పాశురము-19
***********
"పెరుమాళ్ళు -పిరాట్టి ఇంతవరకు ఒకరికొకరు
పంచశయన మిథునమంటున్నది వారు "ఒకేఒకరు."
ఆహా గోపికలదేమి భాగ్యము.ఎన్నితపముల మనలకు ఫలము.గోదమ్మ వారికి-వారితో పాటుగా నీలాకృష్ణుల శయనసౌందర్యమును దర్శింపచేస్తున్నది.
చేతనులకు వారు అనవరతము మునిగితేలుచున్న సంసారములోని సింగారమును చూపిస్తు ముక్తిసోపానములను ఎక్కిస్తున్నది. అవిభక్తమైన పరమాత్మానుగ్రహమును అర్థమయ్యేటట్లుగా వారి రహస్య సన్నివేశములను సదస్యముగా వివరిస్తూ, ఆరి ఓడిలోని చేర్చుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పంచేంద్రియ తర్పణ పాశురమును అమ్మ అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ర పంచశయనత్తిల్ మేలేరి
కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నయై కొంగైమేల్
వెత్తుకిడంద మలర్మార్పా వాయ్ తిరవాయ్
మైత్తిడం కణ్ణిణాయ్ నీ ఉన్ మణాలనై
ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్
ఎత్తన ఏలుం పిరివాట్ర గిల్లయాల్
తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్.
మెత్తెన్ర పంచశయనత్తిల్ మేలేరి
కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నయై కొంగైమేల్
వెత్తుకిడంద మలర్మార్పా వాయ్ తిరవాయ్
మైత్తిడం కణ్ణిణాయ్ నీ ఉన్ మణాలనై
ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్
ఎత్తన ఏలుం పిరివాట్ర గిల్లయాల్
తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్.
ప్రస్తుత పాశురములో
1.ఏనుగుదంతములు నాలుగు కోళ్ళుగా గల మంచము -క్కోట్టుక్కాల్ కట్ట్
దానిపై
2.ఐదు శుభలక్షణములతో కప్పబడియున్న పరుపు-మెత్తెన్ర పంచశయనత్తిల్
3.ఆ శయ్య చుట్టు నాలుగు వైపుల ప్రకాశించుచున్న గుత్తి దీపములు.-కుత్తువిళక్కెరియ
4.పరిమళిస్తున్న పూలగుత్తులను కొప్పులో తురుముకుని
నల్లని-చల్లని కాటుకను దిద్దుకుని ప్రకాశిస్తూ-మైత్తిడం కణ్ణిణాయ్
నీలమ్మ
5.స్వామి విశాలవక్షస్థలముపై తలవాల్చి యున్నదట.-వెత్తుకిడంద మలర్మార్పా
6.అమ్మ విశాలనేత్ర సౌందర్యమునకు ముగ్ధుడైన స్వామి వక్షస్థలము మరింత విస్తరించినదట.
7.ఆ తన్మయావస్థనుండి వారు ఒక్క క్షణమైనను విడివడలేకయున్నారట.ఎత్తన ఏలుం-
8.నీయుం-మణాలనై
అమ్మా నీవు-నీ స్వామి మమేకమై యుండగా
అమ్మా పిల్లకుబదులీయకపోవుట నీ స్వరూపమునకు-స్వభావమునకు సరికాదు
తత్తువ మన్రు తగవేలో రెంబావాయ్.
కనుక
మాకోసము బహిర్ముఖమై వచ్చి తలుపుగడియ తీయకున్న గాని కనీసము స్వామిని నోమునకు తోడ్కొని వస్తానన్న మాటనైనా చెప్పవమ్మా అని ప్రార్థిస్తున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో.-ఇది వాచ్యార్థము.
ఏనుగుదంతములతో చేసిన మంచపుకోళ్ళు
1.ధర్మార్థకామమోక్ష సంకేతములు.
2 చతుర్వేదములు .
వాటిని గట్టిగా పట్టుకుంటే గాని కాని
2. పంచశయనిత్తల్ మీస
వారితో పాటుగా వారిద్దరి ఒడిలో పిల్లలుగా మనము కూర్చోలేము
.సౌందర్యము-సౌకుమార్యము-సౌశీల్యము-సత్వము-సులభత్వం.ఆ పరుపు లక్షణములు
మరికొందరు
3.అర్థపంచకమును
పరమాత్మస్వరూపము
జీవాత్మస్వరూపము
విరోధిస్వరూపము
ఉపాయస్వరూపము
పురుషోత్తమస్వరూపముగా కూడా భావిస్తారు
4. దేవ-మానుష-తిర్యక్-స్థావర-జం గమములుగా కూడ అన్వయించేవారు మరికొందరు.పంచేంద్రియ-పంచభూత ప్రకృతిగా ప్రస్తుతించువారు కొందరు.
.
" విభజిస్తే ఐదు.సమీకరిస్తే ఒకటే."
స్వామి చేతనునిగా నా సేవలు స్వీకరించు.ఒకవేళ నా శరీరములోని పంచభూతములు మూలములో కలిసినవేళ,
నా నుండి విడివడిన జలము నీకు తీర్థముగా తరియించనీ.
నా నుండి విడివడిన అగ్ని నీ ముందు జ్యోతిగా వెలుగనీ.
నా నుండి విడివడిన భూమితత్త్వము నీవు నడచు చోటుగా మారనీ.
నా నుండి విడివడిన ఆకాశతత్త్వము నీకు ఛత్రముగా నుండనీ.
నా నుండి విడివడిన వాయువు నిన్ను చామరమై వీచనీ.
అంటే ఇక్కడ అవిభాజ్యముగా నున్నది కేవలము నీలమ్మకృష్ణులే కాదు.సకలచేతనులు.
ఇక్కడ మనకొక సందేహము రావచ్చును.నోము నియమములలో కాటుక అలదుకొనుట-పూలు తురుము కొనుట నిషేధించబడినవి అమ్మ ఆ రెంటిని ధరించినది అని చెబుతున్నది అంటే శ్రీకృష్ణ సేవా సౌభాగ్యమే నోముఫలము అని అమ్మ చల్లని-చక్కని కన్నులలో దాగిన స్వామి మనలను తప్పక అనుగ్రహిస్తాడంటున్న,
ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment