Sunday, November 7, 2021

TIRU MOOLAR NAAYANAAR

తిరుమూలర్ నాయనారు ******************* మూలర్ అను సత్తనూరు గ్రామవాసియైన విగతజీవుడైన పశువుల కాపరిశరీరములోనికి ప్రవేశించిన వాడు కనుక ,నాయనారు అసలుపరు మరుగున పడి,తిరుమూలర్ నాయనారుగా ప్రసిధ్ధి చెందినాడు. తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెళ్ళుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమంద విచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషయమును తెలిసిన ,.నాయనారు ఆవులను దుఖః విముక్తులను చేయ దలిచాడు. ఆది శంకరుల వారిని స్మరించి,నిష్కాముడై తన శరీరమును చెట్టు తొర్రలో పెట్టి మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేశాడు. కాపరిని చూసి గోవులు సంతసించాయి. అంటే అంతకు ముందు గోవులు విచారముతో నున్నాయా? ఎందుకున్నాయి? వాటి దగ్గరకు నయనరు వెల్లవలసి వచ్చిన పరిస్థితి ఏమిటి? పరకాయ ప్రవేశమే మూలార్ గా ప్రకటింపబడుటకు సరియైన పరిష్కారమా? అని మన మనసు మనలను పరిపరి విధముల ప్రశ్నింప వచ్చును. అసలు ఇదంతా ఆదిదేవుడు ఆడిన నాటకమని నమ్ముతున్నప్పటికిని,వమ్ముకానీయని వాని కరుణ చేసిన కనికట్టును తెలిసికొనే ప్రయత్నమును చేద్దాము. తిరునంది యోగి శిష్యునిగా ప్రశస్థిని పొందిన నాయనారు పరమేశుని సంకల్పముతో పరకాయ ప్రవేశమును చేసినాడనుటలో సందేహము లేదు. ఎవరి తలపున దాగి,దానిని వారిజీవితములో సరికొత్త మలుపుగా మలుస్తాడో చెప్పనలవికాదు. నడక-నడిచేది-నడిపించేది అన్నీ తానేయైన నటరాజు నాయనారు మనసులో,పోతికొండల యందున్న అగస్త్యముని సందర్షనాభిలాషకు బీజం నాటాడు.అనుకున్నదే తడవుగా అమలుచేయుటకు అనుజ్ఞ నిచ్చాడు. అమితానందముతో అడుగులను కదుపుతున్నాడు నాయనారు.కదిపిస్తున్నాడు నగజాపతి. దారిలో కావేరి నదిలో స్నానమాచరించి,కామేశునికి ప్రదక్షిణమాచరించి,కదులుతున్న సమయములో,కాగల కార్యమునకు కావలిసిన దృశ్యమును నాయనారు కన్నులముందుంచాడు ఆ మూడుకన్నులవాడు. మునిదర్శన కాంక్ష మౌనముగా తరలిపోయినది.విచారముతో కన్నీరు-మున్నీరుగా రోదిస్తున్నాయి గోమాతలు.కారనము-నివారనము నాయనారు మనసు ఆవరణమున ప్రవేశించి,ఆలోచింపచేసినవి.అంబాపతి పతి అంబా ధ్వనులు ఆవులమందలో ప్రతిధ్వనించుచు నాయనారును చుట్టుపక్కల పరికింపచేసినవి.స్వామిని నాయనారు భక్తిని పరీక్షింపచేసినవి. విధిలీలా విలాసముగా విగతజీవుడై అక్కడ పడియున్నాడు గోసంసరక్షకుడు భూసంరక్షకుని ఆటలో. తక్షణ కర్తవ్యముగా తన సరీరమును అక్కడ నున్న ఒక చెట్టు తొర్రలో భద్రపరచి,తాను మూలార్ తనువులోనికి ప్రవేశించాడు.కాపరిని చూసిన ఆవులు ఆనందముతో సమీపించాయి. ఏ వేళ ఏమి జరుగుతుందో ఆ ఎరుకుల వానికే ఎరుక. ఇంటికి చేరిన వానిని ఎనలేని ప్రేమతో సమీపించింది మూలార్ భార్య. తల్లిగా గౌరవించు సంస్కారము తప్పుచేయనీయక సత్యమును చెప్పించి,ఆమెకు సత్యమార్గమును చూపించాలనుకున్నది. మంచిరసపట్తులో నున్న కథ ఆమెతో తగవులాడించింది.మూలార్ను కర్తవ్య విముఖిగా ఆరోపించుచు,గ్రామపెద్ద న్యాయ నిర్ణయము వైపు మరలించినది . నందివాహనుని పందెమునకు పదునుపెట్టుతూ ముందరకు పోతున్నది. అన్మతించారు గ్రామ పెద్దలు మూలార్ సన్యాస స్వీకరనకు-వాని భార్య సన్మార్గ సాధనకు. తరలి వచ్చాడు మూలార్ గోవులతో పాటుగా తన కాయమును దాచిన చెట్టు వద్దకు.గోసమ్రక్షణా సేవను చేస్తూనే పరమేశుని ప్రసన్నుని చేసుకునే ప్రయత్నమునకై. తలపుకు జన్మను ఇచ్చినవాడు తనువును మాయము చేసేసాడు.దృశ్యమును చూపిస్తూనే నాయనారు శరీరమును అదృశ్యము చేసేసాడు. ఘటనాఘటనా సమర్థుడు ఆనతీయగా , సమాధి స్థితిలో మూడువేల సంవత్సరాలుండి,సంవత్సరమునకొకసారి బహిర్ముఖుడై ఒక పద్యమును చెప్పుచు,మూడువేల పద్యముల "తిరు మందిరము"ను అందించిన అదృష్టవంతుడు తిరుమూలర్ నాయనారు ఆ చంద్ర తారాక్షము ఆరాధ్యనీయుడు. నాయనారును అనుగ్రహించిన ఆదిదేవుడు మనలనందరిని సంరక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...