కదా త్వాం పశ్యేయం-23
************************
"జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం
నమామి భగవత్ పాదం శంకరంలోకశంకరం"
" స్తవైః బ్రహ్మాదీనాం, "జయజయ" వచోభిః నియమినాం
గణానాం కేళిభిః, మదకల మహోక్షస్య కకుది
స్థితం, నీలగ్రీవం, త్రినయనం, ఉమాశ్లిష్ట వపుషం,
"కదా త్వాం పశ్యేయం" కరదృతమృగం ఖండపరశుం."
ప్రస్తుత శ్లోకములో నాదము నాలుగువిధములుగా నినదింపబడుతూ,నీలగ్రీవుని స్తుతిస్తున్నది.
1. మొదటి విభాగము స్తోత్రము.బ్రహ్మ మొదలగు వారు, స్వామి యొక్క పరాక్రమమునకు సంకేతముగా గండ్ర గొడ్డలి,ప్రసన్నత సంకేతముగా మృగమును చెరొక చేతి యందు ధరించి అంబా సమేతుడై అనుగ్రహించుచున్నారు.అని స్తుతించుచున్నారు.(
సామీప్యాను గ్రహము -దేవతాగణములకు)
2.నియమినాం జయజయ వచోభిః
నియమపాలనా పరులైన మహర్షులు స్వామికి"మంగళాశాసనములను -జయజయ శంకర అంటూ చేస్తున్నారు.( ఇదికూడా సామీప్యానుగ్రహమే-ఋషులకు)
3 కేళిభి సేవనం కరోమి అంటున్నారుప్రమథులు.(ఇదికూడా సామీప్యానుగ్రహమే-కింకరులకు)
4.మహోక్షము వీరందరిని మించిన అనుగ్రహమును పొందగలిగినది.అది వారి స్పర్శానుగ్రహము.
ఆదిదంపతులు తమ కకుది-మూపుపై ఆసీనులైన వేళ పొందిన మహదానందము/మహోత్సాహము అనితరసాధ్యము.
ఆ ఆనందవ్యక్తీకరణయే అది చేయుచున్న శబ్దములు.
నాలుగు వర్గములకు చెందిన ఉపాధులు నాలుగువిధములుగా స్వామిని దర్శించుచు ధన్యతనొందుచున్నవి.
అటువంటి మహదర్శనమును నా ఉపాధి ఎప్పుడు పొందునో కదా.
" నమః శివాయ-నటేశ్వరాయ
నమఃశివాయ-నటేశ్వరాయ
హృదయపీఠికా మధ్యగతాయ
ఉమా వరాయ నమో నమస్తే"
అని ప్రార్థిస్తూ,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.
" వస్త్రోద్ధూత విధౌ సహస్ర కరతా"--
అన్నట్లుగాసూర్యభగవానుడు తన కరములనే కిరణములతో విరాత్పురుషునికి వస్త్రమును సమర్పిస్తున్నాడు.గురువుగారి వెనుకాందరు శివ సంకీర్తనమును త్రికరణ శుద్ధిగా చేస్తూ,తమ అడుగులను కదుపుతున్నారు.
ఏమో అనుకున్నాము కాని ఈ శంకరయ్య ఎంత చక్కటికథనుచెప్పాడు.నేనిన్నాళ్ళు శివుడు మనకేమి ఇవ్వలేడు కనుక పాదాల దగ్గర ఉందనిమ్మంటాడని అనుకున్నాను.కాదన్న మాట.
అనగానే మరొకరు ఆయనకు భక్తులచే నిందపడటం మహదానందముగాఉంటుందట.అందుకే అన్నీ తానైనా ఏమీలేనివలె మనను భావింపచేస్తాడట.
తెలిసిన కొందరు
"ఎందుకయా సాంబశివా-ఈ బూడిదపూతలు
ఈ అల్లరి ఆటలు" అని హెచ్చరిస్తూనే ముచ్చట పడుతుంటారట.
ఇవ్వాళ ఎవరు-ఎవరి కథ చెబుతారో?
అనుకుంటుండగానే వారి ముందర ఇద్దరు పదేళ్ళ బాలురు కుస్తీలు పడుతూ వాదించుకుంటున్నారు.
నేను చెప్పినంది సరైనది అని ఒకడంటుంటే,
కానే కాదు-నేను చెప్పినదే సరైనది అంటున్నాడు ఇంకొకరు .
