మార్గళి మాలై-24
***************
ఇరువది నాలుగవ పాశురం
*************************
అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోత్తి
శెన్రంగు త్తెన్నిలింగై శెత్తాయ్! తిరల్ పోత్తి
పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పూగళ్ పోత్రి
కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోత్తి
కున్రు కుడైయా ఎడుత్తాయ్! గణం పోత్తి
వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోత్తి
ఎన్రెన్రున్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్
ఇన్రుయాం వందోం ఇరంగు ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము
నాడు భూమిని కొలిచిన వామన పాదములకు మంగళం
లంకకేగి రావణు కూల్చిన రామ పాదములకు మంగళం
శకటాసురుని కూల్చిన స్వామి పాదములకు మంగళం
వత్సాసుర కపిత్సాసుర సంహారి పాదములకు మంగళం
గోవర్ధనగిరి నీత్తిన గోవిందుని పాదములకు మంగళం
శుభకర కరమున నున్న వేలాయుధమునకు మంగళం
ఒకటా? రెండా? మూడా? ఎన్నని కీర్తించగలము
మాధవా! దయతో మంగళ హారతులను స్వీకరించు
రంగనాథ స్వామికి మంగళాశాసనములు పాడరారె
అంగనలారా! అందరు ఆండాళ్ అమ్మ వెంట నేడే.
తండ్రికి దగ్గ తనయ మన గోదమ్మ.కనుకనే శ్రీమాన్ పెరియాళ్వారులు ప్రతిపాదించిన " పల్లాండ్లను" ప్రస్తుతులను కూడిన మనగళా శాసనములను మనకు పరిచయము చేయుచున్నది.
ఈ పాశురములో,
వాత్సల్యము! వత్సుని (పుత్రుడు/పుత్రిక)అందలి ఆత్మీయానురాగము.ఇక్కడ వాత్సల్యము గోపికలపై స్వామికి,స్వామిపై గోపికలకు పరస్పరాశ్రితము. ఆత్మానంద స్థితికి ఇది నేత్రోత్సవము.స్వామి గోపికలకు వాత్సల్యమును అందించుచు తాను వారినుండి పొందకోరిన హేల!కృష్ణ లీల!
విదేహమహారాజు సీతమ్మను రాముని చేతిలో పెట్టుచు "భద్రం" అన్న మాట ఎంత పవిత్రమైనదో గోదా సమేత గోపికల మంగళాశాసనము అంతే పవిత్రము.రాక్షస సం హారముచేసి స్వామి శరీరము ఎంత కందెనో,స్వామి ఎంత అలిసిపోయేనో అని తలచు పసి మనసులు వారివి.పసితనము అనగా కపటము లేనిదివయసుకు సంబంధించినది కాదు.ఎన్ని కన్నులు కుట్టినవో స్వామిని అని యశోదతో కూడి మన గోపికలు స్వామికి దిష్టి తీసిరి.అనుభవైక వేద్యమైన ఆత్మ సాక్షాత్కార పురస్కారము..
ఆరుసార్లు చేయు మంగళా శాసన విశిష్టత ఏమిటి? .అమృతధారలుగా అరుదైన విషయములు అనుసరించినవి.ఆరు ఋతువులందును,ఆరు రుచుల యందును,ఆరు శత్రువుల యందును,ఆరు విషయములందును ( పంచేంద్రియములు+మనసు) ఆరు పోయుట యందును (వారు పోయుట)స్వామి ఆరు రంగనాథ క్షేత్రములందును( ఆద్య రంగము-పరిమళ రంగము-వట రంగము-సారంగము-అప్పలి రంగము-అంతరంగము) ఆనందమయముగా నుండుటకు గోపికలు మంగళమును పాడిరి.అవన్నీ పరమాత్మ రూపాలే కదండీ!
తన వాడనుకున్న స్వామి తత్త్వమును అర్థముచేసుకొనుచున్నారు గోపికలు.వారికి స్వామి సకల అవతార విశేషములు కళ్లముందు కదలసాగినవి.యుగ విభజనను విస్మరించారు.జ్ఞాన దశను ( సకలమును బాహ్యస్థితి నిజమనుకొను) జరిపివేసినది వారి అతిశయమైన ఆప్యాయత.ఇక్కడ గోపికలు స్వామి త్వమేవాహం-త్వమేవాహం (నీవే నేను-నేనే నీవు) అనుకునే స్థితిలో ఉన్నారు.హెచ్చుతగ్గులు లేని ముచ్చటైన స్థితి. కనుకనే వారు స్వామి నుండి తాము వరములను పొందాలనే స్థితిని దాటి స్వామికి తాము ఏమివ్వగలము అని ఆలోచించేలా చేసినది.
