Monday, January 29, 2024

ADITYAHRDAYAM-02


 


శ్లోకము-02

 ********

 " దైవతైశ్చ సమాగమ్య "ద్రష్టుం" అభ్యాగతో రణం

  ఉపగమ్యాబ్ర విద్రామ అగస్త్యో "భగవాన్-ఋషిః"


  పద విభాగము

  ***********

 రణం-ద్రష్టుం-యుద్ధమును వీక్షించుటకు

 దైవతైశ్చ్య-సమాగమ్య-దేవతలతో సహా

 భగవాం-ఋషి-విశేషపదములు

 అగస్త్యో-అగస్త్యమహాముని

 గమ్యా-రణస్థలికి వచ్చెను.

 విదామ-ఉపగమ్యబ్ర-తాను ఒక్కడే రామునికి దగ్గరగా వెళ్ళెను.

 భావము

 ******

 భగవానుడు-ఋషి అయిన అగస్త్యుడు దేవతలతో కలిసి యుద్ధమును వీక్షించుతకు వచ్చి,తానొక్కడు మాత్రమే రామునికి అతిదగ్గరగా వెళ్ళెను.(కర్తవ్యబోధనమునకై)

  ఇప్పుడు విశేష శబ్దములను ప్రస్తావించుకుందాము.


 కథనము ప్రకారము అగస్త్యభగవానుడు దేవతాసక్తులతో యుద్ధమును వీక్షించుటకు వచ్చి,తానొక్కడే రాముని సమీపించినాడు.అనగా ఇది అత్యంత గోప్యము.వాల్మికి మహర్షి అగస్త్యునకు భగవాన్-ఋషి అను రెండు విశేష గుణములను ప్రస్తావించినాడు.కనుకనే "ద్రష్టుం" అన్న పదమును అగస్త్యునకు అన్వయిస్తే యుద్ధము-దాని పరిణామములను ముందే దర్శించగలిగిన మహాజ్ఞాని.

 విష్ణు పురానములోనిర్వచించినట్లు,

 "ఉత్పత్తి-ప్రళయంచైవ

  భూతానామా గతిం-గతిం

  వేత్తి విద్యాం-అవిద్యంచ"

 ఉత్పత్తి-ప్రలయము

 భూతముల రాక-పోకలు(ప్రపంచము)

 విద్యా-అవిద్యా, అను

  ద్వంద్వముల గురించి,

 భ-స్థితి

 గ-నాయకుడు

 వ-అంతర్యామి

 న-సాకారము ,గురించి తన జ్ఞాన నేత్రముతో 

  అర్థముచేసికొనిన,సద్గుణుడు భగవానుడు.

   అంటే, జరుగుచున్న రామ రావణ యుద్ధములో రాబోతే పరిణామములను  గ్రహించిన జ్ఞాని.

  రాముని కర్తవ్య విముఖత్వము నుండి (చింతాశోకములనుండి) మరలించి,కర్త్వ్యదీక్షినిచేయగల వాడు.అదియును సరియైన సమయములో.కనుకనే "అభ్యాగతి అగస్త్యూడు"

  అయోధ్యా రాజ్య పదాతిదళ నాయకునిగా రాజ్య సంరక్షణా బాధ్యతను విస్మరించని వాడు.

 2.ఋషి-రెండవ విశేష పదము.

 "ర్షయో మంత్ర ద్రష్టార న తు కర్తః"

 తన జ్ఞాన నేత్రముతో మంత్ర ప్రభావమును గ్రహించి, దానిని తగిన సమయమునార్హులైనవారికి ఉపదేశించి,వారికి స్పూర్తి నిచ్చి,విజయప్రాప్తికి సహాయపడువాడు ఋషి.

   కుంభసంభవుడైన అగస్త్యుడు సూర్యపుత్రుడు.రామునిది సూర్య వంశము.కనుక ఉపదేశించుటకు-ఉపదేశమునుపొందుటకు (ఆదిత్యహృదయ స్తోత్రమును) ఇద్దరును అర్హులే.

  మహర్షి నారదుడు కూడా వాల్మీకిని తారక మంత్రోపదేశముతో  శ్రీమద్రామాయణ రచనమును చేయించినవాడే కదా.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...