శ్లోకము
"తాం మ ఆవహ జాతవేదో లక్ష్మిం అనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం.
పూర్వ శ్లోకములో లక్ష్మీదేవిని తన దగ్గరకు చేర్చమని జాతవేదుని ప్రార్థించిన భక్తుడు జాతవేదునికి మరొక విన్నపమునుచేయుచున్నాడు.
ఓ జాతవేదుడా!
నీవు నిత్యపూజలలో జ్యోతిగాను,అగ్నికార్యములలో మేము అందించు యజ్ఞవస్తువులను దేవతలకు అనుకూలమగు హవిస్సులుగా చేర్చి,వారి అనుగ్రహమును అందించు సంధానకర్తగా కీర్తింపబడుతున్నావు.దానికి కారనము,
1ఆశ్రిత ఆశ్రయము
2.ఆర్ష వాజ్మయము
3.అనంత సంపద అను నీ మూడు శుభలక్షణములు.
లక్ష్మీదేవి ప్రసన్నతను అందచేయగల జ్ఞానచైతన్యము నీవేసుమా.
నీ ఆశ్రిత ఆశ్రయముతో నిన్ను చేరగలిగినాను.నీ ఆర్ష వాజ్మయ శక్తితో ఆ తల్లి శాశ్వతముగా నాలో నిండియుండునట్లు ,నన్ను సౌభాగ్య సౌశీల్యునిగా దీవించునట్లు చేయుము.
No comments:
Post a Comment