శ్లోకము-04
********
"ఆదిత్యహృదయంపుణ్యం సర్వశత్రు వినాశనం
జయావహంజపేత్ నిత్యం అక్షయం పరం శివం."
పద విభాగము
************
పుణ్యం
సర్వ శత్రువినాశనం
జయావహం
అక్షయం
పరమం/సర్వోత్కృష్టము
శివం/శుభం
అదిత్యహృదయం.
అగస్త్య మహాముని మొదటి శ్లోకములో దృష్ట్వా,అని,రెండవ శ్లోకములో శృణు అని,మూడవ శ్లోకములో జపేత్ చ్దర్శించు,శ్రవణము చేయి,జపించు అను సాధనావస్థలను తెలియచేసినారు.
స్తోత్ర ఫలసిద్ధినికూడా ముందుగనే ధృవీకరించినారు.
ప్రస్తుత శ్లోకములో సనాతనము-గుహ్యమైన ఆదిత్యహృదయ స్తోత్రము యొక్క శుభలక్షణ సమగ్రతను వివరిస్తున్నారు.
స్తోత్ర ఫలితము శాశ్వతముకనుక నిత్యం అన్నారు.నశించనికనుక అక్షయం అన్నారు.ఐహికాతీతము కనుక ఫలప్రదము కనుకపరమన్నారు.శుభప్రదమైనదికనుక శివం అన్నారు.జయ స్వరూపము కనుక జయం అన్నారు.
ఇంక "పుణ్యం" శబ్దమును పరిశీలిస్తే,
మందలస్తోత్రముకూడ,
"పునాతు మాం తత్ సత్ వరేణ్యం"అనికీర్తిస్తున్నది.
"పునాతి అనేనపుణ్యం" అంటారుపెద్దలు.
దేని వలనపునీతులమవుతామో/ఏ మహాశక్తి పాపక్షయము గావించగలదో అదిపుణ్యము అని నిర్వచిస్తారు.
అసురీగునములను పారద్రోలిన మానసికస్థితియే ఆదిత్యము.దానిని గుండెలోభద్రముగా దాచుకొనుటయే హృదయము.
నామములన్నీ సనాతములో గుణసంకేతములే కదా.
కనుకనే గుహ్యం అనికూడా అన్నారు.
కదిలేది కదిలించేదీయినప్పటికిని కనిపించనిది హృదయము.అదేచేతనము.అది దైవీసంపద్భరితము.మనము రోజు భౌతికదృష్టితో చూస్తున్న సూర్యబింబమే,వైజ్ఞానిక దృష్టితో చూస్తే ఉదయ-అస్తమానములు లేనిదిగా గమనించగలుగుతాము.దానినే మరికొంత భక్తిశ్రద్ధలతోఉపాసన దృష్టితో చూస్తే అందులో నిక్షిప్తమయి సకల చరాచరములను చైతన్యవంతులనుచేస్తున్న మహాద్భుత మూలశక్తి మనకు దర్శనమిస్తుంది.
సూర్యవిజ్ఞాన కేంద్రీకృతమే,శబ్దరూప సూక్ష్మమే "ఆదిత్యహృదయస్తోత్రము.కనుకనిత్యము జపించు అని ఉపదేశించెను రామునకు అగస్త్యుడు.
తం సూర్యంప్రణమామ్యహం.
No comments:
Post a Comment