Friday, April 29, 2022

IF LETTER CHANGES ITS PLACE IN A WORD.?


 telugupada teeyadanamunu AsvaadimchaalamTae tappaka padamuloe daagina aksharamulanu gurtimchagalagaali.amtaekaadu avi amarina vidhaanamunu gamanimchagalagaali.aksharamulu aTu-iTu maarutu padasaumdaryamunu pempodistoo,bhaavamunu inumaDimpachaestumTaayi.
 aTuvamTi konni padamulanu gamaniddaamu.
1.chirugu/chiguru
 paina unna remDu padamulaloeni aksharamulu okaTae ayinappaTikini,vaani arthamu maatramu vibhinnamae.
 chirugu anna padamu vastramuloeni nissattuvanu teliyachaestumTae,
chiguru anna padamu vasamtamuna cheTlakommalaloe vachchu pachchadanamunu prakaTistunnaayi.
1karamu/rakamu
2.aduru/arudu
3.ravamu/varamu
4SukuDu/kuSuDu
5.paDaga/pagaDa
6.davanam/vadanam
7.dasara/sarada
8.ratamu/taramu
9.vasati/savati
10.kaMpamu/pamkamu
  padamula arthamulanu gamaniddaamu.
karamu-chaeyi/mikili
rakamu-vargamu
aduru-kampimchu
vadaru-noeTikivachchinaTlu maaTlaaDu
ravamu-Sabdamu
varamu-pomdinadi
SukuDu-vyaasamuniputruDu
kuSuDu-SreeraamaputruDu
paDaga-paamutala
pagaDa-navaratnaulaloenidi
vasati-saukaryamu
savati-bhartayokka maroebhaarya
dasara-pamDuga
sarada-samtoeshamunu kaligimchunadi
kampamu-kadalika
pamkamu-burada.
kabamdhuni karamu adoe rakamu.
 
vaakyamulanu pariSeelimchamDi.
**************************

 dasara selavulu saradaagaa gaDichinaayi.
 ravamunu gurtimchae varamunu pomdenu
 paamupaDagapai pagaDamu unnadi.
marikonni viSaeshamulanu jatachaeddaamu.

 dhanyavaadamulu.

 తెలుగుపద తీయదనమును ఆస్వాదించాలంటే తప్పక పదములో దాగిన అక్షరములను గుర్తించగలగాలి.అంతేకాదు అవి అమరిన విధానమును గమనించగలగాలి.అక్షరములు అటు-ఇటు మారుతు పదసౌందర్యమును పెంపొదిస్తూ,భావమును ఇనుమడింపచేస్తుంటాయి.
 అటువంటి కొన్ని పదములను గమనిద్దాము.
1.చిరుగు/చిగురు
 పైన ఉన్న రెండు పదములలోని అక్షరములు ఒకటే అయినప్పటికిని,వాని అర్థము మాత్రము విభిన్నమే.
 చిరుగు అన్న పదము వస్త్రములోని నిస్సత్తువను తెలియచేస్తుంటే,
చిగురు అన్న పదము వసంతమున చెట్లకొమ్మలలో వచ్చు పచ్చదనమును ప్రకటిస్తున్నాయి.
1కరము/రకము
2.అదురు/అరుదు
3.రవము/వరము
4శుకుడు/కుశుడు
5.పడగ/పగడ
6.దవనం/వదనం
7.దసర/సరద
8.రతము/తరము
9.వసతి/సవతి
10.కంపము/పంకము
  పదముల అర్థములను గమనిద్దాము.
కరము-చేయి/మికిలి
రకము-వర్గము
అదురు-కంపించు
వదరు-నోటికివచ్చినట్లు మాట్లాడు
రవము-శబ్దము
వరము-పొందినది
శుకుడు-వ్యాసమునిపుత్రుడు
కుశుడు-శ్రీరామపుత్రుడు
పడగ-పాముతల
పగడ-నవరత్నౌలలోనిది
వసతి-సౌకర్యము
సవతి-భర్తయొక్క మరోభార్య
దసర-పండుగ
సరద-సంతోషమును కలిగించునది
కంపము-కదలిక
పంకము-బురద.
కబంధుని కరము అదో రకము.
 
వాక్యములను పరిశీలించండి.
**************************

 దసర సెలవులు సరదాగా గడిచినాయి.
 రవమును గుర్తించే వరమును పొందెను
 పాముపడగపై పగడము ఉన్నది.
మరికొన్ని విశేషములను జతచేద్దాము.

 ధన్యవాదములు.



 



 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...