బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకు మారుస్తుంది ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారుబతుకమ్మ ఉయ్యాలో
జలములోన కలిసె ఉయ్యాలో
జలజముగా పూసె ఉయ్యాలో
జనము పూజలందె ఉయ్యాలో
దప్పిక తీర్చేను ఉయ్యాలో
గొప్పనైన తల్లి ఉయ్యాలో 11 బతుకమ్మ 11
చేనులోన జారె ఉయ్యాలో
జొన్నపైరుగా మారె ఉయ్యాలో
యెన్నరాని ప్రేమ ఉయ్యాలో
ఆకలిని తీర్చే ఉయ్యాలో 11 బతుకమ్మ 11
కలికి చిలుకల కొలికి ఉయ్యాలో
పిల్లగాలిని చేరె ఉయ్యాలో
పిల్లాపాపనుగావ ఉయ్యాలో
పిల్లనగ్రోవై తాను ఉయ్యాలో
ఉల్లము ఉప్పొంగ ఉయ్యాలో
చల్లనైన తల్లి ఉయ్యాలో 11 బతుకమ్మ 11
నిండుజాబిలి చేరె ఉయ్యాలో
పండువెన్నెలగాను ఉయ్యాలో
పిండారబోసింది ఉయ్యాలో
సత్తుపిండి దొరికె ఉయ్యాలో
సత్తువ గౌరమ్మ ఉయ్యాలో 11 బతుకమ్మ 11
చెట్టులోన చేరె ఉయ్యాలో
చుట్టమౌతానంది
తెల్పింది ప్రేమను
శిల్పక్క పండుగా
కల్పవల్లి తల్లి 11 బతుకమ్మ 11
తెల్పింది ప్రేమను
శిల్పక్క పండుగా
కల్పవల్లి తల్లి 11 బతుకమ్మ 11
వలయాకారంలోన ఉయ్యాలో
మమకారం దాగుంది ఉయ్యాలో
ముత్తెపు బతుకుల్లో ఉయ్యాలో
పొత్తు తెలుపుతుంది ఉయ్యాలో 11 బతుకమ్మ 11
సత్తెపు బతుకమ్మ ఉయ్యాలో
గునుకుపూలల్లోన ఉయ్యాలో
గుమ్మాడిపూలల్లో ఉయ్యాలో
తంగేడుపూలల్లో ఉయ్యాలో
చామంతిపూలల్లో ఉయ్యాలో
పూబంతి బతుకమ్మ ఉయ్యాలో
పూలు పేర్చేమమ్మ ఉయ్యాలో 11 బతుకమ్మ
తాపాలు తీర్చేవమ్మ ఉయ్యాలో
ఆడిపాడేమమ్మ ఉయ్యాలో
సద్దులాడంగాను ఉయ్యాలో
ముద్దులాడేతల్లి ఉయ్యాలో
మనీదా విందులు ఉయ్యాలో
మనసైన చిందులు ఉయ్యాలో
బొడ్డెమ్మ అందాలు ఉయ్యాలో
బొడ్డెమ్మ చందాలు ఉయ్యాలో
దొడ్డదైన తల్లీ ఉయ్యాలో 11 బతుకమ్మ 11
తలపైన మోసేము ఉయ్యాలో
తలవంపు తేమమ్మ ఉయ్యాలో
తలచినంతలోన ఉయ్యాలో
తల్లడిల్లనీవు ఉయ్యాలో
తల్లీ బతుకమ్మ ఉయ్యాలో
నీవు సేదతీర ఉయ్యాలో
నిమజ్జనాలమ్మ ఉయ్యాలో
మళ్ళీ మమ్మేలంగ ఉయ్యాలో
నీళ్ళవాయనాలు ఉయ్యాలో
వేనోళ్ళపొగిడేము ఉయ్యాలో 11 బతుకమ్మ11
No comments:
Post a Comment