Friday, December 31, 2021

PASURAM-16

నూతన సంవత్సర శుభాకాంక్షలు ------------------------------ తిరు చిట్రంబలం-పాశురం-16 ************************** మున్ ఇక్కడలి చురుక్కి ఎళందుడియాళ్ ఎన్న తిగలైదెమ్మ ఆరుడయాల్ ఇట్టడియన్ మిన్ని పొళందె ఎం పిరాట్టి తిరువడిమేల్ పొన్నం చిలంబర్ చిలంబర్ తిరుప్పురవం ఎన్న శిలై కులవి నందమ్మై ఆరుడయాళ్ తన్నిల్ పిరవళా ఎణ్ కోమణ్ అంబర్క్ మున్ని అవళ్ నమక్కు మును శురుకు ఇన్నరుళే ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్ ----- " ఆనందామృతాకర్షిణి-అమృత వర్షిణి హరాది పూజితే శివే భవాని పోట్రి" సలిలం వర్షయ వర్షయ "ఒరురకాల్" పాశురములో తనను తాను ఆవిష్కరించుకొనుటకు అంతర్ముఖమైన చెలి,అమ్మ అనుగ్రహముతో అమృతాకర్షిణియై-ఆనందామృత వృష్టిలో మునిగి పులకించినదై,తాను పొందిన దివ్యానుభవమును తన చెలులకు సైతమును అందింపచేయుతకై బహిర్ముఖమైనట్లున్నది. కనకనేతన చెలులతో చెలులారా! రండి రండి.మనమందరము, ఎన్నపొళయాయ్ ఎన్నగలేని/ఎంచలేని మళయేలో-వర్షములో రెంబావాయ్-మునకలు వేస్తూ/మునిగితేలుదాము అంటూ పిలిచినది. బయట నున్న చెలి బాహ్యములోని బహిరాకాశమును చూస్తూ తన అనుభూతిని వివరిస్తున్నది. బాహ్యమును అధిగమించిన వేళ నీవు/మనము /మన హృదయములలోని దహరాకాశము కురిపిస్తున్న అమృత వర్షములో తడుస్తూ-తరిద్దాము అంటున్నది. నామ-రూపములు ఒక్కటే అయినప్పటికిని,జీవునకు అందించు అనుగ్రహములు అనేకములు. వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా ఇది బాహ్యము. వానల్లు కురవాలి వామదేవుడా వ్యామోహం తొలగాలి మనకు జీవుడా ప్రస్తుత పాశురమును తిరుమాణిక్యవాచగరు, మున్నై కడలి సురుక్కి ఎళుందురాయ్ అన్న వాక్యముతో ప్రారంభించారు. తాదాత్మ్యస్థితికి కించిత్ దూరముగా నున్న చెలి తన చెలులతో , నేను చూస్తూ గమనిస్తున్నాను ఈ వింతను. ఇప్పుడే సూర్య కిరణములు నింగి నుండి కడలిని ప్రవేశించి , సురుక్కి-నీటి స్థూల పరిమాణమును తమ వేడితో తగ్గించి వాటికి ఆవిరి అను కొత్తరూపమును అందించినవి. సముద్రజలము తాను సూక్ష్మరూపముతో నింగివైపునకు,/ఊర్థ్వముఖముగా తన పయనమును సాగించుటకు సిధ్ధమగుచున్నది . అనగానే మరొక చెలియ దానిని సమర్థిస్తూనే తనకు కలిగిన ఆలోచనను ఇది కూడా సమజసమేనేమో అంటూ, శివశక్యైరూపముగా నున్న పరమాత్మ మన కొరకు కరుణకిరణములుగా మారి ,భవసాగరమనే సంసారములో నున్న మనలను ఉధ్ధరించుటకు ఇందులోని మాలిన్యములను కరిగించివేసి,మన మనసులను తేలిక చేసి ,మన కుండలినిని జాగృతము చేస్తూ మనలను సహస్రారము చేర్చుటకు సిధ్ధపరుస్తున్నదేమో అన్న పూజ్యభావము కలుగుచున్నది అనగానే చెలులందరు మరింత ఉత్సాహముతో , మళైంద-మళైంద అంటు సలిలం వర్షయ వర్షయ వర్షయ అని ఆకాశమును మరికొంత నిశితముగా పరిశీలిస్తూ,వారి అనుభవములను/అనుభూతులను పరస్పరము పంచుకుంటున్నారు. వారి బాహ్యనేత్రములు దర్శించుచున్న దృశ్యములే వారి దహరాకాశములో దివ్యమంగళ స్వరూపమైన,అమ్మ ఇట్టడియన్-సన్నని నడుమును తిరువడిమేల్-దివ్యపాదపద్మములను తిరుప్పురవం-మంగళతోరణముల వంటి కనుబొమలను మేఘముగా-మెరుపుగా-హరివిల్లుగా దర్శనమిస్తూ,వారిని తన్నిల్ పిరవిళా-అమ్మ భావన నుండి విడదీయలేని వారిగా అదియును, అంబర్కు తన్నిల్ పిరవిళా-ప్రేమయను పాశముతో కట్టబడి విడదీయలేని వారిగా అమ్మ చేతులలో ఒదిగిపోయి మురిసిపోయే అమృతవర్షమును కురిపిస్తున్నది వారిపై అమ్మదయ. వారు సంభాషించుచుండగా ఆకాశములో ఉరుములు ఉరుముతున్న శబ్దమును వినగానే ఒక చెలి భయముతో తన చెవులను మూసుకొని,వేరొక చెలిదగ్గరకు చేరగానే,ఆమెను అనునయిస్తూ, చెలి! ఒక సారి నీహృదయములోనికి తొంగిచూడు. మన తల్లి మన శ్రవణేంద్రియమును అనుగ్రహించుటకై తన, తిరువడివేల్ పొన్నం శిలంబ శిలంబ మనలను ఆహ్లాదపరచుటకై తన దివ్యచరణారవిందములకు అలంకరిం పబడి ధన్యతతో కీర్తించుచున్నబంగరు మువ్వలసవ్వడిని మనకు వినిపించుచున్నది అని దహరాకాశమును దర్శించమంటున్నది. ఉరుమును తరుముతూ ఆకాశమున కనబడిన సన్నని మెరుపును చూడగానే కొంచము అంతర్దర్శనమును చేయుట ప్రారంభించినందులకేమో వారికి ఆ మెరుపు మెరుపుగా మాత్రమే కాక, మిన్ని పొళందె-ఆకాశములోని మెరుపు ఇట్టిడియన్-అమ్మ నడుముగా లక్షరోమ లతాధార తా సమున్నేయ మధ్యమా గా దర్శనమిచ్చింది. ఎంతటి భాగ్యశాలులు వారు.కనుకనే వారు మేఘము-మెరుపులో పార్వతీపరమేశ్వరులను దర్శించగలిగారు. పునీతులైన వారి మనోనేత్రములకు అవ్యాజానుగ్రహము అందమైన హరివిల్లై హర్షాతిరేకముతో ముంచివేసినది.నిజమునకది హరివిల్లా అవునేమో.కాదు కాదు అంతకు మించిన అనుగ్రహమేమో. మంగళతోరణములైన అమ్మ కనుబొమ్మల కళలవి. తిరుపురవం ఎన్న శిలై కులవి. అనగానే నిజమే చెలి ఇది అంబరవర్షముకానేకాదు. మన మదిలో కదులుచున్న సంబరవర్షము అని మురిసిపోతూ చెలులందరు సంతోషముగా శివనోము నోచుకొనుటకు కదులుచున్నారు. అంబే శివే తిరువడిగలే శరణం.

Thursday, December 30, 2021

PASURAMU-15

తిరు చిట్రంబలం-పాశురం-15 ************************* తిరువెంబావాయ్-15 *************** ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్ శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్ పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్ పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్ వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్ ...... ' పరా భక్త్యా యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి- న శోచతి ఆత్మారామోభవతి ************ అంతః బహిః యత్ సర్వం వ్యాప్త పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం. ................................................ తిరుమాణిక్యవాచగరు మనకు ఇప్పటివరకు అందించిన 13 పాశురములలో మనకు అగుపించిన పాత్రలు,పరిస్థితులు-పరిసరములు మానవ శరీర వివిధ అవస్థలను మనలను మనము ఉధ్ధరించుటకు సహాయపడుటకు ు సహకారములుగా నున్న బాహ్య సంకేతములు. కాదారై కుడై యాడ అంటూ కుండలముల ప్రసక్తితో ప్రారంభించిన పాశురములో ఆట-పాట ,పట్టు-విడుపులను చెబుతూ,ఒకదానిని పట్తుకొనవలె నంటేఏ విధముగా వేరొకదానిని విడువ వలెనో సూచించారు. ఆ విషయమునే మరికొంత ప్రస్తావిస్తూ, ప్రస్తుత పాశురములోనిచెలి ఆత్మానంద స్థితిని పొందుటకై, " తనలోని తనను గుర్తించుటకై" ఆత్మాశ్రయణ భక్తిని/పరా భక్తిని ఏ విధముగా ఆశ్రయించినదో,దానిని పట్టుకొనుటకు/అంతర్ముఖమగుటకు బహిర్ముఖత్వమును ఏ విధముగా విడిచి పెట్టినదో మనకు వివరించుచున్నారు. ఆత్మభవునీశ్వరునేశరణంబు వేడెదన్. సిత్తం కళి-మనసు ఆనందముతో ఉప్పొంగగా పాయింద్-మునిగి ఆడేలో-ఆడుదాము అని చెలులను పిలుస్తున్నారు. సిత్తము లో అనందమునకు కారణము ప్రస్తుత పాశురములో వీరు దూకి ఆడదలుచుకొన్న పొయిగై బాహ్యములో లేదు.అది వారి అంతరంగమున నిండినది. ఆ మడుగులోనికి జలము ఏ విధముగా నిండియున్నదంటే. నెడందారై కణ్ పణిప్పన్-మనసులో నిండిన ఆర్ద్రత పొంగిపొరలి నయనములకు చేరి ఆనందాశ్రువులను అనవరతము వర్షించుచున్నవి. ఆ అంతరంగ కొలనులోనికి పాయిందేలో-మునిగిన వెంటనే, " యజ్ఞాత్వా మత్తో భవతి-స్తబ్దో భవతి ఆత్మారామో భవతి.' ఆ పొయిగై లోనికి దూకి /బాహ్యమును వీడి అంతరంగములోనికి జారిన వెంటనే జీవుడు మత్తులో మునుగుతాడు.స్తబ్దుడుగా మారతాడు.తనను తాను కనుగొనే ప్రయత్నములో తన ఉనికిని మరిచిపోతాడు . ప్రస్తుత పాశురములోని చెలి, పారోరుగాల్ వందనయాల్-అని అంటున్నారు. ఆమె భూమికి నమస్కరించుట మరచినది.అంతే కాదు విణ్ణోరం తాం పణియాల్ ఆకాశమునకు-సురులకు నమస్కరించుటయును మరచినది. ఈ వాక్యము మనకు చెప్పుచున్న విషయము ఏమిటంటే ఆమె బాహ్యమును గుర్తించుటలేదు.కాని అదే సమయములో ప్రక్షిప్తముగా నున్న పంచభూతములు నిక్షిప్తమిలైనవి.ఆమె అంతర్నేత్రము వానిని దర్శించుచునే,గౌరవించుచునే యున్నది. ఇంకొక విచిత్రమేమిటంటే పంచభూతములే కాదు ఆమె పంచేంద్రియ శక్తులు సైతము అంతర్ముఖములైనవి. అ శక్తులే ఆమె కేరింతలు కొడుతున్న అంతరంగ మడుగులోని పద్మములు.కనుకనే ఆమె కన్ను, పేర రయ-ఒకే ఒక పెద్ద దేవుని, ఏరురువర్-దివ్యమంగళ విగ్రహమును చూడకలుగుతున్నది. ఆమె వాక్కు ఓరురుకాల్-ప్రతి క్షణము ఎం పెరుమాన్/నం పెరుమాన్ అని వాయ్ ఓవాల్-నోరార పలవరిస్తున్నది/జపిస్తున్నది. అదికాదా మానస సరో వరములో ఝంకారమును/ప్రణవమును జపించుచున్న తుమ్మెదలు. ఆమె మనసు ఆరొరువర్-నిర్ద్వంద్వమైన నామమును వినుచు తరించుచున్నది ఆమె, ఆ అంతరంగ హ్రదములో విత్తగళ్ తాళ్ విశ్వేశ్వరుని పాద సందర్శనముతో/సంసేవనముతో ,ఆత్మానందములో మునకలు వేయుచున్నది.చెలులారా కదిలిరండి.మనలోని మనను దర్శించి తరించుదాము. అంబే శివే తిరువడిగళే శరణం