అన్ని రూపములు ఇందే ఆవహించెను అని అన్నమయ్య అనుకున్నట్లుగా వారిలో రామావతారము-కృష్ణావతారము స్వామిలో కనిపించసాగినవి.
గోదమ్మ గోపికలను రెండు వర్గములుగా చేసినది.కొందరు రామునిగా భావించి,ఆశీర్వదిస్తున్నారు.మరి కొందరు కృష్ణునిగా బలపరచి ఆశీర్వదిస్తున్నారు.అదినేనే-ఇదినేనే అయిన స్వామి వినోదిస్తున్నాడు.
భూమండలము తమోమయము.మాయా మోహితులను చేసేది.రాళ్ళు-రప్పలు ఎత్తు-పల్లాలు అటువంటి భూమిని దేవతల కొరకు ,ఒక్కసారిగా పెరిగి కొలిచిన స్వామి పాదములు ఎంత కందిపోయినవో కదా! లబ్ధిపొందిన ఇంద్రుడు మరెవరు ఆ విషయమును తలవ లేదు అన్నరు కృష్ణుని వర్గము వారు. నిజమునకు ఇది స్వామి మనకు అందించిన ధూళి ప్రసాదము.
రామ వర్గము వారు ఊరుకుంటారా? చాల్లే1 మీ స్వామి ఉన్న చోటనే ఉండి చేసిన పనిని గొప్పగా చెప్పు కుంటునారు.అదే మా రాముడు అడవులను.సముద్రములను,కొందలను,గుట్తలను దాటి లంకాద్వీపమునకు వెళ్ళి రావణుని సమ్హరించాడు.మాస్వామి పాదములెంత కంది పోయినవో అన్నారు.నిజమునకు దశ ఇంద్రియములు రావణుని పదితలలు.వాని అహంకార రూపమే రావణుడు.వాటిని మర్దించిన స్వామి మా రాముడు అంటున్నారు.
కృష్ణ వర్గము వారు ఊరుకుంటారా? మీ స్వామి బాల్యములో ధనుర్విద్యలు నేచిన వాడు.అంతే కాదు పెండ్లి అయిన వాడు.ఆ వయసులో రావణుని కూల్చుట ఏమంత ఘనకార్యము.
పాపము మాస్వామి చిన్న బాలుడు.గొల్ల కులములో నున్న వాడు.క్షాత్ర ధర్మ్మేది? అయినప్పటికిని కపట శకటుని కాలితో తన్ని సంహరించాడు.మన శరీరమే శకటమైతే కామ-క్రోధములు దానిని నడిపించే రెండు చక్రములు.కామము తీరనప్పుడే కదా అది క్రోధముగా తన స్వభావమును మార్చుకుంటుంది.అట్టి దానిని తన కాలితో తన్ని విరిచినప్పుడు,ఆ పాదమెంత కందెనో కదా అంటూ,రామ వర్గము వారికి అవకాసము ఇవ్వకుండా స్వామి రక్షనను మరొక మూడు సంఘటనలతో చెప్పుకొచ్చారు.
కపటదూడ మోహము-వెలగ పందు వాసన.దూడగా-వెలగ చెట్టుగా వచ్చిన (మారువేషములలో) దూడను పట్టుకొని వెలగ చెట్టుపైకి విసిరి,ఒకేసారి ఇద్దరు రాక్షసులను కూల్చినప్పుడు స్వామి పాదములెంత కందెనో.
అంతే కాదమ్మా.ఏ ఇంద్రునికైతే స్వామి బలిని పాతాళమునకు పంపి,రాజ్యమును ఇచ్చినాడో,ఆ ఇంద్రుడే అహంకారముతో రాళ్ళవాన కురిపించినపుడు ఏడు పగళ్ళు-ఏడు రాత్రుళ్ళు,తన చిటికెన వేలుపై గోవర్ధనగిరి న్)ఎత్తి,గోవులను-గోపాలకు;లను కాచిన స్వామి పాదపు వంపు ఎంత కందెనో అన్నారు.వాదన వేడుకను చాలించుకొని గోపికలందరు స్వామిని దిష్టి తీసి,మంగల హారతుల నిచ్చినారు.
( ఇక్కడ ఏడు పగలు-రాత్రి వారము అని కాదు.ఎన్ని రోజులు గడిచినా అదే అది నుండి శని వారములు అని అంతరార్థము)
.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం )

No comments:
Post a Comment