మధుమాసము-ధాత
******************
అదిగో! ఆనందోత్సాహము! ఆస్వాదించండి.
" మననాత్ త్రాయతే మంత్రః" మననము చేసే వారిని రక్షించేదే మంత్రము అను ఆర్యోక్తికి అద్దము పడుతూ,బ్రహ్మ మానసపుత్రుడు,సప్తర్షులలో ఒకరైన పులస్త్యుడు (ప్రథమముగ నుండువాడు),పురాణ సంపదను మానవాళికి చేరువ చేసిన మహనీయుడు వేదవేద్యుని కీర్తిస్తూ,లాంఛన ప్రాయముగా మార్గమును చూపిస్తు మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.క్షీరసాగర మథనానంతరము జలరసముగా ప్రకటింపబడిన/వెలువడిన( అపొ-నీటి-రస-సారము)కృతస్థలి అను అప్సరస అవనీతలమును చిగురింపచేయుటకు ఆడుతూ స్వామిని అనుసరిస్తున్నది.అసమాన సౌందర్యముతో,అప్రమేయ పరాక్రమముతో కోకిలమ్మకు కొత్త కూత నేర్పించుటకా యన్నట్లు,తుంబురుడు తన మధుర గానముతో పరమాత్మను తన్మయ పరుస్తూ,తరించిపోతున్నాడు.
నాగరాజైన వాసుకి ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.
పర్వత పరిరక్షకుడు పరిశీలనా దక్షుడు అయిన రథకృత్ అను యక్షుడు జగములను తన శక్తిచే మాయామోహితులను చేయుటకు స్వామి రథమునకు సప్తాశ్వములకు అనుసంధానమును చేస్తూ, ఆనందిస్తున్నాడు.హేతి రాక్షసుడు రథమునకు వెనుక నిలబడి స్వామి రథమును తన భుజబలముతో ముందుకు జరుపుతున్నాడు.నయనానందకరముగా " ధాత" నామాంకృత శోభితుడై భూతలమును నవనవోన్మేషము చేయుటకు స్వామి తరలుచున్నాడు.
స్వామి సృష్టికార్యమును తిరిగి ప్రారంభిస్తున్నాడు.మోడుబారిన చెట్లు కొత్తచిగురులు తొడుగుటకు తనతో పాటుగా జలసంపత్తిని (అపరసను) జ్ఞాన సంపత్తిని(పులస్త్య మునిని) మోహవివశులను చేయుటకు రథకృత్ ని,భవసాగర బంధములను (వాసుకిని)సర్పములను ,తమోగుణ హేతి రాక్షసుని సంకేతములుగా తనతో పాటు తరలిస్తున్న ఆ తాపస మనోహరుడు మనలను రక్షించును గాక.
తం ధాత ప్రణమామ్యహం.

No comments:
Post a Comment