Wednesday, December 29, 2021

paasuram-14

తిరు చిట్రంబలం-పాశురం-14 ***************************** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... "నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం." యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు. కృత యుగములో పాటించబడిన కఠోర నియమములను కొంతవరకు మినహాయించి,త్రేతయుగములలో యజ్ఞ-యాగాదులతో కఠిన నిబధ్ధతతో భగవదనుగ్రహమును పొందిన మహాత్ములగురించి మనకు వివరించబడినది. అదే భగవదనుగ్రహము ద్వాపర యుగమునకు అన్వయించుకుంటే వారు భగవంతుని చెలికానిగా /సఖునిగా భావిస్తూ ఆడుతూ-పాడుతూ,చల్దులారగిస్తూ,ఛలోక్తులను విసురుకుంటూ చరణసేవా సౌభాగ్యమును పొందిరనుటకు ఉదాహరణము మనకు లభించుచున్నవి. కాని కలిపురుషుని ప్రభావమేమని చెప్పగలము.ఇంతకు ముందు యుగములలో సులభసాధ్యమనుకున్న అగ్నికార్యములు-ఘోర తపములు ఆచరించుట కడు దుర్లభమైన తరుణమున,నిర్హేతుక కృపతో పరమాత్మ తనను తలచినంతనే తరలి వచ్చి మనలను తరింపచేయుచున్నాడనుటకు నిదర్శనమే చెలులు స్వామిని గురించి చేయుచున్న సంకీర్తనము. . దీనికి ఆచార-వ్యవహారములు లేవు.ఆసన నియమము-ఆహార నియమము అసలే లేదు.పాండిత్య ప్రకర్ష కు ప్రాముఖ్యత లేనే లేదు. మనము ఈ సంకీర్తనమును సర్వకాల సర్వావస్థలయందును చేసుకొని సద్గతిని పొందవచ్చును. అదియే - 1) సో-హం అని మనలోని శ్వాసలు చేయుచున్న అజపామంత్రము. 2) లబ్-డబ్ అని మన గుండె చేయు నాద జపము. 3) స్తోత్రాణి సర్వం గిరో-నా వాక్కులన్నియును నీ స్తోత్రములో అన్న భావనను మనము అన్వయించుకుంటే, సర్వము సంకీర్తనమయమే-సకలార్థ సాధనమే.స్వామి చరణాశ్రితమే-సకల సౌభాగ్యప్రదమే. తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో రెండు విషయముల గురించి నొక్కి వక్కాణించారు. చిట్రబలం పాడి,వేదప్పొరుల్ పాడి,శోదితిరం పాడి,సూట్కొండ్రతార్పాడి,అందం ఆమా పాడి,పాదతిరం పాడి అంటూ, అవి ఒకటి-పాడి అన్న పదమును పదే పదే ప్రయోగించారు. రెండవది ఆడి అన్న పదమును పదే పదే ప్రయోగించారు. కాదార్ కుడై యాడి,పైపూం కలాలాడ,కోదై కురాళాడ,వండిన్ కులామాడా,సీద పునలాడ,ఆదేలో రెంబావాయ్ అంటూ, పాడి అన్న పదము సంకీర్తనా భక్తి విభాగమైన భక్తునకు అన్వయించుకుంటే, ఆడి అన్న పదమును సంరక్షణ, అనుగ్రహరూపమైన పరమాత్మకు అన్వయించుకోవచ్చును. అంటే పరమాత్మ పట్టువిడుపు అన్న ఆటను మనతో ఆడుచున్నాడు. మనము పరమాత్మ పాదములను పట్టుకోవాలంటే ఇంకొక దానిని విడిచివేయాలి. ఒకసారి పరమాత్మ పాదములను పట్టుకోలేకపోయినామనుకోండి నిర్హేతుక కృపతో మనకుమరొక ఉపాధిని ఇచ్చి మరల దాని ద్వారా తనను పట్టుకోమంటాడు. తిరుమాణిక్య వాచగరు మనకు ఈ పాశురములోని చెలుల ద్వారా, స్వామి చిట్రంబలం నుండి, సకల జగములను తనలో నిక్షిప్తము చేసుకొనిన ఆకాశ తత్త్వము నుండి (నిరాకారమునుండి) మనలను అనుగ్రహించుటకు తనను తాను విస్తరించుకొనుచు,ఒక్కొక్క భూతమును సృష్టించి,దానిని తనకు సహాయము అని మనము భావించుకొనునట్లు,పంచభూతములను పంచ తన్మాత్రలను,పంచేంద్రియములను సమ్మిశ్రితము చేసుకుంటూ, ఇందుగలడందులేడను సందేహము వలదు-పోతనామాత్యుడు వివరించినట్లు, తనకు అవసరములేక పోయినప్పటికిని ఆకాశ,వాయు,అగ్ని,జల,పృధ్వీ తత్త్వములుగా తనను ఆదిగా-అంతముగా /సాకారముగా , ఆర్తా పిరవి నుండి జీవులను అనుగ్రహించుటకు, శూట్కొండ్రై తార్పాడి అని తుమ్మిపూల మాలాంకృతుదైన సాకారునిగా సాక్షాత్కరించి,అనుగ్రహించినాడు. ఇదంతయును స్వామి లీలా వైభవ విశేషములు.ఆటలు. స్వామి ఈ ఆటలోని అంతరార్థమును కనుక మనము పరిశీలించగలితే ధన్యులమే. భగవదనుగ్రహమైన ఉపాధిని ,ఏ విధముగా మనము నదిని దాటుటకు మాత్రమే నావను ఉపయోగిస్తామో అదే విధముగా సంసారజలధిని దాటుటకు మాత్రమే ఉపయోగించాలి.మన ధ్యేయము స్వామి చరణములను శరణుకోరుట.మన పట్టు స్వామి చరణాశ్రయమును పొందిన వెంటనే ఉపాధిని విడిచిపెట్టగలిగి/దానిమీది ప్రీతిని విడిచిపెట్టగలగాలి. . ***** మనకు ఈ ఉపాధి ఒక సాధనము మాత్రమే కాని సర్వస్వము కాదు.****** ఈ తత్త్వమును తెలిసిన/ఆచరిస్తూ అనుభవిస్తున్న చెల్లులు మడుగులో జలకములాడునపుడు, వారి కుండలములు,ఆభరణములు,కేశములు,కేశములలో అలంకరించుకొనిన పుష్పములు,పుష్పములపై వాలిన తుమ్మెదలు సకలము సంకీర్తనములై స్వామి పాదములను పొందకలిగినవి. మనము ఆడుతు-పాడుతు పాదములను పట్టుకోగలిగితే అయ్య తాను అమ్మగా మారి, అమ్మ తన కంకణముల కరములతో మనలను ఉధ్ధరిస్తుంది. పేయ్వళిదన్-కరుణ అనే కంకణములదాల్చిన కరములుగల, అమ్మ నమ్మై-మనలను వళర్తెడుత్తు-మనలను అనుగ్రహిస్తుంది. అంబే శివే తిరువడిగళే శరణం.

PASURAM-14

తిరు చిట్రంబలం-పాశురం-14 ***************************** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం. యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు. కృత యుగములో పాటించబడిన కఠోర నియమములను కొంతవరకు మినహాయించి,త్రేతయుగములలో యజ్ఞ-యాగాదులతో కఠిన నిబధ్ధతతో భగవదనుగ్రహమును పొందిన మహాత్ములగురించి మనకు వివరించబడినది. అదే భగవదనుగ్రహము ద్వాపర యుగమునకు అన్వయించుకుంటే వారు భగవంతుని చెలికానిగా /సఖునిగా భావిస్తూ ఆడుతూ-పాడుతూ,చల్దులారగిస్తూ,ఛలోక్తులను విసురుకుంటూ చరణసేవా సౌభాగ్యమును పొందిరనుటకు ఉదాహరనము మ్నకు లభించుచున్నవి. కాని కలిపురుషుని ప్రభావమేమని చెప్పగలము.ఇంతకు ముందు యుగములలో సులభసాధ్యమనుకున్న అగ్నికార్యములు-ఘోర తపములు ఆచరించుట కడు దుర్లభమైన తరుణమున,నిర్హేతుక కృపతో పరమాత్మ తనను తలచినంతనే తరలి వచ్చి మనలను తరింపచేయుచున్నాడనుటకు నిదర్శనమే చెలులు స్వామిని గురించి చేయుచున్న సంకీర్తనమే. దీనికి ఆచార-వ్యవహారములు లేవు.ఆసన నియమము-ఆహార నియమము అసలే లేదు.పాండిత్య ప్రకర్ష కు ప్రాముఖ్యత లేనే లేదు. మనము ఈ సంకీర్తనమును సర్వకాల సర్వావస్థలయందును చేసుకొని సద్గతిని పొందవచ్చును. అదియే - 1) సో-హం అని మనలోని శ్వాసలు చేయుచున్న అజపామంత్రము. 2) లబ్-డబ్ అని మన గుండె చేయు నాద జపము. 3) స్తోత్రాణి సర్వం గిరో-నా వాక్కులన్నియును నీ స్తోత్రములో అన్న భావనను మనము అన్వయించుకుంటే, సర్వము సంకీర్తనమయమే-సకలార్థ సాధనమే.స్వామి చరణాశ్రితమే-సకల సౌభాగ్యప్రదమే. తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో రెండు విషయముల గురించి నొక్కి వక్కాణించారు. అవి ఒకటి-పాడి అన్న పదమును పదే పదే ప్రయోగించారు. రెండవ్ది ఆడి అన్న పదమును పదే పదే ప్రయోగించారు. పాడి అన్న పదము సంకీర్తనా భక్తి విభాగమైన భక్తునకు అన్వయించుకుంటే, ఆడి అన్న పదమును సంంఓహనా అనుగ్రహరూపమైన పరమాత్మకు అన్వయించుకోవచ్చును. అంటే పరమాత్మ పట్టువిడుపు అన్న ఆటను మనతో ఆడుచున్నాడు. మనము పరమాత్మ పాదములను పట్టుకోవాలంటే ఇంకొక దానిని విడిచివేయాలి. ఒకసారి పరమాత్మ పాదములను పట్టుకోలేకపోయినామనుకోండి నిర్హేతుక కృపతో మనౌ మరొక ఉపాధిని ఇచ్చి మరల దాని ద్వారా తనను పట్టుకోమంటాడు. తిరుమాణిక్య వాచగరు మనకు ఈ పాశురములోని చెలుల ద్వారా, స్వామి చిట్రంబలం నుండి, సకల జగములను తనలో నిక్షిప్తము చేసుకొనిన ఆకాశ తత్త్వము నుండి (నిరాకారమునుండి) మనలను అనుగ్రహించుటకు తనను తాను విస్తరించుకొనుచు,ఒక్కొక్క భూతమును సృష్టించి,దానిని తనకు సహాయము అని మనము భావించుకొనునట్లు,పంచభూతములను పంచ తన్మాత్రలను,పంచేంద్రియములను సమ్మిస్రితము చేసుకుంటూ, ఇందుగలడందులేడను సందేహము వలదు-పోతనామాత్యుడు వివరించినట్లు, తనకు అవసరములేక పోయినప్పటికిని ఆకాస,వాయు,అగ్ని,జల,పృధ్వీ తత్త్వములుగా తనను ఆదిగా-అంతముగా /సాకారముగా , ఆర్తా పిరవి నుండి జీవులను అనుగ్రహించుటకు, శూట్కొండ్రై తార్పాడి అని తుమ్మిపూల మాలాంకృతుదైన సాకారునిగా కీర్తించారు. ఇదంతయును స్వామి లీలా వైభవ విశేషములు.ఆటలు. స్వామి ఈ ఆతలోని అంతరార్థమును కనుక మనము పరిశీలించగలితే ధన్యులమే. భగవదనుగ్రహమైన ఉపాధిని ,ఏ విధముగా మనము నదిని దాటుటకు మాత్రమే నావను ఉపయోగిస్తామో అదే విధముగా సంసారజలధిని దాటుటకు మాత్రమే ఉపయోగించాలి.మన ధ్యేయము స్వామి చరణములను శరణుకోరుట.మన పట్టు స్వామి చరణాశ్రయమును పొందిన ఎంటనే ఉపాధిని విడిచిపెట్తగలిగి/దానిమీది ప్రీతిని విడిచిపెట్తగలగాలి. మనకు ఈ ఉపాధి ఒక సాధనము మాత్రమే కాని సర్వస్వము కాదు. ఈ తత్త్వమును తెలిసిన/ఆచరిస్తూ అనుభవిస్తున్న చెల్లులు మడుగులో జలకములాడునపుడు, వారి కుండలములు,ఆభరనములు,కేశములు,కేశములలో అలంకరించుకొనిన పుష్పములు,పుష్పములపై వాలిన తుమ్మెదలు సకలము సంకీర్తనములై స్వామి పాదములను పొందకలిగినవి. మనము ఆడుతు-పాడుతు పాదములను పట్తుకోగలిగితే అమ్మ తన కంకణముల కరములతో మనలను ఉధ్ధరిస్తుంది. పేయ్వళిదన్-కరుణ అనే కంకణములదాల్చిన కరములుగల, అమ్మ నమ్మై-మనలను వళర్తెడుత్తు-మనలను అనుగ్రహిస్తుంది. అంబే శివే తిరువడిగళే శరణం.

