కదా త్వాం పశ్యేయం-22
*************************
" జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం."
" కదా వా త్వాం గిరిశ తవ భవ్యాంఘ్రి యుగలం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్
సమాశ్లిష్టాఘ్రాయ బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే."
ఓ గిరిశ! వాక్కులకు అధిపతి,
నేను ఎప్పుడు నీ దివ్య పాదపద్మములను గ్రహించి,నా శిరముతో,కన్నులతో,వక్షముతో తాకి,నీ దివ్య పదాంబుజముల సుగంధములను ఆఘ్రాణింపగలను స్వామి.నాకు ఆ భాగ్యమును ప్రసాదింపుము అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.
" చిదానంద రూపా-శివోహం శివోహం
చిదానంద రూపా-శివోహం శివోహం
మనో బుద్ధ్యహంకార చిత్తానినాదం
చిదానందరూపా-శివోహం శివోహం
"శివోహం " అంటూ శివ స్వరూపమై,
శోభాయమానముగా .......అడుగులను కదుపుతున్నది మల్లికార్జున దర్శనమునకై మహోత్సాహము.
మంగళవాయిద్యములు,సావధాన ఘోషలతో సహవాసము చేస్తూ బాహ్యస్మృతిని కలిగించాయి.
గొంతు సవరించికుని శంకరయ్య "వినబడుతున్న మంగళ వాయిద్యములు "కుటుంబయ్య పెళ్ళివి" అని, ఒక నిమిషము ఆగాడు. అప్పుడే కుటుంబయ్యకు పెళ్ళి చేస్తున్నారా.
ఒక్కొక్క దశను దాటుతూ ఒక్కొక్క ఆశ్రమ ధర్మమును స్వీకరించుట ప్రకృతి సహజమే కదా.అదిగో మహాదేవుడు సతీసమేతుడై వారిని దీవిస్తున్నాడు.
పాపం ఇకమీదట ...
అనగానే ఇంక వెళ్ళడాశివయ్య కుటుంబయ్య దగ్గరికి? ఊహించేసుకుంటూ శంకరయ్యను అడిగారు తక్కినవారు.
ఎందుకు వెళ్ళడు.బహుపెద్ద కుటుంబీకుడు కదా.తన బిడ్డల ఆలన-పాలన చూసుకోవాలి కదా.కనుక వెంట వెంట వెళ్ళి చూసిరావడం మొదలుపెట్టాడు తన బాధ్యతగా.
అప్పుడు కుటుంబయ్య,
'సదా మోహాటవీ చరతి" కొత్తగా వచ్చిన భార్యతో జీవితము బహులెస్సగా ఉంది.కాని ఒకటే చిక్కు వచ్చింది.అదీ మన శివయ్యతో.ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాడు బాల్యస్నేహితుడినంటూ.
కనుక బాగా ఆలోచించి కుటుంబయ్య శివయ్యతో నేను పిలిచినప్పుడు మాత్రమే నాదగ్గరికి రా అని నిర్మొహమాటముగా చెప్పి,హాయిగా ఊపిరిపీల్చుకున్నాడు.
సరేనన్నాడు సదాశివుడు.
కుటుంబయ్య మనసు చేయని విన్యాసాలు లేవు-వొఇహారాలు లేవు.విచ్చలవిడిగా వినోదిస్తూ,విశ్వేశ్వరుని విస్మరించింది.
అదే సమయములో
స్వామి చలత్ ఉరగహారుడు.కాలమును సర్పములుగా మలచి కంఠాభరములుగా ధరించినవాడు.కాల కాలుడు.స్వామి కనుసన్నలలో కాలం కదులుతూ చేతనులలో చెప్పలేనన్ని మార్పులను తెస్తోంది.
కుటుంబయ్యకు అందులో మినహాయింపులేదు.జవసత్వాలు జారిపోతున్నాయి.భార్యబిడ్దలు భరించలేనంత బరువుగా అనిపిస్తున్నారు."నీరసము తక్క నిలిచియున్నది లేదు తోడుగా."
తన మిత్రుడు గుర్తుకు వచ్చాడు.తనవాడు తలుచుకున్నాడని తరలి వచ్చాడు స్వామి సకుటుంబ సమేతముగా.
