రెండవ పాశురము-02
***************
వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు
చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి
నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మై ఇట్టు ఎళుదోం మలరిట్టు నాం ముడియోం
శెయ్యాదన శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
***********************************
ప్రథమ పాశురములో నారాయణుని దయార్ద్రహృదయమును సంకీర్తిస్తూ,స్వామి మనమీది వాత్సల్యముతో రేపల్లెలో శ్రీకృష్ణునిగా అవతరించినాడని, ,నోము నిర్వాహకునిగా తానుండి , మనలతో కలిసి ఆడి-పాడి ,అనుగ్రహిస్తాడని , వారుచేయవలసిన వ్రతవిధానమును వివరించుచున్న ఆండాళ్ అమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,రెండవ పాశురమును అనుసంధానముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ప్రస్తుత పాశురములో అమ్మ నిశ్చయ -జ్ఞానము గోపికలను" వైయత్తు వాళ్వీర్గాళ్ అంటు గోపికల భూసురత్వమును గుర్తుచేసినది.మొదటి పాశురములో చిరుమీర్గాళ్ పసివారు అన్నది.అయినప్పటికిని శెల్వ చిరు మీర్గాళ్-అంటు వారి సంపదను ప్రస్తావించినది.
భూమి మీద చేతన ఉపాధిలో నున్నప్పటికిని,ఉపాయముగా పరమాత్మ సుగుణములందు,సుహృత్భావమే వారి సంపద.స్వామి కైంకర్యమునందు అనురక్తి గలియున్న భాగ్యవంతులు వారు.
పర మూర్తిగా నున్న నారాయణుడే రెండవ పాశురములో అనుగ్రహిస్తాడనిక్షీరాబ్ధి శయనుడుగా /వ్యూహామూర్తిగా ప్రస్తుత పాశురములో మనను అనుగ్రహిస్తున్నాడు.
కేళీరో పార్కడలుళ్
పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి -అంటు శేషశయనుని దర్శింపచేయుచున్నది.
ఏలో-ఓ చెలులారా!
ఎంపావై-మనముచేయబోవుచున్న వ్రతము ఎంతటి మహిమాన్వితమనిన,
"ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్."
నాముం నం పావైక్కు-మనముచేయబోవు వ్రతము
ఉయ్యుమూరు-ముక్తిమార్గమును చూపునది మరియును
ఉగందు-సంతోషప్రదమైనది.
పరమన్ అడిపాడి-పరమాత్మ పాదపద్మముల వైభవమును సంకీర్తించుదాము..
అంతేకాదు వ్రతసమయమున చేయవలసిన ధర్మములు-చేయకూడని పనులు అంటూ.కృత్యాకృత్య వివేకమును తెలియచేసినది.
ఆహారమును -అలంకారమును ప్రస్తావించినది.ఇది బాహ్యము.
నెయ్యిణ్ణోం పాలుణ్ణోం-నెయ్యి-పాలు స్వీకరింపవద్దు.ఆహారము.
పాలు-నెయ్యి గొల్లలకు సమృద్ధిగా లభించునవి.పరమప్రీతిపాత్రములు.అయినప్పటికిని వారు శ్రీకృష్ణ సంశ్లేషణములో వానిని మించిన ఆనందానుభూతిని పొందగలమంటున్నారు.
పదార్థమైన పాలు కంటె పరమాత్మ పై భక్తి ఒక్కపాలు ఉన్న ధన్యులమే.భక్తి తాత్కాలికము కాకుండా పరిణామముచెంది స్థిరముగా నిలుచుటయే నెయ్యి.స్థిరమైన భక్తిని అర్థించుటయే పాలున్నోం--నెయ్యిన్నోం.
మై ఇట్టు ఎళుదోం మలరిట్టు నాం ముడియోం-కాటుకను పువ్వులను ధరించవద్దు-అలంకారము.
తీక్కురళై శ్శెన్రు ఓదోం
కొండెములను చెప్పవద్దు.ఇతరుల చెవికి చేర్చవద్దు.
ఓ పంచేంద్రియములారా! పరమాత్మ గుణసంకీర్తమును తక్క అన్యమును శ్రవణము చేయవద్దు.దివ్యస్వరూపమును తక్క అన్యమును దర్శించవద్దు.పరమాత్మ సామీప్య దివ్య సుగంధములను తక్క అన్యములను ఆఘ్రాణించవద్దు.
అంతే కాదు.వద్దు వద్దు అని చెబుతున్నారు మరి మేమేమి చేయాలి అన్న సందేహము ఇంద్రియములైన మీకు కలుగతుందేమో.
నాట్కాలే నీరాడి-బ్రాహ్మీ ముహూర్తములోనే స్వామి దివ్యానుభూతులలో జలకములాడండి.
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి-కైకాట్టి చేయిసాచి పండితులను-పామరులను -అర్హతకలవారికి-అనాథలను దాన-ధర్మములతో ధర్మబద్ధులను గావించండి.
కైకాట్టి-ఇందులో మీరు ఒక పరికరము మాత్రమే అన్న తలపును విడనాడకండి.దానములను ప్రతిఫలమునాశించకుండా ఆచరించండి.
ఇంతకు వాచ్యార్థముగా తిరుప్పావై అను పవిత్రవ్రతమును ఆచరించుటకు కారణము అవసరమా?అనన్య భక్తియా అన్న సందేహము కలుగవచ్చును.
అవ్యాజకరుణ అవసరమును కల్పించినది.అవకాశమును అందించినది.
తల్లితండ్రుల అజ్ఞానము రేపల్లె లోని కన్నెలను క్రిష్ణుని కలువనీయక నిర్బంధించినదట.తత్ఫలితముగా అనావృష్టి-క్షామము.దాని నివారణకు కాత్యాయని వ్రతమొక్కటే కామితార్థప్రదమని తెలుసుకొనిన వారు శ్రీకృష్ణుని వ్రతమును నిర్వర్తింపచేయమని వేడుకున్నారట.అందులకు స్వామి నేను పురుషుడను వారు కన్యలు కదా అని అభ్యంతరమును తెలియచేసినాడట.అందులకు వారు పశ్చాత్తాపముతో స్వామి మా అజ్ఞానమును మన్నించి,మమ్ములను అనుగ్రహించు అని ప్రార్థించగా, స్వామిని సేవించుకునే అనుమతిని పొందిన గోపకన్నియలు.
ఇవి నన్నాళాల్ మంచిరోజులు కనుక మనమందరము
కిరిశైగళ్-నోమును అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభిద్దాము అని మనతో అంటున్న గోదమ్మ మనకు తరువాతి పాశురములో అందించబోతున్న దివ్యానుగ్రహమును తలచుకుంటూ,మన చేతిని పట్టుకుని నడిపించుచున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment