Thursday, December 8, 2022

AALO REMBAAVAAY-INTRODUCTION


 ఏలో రెంబావై-

        వ్రతమునకు రండు.
  *************************
 శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే
*********************************
" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే".
శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు/ఘనులు.
             రిపాదపద్మములకు.బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు .
" భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్
భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం."
  గోదమ్మ మనకు అందించిన "తిరు" పావనమైన,"పావై" తిరుప్పావై.దీనిని "శ్రీవ్రతము" అని కూడా ప్రస్తుతిస్తారు.వసుదేవసుతునిగా ఐహిక సంపదలు,నందగోపాలునిగా ఆముష్మికానందమునొసగెడి దివ్య వ్రతము.
 సహనములో భూదేవి,సంపదలో శ్రీదేవి,సహాయకారకత్వములో నీళాదేవి అయిన ఆండాళ్ తల్లి విల్లిపుత్తూరును రేపల్లెగా,రంగనాథుని గోపాలునిగా,తనను ఒక గోపికగా అనుకరించుకొని,మనలను అనుసరించమని,అనుగ్రహమును అందపుచ్చుకొనమని అలరించిన దివ్యలీల.
 బాహ్యమునకు ఒకవిధముగా,భాగ్యమునకు మరొకవిధముగా ప్రకటనమగుతు,ముప్పదిరోజులలో ముక్తిపథమును చేర్చు ముకుందుని హేల.
  మనగమనములో పరిచయమగువారందరును మాధవులే.మార్గదర్శకులే.బహువిధములైన భక్తికి బావుటాగా నిలుచువారే.భాగ్యశాలురే.
 వైష్ణవసాంప్రదాయానుసారముగా మొదటి ఐదు పాశురములు వ్రత సమయమును,నియమములను,సంయమనములను,సానుకూలతలను,సామూహిక సమర్పణములను తెలియచేయటమే కాక స్వామి పర-వ్యూహ-విభవ-అర్చా-ప్రాభవములను అనుగ్రహిస్తాయి.
 రెండవభాగము గోపికలుగా బాహ్యమునకు (ఆళ్వారులు)ప్రకటనమగుతు ప్రమేయభక్తి తత్పరులైనవారిగా లోలనుండువారును-ప్రమాణ భక్తికి ప్రాతిపదికలుగా బయట నిలుచుని మేల్కొలుపుతు ప్రతి ఇంద్రియము యొక్క పరిపరి విధముల పరమార్థ తత్త్వమును పరికించుటకు పద్ధతిని ప్రసాదిస్తుంటారు.
  సాప్రదాయానుసారముగా నిత్యభక్తిసూరిగనములను సేవించుకోవటము ,వారిని మేల్కొలుపుట,నప్పిన్నాయ్ నందగోపన్ అనుగ్రహముతో నోములో దర్శించబోయే మరెన్నో లీలా విభూతులను వా అనేకానేక దాసోహములను
సమర్పించుకుంటూ,అజ్ఞాన/అపరాధ క్షమాపణములను అర్పించుకుంటూ,మీతో పాటుగా పాశురములను అనుసంధానము చేసుకునే ప్రయత్నములో అమ్మ చేతిని వీడక అడుగులను కదుపుదాము.
  ఆండాళ్ తిరువడిగళే శరణం.

 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...