పలుకరించి వెళ్ళాడు...పరివర్తనను వదిలి కుటుంబయ్య దగ్గర.
" ధైర్యాంకుశేన నిభృతం
రభసాదాకృష్య భక్తి శృంఖలయా
పురహర చరణాలానే
"హృదయ మదేభం" బధాన చిద్యంత్రైః."
శివా!
ఇంతవరకు నాహృదయమే మదీంచిన ఏనుగు విషయవాసనలో విహరిస్తూ,నీ ఉనికిని మరచినది.దానికి నీవు దృఢమైన కరుణ అనే సంకెళ్ళను బిగించి,నీ పాదపద్మములనే గుంజకు కట్టివేయి"
పాహిపాహి పరమేశ్వరా ఇక నేనే నీదగ్గరకు వస్తాను.ఇన్నాళ్ళు,
" జడతా-పశుతా-కళంకితా
కుటిల చరత్వం చ " నాస్తి" మయదేవ
అస్తి యది రాజమౌళే
భవదాభరణస్య కిం పాత్రం"
నా అలసత్వమే,
నీవు నాకెన్ని అవకాశములనిచ్చినప్పటికిని గుర్తించనీయకుండా చేసినది.నా అజ్ఞానమే నీకు నన్ను ఏ విధమైన ఆభరణ ముగా చేయలేకపోయినది.నేను అందులకు తగినవాడను కానేమో.
నేను నీకు విషమును తెచ్చి నైవేద్యమును చేయలేను.కరిచర్మమును వస్త్రముగా కప్పలేను.కాలనాగుల హారములేయలేను.అనవరతము ధర్మమైన నీ వాహనము కాలేను.
వాటి స్థానమును అర్థించలేను.అలా అని తిరిగివెళ్ళిపోను.
ఓ సదాశివా దయతో నీవు,
"తవాధీనంకృత్వా "మయి నిరపరాధిం కురు" కన్నీరు కారుస్తున్నాడు.గొంతు గద్గదమైనది.తనువు అణువణువు కంపించిపోతున్నది.
అన్నానాంపతి చిన్న అన్నపుముద్దనడిగితే.....మమ్ములను అనుగ్రహించుటకే అని అర్థము చేసుకోలేకపోయాను....అంటున్న కుటుంబయ్యతో,
నువ్వేమి అపరాధం చేసావని అని ప్రేమగా కుటుంబయ్యను అడిగాడు శివయ్య.
ఇంకా నన్ను పరీక్షించకు,స్వామి.నేను
" ఉపేక్షానో చేత్ కిం వహరసి భవధ్యాన విముఖాం"
నిన్ను కనీసము స్మరించుకోలేదు,
సరే! అయితే ఇప్పుడు నేనేమి చేస్తే నీ దు@ఖము తొలగిపోతుంది అని అడిగాడు శివయ్య కుటుంబయ్యవైపు చూస్తూ,అర్థముకానట్లుగా..
నీ దివ్య పాదపద్మములను తాకుతూ,శిరమున అలంకరించుకుంటూ,కన్నులతో అశ్రుధారలతో అభిషేకించుకుంటూ,మనసులో ముద్రించుకుంటూ,నాసికతో వాటి పరిమళమును అనుభవిస్తూ బ్రహ్మానందముతో .......
ఏకధాటిగా అశృవులు అభిషేకము చేస్తున్నాయి.భావము గంధము అలదుతోంది కాలిన మోహముల బూది స్వామి పాదములను చేరి తరిస్తున్నది. .వాక్కులు బిల్వములై పల్లవములను చేరుచున్నవి.తనను తాను మరచిపోయి తన్మయములో నున్న కుటుంబయ్యకు,
" "అశనం గరలం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజ భక్తిం ఏవ దేహి"అన్న అభ్యర్థనకు సమాధానము లభించింది.
వీనుల విందుగా,
' శివ శివ శివ యనరాదా
శివనామము చేదా
శివపాదము మీద -నీ-శిరసునుంచరాదా" అను పాట,
ఆశీర్వదిస్తున్నట్లుగా ఆలపిస్తున్నది.అంతరంగములో.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)
No comments:
Post a Comment