తిరుప్పావై-పాశురం 08
*****************
" మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం
విశ్వోప జీవ్యమమృతం వచసా దుహానాం
తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం
సంతః పయోధి దుహితః సహకాం విదుస్త్వాం".
పూర్వ పాశుర ప్రస్తావనము
*******************
శబ్దము-శ్రవనము అను అంశములతో పక్షులను-భారధ్వాజ పక్షులను సంకేతించి,తెల్లవారుచున్నదనుచు,ఇద్దరు జ్ఞానమూర్తులను తన వెంట తీసుకుని,మూడవ గోపికను నిదుర లేపుటకై,ప్రస్తుత పాశురములో
"దృశ్యము-నయనము" ను తూరుపు దిక్కు-తెల్లదనమును సూచిస్తున్నది గోదమ్మ.
ప్రస్తుత పాశుర ప్రాభవము
*****************
ప్రస్తుత పాశురము బయటనున్న గోపికలు తమతో మాట్లాడుతున్నట్లు భావిస్తూ,సంభాషణా చతురతతో సాగుతుంది.
మూడవ గోపిక-నోముపై కుతూహలము కలది-కోగులం ఉడయ.
స్వామిని త్రికరన శుద్ధిగా ఆశ్రయించుట-స్వామి అనుగ్రహించుట అను రెండు విషములను ప్రస్తావించినది గోదమ్మ అరుళ్ అన్న పదముతో.
శబ్దము-శ్రవనము అన్న అంశముతో పక్షులు-భారధ్వాజ పక్షులను స్తోత్రములను,శంఖనాదములను సంకేతిస్తూ శ్రవణేంద్రియమును జాగృతపరచిన ఆండాళ్ తల్లి,ప్రస్తుత పాశురములో,రంగులను,దిక్కులను,సిరువీడు అను మేత ను ,స్వామిని సేవిద్దామనుకొను తలపు-దానికి ప్రయత్నము-సాఫల్యము అను మూడు అంశములును స్వామి అనుగ్రహమేనని ,
"దృశ్యము-నయనము" అను అంశములతో పోలికను చెప్పి,మావాన్-మల్లనై అను రాక్షసులను ,మానసిక-శారీరక దోషములుగా వివరిస్తూ,ఆ దోషములను సంపూర్ణముగా తొలగించివేసిన శ్రీకృఇష్స్వామిని సంకీర్తిస్తూ,మూడవ గోపికను తమతో పాటుగా తీసుకుని వెళుతున్న,
అమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురములోనికి ప్రవేశిద్దాము.
ఎనిమిదవ పాశురము.
*****************
కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు
మేవాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు, ఉన్నై
కూవువాన్ వందునిన్రోం కోదుగలం ఉడయ
పావాయ: ఎళుందిరాయ్" పాడి" పరై కొండు"
మావాయ్ పిళందానై మల్లనె మాట్రినాయ్
దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్
ఆవాయ్ ఎన్న్రైఅనందు అరుళేలో రెంబావాయ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
దేవాదిదేవనె-శ్రీకృష్ణ పరమాత్మను
ఆవావెన్రు-త్రికరణ శుధ్ధితో
శెన్రుదాం-చెన్నుమీర
సేవిత్తాల్-సేవించుటకు
కోగులం ఉడయ-కుతూహలముతో నున్న
పావాయ్-ఓ గోపికా
ఎళుందిరాయ్-మేలుకో.
ఈ గోపిక బహిర్ముఖమగుటకు సుముఖముగా లేదు.చతుర భాషిణి.కనుక తగిన సమాధానములతో తాత్సారముచేస్తూ,వారిని పంపించేయాలనుకుంది.
అందుకే గోదమ్మ,దృశ్యమును చూపిస్తు-లేచి చూడు తెల్లవారినది అంటున్నది.
పాయ్-కణ
ఓగోపికా/ఓ నయనమా,
కణ్-చూడు,
1.వానం-ఆకాశము
కీళ్వానం-తూరుపుదిక్కు,
వెళ్ళెన్రు-తెల్లబడుచున్నది/తెల్లబడినది.
ఆకాశములోని తూరుపు దిక్కు తన నల్ల రంగును వీడి(
తమోగుణమును)
వెళ్ళెన్రు-తెల్లబడినది/తెల్లవారినది. అనగానే,
లోపలనున్న గోపిక,
ఆ ప్రకాశము తూరుపు దిక్కుది కాదని,వ్రతము చేయుటకు
వెళ్ళుచున్న గోపికల ముఖవర్చస్సు అని పలికినది కాని తలుపు
తీయలేదు.
2.రెండవ సంకేతముగా,తెల్లవారినట్లు నమ్మలేదని గోదమ్మ వారికి చాలా సహజమైన చిరుమేతను/శిరువీడును చూడమంటున్నది.
