పాశురం-01
**********
మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్
నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైఈర్
శీర్మల్గుం అయిప్పాడి చ్చెల్వ చ్చిరుమీర్గాళ్
కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపంకుమరన్
ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం
కార్మేని చెంకణ్ కదిర్మదియుంపోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరై దరువాన్
పారోర్ పుగళ్ పడిందు ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ
సంగత్తమిళమాలై మొదటిపాశురమును అనుసంధానముచేసుకొనుటకు పూర్వము ముఖ్యముగా నా చేయిపట్టుకుని నడిపిస్తున్న అమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు.నా అపరాధములను మన్నించమని వేడుకుంటు,పరమాత్మ యొక్క
పర-వ్యూహ-అర్చ-విభవయ కటాక్షములను అనుగ్రహించగలవాడు,
" నారాయణనే" నారాయణుడొక్కడే అన్న ఆర్యోక్తిని గౌరవస్తూ, పాశుర ప్రాభవములోనికి ప్రవేశిద్దాము.
ప్రస్తుత పాశురము స్వామి యొక్క-స్వామి మాతాపితలైన నందయశోదల స్వరూప-స్వభావములను సంకీర్తిస్తున్నది.స్వామి ప్రసన్నతానుభవమునకై ,పర అనుగ్రహమునకై మన ఉపాధిని అనుసరించి,చేతనులుగా మనము చేయవలసినవి,
నీరాడ ప్పోదువీర్,నన్నానాళ్ నీరాడపోదువీర్,
పారోర్-నీరాడపోదువీర్, మార్గళి నీరాడపోదువీర్ అంటు జలక ప్రాశస్త్యమును వివరించుచున్నది.
ఏమా జలములు? ఏమిటా జలకములు? అవి బాహ్యమునకు యమునలో జలకములు.యమునకు చేరు దారిలో కురియుచున్న యామిని(వెన్నెల్) జలకములు.
అటువంటి జలకములకు ఆడుటకు నేరిళఈర్-సకలభరణభూషితులైన కన్యలు పిలువబడుతున్నారు.
ఆభరణములు బాహ్యమునకు లేక భవతాప పరిహారమునకా? అవే మనోవాక్కాయ కర్మలను త్రికరణములు.వాటిని ధరించి హరిహృదయమనే మడుగులో జరిగే సంశ్లేషణమే ఆ జలకము.
వాచ్యార్యార్థమును పరిశీలిస్తే స్వామి రూపవైభవము,
కార్మేన్-నల్లని మేఘము వంటి శరీరము
శెన్ కణ్-అందమైన కన్నులు/ఎర్రని కన్నులు
కదిర్ముదియంపోల్-చంద్రబింబం వంటి ముఖము
స్వభావమును గురించి అన్వయించుకుంటే,
కరుణను వర్షించుకునే మేఘము శరీరము
శెంకణ్-పద్మములవంటి కన్నులు
చంద్రునివంటి చల్లదనమునిచ్చు ప్రసన్నతత
అట్టి అర్చా స్వామి
అడిపాడిం-గోకులములో
కూర్వేల్కొదుంతొళిన్-పరాక్రమమైన భుజములపై పదునైన ఆయుధమును ధరించు
ఆనందమునకు నెలవుగా నున్న నందగోపుని పాలనలో
యేరారంధకణ్ణి యశోద సుకుమార లాలనలో
సామర్థ్యమునకు-సౌకుమార్యమునకు
కాఠిన్యమునకు-కరుణకు ప్రతినిధులుగా నున్న
యశోద కన్నులకు సింగపు పిల్లవలె,నందుని అనుసరించు అణకువ రూపముగా నున్న స్వామిని చరి సంకీర్తించుకునే,
పుగళ్పడిందు-ప్రతినను పూనుదాము.
పారోర్-చేతనులారా పుగల్పడిందు-వ్రతమును కలిసి చేసుకునే ప్రతిన పూనుదాము.
శెల్వశిరుమీర్గళ్ -పసివారము ఐనను ప్రపత్తి సంపదగలవారమైన మనకు స్వామి
పరై తరువాన్-పరను అనుగ్రహిస్తాడు.
వాచ్యార్థమును గమనిస్తే పర ఒక వాయిద్యవిశేషము.కాని నిజమునకు అది దాసుని అభీష్టమును నెరవేర్చు రూపము తానై,భావము తానై భాసిల్లునది.
నీరాడపోదుమిన్-మునకలు వేయుటకు రారండి చెలులారా అని చెలులను చైతన్యవంతులను చేస్తున్నది.
ప్రస్తుత పాశురము,
1. ప్రాప్య స్వరూపము
2. ప్రాపక స్వరూపము
3. అధికారి స్వరూపము
4. ఆనందస్వరూపము
అను నాలుగు అంశములను గుర్తుచేస్తున్నది.
చేతనుల జీవన గమ్యము,దానికి వారు చేయవలసిన గమనము,అర్హతను అర్థము చేసుకొనుట,ఆనందాబ్ధిలో మునకలు వేయుట
కరణము-కారణము-కార్యము-కారుణ్యము అన్నీ తానేయైన పరమాత్మ ఆ అవకాశమును ఏ మిష ద్వారా కల్పించినాడో,కరుణించినాడో రెండవ పాశురములో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment