" అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః "
(అఖిలాండ బ్రహ్మాండలములలోను,అన్ని చరాచర జీవ రాశులలోను గురువు వ్యాపించి
యున్నాడట.నిజమేనా? మీరేమంటారు?)
ఓ ! మనిషి! ఆలోచించు
*************************
మూస్తూ-తెరుస్తూ, నిరంతరము శ్రమిస్తూ
కంటిని కాపాడే కనురెప్ప కాదా గురువు
పీలుస్తూ-వదులుతూ, ఊపిరిని అందిస్తూ
ఉనికిని కాపాడే నాసిక కాదా గురువు
కప్పేస్తూ-దాచేస్తూ, వ్యవస్థలను రక్షిస్తూ
స్పర్శను అందించే చర్మము కాదా గురువు
కదలకుండ-మెదలకుండ పదును పళ్ళ మధ్య తానుంటూ
అదనుచూసి కదలాడే నాలుక కాదా గురువు
అడుగు వేస్తు-అడుగుతీస్తు నడవడిని చూపిస్తూ
కుడి ఎడమల పయనించే నడకయు కాదా గురువు
మంచి పనులు-చెడ్డ పనులు రెండింట్లో తానుంటూ
మనసు దారి మళ్ళించే బుద్ధియు కాదా గురువు
ఐదు జ్ఞానేంద్రియములు-ఐదు కర్మేంద్రియములు నివసిస్తూ
అనవరతము పాటించే క్రమశిక్షణ కాదా గురువు
నీ శరీరమే గురు కులమై ఎన్నో నేర్పిస్తుంటే ( గురువుల సమూహము)
No comments:
Post a Comment