ఎరుమై-గేదెలు/పశువులు
పరందన్-అటు-ఇటు వ్యాపించి,
శిరువీడు-చిన్న మేతను
మేయవాన్-మేస్తున్నాయి.
రేపల్లెలో పశువులు చిన్నమేత-పెద్దమేత అను సంప్రదాయమును వివర్సితున్నది.
ఆ ప్రదేశమంతా నల్లగా కనిపిస్తున్నది చూడు అనగానే,
చమత్కారి గోపిక,
అది శిరువీడు కాదని,ఇంకా తెల్లవారలేదని స్వామి వ్రతమునకై
వేచియున్న గోపికల అప్పటి వదనముల దిగులు అని,అది వారి
ఉత్సాహమును చూచి.అక్కడికి వెళ్ళి వ్యాపించినదని చెప్పి తిరిగి
అంతర్ముఖమైనది.
గోపికల శ్రీకృష్ణసేవా ఉత్సాహము చీకటిని తరిమివేసినదన్నమాట. జై శ్రీకృష్ణ.
ఇక్కడ
మనము ఒక చిన్న విషయమును ప్రస్తావించుకొందాము.నలుపురంగు-చీకటి-తమోగుణము పరాశ్రయములు కనుక అవి స్వతంత్రత లేక ఏదో ఒక దానినాశ్రయించి ఉంటాయి.అది ఎక్కువ సేపు స్వతంత్రముగా ఉండలేదు.కనుక అది మనలను ఆశ్రయించక ముందే,సత్వగుణశోభితమైన తెలుపును/వెలుగును ఆశ్రయిద్దాము.
అప్పుడు గోదమ్మ ,
3.మూడవ సారి స్వామిని సంకీర్తించి,"పఱను" తెచ్చుకుందాము అంటు,ఒక వాయిద్య పరముగాను-పరమాత్మ సాయుజ్య పరముగాను "పఱ" ను ప్రవేశపెట్టినది.
ఉన్నై" నిన్ను
"కూవువాన్ వందు నిన్రోం"-
వందు-నీ ఇంటికి వచ్చి.నిన్రోం-నిలబడి ఉండి నిన్ను
కూవువాన్-పిలుచుచున్నాము.
అంతే కాదు ఇక్కడికి వచ్చి నిన్ను పిలిచేముందు,
మిక్కుళ్ళ-పిళ్ళైకళ్--ఎందరో గోపికలు
వ్రతమును చేయు ప్రదేశమునకు,
పోవాన్-చేరారు
పోగిన్రారై-వెళ్ళుచున్నారు
పోగామల్-వెళ్ళుటకు సిధ్ధమగుచున్నారు.
చేతనులలోని వివిధ మానసిక స్థితులను సూచిస్తున్నది.తలంపుతో నుండు వారు,తలచిన దానిని చేయుటకు ఉద్యమించుచున్నవారు,తలచి-తరించినవారు.
వారి భక్తి ఏ దశలో మనసులో-వాచకములో-కాయకములో ఉన్నను స్వామివారిని ఆశీర్వదిస్తాడు-అనుగ్రహిస్తాడు కనుక ,
నోమునకు వెళుతున్న గోపికలను,
మేము ,
కాత్తు-నివారించాము.
వచ్చి నిలబడి నిన్ను పిలుచుచున్నాం.
మీ ఇంటికి వచ్చి,
వండు-వచ్చి-
కూవువాం-నిన్ను పిలుస్తూ,
నిన్రోం-నిలబడియున్నాము.
ఉన్నై కూవువాం వందు నిన్రోం-కూవువాం వందు నిన్రోం.
కూవువాన్ వందు నిన్రోం అంటుంటే,
నేను మీతోవస్తే మనకేమి ప్రయోజనము? అని ప్రశ్నించుచున్నది
లోపలి గోపిక.
స్వామి,
మావాయ్-మానసిక కట్టడిలేని అశ్వములను,
మల్లనె మాట్రినాయ్-అవే అహంకార-మమకారములు.
ఒకటి మానసిక దౌర్బల్యము.రెండవది శారీరక దౌర్బల్యము. వాటిని తొలగించే స్వామిని,
ఆలానెన్రు సేవిత్తాల్-త్రికరనములతో సేవించి,స్వామి అరుళ్-అనుగ్రహమనే
పఱను అనుగ్రహిస్తాడు.మనము దానిని తెచ్చుకుందాము.
పఱ ఒక వాద్యవిశేషము/పరము.
"పాడి పఱై కొండు" అంటూ చమత్కారి గోపికతో పాటుగా మనము అమ్మ చేతిని పట్టుకుని,
మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ తిరువడిగలే శరణం.
No comments:
Post a Comment