చిదానందరూపా-నిన్రచీరు నెదుమార నాయనారు
*****************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పెడుమారనర్ అను రాజుకు కున్ పాండియన్ వేరొక పేరు
జైనుడు తాను ,తన పరిపాలన కోరును కొంత మార్పు
ఆరోగ్యము-రాజ్యము అభివృద్ధిని పొందెను,ఆశీర్వచనమో
అద్భుతముగ మార్చెను రాజును తిరుజ్ఞాన సంబంధరు సంస్కారము
అదననుకొని ఆక్రమించగ రాజ్యము దండెత్తెను ఉత్తర రాజు
అదిమేసెను వానిని అరివీర భయంకర శంకర మహరాజు
అనవరత రక్షణలో రాజ్యము ఆనందములో తేలియాడగ
ఆది దేవుని కరుణను పొందగ, ఆధ్యాత్మికయే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
నెడు మారనర్ పాండ్య రాజు.జైన మతమునునమ్మిన వాడు.అతని వీపుపై గూని యుండుట వలన కుణ్ పాండియళ్ అని పిలువబడేవాడు.అతని రాజ్యములో కూడా అనేక సమస్యలు అతనినివేధించుచున్నవి.శివుని కృపా కటాక్షమేమో ఒకరోజు తిరుజ్ఞాన సంబంధారు దర్శనము,సంభాషణము రాజులో కోల్పోయిన తన ఆరోగ్యమును ప్రసాదించి,తన రాజ్యములోనిచీకాకులు తొలగి పోయి ప్రశాంతముగా నుండ సాగెను.ఇదే సమయమని ఎన్నాళ్ళనుందియో ఎదురుచూస్తున్న శత్రురాజు పెద్ద సైన్యముతో దండెత్తెను.నమ్మిన వారి కొంగు బంగారమైన పరమేశుడు ప్రచండుడై శత్రువును పరాజయము పాలు చేసెను.ఆశ్రిత వత్సలుని ఆశీర్వచనముతో వారు అతి పవిత్రులైరి.
( ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment