చిదానందరూపా-కరి నాయనారు
***************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
తిరుక్కడ వూరులోని శివభక్తుడు కరి నాయనారు
సంకీర్తించగ ఇశుని ఆతనికెవ్వరు సాటిరారు
మార్కండేయుని సమ్రక్షించినదిక్కడే మాహేశ్వర క్షాత్రము
మహాత్ములకు ఆలవాలమైనది ఈశుని క్షేత్రము
వైభవ వాగ్బంధములతో,శాంభవ సంకీర్తనలతో
పాండ్య-చోళ-చేర దేశముల పాటలు తేనెలు మీటెను
పాయని భక్తికి తోడుగ సంపద సాయము ఆయెగ
సన్నిధి చేరగ సంపద శివభక్తుల చేరుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
No comments:
Post a Comment