" రక్తబీజ వధే దేవి చండ-ముండ వినాశిని
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి"
చందముండాసురులు చాముండ చేతిలో సమసిన తదుపరి దేవ-దానవ యుద్ధము కొత్తరూపును సంతరించుకున్నది.
తరగని తామసము తనసైన్యమునంతటిని కూడ దీసుకుని తల్లిని వధియింప వచ్చుచున్నది.దానికి మేము సిద్ధము అంటూ దైతేయులు-కంబులు-అనేకానేక వీర్యులు-ధౌత్రులు-కాలకులు-మౌర్యులు-కాలకేయులు శుంభ-నిశుంభ పక్షమున సన్నద్ధమగుచున్నారు.
వానితో కాసేపు వినెదించవలెననుకున్నదేమో మన తల్లి సప్త మాతృకలను పోరాదనిచ్చి వాని సైన్యమును సమరాంగనమును వీడిపారిపోవునట్లు చేసినది. ఈ ఘట్తములో తల్లి శివుని వానికదకు రాయబారిగా సాంతి సందేశతో పంపి శివదూతిగా కీర్తింపబడుతున్నది.
సైన్యము పలాయనము చిత్తగించుతను చూసి తమతో పోరాడుచున్న సప్తమాతృకలకు ధీటుగా సుంభ-నిస్-శుంభులు రక్తబీజుని రణరంగమునకు పరిచయము చేసిరి.
కొన్ని కథనముల ప్రకారము వీడు స్వయముగా మహిషుని తండ్రియైన రంభుడు అని దేవిపై పగ సాధించుతకై తన శరీరము నుండి కిందపడిన ప్రతి రక్తపుబొట్టు నుండి మరొక రక్తబీజుడు జనించు వరమును పొందియున్నాడు కనుక జయము తథ్యము అన్న నమ్మకము శుంభునిది.
రక్తమే బీజముగా కలవాడు.రక్తి అనురక్తిని వీడలేనివాడు.
కాసేపు వారి నమ్మకమునకు భంగము వాటిల్లనీయకూడదని అమ్మ తలచినదో ఏమో సప్తమాతృకలు సంధించుచున్న బాణ,గద,శూల ప్రహరణములకు వాని శరీరమునుండి కారుచున్న రక్తపు బిందువులు వారి అజ్ఞానము వలె/అహంకారము వలె అంతంకంతకు అనేకానేకములై అట్టహాసము చేయుచుండెను.
Yఆ దేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థితా
తల్లి కదసారి కనికరించి వారివద్దకు దూతగా సివుని పంపి బ్రతుకదలచినచో పాతాలమునకు పొండు.దేవేంద్రునికి స్వర్గమును,వారు హవిస్సులను అందుకొనునట్లు అప్పగించమని అవకాశమునిచ్చెని.
దానికి వారు మరింత క్రోధముతో అంబికను వధించుటకు సమీపించిరి.వెంటనే చాముండా/కాళి అమ్మ ఆజ్ఞపై తన నాలుకను విస్తృతపరచి,రక్తబీజుని రక్తమును ఒక్క బిందువు కూడా నేలరాలనీయకుండా కబళించుచుండెను.నిస్సారుడైన రక్తబీజుని కాళిక/చండిక సమూలముగా అంతమొందించిరి.
No comments:
Post a Comment