తిరుప్పావాయ్-పాశురము10
*******************
"మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం
విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం
తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం
సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."
పూర్వ పాశుర ప్రస్తావనము
**********************
గోదమ్మ "కీళ్వానం వెళ్లెండ్రు" 8 వ పాశురములో,
మిక్కుళ్లిపిళ్లైగళుం-
'పోవాన్-పోగిన్రారై-పోగామళ్ అని వివిధ దశలలో నున్న చేతనులను ప్రస్తావించినది.
"తూమణి మాడత్తూ9వ పాశురములో గోపిక "పెరుం తుయిల్"యోగనిద్రను పరిచయముచేసినది.ఏకీకృతమైన ఇంద్రియావస్థ అది.స్వామి అనుగ్రహ సంకేతము.
ప్రస్తుత పాశుర ప్రాభవము.
**********************
గోదమ్మ మనకు,కృతకృత్య అయిన గోపిక /సిద్ధోపాయ/స్వామిని/యజమాని భగవదనుభవమను సదాత్వంకేశవ ప్రియగా తనను తాను మనోయజ్ఞములో హవిస్సుగా అర్పించుకుని స్వామిని భోక్తగా ప్రకాశింపచేయుచున్నది.దాని విశ్లేషణమే ఆమెను భగవదానుభవము నుండి మెల్ల-మెల్లగా బహిర్ముఖము కమ్మనుట.
1.పూర్వ పుణ్య ఫలితము/పూర్వజన్మసుకృతము
2.పూర్వ యుగ (రామాయణ కుంభకర్న) వృత్తాంతము
3.తులసీదల వైభవము
4.సత్సాంగత్యము
5.మెల్లగా లేచిరమ్మని సిద్ధోపాయ గోపికతో చెప్పుట పరిచయము చేయుచున్నది.
ప్రస్తుత పాశురము ప్రతిపదము రెండు భిన్న అర్థములతో అన్వయించబడి,అమృతమును వర్షిస్తుంది.
నోత్తు చువర్కం-నోము ఫలితముగా గోపిక స్వామిలీలానుభవమును (స్వర్గమును) పొందుతున్నది.ఆమె ఉపాయము-బయటనున్న గోపికలు ఉపేయము.
చువర్కం-భాగవతుల సాన్నిహిత్యముగా అన్వయించుకుంటే విల్లిపుత్తూరులోని గోపికలు పూర్వపుణ్య ఫలితముగా గోదమ్మను అనుసరిస్తున్నారు.పరమాత్మతో మమేకమగుట కదా నిజమైన స్వర్గము.
కుంభకర్ణపదము రావణసోదరుని నిద్రను సంకేతిస్తున్నప్పటికిని,అది అన్యాపదేశముగా "అగస్త్యమహాముని" ని సూచిస్తున్నది.
ఇంద్రియ విషయములకొస్తే ఇక్కడ పరిమళము-ఘ్రానము ప్రస్తావించబడినది.
గోపిక గదిలోని తులసిదళ (గోదమ్మ ప్రకటింపబడిన తులసి వన)
పరిమళములను ఆఘ్రాణిస్తున్న నాసికదే ఆ సౌభాగ్యము.దానితో పాటు నయనము.అది స్వామి తనకిరీటముగా అలంకరించికొనియున్న
"నాట్రత్తు తుళాయ్" పరిమళ,తనను తాను స్వామికి భోగ్యముగా అర్పించుకొనిన (స్వామి భోక్త) తులసి సౌభాగ్యమును దర్శించుచున్నది.
మనసు మరింత సౌభాగ్యమునుచేసికొనినది.అది వాక్కుగా 'నం మనయొక్క మాల్-స్వామిని,
నారాయణుని వ్యాపకత్వమును తులసిపరిమళములో
అనుభవించగలిగినది.
అరుంగలమే-ఓ ఆభరణమా/గోకులమునకు ఆభరణమా/ మువంటిదానా/
వేరొక అర్థము /అర్హత-మాచే శ్రీవ్రతమును చేయించగల అర్హత కల దానా స్వామి సేవను మాకు సైతము అనుగ్రహించు.
" తులసి అమృత జన్మాసి-సదా త్వంకేశవ ప్రియే"
పాలకడలిలో ప్రకటింపబడిన సక్షాత్ లక్ష్మీ స్వరూపము పరిమళభరితము పరమపావనము యైన వృక్ష రూపమున నున్న తులసి/స్త్రీ రూపమున నున్న తులసి అని ఇద్దరి ప్రస్తావనము.(రామానుజ సోదరి)
అత్యద్భుత పాశురమును అందించిన గోదమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురములోనికి ప్రవేశిద్దాము.
పాశురము
*****
" నోత్తు చ్చువర్కం పుగిగిన్ర అమ్మనాయ్
మాత్తముం తారారో ,వాశల్ తిరవాదార్
నాత్తత్తు తుళాయ్ముడి "నారాయణన్ నమ్మాల్
పోత్తపరై తరుం పుణ్ణియనాల్ పండొరునాల్
కూత్తత్తిల్ వాయ్ విళింద కుంబకరుణన్
తోత్తు మునక్కే "పెరుం తుయిల్" తాన్ తందానో
ఆత్త అనందలుడయాయ్ అరుంగలమే
తేత్తమాయ్ వందు తిరవేలో రెంబావాయ్."
అమ్మణ్ణాయ్! అని గోదమ్మచే పిలువబడుచున్న గోపిక పూర్వ సుకృతముగా స్వామి లీలా వైభవమును అనుభవించుచు,తనలో తాను/తనతో తాను రమించుచున్నది.అదియే ప్రస్తావించబడిన స్వర్గము.
ఆమె తలుపుతీయకపోగా కనీసము మాటాడుటలేదు.
ఎక్కడ స్వామి తన దగ్గరలేడని చెబుతుందేమోనని,
స్వామి తన శిరమునకు చుట్టుకొనిన/అలంకరించుకొనిన తుళాయ్-నాట్రత్తు తులసి పరిమళము మా నాసికలను అనుగ్రహించుచున్నది.
నిద్దురలో రామాయణ(త్రేతాయుగ) కుంభకర్ణుని జయించి,వాని నిద్దురను కానుకగా స్వీకరించినావా,
మా చే నోమును చేయించగల అర్హత నీకు కాక ఎవరికికలదు? (ఓ మహాజ్ఞాని)
నీవు మెల్ల-మెల్లగా బహిర్ముఖివై వచ్చి తలుపు గడియ తీసి,మాతో పాటుగా నోమునకు రమ్ము,అని చెప్పుచున్నగోదమ్మ చేతిని పట్టుకుని,
మనమును అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment