Friday, December 22, 2023

TIRUPPAAVAI-07 PAASURAM


 



   తిరుప్పావై-పాశురము07

   ******************

 "మాతః సముత్థైతవతీ మదివిష్ణుచిత్తం

  విశ్వోపజీవమమృతం వచస దుహానాం

  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం

  సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం"


  పూర్వపాశుర ప్రస్తావనము

  *********************

  మనము శుద్ధి వ్రతమును పూర్తి చేసుకుని,ఆందాళమ్మచేతిని పట్టుకుని రెండవ భాగమైన 'మేల్కొలుపు వ్రత భాగములో మొదటి గోపికను మనతో కలుపుకుని,రెండవ గోపిక ఇంటికి వెళ్ళుచున్నాము"

 ప్రస్తుత పాశురములో శబ్దమును మరింత స్పష్టము చేస్తూ,భారధ్వాజ పక్షుల "కృష్ణ నామ సంకీర్తనమును" గొల్ల భామల చల్ల చిలుకు శబ్దములను,కేశి అను రక్కసుని సంహరించిన కేశవ నామ సంకీర్తనమును శబ్దమును-అందులో దాగిన పరమార్థమును తెలిసికొనుటకు శ్రవనమును సాధనములుగా నోము సాధనకు వివరించుచున్నది గోదమ్మ.

 ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,మనము పాశురములోనికి ప్రవేశిద్దాము.


ఏడవ పాశురము


****************


కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు


పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే


కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు


వాశ నరుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్


ఓశై పడుత్త తైరరవం కేట్టిలైయో?


నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి


కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో


దేశం ఉడయేయాయ్ తిరనేలో రెంబావోయ్.


" నారాయణతే నమో నమో


నారద సన్నుత నమోనమో."


తమోనిద్రను వీడి తాదాత్మ్యములో నున్నవారు కొందరు,తన మదిలోని స్వామిని సేవించువారు మరికొందరు,తన్మయములో నున్న కొందరు,తలపు మార్చుకొనుటకు ఇష్టపడనివారు కొందరు,తలుపుతీయుటకు ఇష్టపడని వారు ఇంకొందరు,తనవాడేనని తనతోనే ఉండాలనే వారు కొందరు,తనివితీరని తాదాత్మ్యముతో పరిసరములను పట్టించుకోని వారు ఇలా వివిధ భావములతో,భంగిమలతో,అనుభవములతో .....


నున్న గోపికల రూపములలో నున్న ఆచార్యులను/ఆళ్వారులను తల్లి దయతో మనము దర్శించ బోతున్నాము.


వీరిలో ఎవరు ఎక్కవభక్తికలవారో-ఎంతటి భాగ్యశాలురో చెప్పుట సాధ్యము కానిది.


నిద్రిస్తున్న వారిది పారవశ్యము.

మేల్కొలుపు వారిది ప్రాప్తిత్వరిత్వము.


వారందరును భగవదనుగ్రహమును పొందినవారే.


ఇప్పుడు తల్లి నిదురలేపున్న గోపిక/బహిర్ముఖురాలిని చేయుచున్న గోపిక


నాయగన్ పెణ్ణ్ పిళ్ళాయ్-వ్రతమునకు నాయకత్వమును వహించగల సమర్థురాలు.


దేశం-తేజస్విని. కాని,


హరిని తక్క అన్యమును కాంచలేని పిచ్చిది.నిరంతర హరి అనుభవసాగరమున తేలియాడునది. తన శక్తిని గుర్తించలేనంత పిచ్చిలో మునిగినది.


అందుకే గోదమ్మ ఆ గోపికను


పేయ్ పెణ్ణే-ఓ పిచ్చిదాన అని పిలిచినది.


స్వామి సర్వాంతర్యమితత్త్వమును మూడు నిదర్శనములతో నిరూపిస్తున్నది ఆండాళ్ తల్లి

.


మొదటిది-భరధ్వాజ పక్షులు.


శ్రవణభక్తిని మరో మెట్టు ఎక్కిస్తునది తల్లి.


ఆరవ పాశురములో "పుళ్ళుం" అని సామాన్యవాచకముగా పక్షులు అని చెప్పినది.వాటి ధ్వనులను అస్పష్టతతో నున్నట్లు చెప్పినది.కాని ఇప్పుడు తల్లి చెబుతున్న పక్షులు ఉన్నతమైనవి.(యోగులు)


కనుక అవన్నియు ఒకచోట చేరినవి.వాటికి " భారధ్వాజ పక్షులు" అను ఒక నిర్దిష్ట నామము కలదు.అంతే కాదు అవి ఒక చక్కని నిర్దిష్ట శబ్దముతో ,


కృష్ణా-కృష్ణా అని అంటున్నవి.అదియే,


కీశు కీశెన్రుం కలందు.


కలందు-కలిసి చేయుచున్న


కీశు కీశు-కృష్ణ నామము.


ఆ నాదము రేపల్లె మొత్తము వ్యాపించి-నినదించుచునది.


శ్రవణేంద్రియ సంస్కారమునకు సాక్షిగా నున్నది.


కేట్టిలైయో?


దానిని వినలేదా? లేవకున్నావు?


కృష్ణదర్శనము అనుభవిస్తున్న ఆ గోపికను పక్షిరవము బహిర్ముఖము చేయలేక పోయినదను కొని అమ్మ


"మత్తినాల్ ఓశై "అను మహాద్భుతమును మనకు అందించుచున్నది.ఇది రెండవ ఉదాహరణము.


గోపికల రూపములో నున్న జ్ఞానులు చేయుచున్న వేద-వేదాంత చర్చలు.వాటిని అనుసరిస్తూ వాటి సుగంధములు ఎలా వ్యాపిస్తున్నాయో/వారు ఎలా చర్చించుకుంటున్నారో ఒకసారి గమనిద్దాము.


రేపల్లె లోని గోపికలకు చల్లచిలుకుట నిత్యానుష్ఠానము.


వారికి కడవ-కడవ లోని కవ్వము-కవ్వమునకు కట్టిన తాడు


-దానిని పట్టుకుని చిలుకుతున్న వారి చేతులు,అప్పుడు వారు చేయు కీర్తనలు/జానపదములు అంతా హరిరూపమే/హరి నామమే.


కావాలంటే కన్నులు తెరిచి చూడు.


వారు కృష్ణతత్త్వమనే పెరుగును వారి హృదయములనే కడవలలో నింపుకున్నారు.సాక్షాత్ పరమాత్మనే కవ్వముగా పట్టుకున్నారు.వారి భక్తియనే తాడును దానికి కట్టారు.అది వారికి స్వామి నర్తనము.


కవ్వము తానైన కన్నడు తన చేతులను చాచి రండి బృందావనమునకు రాసలీలలో మునుగుదాము అనికవ్విస్తున్నాడట.వారి మనసు మురిసి ఆనందమును దాచుకోలేక ఎదపైకెగిసి,అక్కడ అలంకరింపబడియున్న మంగళ సూత్రములు,కాసుల పేరులు కృష్ణా కృష్ణా అను


సంకీర్తనముతో చేస్తున్నాయట.మనో పూజ.


కవ్వమై కవ్వించిన కొంటె కృష్ణుడు


ఎక్కడ మాయచేసి మాయమగుతాడో కనుక గట్టిగా పట్టుకోవాలని


,వారు పెరుగుకుండను గట్టిగా పట్టుకొన్నప్పుడు వారి చేతుల కంకణములు కృష్ణా-కృష్ణా అంటు తమ వంతు సేవగా కీర్తిస్తున్నయట-కాయక పూజ.


వాచక పూజ సరే సరి.వారి పెదవులను వీడలేనిది.


మనో-వాక్కాయ-కర్మల తననారాధించు చున్న గోపవనితలతో కలిసి ఓయ్ నేనిక్కడనే ఉన్నాను అని అంటున్నటుందిట ఆ కవ్వపు సడి.


ఓశై మనత్తినాల్-ఎంత మనోహరము-మాననీయము


వారికేశముల నుండి వ్యాపించుచున్న సుగంధములు,


మత్తినాల్ ఓశై,చల్లను చిలుకుచున్న,


ఆయిచ్చర్-గోపికల,


కుళల్-కేశములనుండి వ్యాపించుచున్న,


వాస-నరుం-సుగంధములను ,


నీవు గమనించలేదా.


నీ నాసికను చైతన్యవంతము చేసుకొని,


మాచేసమర్థవంతముగా వ్రతము చేయించుటకు,నాయకురాలివై,


కేశవనై-అశ్వరూపములో వచ్చిన కేశి అను అసురుని సంహరించి,కేశవునిగా కీర్తింపబడిన స్వామిని సేవించుటకు ఆ గోపికను తమతో కలుపుకుని వెళ్ళుచున్న గోదమ్మ చేతిని పట్టుకునిమనము కూడ మన అడుగులను కదుపుదాము.


ఆండాళ్   దివ్య  తిరువడిగళే శరణం.





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...