Tuesday, December 28, 2021

PASURAMU-13

తిరుచిట్రంబలం-పాశురం-13 ********************** పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళవు వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు అతిసామాన్యముగా భావించే ప్రకృతి లోని కొలను ,కొలనులోని నీలికలువలు,కెందామరలు,పులుగు జంటలు,పాములు,మొదలగు వానిని కనుక మనము కొంచము లోతుగా పరిశీలిస్తేఅవి అన్నియును మనకు భగవత్స్వరూపమును -సద్గుణములను వర్ణించుచున్న ధన్యజీవులే. భలే భలే అందాలు సృష్టించావు అంటు మనము భగవంతుని కీర్తించవలసినదే. ప్రస్తుత పాశురములో జలరూపముగా స్వామి దర్శనమిస్తున్న మడుగు/పొయిగై , తరులు-గిరులు-విరులు-ఝరులు నిరతము నీ పాద ధ్యానమే- నిరతము నీ పాద గానమే అన్నట్లుగా, స్వామి పాదములను అర్చించుటకు మడుగులోని కార్మలరార్-నీలికలువలు,అందులోను పైంగుమళై-సుకుమారమైన నీలికలువలు వానితో పాటుగా శెంగమల పైంపోదార్ కెందామరలు/ఎర్రని తామరలు వికసించి సుగంధభరితములై మీ పాదములపై వాలుటకు తహతహలాడుచున్నవి. అదికాదు.అదికాదు.అవి అసలు పువులు కానేకావు.సాక్షాత్తుగా ఆదిదంపతులైన మీరే, అమ్మ నీలికలువగా,అయ్య కెందామరగా అనుగ్రహ పరిమళములను మాపై కురిపిస్తూ,కరుణాంతరంగమునే కొలనుగా మలిచి,మా ముందు సాక్షాత్కరించినారు, మీ దర్శన భాగ్యముతో మేమే కాదు,మా ముందు ఉన్న, చిన్న చిన్న జీవులు,తుమ్మెదలు గుంపుగా చేరి మీ వైభవమును వేనోళ్ల కీర్తించుచున్నవి.అవి ఎంతటి భాగ్యమును చేసుకొనినవో. చెలి అటు చూడు, కురుంగునత్తార్- అ గువ్వల జంటఒకదానికొకటిదగ్గరయై శ్రవణానందముగా మిమ్ములను సంకీర్తించుచున్నవి. అని ఒక చెలి అనగానే ,మరొక చెలి. ఇటువైపు చూడండి చెలులారా! పువ్వులేకాదు-పులుగులేకాదు ,కొలను జలము సైతము నాగాభరణుని నర్తనమును తలపింపచేయుచు చరచర పాకుతూ, పిన్నుం అరవత్తాల్ -స్వామిని అర్చించుచున్నదా అన్నట్లుగా వళులు వళులు తిరుగుతూ ప్రదక్షిణమును చేయుచున్నది. ఇక్కడ పువ్వుల సేవ ను మానసికముగాను-పులుగుల సేవను వాచకముగాను -పాము ప్రదక్షినమును కాయకముగా భావించి , చెలులారా మనము ఇంక ఆలస్యము చేయక/తడవు చేయక కుడైయుం-మునకలు వేస్తూ ,దోసిళ్లలోని నీటిని ఒకరిపై ఒకరము చల్లుకుంటూ నాదోపాసనను చేద్దాము అ0టుండగానే మరొకచెలి , వింటున్నారా మనతో పాటుగా మన కరములు జోడిస్తూ కాయక కర్మను చేస్తుంటే , కరములకు అలంకరింపబడిన శంగం-క ంకణములు ధ్వనులను చేస్తున. వాచక కర్మను అందులో మేళవిం చి చభక్తి ప్రపత్తులను మనసుకు అందచేస్తున్నాయి. అవుననవు ను. ఒక్కసారి నీటిప్రవాహమువైపు చూపును మరల్చండి . నీటి అలలు ఆనందముతో ఎగిసిఎగిసి కేరింతలు కొడుతున్నాయి అని మరొక చెలి అనగానే,ఆమె మాటను ఖండిస్తూ, అవి నీటి అలలకేరింతలు కాదు ఒకసారి గమనించండి.ఆ చప్పుడు కొంగై కళ్ పొంగ-మన హృదయములలో ఉవ్వెత్తున పొంగుతున్న ఆనందము అనగానే, సందేహముగా చూస్తున్న చెలులతో ఆ ఆనందమునకు కారణము ం ఎంగళ్-మనయొక్క, పిరాట్టి-జగన్మాత యైన పార్వతి ఎం-మన యొక్క కోన్రు-ప్రభువు యైన పరమేశుడు మనలను సార్థనినాల్- శరణార్థులుగా స్వీ కరించి అనుగ్రహించబోతున్నారు. కనుక పంగయుం పూ-ం పద్మములతో నిండిన జ్ఞానులు-యోగులతో నిండిన ఈ మడుగులో ఆడేలో-మునకలు వేసి తరించుదాము రండి అని ఒకరితో వేరొకరు కలిసి భగవదనుగ్రహమును సమిష్టిగా పంచుకొనుటకు సిధ్ధమగుచున్నారు. చెలుల స సంభాషణమును కనుక గమనిస్తే మనకు ఒక సందేశము సూచిస్తున్నారనిపిస్తుంది .. అదేమిటంటే శ్రీ ఆది శంకరులు చెప్పినట్లు , "యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ" కొలనుగా చూసినా,పూవుగా చూసినా,పులుగుగా చూసినా,కొలువుగాచూసినా,దానిలోని బ్రహ్మమును చూడగలిగిన వాడే/నాడే బ్రహ్మానందమును ఆస్వాదించగలరు. శివోహం. అంబే శివే తిరువడిగళే పోట్రి.

PASURAM-13

తిరుచిట్రంబలం-పాశురం-13 ********************** పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్ అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్ తంగళ్ మనం కళౌ వార్వందు సార్ధనినాల్ ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు శంగం శిలంబ శిలంబు కలందార్ప కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్ పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్ ఘనాఘనసుందర పోట్రి ********************* తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు అతిసామాన్యముగా భావించే ప్రకృతి లోని కొలను ,కొలనులోని నీలికలువలు,కెందామరలు,పులుగు జంటలు,పాములు,మొదలగు వానిని కనుక మనము కొంచము లోతుగా పరిశీలితే అవి అన్నియును మనకు భగవ్త్స్వరూపమును-సద్గునములను వర్ణించుచున్న ధన్యజీవులే. భలే భలే అందాలు సృష్టించావు అంటు మనము భగవంతుని కీర్తించవలసినదే. ప్రస్తుత పాశురములో జలరూపముగా స్వామి దర్సనమిస్తున్న మడుగు/పొయిగై , తరులు-గిరులు-విరులు-ఝరులు నిరతము నీ పాద ధ్యానమే- నిరతము నీ పాద గానమే అన్నట్లుగా, స్వామి పాదములను అర్చించుటకు మడుగులోని కార్మలరార్-నీలికలువలు,అందులోను పైంగుమళై-సుకుమారమైన నీలికలువలు వానితో పాటుగా శెంగమల పైంపోదార్ కెందామరలు/ఎర్రని తామరలు వికసించి సుగంధభరితములై మీ పాదములపై వాలుటకు తహతహలాడుచున్నవి. అదికాదు.అదికాదు.అవి అసలు పువులు కానేకావు.సాక్షాత్తుగా ఆదిదంపతులైన మీరే, అమ్మ నీలికలువగా,అయ్య కెందామరగా అనుగ్రహ పరిమళములను మాపై కురిపిస్తూ,కరుణాంతరంగమునే కొలనుగా మలిచి,మా ముందు సాక్షాత్కరించినారు, మీ దర్శన భాగ్యముతో మేమే కాదు,మా ముందు ఉన్న, చిన్న చిన్న జీవులు,తుమ్మెదలు గుంపుగా చేరి మీ వైభవమును వేనోళ్ల కీర్తించుచున్నవి.అవి ఎంతటి భాగ్యమును చేసుకొనినవో. చెలి అటు చూడు, కురుంగునత్తార్- అ గువ్వల జంటు ఒకదానికొకటి దగ్గర్గా యుగలగాత్రములతో మిమ్ములను కీర్తించుచు శ్రవణానందముగా మిమ్ములను సంకీర్తించుచున్నవి. ఈటువైపు చూదండి చెలులారా! పువులేకాదు-పులుగులేకాదు ,కొలను జలము సైతము నాగాభరణుని నర్తనమును తలపింపచేయుచు చరచర పాకుతూ, పిన్నుం అరవత్తాల్ -స్వామిని అర్చించుచున్నదా అన్నట్లుగా వళులు వళులు తిరుగుతూ ప్రదక్షిణమును చేయుచున్నది. చెలులారా మనము ఇంక ఆలస్యము చేయక/తడవు చేయక కుడైయుం-మునకలు వేస్తూ ,దోసిళ్లలోని నీటిని ఒకరిపై ఒకరము చల్లుకుంటూ నాదోపాసనను చేద్దాము అనుటుండగానే మరొకచెలి , వింటున్నారా మనతో పాటుగా మన శంగం-కంకనములు సిలంబ ధ్వనులను చేస్తున్నాయి.కాయక కర్మను చేస్తున్నాయి. వాచక కర్మను అందులో మేలవించి,భక్తి ప్రపత్తులను మనసుకు అందచేస్తున్నాయి. అవునౌను నీటి అలలు ఆనందముతో ఎగిసిఎగిసి కేరింతలు కొడుతున్నాయి అని మరొక చెలి అనగానే,ఆమె మాటను ఖండిస్తూ, అవి నీటి అలలకేరింతలు కాదు ఒకసారి గమనించండి.ఆ చప్పుడు కొంగై కళ్ పొంగ-మన హృదయములలో ఉవ్వెత్తున పొంగుతున్న ఆనందము అనగానే, సందేహముగా చూస్తున్న చెలులతో అ అనందమునకు కారనము ఎంగళ్-మనయొక్క, పిరాట్టి-జగన్మాత యైన పార్వతి ఎం-మన యొక్క కోన్రు-ప్రభువు యైన పరమేశుడు మనలను సార్థనినాల్-సరణార్థులుగా స్వీకరించి అనుగ్రహించబోతున్నారు కనుక పంగయుం పూ-పద్మములతో నిండిన జ్ఞానులు-యోగులతో నిండిన ఈ మడుగులో ఆడేలో-మునకలు వేశి తరించుదాము రండి అని ఒకరితో వేరొకరు కలిసి భగవదనుగ్రహమును సమిష్టిగా పంచుకొనుటకు సిధ్ధమగుచున్నారు. చెలుల సంభాషణ్ అమును గమనిస్తే మనకు మాణిక్యవాచగరు మరొక ముఖ్యమైన విషయమును సూచనగా అందిస్తున్నారనిపిస్తుంది. అదేమిటంతే శ్రీ ఆది సంకరులు సెలవిచ్చినట్లు, "యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ" కొలనుగా చూసినా,పూవుగా చూసినా,పులుగుగా చూసినా,కొలువుగాచూసినా,దానిలోని బ్రహ్మమును చూడగలిగినన వాడే/నాడే బ్రహ్మానందమును ఆస్వాదించగలరు. శివోహం. అంబే శివే తిరువడిగళే పోట్రి.

Monday, December 27, 2021

PASURAM-12

తిరుచిట్రంబలం-పాశురం-12 ************************ ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం కాత్తు పడైత్తు కరందు విళయాడి వార్తయుం పేశి వలై శిలంబ వారళైగళ్ ఆర్పరవం సెయ్య అణుకుణల్ మేల్ వండార్ప పూత్తిగణుం పొయిగై కుడైదుడై యాన్ పొర్పాదం ఏత్తి ఇరుంచులై నీరాడేలో రెంబావాయ్ ***** ఆర్తా విషణ్ణా శిధిలాస్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఖః సుఖినో భవంతు భగవన్నామ సంకీర్తనమే భవరోగమును హరింపచేయగల ఔషధము.భవరాశి యనుగడ్డివాములను దహింపచేయగల అగ్నికనము.భవసాగరమును సులభముగా దాటింపగల నావ.భవతారకము. జీవులకు ఆర్తిని కలిగించుచున్న కలతలను పెంచుచున్న కష్టములను కనుక మనము గుర్తించగలిగితే అవి శ్రీ అదిసంకరులు భజగోవిందములో వచించినట్లు, పునరపి జననం-పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే పిరవి-తిరిగి తిరిగి, తుయిర్ కెడ-బాధలలో మునిగి సంసారమనే జలధిలో బంధములనే మొసలిచే పట్తుకొనబడి,దానిని విడిపించుకొనలేక/చేతకాక మనలను మనము రక్షించుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది చెలులారా. తుయిర్కెడనాం-బాధలను/ఆర్తిని తొలగించు ఆర్తాదుం-నర్తకుడు సాటిలేని మేటి నర్తకుని పొర్పాదం-బంగారుకాంతులీనుచున్న పాదమును పట్టుకుని, వార్తయుం పేశిం-లీలావిషేషములను సంకీర్తించుదాము. ఆ అసమాన నర్తకుకి నాట్య విశేషములే , కూత్తం ఇవ్వానం-ఆకాశమును సృష్టించుట, కువలయమున్-భూమందలమును సృష్టించుట భూమ్యాకాశములతో పాటుగా సమస్తమును సృజించి, కాత్తు-సృష్టికార్యమును చేసి, పడైత్తు-దానిని స్థితికార్యముగా పోషించుట, తరువాత, మూడవ భాగముగా, పడైందు-తనలో లీనము చేసుకొనుట అను మహత్తర నాట్యమును విళయాడి -అవలీలగా చేస్తూ మన ఆర్తిని/భవబంధములను తొలగించుచున్నాడు. స్వామి నృత్య రూపముగా చేస్తున్న , నృత్యములోని భంగిమలను కనుక ఒక సారి పరిశీలిస్తే, చేతిలోని డమరుకము-సృష్టికార్యమునకు చిహ్నముగా, కుడివైపు పైనున్న అభయహస్తము స్థితికార్య సూచకముగా, ఎడమ ఊర్థ్వ హస్తములోని అగ్ని సంహార సంకేతముగా, భూమికి ఆనించిన కుడిపాదము తిరోధానపు గుర్తుగా, సగము ఎత్తి ఉంచిన వామపాదమును అనుగ్రహ అర్థముగా పెద్దలు భావిస్తారు. ప్రపంచకదలిలకు పరమేశుని కదలికల ప్రతిబింబములే కదా. స్వామి అగ్నిపాత్రను వామహస్తమున పట్తుకుని నర్తనమును చేయుటలోని ఆంతర్యమును అనుభవజ్ఞులు అందించిన ప్రకారము, నేను-నాది అను అహంకారముతో/అజ్ఞానముతో భ్రమను నిజమనుకునే జీవులను జనన-మరణ వలయమును చిక్కుకొని కొట్టుమిట్టాడుచున్న వారిని,ఉధ్ధరించుటకై (ఒకసారి దర్శించినంత మాత్రముననే) జన్మరాహిత్యమునందించుటకై, నటనం ఆడునే, ఆ పరమశివుడు భవ తిమిర హరుడు నటనా వతంసుడై తకధిమి తకధిమి యని, అని సంకీర్తించువేళ, మన చేతికడియాలు,నడుమునకు ఉన్న ఒడ్డాణము, వళి-వార్కళైగళ్ శిలంబ ఇక్కడ ఆభరణములు బాహ్యములుకావు.అంతఃకరనములు.నాభినుండి వెలువడు ఓంకారమే ఒడ్డాణపు సవ్వడి.భక్తిభావ కైమోడ్పు కంకణముల ధ్వని. ఆ నామ మాహాత్మ్యమో/నామి మాహాత్మ్యమో తెలియదు కాని చెలి, మన అణి కుణల్-పువ్వులచే అలంకరింబడిన కేశములు మంత్రమయములై మాహేశుని ప్రణ వముతో పలవరించుచున్నవి . ప్రణవనాదము చేయు తుమ్మెదలను ఆకర్షించగా ఆనంద డోలలూగుతూ ,మన మాంస స్ శరీరములు మంత్రశరీరములగుచున్నవేళ శివ నోమునకు సిధ్ధమగుదాము. అంబే శివే తిరువడిగళే శరణం.

Sunday, December 26, 2021

PAASURAMU-11

తిరుచిట్రంబలం-పాశురం-11 *********************** ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్ పాడి అయ్యా వళి అడియో వాళ్దోంకాణ్ ఆరళ్ పోర్ శయ్యా వెణ్ణిరాడి శెల్వా శిరు మరుంగుల్ మయ్యార్ తడంగన్ మడందై మణవాలా అయ్యా నీరాట్కొండ అరుళుం విడయాట్రిన్ ఉయివార్గళ్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిదోం ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలో రెంబావాయ్ తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో పుణ్యతీర్థ స్నానము మహిమ గురించి కీర్తిస్తున్నారు. " అపవిత్రో పవిత్రావ సర్వస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సః బాహ్య-అభ్యంతరః శుచిః" వశిష్ట ముని జనక మహారాజునకు చెప్పిన విధముగా సర్వదేవతాశక్తులును సత్వగుణసోభను సంతరించుకొని ద్రవరూపమై జలావాసమును చేయుచున్న సమయమున జీవుని పాప-పుణ్యములతో సంబంధములేక వేసిన మునక కల్మహములను హరించివేసి,సన్మార్గమును చూపి,సద్గతిని ప్రసాదిస్తుందని ఆర్యోక్తి. ప్రస్తుత పాశురములో వెణ్ణిరాడై ప్రాభవము ప్రస్తుతింపబడుచున్నది. వెణ్-తెల్లని నీర్-ఆడి-జలములో స్నానముచేసి శెల్వన్-ఐశ్వ్ర్య వంతులైన వారిని చెబుతున్నారు. తెల్లని జలములో స్నానము చేసి భగవంతుడు-భక్తుడు ఇద్దరును ఐశ్వర్యవంతులైనారు. స్వామి మడైంద-ఉత్తమస్త్రీ యైన మాత పార్వతికి, అదియును- శిరు మరుంగుల్-సన్నని నడుముగల,సిమ్హ మధ్యయైన,మంత్ర స్వరూపమైన, మయ్యార్ తడంగల్-విశాలమైన కరుణ పూరిత నేత్రములు కలిగిన అమ్మ విశాలాక్షికి, మణవాలా-భర్గా,నాధునిగా, వెణ్ణిరాడై-విబూదితో నిండి,ఐశ్వర్యప్రదాయకుడైన శెల్వ గా ఈశ్వరునిగా ప్రకాశిస్తున్నాడు. భక్తుల విషయమునకు వస్తే, వెణ్ నీరాడి-సత్వ శుధ్ధ జల పూరితమైన, పొయిగై-కొలనులో మునిగి పునీతులగుచున్నారు. ఆ పొయిగై-కొలను/పుష్కరిణి ఎలా ఉన్నదంటే, ముయ్యార్ తడం- ముయ్యార్ -తుమ్మెదలతో, తడం-నిందిపోయి ఉనది. ముయ్యార్ ఎందుకు అక్కడికి వచ్చి వాలినవి అన్న సందేహము మనకు రావచ్చును. ఆ మడుగు వికసించిన కమలములతో వింత సువాసనలతో తుమ్మెదలను ఆకర్షించుచున్నది. వచ్చి వాలిన తుమ్మెదలు పొయిగై పుక్కు-మడుగులోనికి ప్రవేశించి, ముగేరెన్న-శబ్దములను చేయుచున్నవు. చేతులతో మధువును పట్తుకొని గ్రోలుతు ఆనందముతో చేయుచున్న శబ్దములు మడుగున ప్రతిధ్వనించుచునది.ఇది బాహ్యము. మన చెలులు సైతము ఆ మడుగులోనికి ప్రవేశించి సత్వగుణశోభిత పద్మములై , కయ్యార్-చేతులనిండా జలమును తీసుకొని కుడైందు-కుడైందు-ఒకరిపై ఒకరు జల్లుకుంటూ,కేరింతలు కొడుతూ శబ్దములను చేయుచున్నారు. ఇది దృశ్యము. కాని నిశితముగా పరిశీలిస్తే స్వామి అవ్యాజ అనుగ్రహ కరుణా ప్రవాహము ఆ మడుగు/పొయిగై.సానపెట్తిన సాధనతో పరమాత్మను పరిపరివిధములుగా ప్రార్థించుచున్న ఎందరో మహానుభావులు పద్మములు. వారుచేయుచున ప్రణవమే పదిదిక్కుల వ్యాపించి పరిమళిస్తున్న తుమెదల ఝుంకారము.స్వామి వారిపై కురిపిస్తున్న అనుగ్రహమే ఆ తెల్లని ఎర్రని కళలతో కనువిందుచేసే అర్థనారీశ్వరము. చెలులద్వారా తిరుమాణిక్యవాచగరు మనలను మనము ఉధ్ధరించుకొనుటకు ఒక చక్కని మార్గమును చూపుచున్నారు. అదియే, అయ్యా-పరమేశా వళి అదియో-నీవు మాకొక మంచి వలి-మార్గమును చూపుతున్నావు. చూపతమే కాదు నీవు , ఆరోళ్పోర్ వాళ్దోకాణ్-అదరముతో మేము ఆ మార్గమున నడుచుకొనునట్లు,మమ్ములను నడుపుతున్నావు. మేమా ఎయ్యామల్-అసక్తులము కాని నీవు ఎందరినో నీ అక్కున చేర్చుకొనుట తెలిసినవారలము. ఉయ్ వార్గల్ -ఎందరినో నీ ఒడిలో ఒదిగే భాగ్యమును ప్రసాదించావు. ఎయ్యామల్-మేము అశక్తులమైనప్పటికిని, విడయాట్రిల్-నీ అవ్యాజ అనుగ్రహమును వినియున్నాము. స్వామి మమ్ములను కనికరించి ఎమై మమ్ములను కాప్పై-కాపాడు అని వేడుకొనుటకు ముందుగా పుణ్యతీర్థ స్నానమును ఆచరించి,శివనోమును నోచుకొనుటకు చెలులతో బయలుదేరినారు. అంబే శివే తిరువడిగలే శరణం.

Saturday, December 25, 2021

PASURAM-10

తిరువెంబావాయ్-10 ***************** పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్ పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్ వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్ కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్ ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్ ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్. విశ్వరూపాయ పోట్రి *************** ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్పురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపాన్ ధ్యాయేత్ ఈప్సితసిధ్ధయే ధృవపదం విప్రోభిషించే శివం. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా పోట్రి ****************************************** ప్రస్తుత పాశురములో తిరు మాణిక్యవాచగరు స్వామిని,బహువిధములుగా దర్శించి ప్రస్తుతిస్తున్నారు. స్వామి వేదస్వరూపుడు. వేదమేక గుణం జస్త్వా తదహ్నైవ విశుధ్ధ్యతే వేదం అంటే నాదం.దీనినే వేదం అణువణువున నాదం అంటు భక్తులు కీర్తిస్తారు స్వామిని.అంటే స్వామి శబ్దము ద్వారా ప్రకటింపబడుతున్నాడు/ప్రస్తుతింపబడుతున్నాడు/ప్రసన్నమగుతున్నాడు. స్వామి వేదస్వరూపమని, విణ్ణోరం-దేవతలు మణ్ణుం-మానవులందరు తుదితాలం-కీర్తిస్తున్నారు. అంతే కాదు వారు స్వామిని, ఓద ఉలవా-వర్ణింప శక్యము కాని స్వరూప-స్వభావములు కలవాడు అని తెలిసినప్పటికిని, స్వామి అనుగ్రహము వారికి పరమాత్మను వారికి ఒక్కనిగా అనిపించనీయతములేదు.వారు, స్వామి ఒరుప్పాన్-ఒకవైపున/ఏదమవైపున పేదై ని-స్త్రీని/అమ్మను దర్శించగలుగుతున్నారు. స్వామి దర్శనము వారికి అభయమును అందించిచున్నది.ఎందుకంతే స్వామి, పినా పిళ్లైగళ్-వారి పిల్లలకు,వారి పిల్లలకు/ముందు తరములకు, కులత్తరంతన్-వంసములకు/సమూహములకు సంరక్షకుడిగా సాక్షాత్కరిస్తున్నాడు సతీసమేతుడై. కాని విచిత్రము ఏమిటంటే ఒకసారి బ్రహ్మ-విష్ణు పరమాత్మ మొదలు-చివర కనుగొనవలెనని కిందనున్న ఏదులోకములకు-పైనున్న ఏడులోకములకు వారి వాహనములనెక్కి బయలుదేరి,వెతికి-వెతికి కనుగొనలేకపోయిరట. నిజముగా బ్రహ్మ-విష్ణు ప్రయ్త్నించి విఫలులైనారనుటలోని అంతరార్థము ఏమిటి? అహంకారము అను హంసనెక్కి తనకు శక్యముకాని భవిష్యత్తును పట్తుకోవాలనుకొను అవివేకమే కదా ఆ ప్రయత్నము. బ్రహ్మకు పూలతో ముడిచిన స్వామి సిగ కనరాలేదట- ఏమా సిగ? దానిలో స్వామి ముడుచుకొనిన పూవులు దేనికి సంకేతము? విచ్చుకొనుట-సుగంధమును అందించుట వాటి సహజలక్షణము.అహంకారము జ్ఞానమును కప్పివేస్తుంది కనుక ఆర్ అయినార్-స్వామికి ఇరుగుపొరుగు ఎవరు? అన్న ప్రశ్నకు అహంకారమును విడిచి,మనసును వికసింపచేసుకొను జ్ఞానులు.వారికే స్వామి అనుగ్రహమును పొందుట సాధ్యము. విష్ణువు ఐక్కద అజ్ఞానముతో కిందకు కిందకు తవ్వుకుంటూ ఎప్పుడో జరిగిపోయిన దానికై ప్రస్తుతమును వదిలివేసి ప్రయత్నించి, ఆర్ ఉట్రార్-ఎవరు బంధువులు? అజ్ఞానముచే కప్పబడి,పశుపతి పాసమును అర్థముచేసుకొను స్థితిలో ఉన్నవారుకాదు.అజ్ఞాన బంధమును తొలగించుకొని స్వామి శరనమనే బంధముతో ధన్యులగువారు కదా స్వామి బంధువులు. ఓ మనసా అహంకారమును-అజ్ఞానమను అధిష్టించి అయోమయములో పదకు.నీ ఎదురుగా నున్న తేజోరాశి యైన పరమాత్మను దర్శించి/భజించి/తరించు, ఎందుకంటే పరమాత్మ పరమాద్భుతమును గ్రహించుటకు విశ్వరూపము మొదటి సోపానము.నీవు సగుణమును దాటి నిర్గుణ పరబ్రహ్మమును కనుగొనుటకు అంతర్ముఖమగుటయే సరియైన మార్గము. స్వామి తొండర్-భక్తుల, తొండరుళన్-హృత్పద్మములందు ఒరు తోళన్-ఆ ఒక్క చోటనే అరన్ ముడివే స్వామి -కొలువై యున్నాడు/ఉంటాడు. కనుక స్వామిది ఏ వూరు? ఏ పేరు అన్న శంకను వీడి శివనోమును నోచుకునుటకు బయలుదేరుతున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

Friday, December 24, 2021

PAASURAM-09

తిరుచిట్రంబలం-పాశురం-09 *************************** తిరువెంబావాయ్-09 ************ మున్నై పళం పొరుక్కుం మున్నై పళం పొరుళై పిన్నై పుదుమైక్కుం పేత్తుం ప్పెట్రియెనె ఉన్నై పిరానాగ పెట్రవుం శీరడియో ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపాంగావో అణ్ణవరె ఎణకణవర్ ఆవార్ అవర ఉగందు శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్ ఎన్న కురయుం ఇలో మేలోరెంబావాయ్ ఉన్నడియార్ తొళుంబాయ్ పోట్రి ************************* భాగవత సేవా ప్రీత్యాయా పోట్రి తిరుమాణిక్యవాచగర్ భగవదనుగ్రహమును పొందుటకు సులభమార్గమును ప్రస్తుత పాశురములో మనకు అనుగ్రహించుచున్నారు . ఎనిమిదవ పాశురము వరకు నిదురించుచున్న చెలులను మేల్కొలుపుతున్నట్లుగా బాహ్యమునకు /చేతనవంతులుగా మార్చుటకు ఆంతర్యములో జరిగిన ప్రయత్నమును వివరించినారు. ప్రస్తుత పాశురములో శివనోమునకు సిధ్ధపడుచున్న చెలులు తమోనిద్రను వీ డి జాగరూకులుగా నున్నవారే. భగవదనుగ్రహమును భక్తితో పొందగోరుచున్నవారే. దానికి కావలిసిన /చేయవలసిన కార్యాచరణమును అన్వేషించుచున్నవారే.. " శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం " అను తొమ్మింటిని భగవదనుగ్రహ ప్రాప్తికి సోపానములైన నవవిధభక్తి మార్గములుగా పెద్దలు చెబుతారు . అదేవిధముగా భక్తి-జ్ఞాన-కర్మ యోగములను భగవంతుని అనుగ్రహ ప్రాప్తికి అనుసరించవలసిన మార్గములుగాను వివరిస్తారు. సామాన్య ఉపాధి భగవదనుగ్రహ ప్రాప్తికి స్వయసమర్థముకాదు కనుక అది ,దానిని అందించగల ఉపకరణములపై ఆధారపడుట సహజము. కాని నిశితముగా పరిశీలిస్తే భక్తి ఒక్కటే భగవంతుని దరిచేర్చగలదను జ్ఞానమును పొండుట ,జ్ఞానము నిర్దేశించిన నియమములను/సత్కర్మలను ఆచరించుట ఒకే ఒక విధానముయొక్క వివిధ దశలు. అదే విధముగా నవవిధభక్తులును నన్వోన్మేషమైన పరమాత్మ తత్త్వమును అర్థము చేసుకొనుటకు మనము ఎక్కవలసిన నిచ్చెన్ యొక్క తొమ్మిది మెట్లు. ఏ పదార్థము యొక్క గొప్పదనమును తెలుసుకోవాలంటే దాని వైశాల్యము/పరిమ అణముతో తో పాటు అది చెక్కుచెదరక అలాగే ఉన్నదా లేక మార్పుచెందుతున్నదా అనేది మనము గమనిస్తాము. అటువంటిది పరమాత్మ తత్త్వమును అర్థము చేసుకోవాలంటే మనకు సాధ్యమేనా ? అందులోను, మున్నై పళం పొరుక్కు- సనాతనమునకెల్ల సనాతనము స్వభావములోనే కాదు, మున్నై పరం పొరుళై- స్వరూపములోను పురాతనమునకెల్ల పురాతనము. అంతే కాదు ఎప్పెట్రియ్ అనె-మా పరిపాలకా /ప్రభువా నీ లీలా విశేషములను తెలిసికొనవలెనన్న , శీరడియార్-పరమ భక్తాగ్రేసరుల అడుగుజాడలలో నడిచే ,వారిని సేవించే సద్బుధ్ధిని ప్రసాదించు. నృసిమ్హకవి కృష్ణసతకములో చెప్పినట్లు, నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును కనుక మాకు నీవు అనుగ్రహించితే, వారిని,పోతనామాత్యులు చెప్పునట్లు, " తను హృద్భాషల సఖ్యమున్,శ్రవనమున్,దాసత్వమున్,వందనార్చనముల్ ,సేవయున్,అత్మలో ఎరుకయున్ మొదలగు విధానముల ద్వారా అనుసరించి,వారు నడిచిన మార్గములో/వారి అడుగుజాడలలో నడుచుటకు ప్రయత్నించెదము. వారిని ఆశ్రయన భక్తితో, అణ్ అవరె- నా తండ్రి అణ్-కణవర్-నా భర్త అన్ అవర్-నా పాలకా అవర్-నీవర్ ఉగందు-అన్నీ అంటూ శరణాగతితో వారిని, శొన్న పరిశె-మార్గదర్శకులుగా మన్ననతో మార్గదర్శకులుగా గౌరవిస్తూ, ఉన్నడియార్ తొళుంబాయ్-నీ పాద దాసులకు,పాద దాసులమవుతాము. ఎందుకంటే, మున్నైపళళ్-మున్నై పరం సనాతనము-అధునాతనము మాత్రమే నీ స్వరూప-స్వభావములు కావు.వాటి మధ్యలో వచ్చి చేరుచున్న , పిన్నై పుదు మైక్కం -అప్పటికి కొత్తవిగా అనిపిస్తూ,తిరుగుతున్న కాలముతో పాటుగా పాతవైపోతున్న సకల స్వరూప-స్వభావములు నీవే కనుక,మేము నిన్ను,నీ మహత్వమును అర్థము చేసికొనుటకు, యం కింకోణ్-మా ప్రభువా,నీవు మాకు నల్గుదియేల్-ఒక వరమును ప్రసాదించు. అది ఏమిటంటే, మాకు ఉన్నడియార్-నీ పాదభక్తులు కనుక తాల్పణివో-తారసపడితే,వారిని గుర్తించి వారి పాదములను/పాద ముద్రలను , గురుతులను గురువులుగా భావించి, అంగ అవర్కు-వారిని మాకు పాంగావో-స్నేహితులుగా,మా సంరక్షకులుగా చేయి. వారిని గుర్తించి-సేవించుతకు మా అజ్ఞానమును అడ్డురానీయక తొలగించు. మీ నీకృపాకటాక్షమునకు నిదర్శనముగా నీ నిజభక్తుల పాదసేనమును పొందకలిగా మంటే , ఇంక మాకు, ఎన్న కురియుం ఇలో-ఇంకేమి కోరికలు లేవు నిన్ను అదుగుటకు. ఎందుకంతే మహాత్ముల దర్శనము/సేవనము మహాదైశ్వర్యప్రదము అని మున్ను ఎందరి చరితలో వినియున్నాము. సాక్షాత్తు నందకము తానై జనించిన అన్నమయ్య -నరసింగభూపతికి సన్మార్గమును అందించలేదా! గోపన్న తానీషాకు రామలక్షణ సందర్శనా భాగ్యమును కలుగచేయలేదా.devaaSraya manDapamuloe A Anavaayitee ippaTiki konasaagutowmdi kadaa. ఆదిశంకరులు భజగోవింద శ్లోకములో చెబుతున్నట్లు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః. అన్న సత్యమును గ్రహించి శివనోము నోచుటకు కదులుచున్నారు. అంబే శివే తిరువడిగళే పోట్రి.

Thursday, December 23, 2021

PASURAMU-08

తిరుచిట్రంబలం-పాశురం-08 **************************** తిరువెంబావాయ్-008 ****************** కోళి శిలంబ చిలంబుం కురుగెంగు ఎళిలియంబ ఇయంబువేన్ శణ్గెంగుం కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై కేళిల్ విళుప్పోరుల్కళ్ పాడినో కేట్టిలైయో వాళియదెన్న ఉరక్కుమో వాయ్ తిరవాయ్ ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై ఏలై పంగళనయే పాడేరేలొ రెంబావాయ్. ప్రళయ సాక్షియే పోట్రి అర్థనారీశ్వరయే పోట్రి *************** తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ప్రళయసాక్షిగా నున్న ఒకే ఒకడుగా మిగిలిన పరమాత్మ గుఇంచి ప్రస్తావిస్తూనే,మనలను చైతన్యవంతులుగా మలుచుతకు సులభమైన ఉదాహరనలతో, " అజాయ మాన బహుధా విజాయతే" అన్న సూక్తిని ప్రవేశపెట్టి నిద్వందమైన -ఒరువన్ ఒక్కటిగా గల పరమాద్భుతమును ముందు ద్వంద్వములుగా మనకు పరిచయము చేసినారు. ఇప్పటివరకు నిదురించుచున్న చెలులను మేల్కొలుపునపుడు ఉషోదయమును గురించి ప్రస్తావించలేదు. కాని ప్రస్తుత పాశురములో మన్ము వాటికన్న ఎంతో గొప్పవాళ్లమనుకొనే భావనలో నున్న మనలను చైతన్యపరచుటకు, కోళి శిలంబ-తెల్లవారుచున్నదన్న విషయమును తెల్లబరచుటకై కోడి కూయుచున్నది అని సంకేతమును చెప్పారు. అంతే పంచభూత సమన్వితమైన ఈ జగతిలో సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక తమోగునమును వీడండి అని చెప్పకనే చెబుతున్నాయి మరొక విచిత్రము ఎప్పుడైతే కోడికూత వినబడిందో దానిని సంకేతముగా తీసుకుని పక్షులు తామును నాదార్చనకు సిధ్ధముగా ఉన్నామని కూసినవి. పంచేంద్రియ జ్ఞానము కోడికూత రూపములో తమమును వీడి జాగరూకులు కమ్మని చెబుతుంటే, దానికి అనుగుణముగా పక్షులు కూతలలో జాగరూకతతోనే ఉన్నామని సమాధానమును చెప్పుచున్నవి. tiruchiTrambalam-paaSuram-08 **************************** తిరువెంబావాయ్-008 ****************** కోళి శిలంబ చిలంబుం కురుగెంగు ఎళిలియంబ ఇయంబువేన్ శణ్గెంగుం కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై కేళిల్ విళుప్పోరుల్కళ్ పాడినో కేట్టిలైయో వాళియదెన్న ఉరక్కుమో వాయ్ తిరవాయ్ ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై ఏలై పంగళనయే పాడేరేలొ రెంబావాయ్. ప్రళయ సాక్షియే పోట్రి అర్థనారీశ్వరయే పోట్రి *************** tirumaaNikyavaachagaru prastuta paaSuramuloe praLayasaakshigaa nunna okae okaDugaa migilina paramaatma guimchi prastaavistoonae,manalanu chaitanyavamtulugaa maluchutaku sulabhamaina udaaharanalatoe, " ajaaya maana bahudhaa vijaayatae" anna sooktini pravaeSapeTTi nidvamdamaina -oruvan okkaTigaa gala paramaadbhutamunu mumdu dvamdvamulugaa manaku parichayamu chaesinaaru. ippaTivaraku nidurimchuchunna chelulanu maelkolupunapuDu ushoedayamunu gurimchi prastaavimchalaedu. kaani prastuta paaSuramuloe manmu vaaTikanna emtoe goppavaaLlamanukonae bhaavanaloe nunna manalanu chaitanyaparachuTaku, koeLi Silamba-tellavaaruchunnadanna vishayamunu tellabarachuTakai koeDi kooyuchunnadi ani sankaetamunu cheppaaru. amtae pamchabhoota samanvitamaina I jagatiloe sooryuDu udayistunnaaDu kanuka tamoegunamunu veeDanDi ani cheppakanae chebutunnaayi maroka vichitramu eppuDaitae koeDikoota vinabaDimdoe daanini sankaetamugaa teesukuni pakshulu taamunu naadaarchanaku sidhdhamugaa unnaamani koosinavi. pamchaendriya jnaanamu koeDikoota roopamuloe tamamunu veeDi jaagarookulu kammani chebutunTae, daaniki anuguNamugaa pakshulu kootalaloe jaagarookatatoenae unnaamani samaadhaanamunu cheppuchunnavi. daanini anusaristoo ELi EDu svaramulu veeNa teegenu taakutoo svaamini keertistunnavi. mana Sareeramuloeni saptadhaatuvulu svaami sankeertanamunaku sidhdhamaguchunnavi. veeNaa naadamunu anusaristoo, veN sanga dhvanulu vinipistunnaayi. trikaraNamulanu Sudhdhichaesikonina upaadhi satvaguNa Soebhitamai tellani Sankhamuvale praNavamunu ninadistunnadi.vinoedistunnadi. vinoedamaa emdulaku anna saMdaehamu meeloe kaluga vachchunu. niduristunna goepikatoe baaTugaa manalanu saitamu chaitanyavamtulanu chaeyuTaku tiru maaNikyavaachagaru sRshTi vistaraNanu soochistunnaaru.adiyae oruvan gaa unna paramaatma , hari-haruDu anna renDu naama roopamulanu sveekarimchi,hari tana yoega nidranu veeDi svaamini saevimchuTaku sidhdhamugaa nunnaaDani cheppuTa.ALiyaan ambuDamae-padmanaabhuDaina hari, saeshaSayanamunu chaalimchi,sthitikaaryamunaku udyuktuDaguTa. chelulu maelkolupunapuDu veeNaa naadamunu-Samkha naadamunu prastaavimchuTa. manaSareeramanae veeNaloeni naramulanae teegelanu savarimchukoni amta@h Sudhdhini pomduTa, Samkhanaadamunu daevaalaya praanganamulamdunna dushTaSaktulanu paaradroeluTaku chaeyuduru. mana Sareramae/upaadhi yanae daevaalayamu bayaTa umDi manalanu Akarshimchu dushTa Saktulanu/arishaDvargamulanu paaradroelutaku chaeyunadi , veN sangai Eli-sabdamu. imkoka mukhyamaina vishayamu ikkaDa stree-purusha dvaitamu kooDaa soochimchabaDinadi.amma ayyavaari vaamabhaagamuna sthiramai , kaeLi-asamaanamaina/poelchuTaku veelukaani, Sree lalitaa sahasranaamamulaloe cheppinaTlu, samaanaadhika varjitaa-samaanamainadi/adhikamainadi laenidi gaa kaeLi gaa stutimpabaDuchunnadi. svaami kaeli-paramjyoeti asamaana taejoeraaSi adiyaekaadu, svaami-kaeLi param karuNai cheliyali kaTTalaeni karuNaa samudramu. raamadaasu nuDivinaTlu, daaSarathi! karuNaa payoenidhi. cheli chooSaavaa I vichitramu. manameedi karuNatoe praLaya samayamuna okkanigaa nunna svaami,ippuDu " ELai pangaaLanayae" edamavaipu streemoortini dharimchi,manalanu anugrahimchuTaku mana Uriki vachchinaaDu. koeDikootalu-pakshula kootalu,veeNaa naadamu-Sankhanaadamunu neevu vinuTalaedaa? avi neeku vinabaDuTa laedaa? ayitae mana janma vaaLi-vyarthamu/nirupayoegamu. cheli venTanae maelkaamchi Siva sankeertanamunaku/Sivanoemunaku sidhdhamu kammu amTu vaaru Amenu tamatoe kalupukoni kaduluchunnaaru. అంబే శివే తిరువడిగళే శరణం. దానిని అనుసరిస్తూ ఏళి ఏడు స్వరములు వీణ తీగెను తాకుతూ స్వామిని కీర్తిస్తున్నవి. మన శరీరములోని సప్తధాతువులు స్వామి సంకీర్తనమునకు సిధ్ధమగుచున్నవి. వీణా నాదమును అనుసరిస్తూ, వెణ్ సంగ ధ్వనులు వినిపిస్తున్నాయి. త్రికరణములను శుధ్ధిచేసికొనిన ఉపాధి సత్వగుణ శోభితమై తెల్లని శంఖమువలె ప్రణవమును నినదిస్తున్నది.వినోదిస్తున్నది. వినోదమా ఎందులకు అన్న సందేహము మీలో కలుగ వచ్చును. నిదురిస్తున్న గోపికతో బాటుగా మనలను సైతము చైతన్యవంతులను చేయుటకు తిరు మాణిక్యవాచగరు సృష్టి విస్తరణను సూచిస్తున్నారు.అదియే ఒరువన్ గా ఉన్న పరమాత్మ , హరి-హరుడు అన్న రెండు నామ రూపములను స్వీకరించి,హరి తన యోగ నిద్రను వీడి స్వామిని సేవించుటకు సిధ్ధముగా నున్నాడని చెప్పుట.ఆళియాన్ అంబుడమే-పద్మనాభుడైన హరి, సేషశయనమును చాలించి,స్థితికార్యమునకు ఉద్యుక్తుడగుట. చెలులు మేల్కొలుపునపుడు వీణా నాదమును-శంఖ నాదమును ప్రస్తావించుట. మనశరీరమనే వీణలోని నరములనే తీగెలను సవరించుకొని అంతః శుధ్ధిని పొందుట, శంఖనాదమును దేవాలయ ప్రాంగనములందున్న దుష్టశక్తులను పారద్రోలుటకు చేయుదురు. మన శరెరమే/ఉపాధి యనే దేవాలయము బయట ఉండి మనలను ఆకర్షించు దుష్ట శక్తులను/అరిషడ్వర్గములను పారద్రోలుతకు చేయునది , వెణ్ సంగై ఏలి-సబ్దము. ఇంకొక ముఖ్యమైన విషయము ఇక్కడ స్త్రీ-పురుష ద్వైతము కూడా సూచించబడినది.అమ్మ అయ్యవారి వామభాగమున స్థిరమై , కేళి-అసమానమైన/పోల్చుటకు వీలుకాని, శ్రీ లలితా సహస్రనామములలో చెప్పినట్లు, సమానాధిక వర్జితా-సమానమైనది/అధికమైనది లేనిది గా కేళి గా స్తుతింపబడుచున్నది. స్వామి కేలి-పరంజ్యోతి అసమాన తేజోరాశి అదియేకాదు, స్వామి-కేళి పరం కరుణై చెలియలి కట్టలేని కరుణా సముద్రము. రామదాసు నుడివినట్లు, దాశరథి! కరుణా పయోనిధి. చెలి చూశావా ఈ విచిత్రము. మనమీది కరుణతో ప్రళయ సమయమున ఒక్కనిగా నున్న స్వామి,ఇప్పుడు " ఏళై పంగాళనయే" ఎదమవైపు స్త్రీమూర్తిని ధరించి,మనలను అనుగ్రహించుటకు మన ఊరికి వచ్చినాడు. కోడికూతలు-పక్షుల కూతలు,వీణా నాదము-శంఖనాదమును నీవు వినుటలేదా? అవి నీకు వినబడుట లేదా? అయితే మన జన్మ వాళి-వ్యర్థము/నిరుపయోగము. చెలి వెంటనే మేల్కాంచి శివ సంకీర్తనమునకు/శివనోమునకు సిధ్ధము కమ్ము అంటు వారు ఆమెను తమతో కలుపుకొని కదులుచున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

Wednesday, December 22, 2021

pPASURAM-07

తిరు చిట్రంబలం-పాశురం-07 *************************** తిరువెంబావాయ్-007 ****************** అన్నే ఇవయున్ శిలవో పల అమరర్ ఉన్నర్క అరియాన్ ఒరువన్ ఇరుంశీరాన్ శిన్నంగళ్ కేట్పా శివన్ ఎన్రె వాయ్ తిరప్పాయ్ తిన్నాయ నా మున్నం తీశేర్ మెళుగొప్పాయ్ ఎన్నాన ఎన్నరయన్ ఇన్నముదల్ ఎండ్రెన్నోం శొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడియో వన్నం జపేదయిర్ పోలే కిడత్తియాల్ ఎన్నే తుయిలిల్ పరిశేలో రెంబావాయ్ తెన్నాడుడయ ఇరైవా పోట్రి ఎన్నాట్టురుక్కుం ఇరైవా పోట్రి **************************** తిరుమాణిక్యవాచగర్ ప్రస్తుత పాశురములో పరమాద్భుతములను ప్రస్తావిస్తూ పరమేశుని వైభవమును ప్రస్తుతిస్తున్నారు. అన్నే-అమ్మా, ఓ వన్నెంజల్- రాతిహృదయమా, పాషాణ హృదయా, ఎన్నే తుయిలిల్-ఇది ఏమి నిద్ర అమ్మా! నీ చుట్టు జరుగుచున్న శివనాదార్చనమును నీ చెవులు నీ మనసునకు చేర్చలేకున్నవి. ఒకసారి కన్నులు తెరిచి చూడు. నాదం తనుమనిశం శంకరం అంటూ,చేతములు మాత్రమే కాక, శిన్నంగళ్-శివ వాయిద్యములు/కొమ్ము బూరలు సైతము చేతనత్వమును పొంది శివ సంకీర్తనమును చేయుచున్నవి. కాని చేతవైన నీవు ఆరాధనమును విస్మరించి నిదురించుచున్నావు. సకల జగములు మేల్కాంచి,ముందు నీవు చెప్పినట్లుగానే, శివ నామమును వింటూనే అగ్నికి సోకిన మైనము వలె, మెళుందొప్పాయ్-ఆర్ద్రత నిండిన మనముతో, తెన్నాయన్నాం మున్నాం- దక్షిణామూర్తి అని స్తుతిని ప్రారంభించక ముందే,ఎంతో ఆనందముగా స్వామి విభవమును కీర్తించాలనుకుని -భక్తి పారవశ్యముతో కప్పివేయబడిన భావజాలమును భాషారూపముగా మలచలేక/ఆనంద పారవశ్యముతో ఆదిదేవుని, వైభవమును, ఇరుశీరార్-ఇది యని నిర్వచింజాలమని, అనుభవించవలసినేదేకాని అనువదించలేమని, ఒరువన్-ఒక్కదే అనేకములుగా నామరూపములతో భాసించుచున్నాడని,భాషించుచున్నదని భావిస్తూ,భజిస్తూ ఉండేదానివి. అంతే కాదు పరమాత్మ అకాయో-సర్వ కాయశ్చను అమితానందముతో ఆరాధిస్తూ,ఒకపరి, ఎన్నాన-నా తండ్రి ఎన్న రయన్-నా రాజు/నా ప్రభువు అంటూ అంతటితో తృప్తిని చెందక ఎన్నముదన్- నా జీవన హేతువు,నా అమృతము అంటూ పలవరించేదానివికదా. అదికదా నీ సహజ స్వభావము.కాని ఈ రోజు దానికి విరుధ్ధముగా పేదయిర్-అజ్ఞానమనే చీకటితో నిండిన నిద్రను ఆశ్రయించినావేమిటి? వెంతనే మేల్కాంచవమ్మా అని అంటున్నారు. మరి కొందరి భక్తుల అన్వయము ప్రకారము, అన్నే-అమ్మా వన్నెంజల్-కొండలరాజ కూతురా అమ్మా-నీవు మా స్వామి మాపలిట తల్లితండ్ర్లు.జగద్రక్షకులు. మేము మీ పిల్లలము. లోక సహజముగా తల్లి పిల్లలను మేల్కొలిపి వారికి సక్రమమైన మార్గమును చూపును. కాని జగన్మాతా ! పిల్లలమైన మాకు నిన్ను మేల్కొలిపే భాగ్యమును ప్రసాదించుటకై నిదురించుచున్నావా తల్లి! మా ప్రార్థనలను విని మమ్ములను అనుగ్రహించుటకు అర్థనారీశ్వరమైన -ఒరువన్ మీరొక్కరే సమర్థులు. మాయమోహముచే కరుడుగట్టిన శిలలవంటి మా మనసులను మీ కరుణామృత దృక్కులతో కరిగించి/కరుణించి మమ్ములను అనుగ్రహించుటకు మేల్కొనవమ్మా. శొన్నంగళ్ వివ్వేరాయ్-వివిధనామ రూపములలో ఆశ్రిత రక్షణమును చేయుటకు తుయిలిడియో నిదురను వీడి, వాయ్ తిరప్పావ్-మాతో మాట్లాడవమ్మా,అంటూ ఆమెను తమతో కలుపుకొని,శివ నోమునకు మరొక చెలిని మేల్కొలిపి తీసుకొని వెళ్ళటకు కదులుచున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

Tuesday, December 21, 2021

PASURAMU-06

తిరుచిట్రంబలం-పాశురము-06 **************************** మానే నీ నెన్నలై నాళివన్ దుంగళై నాణే ఎళుప్పువన్ ఎన్రళుం నాణామే పోనది శై పగరార్ ఇన్నం పులర్దిండ్రో వాణే నిలానే పిరవే అరివరియాన్ దానే వందెమ్మై తలయెడిత్తాల్ కొండొరుళుం వాణ్వార్ కళల్ పాడి వందోర్కుం వాయ్ తిరవాయ్ ఊనే ఉరుగాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం ఏనోర్కుం తంగోనై పాడేలో రెంబావాయ్ నిజమేదో కల్లయేదో నీలకంఠుండెరుంగు ********************************** అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగక యున్న ఈశ్వరుడెరుగడా, అని వేమన నుడివి నట్లు ,తిరుమాణియవాచగరు మేల్కొలుపబడిన చెలుల వాక్చాతుర్యమును వివరిస్తూనే,ఒకామె తిత్తిక్క పేశువాయ్-వట్టి మాతలను మాత్రమే చెప్పినదని,మరొకామె పాలూర్ తేన్ పేశుం తేనెలో పాలలో నానిన పదార్థములు ఎంత మధురముగా ఉంటాయో వాటికంటె మధురమైన మాటలను మాత్రమే పలికినదని,ప్రస్తుత పాశురములోని చెలి,వీరిని మించిన వాక్చాతుర్యముతో తాను ముందటిరోజే వారి దగ్గరకు వెళ్ళి,తానే వారి నిదురను మేల్కొలుపుతానని చెప్పినది.కాని కార్యాచరణము జరుగలేదు. నీలవేణి మాటలు నీటిమూటలు-అన్నట్లుగా త్రికరణములలోని మనసు-వాక్కు-కర్మలలోని రెండును తటస్థముగా నుండి వాక్కును మాత్రమే అందించుచున్నది. కనక చెలులు ఆమెను, మానే నీ-లేడి వంటి చురుకుదనము కల సొగసరి, నీ-నీవు నెన్నెలె-నిన్ననే నాళై వందు-నాకు నేనుగా మీ దగ్గరకు వచ్చి ఉంగళై-మీ దగ్గరకు నాకు నేనుగా వచ్చి ఎళుప్పవన్-మిమ్ములను మేల్కొలుపుతాను అన్నావు. ఈ చెలి చురుకుదనముతో-వాక్చాతుర్యముతో కూడిన లావణ్యవతి. కాని ఆడితప్పరాదు అన్న సూక్తిని మరచి,ఆదమరచి హాయిగా నిదురించినది. చెలులు వచ్చి ఆమె పలుకులను గుర్తుచేసినప్పటికిని కొంచమైనను నొచ్చుకొనుట లేదు తన ప్రవర్తనకు. అదిగమనించిన చెలులు-ఎండ్రలుం నాణామే, కొంచమైనను సిగ్గుగా లేదా స్వచ్ఛందముగా చేస్తానన్న పనిని చేయలేనందులకు నాణామే-అవమానముగా అనిపించుటలేదా శివారాధనను మరచినందులకు అని నిందిస్తున్నారు. ఇక్కడ మనము ఒక విషయమును గమనిస్తే తిరుమాణియవాచగర్ ఆమెను మానే అని ఎందుకు సంబోధించారో అర్త్థమవుతుంది. మా కురు యవ్వన సంపద గర్వం---హరతి నిమేషా కాలాన్ సర్వం కనుక నీలోని శక్తిని నీలకంఠుని సేవకు వినియోగించుకో చెలి అని హెచ్చరిస్తున్నారు. నీ వాక్కులు వాగర్థములైన పార్వతీపరమేశులుగా ప్రస్తావింపబడి/ప్రశంసింపబడాలి కాని వ్యర్థము కాకూడదు. చెలి నిన్న నీవు మమ్ములను వచ్చి మేల్కొలుపుతానని మాటలు, పొనదిశై పగరార్-ఎటువైపు వెళ్ళినవో నీకే తెలియదుకదా. అనగా వ్యర్థములైనవి కదా , ఇలా కర్తవ్యమును మరచియుండుట, ఊనే ఉరుగాయ్-నీకు మాత్రమే చెల్లినది. కనుకనే, ఇన్నం పులందిండ్రో-ఇంతగా వెలురేఖలు వ్యాపించినప్పటికిని,నీవు కదిలి రాలేక యున్నావు. అదిగో బయటకు చూడు, ఎందరెందరో భక్తులు,స్వామి వాణ్వార్ కళల్-పవిత్ర పాదపద్మములను స్మరిస్తూూ,తరిస్తూ,దర్శిస్తూ, పాడి-సంకీర్తనమును చేస్తూ, వందోర్కుం-వస్తున్నారు. పరమేశుడు, ఉనక్కేం-నీకు మాత్రమే కాదు ఎమక్కోం-మనకు మాత్రమే కాదు అందరిని అనుగ్రహించుతకు, తలై ఎళిత్తు-మనలను ధర్మ మార్గమున నడిపించుటకు/ధర్మమూ పరిరక్షించుటకు, ఆట్కొండ అరుళంం-అరుళం ం-ఆశీర్వచనములను ఆట్కొండ-తనతో పాటుగా తీసుకుని, తానే వందు-తనకు తానుగా తరలి మన దగ్గరకు వచ్చాడు తం మనలనందరికి కోనై-సంరక్షకుడు/ప్రభువు ఆ స్వామి ఉనికిని కనుగొనుటకు ముందు ఎందరో అహముతో, వానే-ఆకాశ మార్గమతా, నిలవే-భూలోక మార్గమంతా పిరవే-మిగిలిన మార్గములనీ తేడి తేడి-వెతికి వెతికి కనుగొనలేకపోయిరి అన్న విషయము నీకు తెలుసుకదా. స్వామి కేవలము మనమీది అవ్యాజ అనుగ్రహముతో ఆశీర్వచనముగా /మనలను ఆశీర్వదించుటకు /అనుగ్రహించుటకు . తనకు తానే తరలివచ్చినాడు. వాయ్ తిరవాయ్- గాత్రమును సవరించుకొని కీర్తించు. మనమందరము త్రికరణములను శుధ్ధము చేసుకొని స్వామి పాదములను అర్చించి అనుగ్రహపాత్రులమగుదాము అంటూ ఆ చెలిని తమతో కలుపుకొని మరొక చెలిని మేల్కొలుటకు అడుగులను కదుపుచున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

