Sunday, December 24, 2023

TIRUPPAAVAI-PAASURAMU-09



.తిరుప్పావై-పాశురం09 ******************* " మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్య మమృతం వచసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం." పూర్వపాశుర ప్రస్తావనము ******************* ఆశ్రయణము-ఆశీర్వచనము నకు నిదర్శనముగా త్రికరణ ములతో స్వామిని సంకీర్తించి-సంసేవించి,స్వామి ఇస్తానన్న "పఱ" ను తెచ్చుకుందామని గోదమ్మ వ్రతఫలమును ప్రస్తావించినది. ప్రస్తుత పాశురము పరమాద్భుతము.ఈపాశురములో మనకు నిదురిస్తున్న గోపికతో పాటుగా ,మేల్కొని యున్న గోపిక తల్లిని పరిచయము చేస్తుంది గోదమ్మ. ప్రస్తుత పాశురములోనిగోపిక పరిశుద్ధ మణులున్న (నవవిధ బంధములు స్వామితో నున్న మనసనే) మందిరములో,ప్రకాశిస్తున్న దీపములు- (జ్ఞానము) పరిమళిస్తున్న ధూపములతో (అంతర్ముఖ తాదాత్మ్యముతో) ,తన ఉపాధి సహజత్వమును మరచి,అంతర్ముఖియై,తనకు రక్షణము భగవంతుడే అన్న గట్టి నమ్మకముతో నున్న ప్రపన్న. గోపిక శయనమందిరములో శ్రీకృష్ణునికై దీపములు వెలుగుచున్నవి.ధూపపరిమళములు సైతము అస్వామికై ఎదురుచూచు చున్నవి.తల్పము సంగతి సరేసరి.స్వామి స్పర్శకై తహతహలాడుచున్నది. ఇంతలో స్వామి రానేవచ్చాడు.గోపిక స్వామిని తనహృదిలో బంధించి-తానును అంతర్ముఖియై తరించుచున్నది. అంటే, శ్రీకృష్ణానుభవమను సంపదను ఇతరుల దరికి చేరనీయని అంతర్ముఖమను తాళమును వేసినది.ఆమెను సామాన్య విషయములు బహిర్ముఖిని చేయలేవు.కనుకనే గోపికలు వచ్చి ఎంత పిలిచినను చలించలేదు. మన వాడుక భాషలో చెప్పాలంతే కృష్ణసేవా సౌభాగ్యమను సంపదకు నిదురిస్తున్న గోపిక ఒక తాళమైతే,ఆమెను బహిర్ముఖురాలిని చేసి,పరమాత్మ సేవా సౌభాగ్యమునుకలిగింప గల ఏకైక తాళపుచెవి ఆమె తల్లి(భాగవతారిణి) .కనుకనే హరినామ సంకీర్తనమను ఉపాయమును చెప్పి,గోపికను మేలుకొనునట్లు చేసినది. నమో భాగవతే వాసుదేవాయ నమః ఇంక "తూమాణి మాడ" అంటే పరమాత్మకు మనకు మధ్యన గల తొమ్మిది విధములైన సంబంధములు గా చెబుతారు.అవి పిత-రక్ష-శేషి-జ్ఞేయుడు -స్వామి-భర్త-ఆధారము-ఆత్మ-భోక్త .వీటిని గురించి మనము తదుపరి పాశురములలో ప్రస్తావించుకుందాము. తొమ్మిదవ పాశురం *************** తూమణి మాడత్తు సుట్రుం విళక్కెళియ తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్ మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్ ఊమైయో? అన్రి స్సెవిడో? అనందలో? ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో? మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ****************************** మా మాయన్-మహా మహిమాన్వితుడ మాధవన్-మాధవా వైకుందన్-వైకుంఠ వాసా మా మాయన్-మహా మహిమాన్వితుడ మాధవన్-మాధవా వైకుందన్-వైకుంఠవాసా,అంటు ఎన్రెన్రు-మరీ మరీ వినిపిస్తునది హరినామ సంకీర్తనము.ఎక్కడ? తూమణి-దోషరహితమైన మణులు పొదిగిన, మాడత్తు-మేడ దగ్గర. ఎవరు చేస్తున్నారు?బయట నున్న గోపికలు. మణిమయకదవం తాళ్-మణిమయ తలుపు గడియపెట్టి ఉన్నది.