చిదానంద రూపా- గణ నాథ నాయనారు
******************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శిర్కళిలో జన్మించిన శివ భక్టుడు గణనాథ నాయనారు
చేసే ప్రతి పని చైతన్య స్వరూపుని సేవగ తలచును
చెంతకు చేరినవారికి చిదానందుని సేవలు పంచును
కొందరు పూమాలలతో,మరికొందరు గంగా జలముతో
ఇంకొందరు శివ చింతనతో ,మరికొందరు సంకీర్తనలతో
సమయము సద్వినియోగము సఫలము మానవ జన్మము
ఫంగుణి ఆర్ద్ర నక్షత్రమున తిరు పూజోత్సవముతో
గణముల నాయకుడవ్వగ సద్వర్తనమే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక .
శిర్కోళి లో శివాలయములోని సత్తెయనాథుని పరమ భక్తుడు.సమయమున సద్వినియోగపరచుకొనుచు,ఇతర చింతనలను వదిలి,ఈశ్వర చింతనతో తన జన్మను సార్థకతమొనరించుకొనువాడు.ఎంతోమంది అతని దగ్గరకు వచ్చి,తమ మనోవేదనను వెలిబుచ్చుకొని,వారి సమస్యలకు తగినపరిష్కారమును పొందెడివారు.మరికొందరు తమ జీవన శైలిని భగవత్సేవకు మళ్ళించుకొని చరితార్థులైనారు.తముళ పవిత్ర గ్రంథములగు "తిరుమరై" గ్రంథ ప్రతులను వ్రాయుచు తన్మయమునందెడి వారు.జ్ఞాన సంబంధరు ఆ స్థలముననే అమ్మ క్షీరపానముచే అమృతగానమును చేసెనని నమ్ముదురు.సాత్విక మార్గములో సంస్కారమును పెంపొందించి,శైవభక్తులను సుసంపన్నులుగ చేసిన నాయనారు సదాశివుని కరుణతో కైలాసమున గణములకు నాయకుడై ఫంగుణి తిరునక్ష్త్రమున పవిత్ర ఆరాధనలనుందుచున్న గణ నాథుని కరుణించిన పరమశివుడు మనలనందరిని అనుగ్రహించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment