Saturday, February 10, 2024

ADITYAHRDAYAM-SLOKA-02

 


   ఆదిత్యహృదయము-శ్లోకము02


  *******************


" దైవతైశ్చ సమాగమ్యాద్రష్టుమభ్యాగతో" రణం"


  ఉపగమ్యాత్ బ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః."




   వివేక రాహిత్యము -విచక్షణాజ్ఞానముతో తలపడుటకు సిద్ధముగా నున్న సందర్భము.




   " జ్ఞాత్వా గృహీణ కర్మాని" అన్నది ఆర్యోక్తి.


 మనముచేసే పనుల యొక్క స్వభావము-ప్రయోజనము తెలిసికొని ఆచరించుట విధానము.సర్వోత్కృష్టము.




  ప్రస్తుత శ్లోకములో "రణమును" గమనించిన అగస్త్యుడు,విజయ ప్రేరేపణమును గావించుటకు,దేవతా శక్తులతో కూడి వచ్చెను.



  యుద్ధము-సమరము అన్న పదములను ప్రయోగించిన మహర్షి వాల్మికి,"రణము  అన్న శబ్ద ప్రయోగమును చేశారు.


 ఘర్షణాపూరితమైనది "రణము" మనసునకు బలమైన తాకిడిని/రాపిడిని కలిగించు చిత్తవృత్తులు/చింతనములే "రణము.



  రామచంద్రుని మనసు సంఘర్షణముగానే యున్నది.రావణాసురుని చిత్తము సంఘర్షణముతోనే యున్నది.


  దానిని ద్రష్టుం-గమనించిన వ్యక్తి అగస్త్యుడు.


  దానిని తొలగించవలసిన బాధ్యత తనది గా భావించాడు.


 " సీతమ్మ సైతము" సరమతో సంభాషించు సమయమున ఆదిత్య ప్రేరేపితయై విజయమునకు ఆదిత్యస్తోత్ర పారాయణమును"చేయుచున్నది.


 అగస్త్యుడు భగవాన్. అనగా తన గమనముతో కాంతులను విస్తరింపచేయువాడు.షడ్గుణ సంపన్నుడు.శోకమును పారద్రోలువాడు.అంతే కాదు ఋషి.కనుకనే స్తోత్ర ప్రారంభములో,



" ఓం అస్య శ్రీ ఆదిత్య స్తోత్ర మహామంత్రస్య


  అగస్త్యో భవాన్ ఋషిః" అని చెప్పబడినది.


  అంతేకాదు "అభ్యాగతిగా " వచ్చాడు.ఉపదేశించుటకు వచ్చాడు.తానొక్కడే దిగివచ్చి,అతిథి తిథి వార నక్షత్రములను గమనించకుండా వచ్చేవాడు,అభ్యాగతి సమయ-సందర్భమునకు అనుకూలముగా వచ్చి,తన కర్తవ్యమును నెరవేర్చువాడు.



 రామం గమ్యా-రాముని సమీపిస్తున్నాడు.


    రామం-ఉపాగమ్యా-రాముని అతిదగ్గరగా సమీపిస్తున్నాడు.


  సమీపించి,


 బ్రవీత్-




ప్రేరేపించబోతున్నాడు.స్పూర్తిని అందించబోతున్నాడు.




  అతిదగ్గరగా సమీపించి త్వరితముగా చెప్పబోతున్నాడంటే ఆ ఉపాయము ఎంతో  రహస్యమైనది-రక్షించునది కావచ్చునని నేను భావిస్తున్నాను.


 తాను దర్శించిన-స్తోత్రమును సర్వదేవతాశక్తి మంతుడైన ఋషి రామునకు ఉపదేశించబోతున్న తరుణములో,


 " తం సూర్యంప్రణమామ్యహం."





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...