దానిదగ్గర. సర్వస్య సరనాగతికి అడ్డంకి అ గడియ. దేహ సంబంధము ను పరిచయము చేస్తున్నట్లుగా అనిపించే ఆత్మ సంబంధము ఆ ఇద్దరు స్త్రీమూర్తులు. గోపికను వచ్చి తెరువమని అభ్యర్థిస్తున్నారు. తలుపు గడియ తీయమనవచ్చును కదా నేరుగా, బయట నున్న గోపికలు స్వగత ఆశ్రయణ భక్తి కలవారు. అంటే తామే స్వామిని సేవించి స్వామిని ఆశ్రయించి పొందాలనుకునేవారు. కాని వారికి విరుధ్ధమైన స్థితిలో ఉన్నతమైన ఉత్తమమైన పర-ఆశ్రయణ స్థితిలో నున్నది లోపల నున్న గోపిక. అంటే స్వామి తనకు తాను మెచ్చి వచ్చి ఆత్మానందస్థితిని అనుగ్రహిస్తే పరమాత్మతో మమేకమవుతు రమిస్తున్నది. అంతర్ముఖమై బాహ్యములకు బదులీయలేని స్థితిలో తన ఇంద్రియములను కట్టడి చేసినది.లోపలనున్న గోపిక ప్రపన్న. అనగా తమకు భగవంతుడే రక్షకుడు అని గట్టి నిశ్చయముతో నున్నది.బాహ్యములో జరుగుచున్న విషయములకు ఏ మాత్రమును చలించనిది.ఇంద్రియములను నిగ్రహించి నిర0తర నిర్గుణ తత్త్వముతో మమేకమగుటయే ఆమె నిద్ర.దానినివీడుటకు ఆమె సుముఖముగా లేదు. కనుక వీరు పిలిచినను మారు పలుకలేదు. .తన తాదాత్మ్యమును వీడలేదు. అప్పుడు గోపికలేమి చూశారు? ఏమి చేశారు? ఆమె పక్కన కూర్చుని యున్న ఆమె తల్లిని చూస్తూ, మామీర్-ఓ అత్తా ఎళుప్పీరో-మేలుకొలపండి అని అర్థించారు. అత్త పిలిచినను ఆమె మేలుకొనలేదు. దేహ సంబంధ-బాంధవ్యములకు ఆమె అతీతురాలు.కనుకనే పలుకలేదు.ఆ గోపిక/జ్ఞాని, సుట్రుం-చుట్టు విళక్కెళియో-ప్రకాశిస్తున్న దీపములతో కమళ-వ్యాపిస్తున్న తూపం-ధూపపు సుగంధ పరిమళములతో తుయినలై మేల్-తల్పము మీద తూమణి మాదత్తు-మణిమయ మేడలో కణ్వలదుం-నిదురిస్తున్నది. అత్త మేల్కొలుప ప్రయత్నించినను ప్రయోజనము లేదు.అంటే స్వామి తనకు తాను అనుగ్రహించాలికాని మన సాధనలతో కాదని చెప్పుచున్నది గోదమ్మ. అసహనముతో గ్-బయటనున్నగోపికలు (ఆ గోపిక దేహ సంబంధములను విస్మరించిన,బాహ్య సంపదలను తిరస్కరించిన స్థితిలో,అత్యంత ఆనందానుభూతిలో ఆ పరమాత్మునితో రమిస్తున్నది.) బయట నున్న చేతనుల (గోపికల) అసహాయత అసహనముగా మారుతోంది.ఆమెపై ఇంద్రియలోపములుగలదానిగా అభియోగములను ఆరోపిస్తున్నది మళ్ళీ వారు అత్తతో, మామీర్-ఓ మేనత్తా! నాలుగు కారణములను ,చెవి-మూగ-అలసినది-మంత్రము వేయబడి కదలలేకున్నది అని, ఉన్ మగళ్ దాన్- నీ కూతురు తాను ఊమయో-మూగదా? అన్రి-లేక సెవిడో-చెవిటిదా? అన్రి-లేక అనందలో-అలిసినదా? అన్రి-లేక మందిర-మంత్రము వేయబడినదా? అన్రి-లేక పట్టాలో-బంధించి కావలిగా ఇక్కడ పెట్టబడినదా? ఉలకటం లేదు/పలుకుట లేదు అని అంటున్నారు. వారిని అనుగ్రహించదలచిన మామీ "హరినామ సంకీర్తనమను" ఒక చక్కని ఉపాయమును సూచించినది. ఎందుకంటే దివ్యగోపికారూపములో నున్న ఆళ్వారులు/ఆచార్యులుగా మారితేగాని,బహిర్ముఖులైతే గాని,తమ జ్ఞానమను దీపములతో,శాంతి సౌభాగ్యములను ధూపములతో సకలమును చక్కపరచవలెనన్న సదుద్దేశముతో. చక్కటి ఉపాయమును అదే అదే, హరినామ సంకీర్తనము తక్క అన్యము ఆమెను బహిర్ముఖురాలిని చేయలేదని చెప్పి వారిచే అత్యంత భక్తితో మాధవన్-వైకుంఠన్ అని సంకీర్తనమును మరీ-మరీ సర్వస్య శరణాగతితో సంకీర్తనమును చేయిస్తున్న వేళ గోపిక మేల్కొని వచ్చి తాళ్ తిరవాయ్ అనగానే -మణికదవపు -మణిమయ ద్వారపు గడియను తొలగించి, వారితో కలిసి నోమునకు బయలుదేరినది..వారితోపాటు మనము కూడ అమ్మ చేతిని పట్టుకుని మన అడుగులను కదుపుదాము. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. .



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...