శివ నామస్మరణమును అధిగమించినది వారి వాగ్వివాదము.
"కాలకంఠునికి కూడా కావలిసినది| అదేగా.
మామూలుగా-మౌనముగా నడిచివెళితే,మహాదేవుని మహాత్మములు లోకవిదితము అయ్యేదెప్పుడు? అందరు తరించేదెప్పుడు?
గురువుగారు వారిని విడదీసి వారి మధ్యజరిగిన విషయమును తెలుసుకున్నారు.
మొదటి వాడు పరమేశ్వరుడు కౄరుడు .పరమేష్టి తలను తీసినవాడు అంటున్నాడు.
రెండవ వాడు పరమేశ్వరుడు దయాళుడు కనుకనే నాలుగు తలలను ఏమీ చేయలేదు అంటున్నాడు.
వారు నిన్న సాయంత్రము" బ్రహ్మకపాలము "గురించివిన్నారట.ఎవరి అభిప్రాయములు వారు స్థిరముగా ఏర్పరుచుకున్నారు.సమర్థించుకుంటున్నారు.
ఇంతకీ అసలు ఎందుకు గిల్లాదట ఆ ఐదవతలను?
సందేహాన్ని వెలిబుచ్చింది వారి వెనుకనున్న గిరిజ.
శంకరయ్య గారుమీరు ఇక్కడ ఉన్నారా.అమ్మయ్య,
తల్లీ గిరిజా?
మా పాథశాల విద్యార్థులను శ్రీశైలము తీసుకుని వెళుతున్నారండి.మధ్యదారిలో వెళ్ళిద్దరు...ఇలా...
ఇంతలో వచ్చారు వీళ్ళ గురువుగారు.ఎందుకు గిరిజా వీళ్ళు వెనకబడ్దారు?
శివుడు చెడ్దవాడు అనిఒకరు
కాదు మంచివాడు అని ఇంకొకరు
కుస్తీలు పడుతూ--నిలిచిపోయారు అన్నది గిరిజ.
బ్రహ్మ ఐదవతలను గిల్లేశాడంటాడు వీడు-కాదు నాలుగు తలలను మిగిల్చాడంటాడు వాడు.
అసలు శివుడు మంచివాడా?
శివుడుచెడ్దవాడా?
అని అడుగుతుండగా వేరొక పిల్లవాడు వచ్చి,మనదారిలోనే ఒకపెద్ద వింత జరుగుతున్నది.
బ్రహ్మయ్యట.ఒక పెద్ద నీటి మోట బావిదగ్గర-బొక్కెనలతో నీళ్ళు తోడుతూ పంటపొలాలకు పో స్తున్నాడు.
అందులో వింత ఏమున్నది అన్నారు పిల్లలు ముగ్గురు.
వింతనా!
ఇంతా-అంతానా.నాలుగు ముఖములున్నాయి అతనికి.మోటబావికి-బొక్కెనకు-పంట పొలములకు కొత్త కొత్త పేర్లు పెట్టి,కొత్త కొత్త పాటలు పాడుతున్నాడు.
మన వాళ్ళు దగ్గరికెళ్ళి ఏ భాషలో పాడుతున్నావంటే తన తలపై నున్న ఖాళీ ప్రదేశమును చూపిస్తూ,
"ధీ యంత్రేణ వచో ఘటేన కవితాకుల్యోప కుల్యాకవైం
రానీతైశ్చ సదా శివస్య చరితాంభోరాశి దివ్యామృతైః మా తన్వతే
హృత్కేదారయుతాశ్చ భక్తి కలమా సాఫల్య
దుర్భిక్షాన్మమసేవకస్య భగవత్ విశ్వేశః భీతికుతః"
అంటూ నవ్వుతున్నాడు.
కలుపుమొక్కను- తన నెత్తిని మాటిమాటికి చూపిస్తున్నాడు.
మా వైపు చూసి ఒకసారి నవ్వి మళ్ళీ నీళ్ళు తోడి,పొలాలకు పోస్తూ,పాడుతూనే ఉన్నాడు" అని చెప్పగానే,
పిల్లలతో పాటుగా-పెద్దలు సైతము కుతూహలముతో అతనినిచూడటానికి బయలుదేరారు వాదనలను వాయిదా వేసుకుని.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)
No comments:
Post a Comment