తిరుప్పావై-నాల్గవ పాశురము
*********************
"మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం
విశ్వోప జీవ్యమమృతం వచసా దుహానాం
తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం
సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."
పూర్వ పాశుర ప్రస్తావనము.
*******************
మొదటి పాశురములో మార్గళి గ్రించి,రెందవ పాశురములో నోము నియమముల గురించి,మూడవ పాశురములో వర్ష ప్రాశస్త్యమును వివరిస్తూ,ఆచార్య వైభవమును పెరుం పశుక్కళ్ అంటూ జ్ఞానమను గోక్షీరమును పుష్కలముగా అనుగ్రహించుచున్నారని తెలిపినది.అమ్మకు సంతృప్తి కలుగలేదు ఆ పరమాత్మ-ఆచార్య వైభవమును మరికొన్ని సంకేతములతో స్పష్టము చేస్తున్నది.
స్వామిని-గురువును నల్లని కరుణామృత మేఘముతో పోలుస్తూ,ఏ విధముగా సముద్రపు ఉప్పునీటిని సూర్యకిరణములవేడితో పైకి గ్రహించి,వానిలోని దోషములను హరించి,మంచినీటిని వర్షించునట్లు,గురువు సైతము అజ్ఞానమనే శిష్యుల ఉప్పునీటిని తన విద్వత్తు అనే సూర్యకిరణముల వేడితో పైకి తీసుకుని,శుభ్రపరచి జ్ఞానమనే మంచినీటిని వర్షిస్తాడు.అంతేకాదు
మేఘము అన్నిచోట్ల సమముగానే వర్షిస్తుంది.గురువు సైతము తన శిష్యులందరికి సమముగానేవిజ్ఞానమును అనుగ్రహిస్తాడు.
మేఘము తన పనికి ప్రతిఫలమును ఆశించదు.గురువుసైతము తన శిష్యుల ఉన్నతిని తక్క ఏమియును ఆశించడు.
ప్రస్తుత శ్లోకములో గోదమ్మ పరమాత్మను "వరుణదేవునిగా" భావిస్తూ,సంకీర్తించింది.
అమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,ప్రస్తుత పాశురములోనికి ప్రవేశిద్దాము.
పాశురము-04
************
" ఆళిమలై కణ్ణా! ఒన్రు నీకై కరవేల్
ఆళియుల్ పుక్కి ,ముగందు కొడార్తేరి
ఊళిముదల్వన్ ఉరువం పోల్ మెయి కరుత్తు
పాళియన్ తోరుడై పర్బనాబన్ కైయల్
ఆళిపోల్ మిన్న వలంబురి పోల్
వాళ ఉలగనిల్ "పెయిదిడాయ్" నాం గళుం
మార్గళి నీరాడ మగిళిందు ఏలో రెంబావాయ్.
పెయిదుడాయ్-వర్షమును కురిపించు అని వరుణదేవుని గోపికలు ప్రార్థిస్తున్నారు.నిండుగా నున్న కొలనులలో వారు మార్గళి స్నాన నియమమును పెట్టుకున్నారు.
పరమాత్మకు గోదమ్మ ప్రస్తుత పాశురములో రెండు పనులను తమ కోసము చేయమని ప్రార్థించింది..అవి,
1.మొదటిది సముద్రమునుండి ఉప్పునీటిని కడుపునిండా త్రావి,త్రేంచుచు పైకి వెళ్ళి,సృష్టి ప్రారంభమునందు తాను ఎటువంటి నీలి వర్ణముతోనున్నాడో,ఆ నీలమేఘశ్యాముని రూపమును ధరించుట.
2. తాను స్వీకరించిన వర్షపు నీటిని ఏ విధముగా భూమిపై కురిపించవలెనో.
ఇది బాహ్యకథనము.కొంచము పరిశీలిస్తే గోదమ్మ సాక్షాత్తుగా భూదేవి.స్వామికరుణామృత వర్షమును కోరుచున్నది
మొదటి పనియైన నీలిమేఘముగా మారు విధానమును సైతము సూ చించినది.
1.కణ్ణా!
ఆళియల్ పుక్కు-నీవు సముద్రము లోపలికి పూర్తిగా ప్రవేశించు/మునుగు.
2.ముగందుకొద్-జలమును సంపూర్ణముగా స్వీకరించు/తాగు
3.చాలా ఎత్తునకు వెళ్ళు-ఆ సమయమున
4.ఊళి ముదల్వన్-సృష్టి విస్తరణ సమయములో ఎటువంటి నీలి కాంతితో ప్రకాశించావో-అట్టి,
నేలమేఘశ్యామునిగా మాకు దర్శనమునిమ్ము.
ఇది మొదటి పని.
ఆ తరువాత ఏ విధముగా వర్షించవలెనో విన్నవించుకొనుచున్నది.
స్వామిచేయవలసిన రెండవ పనిని తెలుపు సమయమున,
"విశ్వం-విష్ణుం" అన్న సూక్తిని మనకు పరిచయము చేస్తూ,
వర్షమునకు-స్వామి విలువిద్యకు పోలికను చెబుతున్నది.
1.శార్గముదైత్త-ఎక్కుపెట్తిన విల్లు నుండి
2 శరమళైపోల్-వస్తున్న బాణవర్షము వలె,
మా పై నీ కరుణవర్షము కురియువేళ,
3.వస్తున్న మెరుపులు-ఆళిపోల్ మిన్ని,
నీ చేతనున్నసుదర్శన చక్ర కాంతినికలిగియుండాలి.
4.మ్రోగుతున్న ఉరుములు-వలంపురిపోల్,
నీ పాంచజన్య(శంఖ) నాదమును పోలియుండాలి
స్వామి! మా భాగ్యమనగా,
వర్షము సైతము నీ శంఖ-చక్ర (దశమహావిద్యలలో తారాదేవి) కలిగి,మమ్ములను అనుగ్రహించి,మాచే,మార్గళిస్నానమును చేయించాలి.మమ్ములను ఉద్ధరించాలి,అని అంటున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment