రాఖీ పండుగ
************
విశిష్ఠ మైన పండుగ రక్షాబంధనము
విశ్వసోదరత్వానికి పటిష్ఠ ఇంధనము
ఆడపడుచులందరికి అంతులేని ఆపేక్ష
అన్నదమ్ముల ప్రేమే వారికి శ్రీరామ రక్ష
...............ఆడపడుచులు సోదరులను
అందమైన ఆసనమున కూర్చుండబెట్టి
ఒట్టు వేసినట్టు వారి నుదుటన బొట్టుపెట్టి
గళమున హారములను వేద్దాము
మంగళ హారతులను ఇద్దాము
అగ్గిని సాక్షిని చేసి వారు నెగ్గాలని కోరుదాము
మనసులోని ప్రీతితో తీపిని తినిపిద్దాము
శ్రావణ పున్నమి జరిగే రాఖీ, కన్నుల పండుగ
వెన్నుని ఆశీసులు మిము సుసంపన్నులుగా మార్చాలని
మేమున్నామని వారి చేతికి రాఖీలను కడదాము
...........కట్టిన రక్షలతో ఆనందముతో అన్నదమ్ములు
కన్నతల్లి కలలను కమ్మని నిజాలు చేస్తూ
ముచ్చట తీర్చగ మా వద్దకు వచ్చిన తోబుట్టువులు
ఏ పాదము ఎత్తనీము, ఆపదను ఆపెదము
కనురెప్పల్లో లక్షణంగా కాస్తాము క్షణక్షణం
నేల, పాదు నేనౌతా చిరు నవ్వుల సోదరి
వేల వేల సిరుల పూలు పూయని నీ దరి
మీరు లక్షింతలు కావాలని అక్షింతలు వేస్తూ
రాఖీ కట్టిన చేతికి చేయూతగా ఉంటాము
..............ఇట్లు
అక్కా చెల్లెళ్ళు ఇరిగో చక్కని బహుమతులతో
అన్న దమ్ముళ్ళు చూడ చక్కని రాఖీలతో
ఒకే తీగ పువ్వులుగా పరిమళములు వ్యాపిస్తూ.
వాత్సల్య తీగలతో వసుధైక కుటుంబమనే పందిరి వేస్తున్నారు.
No comments:
Post a Comment