అదిగో మధుమాస సంరక్షణను దిగ్విజయముగా పూర్తిచెసుకొని,
పులహ మహాముని వంశాభివృధ్ధికి కారణమవుతు,వేదవేద్యునికి లాంఛనప్రాయముగా మార్గమును చూపిస్తూ,మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.అప్సరసాంగన పుంజికస్థలి తన దివ్యశక్తులతో నారద గానామృతమునకు అనుగుణముగా నర్తిస్తున్నది.కఛ్చనీరుడను సర్పము ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు ఒద్దికగా.అతౌజుడను యక్షుడు సలక్షణుడై స్వామిరథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తూ,ఆనందిస్తున్నాడు.ప్రహేతి రాక్షసుడు పరాక్రమోపేతుడై రథమును ముందుకు జరుపుతున్నాడు.తన కిరణముల ద్వారా ఉష్ణోగ్రతల పెంచుతు,అవనీతలమును ఆనందమయము చేయుటకు మాధవమాస అధిపతియై "ఆర్యమ" నామాలంకృత శోభితుడై తరలు వాయు తత్త్వ ప్రధాన స్వామీ.
" తం ఆర్యమ ప్రణమామ్యహం."

No comments:
Post a Comment