ఓం నమ: శివాయ -10
బావిలోన నీవున్నావని భక్తుడిగా నేవస్తే
బావిలోన కప్ప నిన్ను తనతో పోల్చుకుంది
కొండమీద నీవున్నావని కొలువగ నేవస్తే
బండరాయి కూడ నిన్న తనతో పోల్చుకుంది
బీడునేలలో నీవున్నావని తోడుకొరకు నేవస్తే
జోడువీడు అంటు బీడు తనతో పోల్చుకుంది
అటవిలోన ఉన్నావని అటుగా నేవస్తే
జటలను చూపిస్తు అటవి తనతో పోల్చుకుంది
చెట్టులోన ఉన్నావని పట్టుకొనగ నేవస్తే
పట్టులేక ఉన్నావని చెట్టు తనతో పోల్చుకుంది
సఖుడివి నీవై సకలము పరిపాలిస్తుంటే
ఒక్కరైన పొగడరేల ఓ తిక్క శంకరా.
No comments:
Post a Comment