Monday, December 20, 2021

PASURAMU-05

తిరుచిట్రంబలం-పాశురము-05 **************************** మాలరియ నాం ముగనుం కాణా మాలై ఇనైనాం పోలరివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్ న్యాలామే విణ్ణె పిరవే అరివరియాన్ కోలముం నమ్మై యాట్ కొండరుళి కోడాట్టు శీలముం పాడి శివనే శివనే ఎన్రు ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్ ఏలా కుళలి పరిశేలో రెంబావాయ్. తమస్వజ్ఞానజం విధ్ధి మోహనం సర్వదేహినాం ********************************** ప్రస్తుత పాశురములో మేల్కొలుపబడుతున్న చెలిని తమోగుణముతో నిడి,మాయచే కప్పబడిన దానిగా , ఏలా కుళలి అని సంబోధిస్తున్నారు. ఆమె, ఏళా-నల్లని తుమ్మెదరెక్కల వంటి,వత్తైన-పుడుగైన, కుళలి-కేశ సంపద కలిగినది. అంటే తమోగుణముచే కప్పివేయబడి,మాయ యను మోహమను సుగంధమనుకుని ఆఘ్రాణించుచున్నది. ఆత్మ స్వరూపమును అర్థముచేసుకొనలేక పోయినని పరమాత్మను దర్శించితి అనుచు ప్రగల్భములు పలుకు అమాయకత్వము కలది. కనుక ఆమె చెలులు ఆమెను , కడై తిరవాయ్ అని చెబుతున్నారు. చెలి ముందు నీవు నీవు నిదురించుచున్న తలుపు గడియను , తిరవాయ్-తెరువ వమ్మా.ఎందుకంతే బంధింపబడియున్న ఆ తలుపు గడియ నిన్ను తమో నిద్రలో బంధించుచున్నది. అదీ పడరీ కడై-, పదరీ-మోసపూరితమైన, కదై-గడియ కనుకనే అది నీచే, అబధ్ధములను చెప్పించుచున్నది.నీచే ఆత్మ వంచనను చేయిస్తున్నది అని అంటున్నారు. ప్రస్తుత పాశురములో నిదురిస్తున్న చెలి వారితో ఇంతకు ముందు (పాలతో తేనెలో ముంచీ) తేనెలొలుక వినిన వెంటనే నిజమని నమ్ము (నిజము కానప్పటికిని) పలుకులను పలికినది. పొక్కంగళే పేశుం-అబధ్ధములను చెప్పినది. అబధ్ధములు ఒకటి కాదు/రెండుకాదు గళ్-ఎన్నో/ఎన్నెన్నో చెప్పినది. అవి ఏమిటంటే, మాలరియా-విష్ణువు, నాన్ ముగన్-చతుర్ముఖుడైన బ్రహ్మ ప్రయత్నించి, ఆది అంతము కనుగొనలేక పోయిన అరుణాచలేశుని,జ్యోతి స్వరూపుని తాను తెలుసుకొనినానని సర్వసాధారణ విషయముగా చెప్పినది. న్యాలమే-భువన భాందములు, విణ్ణే-గగన భాగములన్నియును, పిరవే-మిగిలిన భాగములన్నియును వెతికినను కాణా -కనుగొనలేక పోయినారు ఎవరిని-పరమాత్మను ఎందుకంటే, స్వామి కోలం నమ్మై యాట్- కోలం-స్వరూపము దివ్య సందర్శనమును, ఎవరు ఏ విధముగా భావిస్తారో,ధ్యానిస్తారో వారికి ఆ దివ్యమంగళ సందర్శనమును అనుగ్రహించు ఆదిదేవుని, నీ తమోగుణము చూశానని మాతో చెప్పించుచున్నది.నీ కన్నులే కాదు నీ చెవులు సైతము నీకు సహకరించకున్నవి. కనుకనే దర్శిస్తూ-తన్మయత్వముతో , ఓ శివా,ఓ శివా అని భక్తులు చేస్తున్న సంకీర్తనము పలుదిక్కుల ప్రతిధ్వనిస్తున్నప్పటికిని,మమ్ముల మిగుల పరవశింప చేస్తున్నప్పటికిని, ఓలం ఇడినం-అద్భుత ఘోషణము స్వామిని సేవిస్తున్నప్పటికిని, నీవు, ఉడరాయ్-ఉడరాయ్-కదలవు-మెదలవు కనులు తెరవవు ఓ చెలి ఇప్పుడైనను లేచి, పడరీ కడై తిరవాయ్-నిన్ను ఆవరించియున్న చీకట్లను తరిమివేసి,నిన్ను అజ్ఞానముతో బంధించుచున్న గడియను తీసి,ఆ చీకటి గది నుండి బయటకు వచ్చి,మాతో పాటుగా శివనోమును చేయుటకు కదలవమ్మా,అని ఆమెను తమతో కలుపుకొని,వేరొక చెలిని మేల్కొలుపుటకు అడుగులను కదుపుచున్నారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి-పరబ్రహ్మమును తెలుసుకొని,అనుభవించగలుటయే పరమార్థము. తిరుమాణిక్యవాచగరు ఈ పాశురములోని చెలి ద్వారా ఆత్మశుధ్ధిలోని ఆచారమదియేల,భాండ శుధ్ధిలేని పాకమేల అన్న వేమన సూక్తిని మరొక్కసారి గుర్తు చేస్తూ,పరమాత్మ చేయు పరమాద్భుతములు స్వానుభవములే కాని సంభాషనములు మాత్రము కాదు అని అనిర్వచనీయ అనుభూతి అందించే ఆదిదేవుని అనుగ్రహమును కీర్తిస్తున్నారు. అంబే శివే తిరువడిగలే పోట్రి.

Saturday, December 18, 2021

PASURAM-04 TIRUVEMBAVAY

పాశురం-04 ********** ఒణ్ణిత్తిల నగయా ఇన్నం పులందిండ్రో వణ్ణిన్ కిళిమొళియార్ ఎల్లారుం వందారో ఎన్నికొడు ఉళ్ళవా చుళ్ళుకో మప్పళవున్ కణ్ణి తుయిల్ అవమే కాలత్తై పోగాదే విణ్ణికొరు మరుందై వేదవిదు పొరుళై కణ్ణుక్కు ఇనియానై పాడి కసిం ఉళ్ళం ఉళ్నెక్క నిన్రురుగై యామాట్టో నీయే వందు ఎన్ని కురైయిల్ తుయిల్ యేలో రెంబావాయ్. మందస్మిత ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలా పోట్రి **************************************** మూదవ పాసురములోని చెలి యొక్క సత్వగుణశోభను ముత్యముల వంటి స్వచ్ఛమైన పలువరుసతో పోల్చారు మాణిక్యవాచగరు. నాలుగవ/ప్రస్తుత పాశురములో నిదురిస్తున్న చెలి అద్భుతతేజో విరాజితమైన నవ్వుకలది. ఆమెనుమేల్కొలుపుచున్న చెలికత్తెలు వణ్ణిన్ మొళియార్ కిళులు వణ్ణిన్-పంచవన్నెల మొళియార్ -చక్కగా మాట్లాదకలిగిన కిళులు-చిలుకులు. వారి మధ్యను జరుగుచున్న సంభాషనము పరమేశుని, వేదపొరుళ్ అని వేదస్వరూపమని, మరందై-భవరోగము తొలగించు ఔషధమునిచ్చు వైద్యుడు అని సంకీర్తించుచున్నారు. బాహ్యములో పరిహాసమును,ఆంతర్యములో పరమార్థమును మనకు అందించుచున్నారనుట నిస్సందేహము. కాలత్తై పోగాదే అంటూ కాలము మన ఎవరికోసము ఆగదు కనుక మనము కాలమును సద్వినియోగ పరచుకోవాలనే విషయమును, చెలి నీవు ఇంకా నిదురించుచున్నావు, ఇన్నం పులందిండ్రో-ఇంకా తెల్లవారలేదా అని మేల్కొలుపుతూ, కాలత్తై పోగాదే-క్షణక్షణము జారిపోతున్నది కాలము.అది గమనించక నీవు కణ్ణె తుయిర్ అవమే-కన్నులు మూసుకొని నిద్రించుచు, అవమే-వ్యర్థము చేయుచున్నావు అని నిందిస్తున్నారు. దానికి సమాధానముగా ఆమె కన్నులు మూసుకొని, ఎల్లోరం వందారో-అందరు వచ్చేశారా? వస్తే కనుక మిమ్మల్ని మీరు పరిచయము చేసుకుంటే ఎన్నిక్కొడు ఉళ్ళవా-మనసులో లెక్కించుకుంటాను, అనగానే భక్తి పరాకాష్ఠకు చేరని ఒక చెలి ముందుకు వచ్చి, అప్పళం-అందరిని లెక్కించి,నీకు చుళ్ళుకో-నేను చెప్పనా అంటూ ముందుకు వచ్చింది. అది గమనించిన మిగిలిన చెలులు ఆమెను ఆపి, యామాట్టో నీయే వందు-నీవే లేచి వచ్చి మమ్ములను లెక్కించు అని అంటు ఒక విన్నపమును కూడ చేసారు. అది ఏమిటంటే లెక్క కనుక సరిపోతే అందరము కలిసి ఆర్ద్రత నిండిన అంతరంగముతో ఆదిదేవుని సంకీర్తించుదాము. ఒకవేళ లెక్కలో ఒక్కటైనను తగ్గినచో నీవు నీ నిదురను కొనసాగించవచ్చును.మేము తిరిగి వెళ్ళిపోతాము. అని అన్నారు. నిదురించుచున్న చెలి మేల్కాంచి వచ్చి లెక్కించవలసినది ఏమిటి? పంచవన్నెల-పంచదార పలుకుల చిలుకలు వారు అని మనము ముందర అనుకున్నాము.అంటే పంచేంద్రియ జ్ఞానము కలవారు.పంచభూతుని సంకీర్తించువారు.పరమ పవిత్రులు. వారు సాక్షాత్తు పరమేశ్వరియైన చెలి వీక్షణ-సంభాషణ-స్పర్శతో తమను తాము పుఈతము చేసుకోవాలనుకుంటున్నారు. చెలి నీవు లేచి వచ్చి నీ వీక్షణ సౌభాగ్యమును ప్రసరించు.నీ సంభాషణ సౌభాగ్యమును అనుగ్రహించు.నీ పవిత్ర స్పర్శ సౌభాగ్యమును ప్రసాదించు. తదనంతరము మా కురైయిల్/దోషములు ఒకవేళ మిగిలి యున్నప్పటికిని సమసిపోతాయి. అందరము కలిసి శివనోమును సంతోషముగా జరుపుకుందాము అని ఆమెను తమతో కలుపుకొని మరొక చెలిని మేల్కొలుపుటకు అడుగులను కదుపుచున్నారు. అంబే శివే తిరువడిగళే పోట్రి.

Friday, December 17, 2021

VEMBAVAY-03

పాశురం-03 *********** ముత్తన్న వెణ్ నకయ మున్ వము ఎదురెళుందన్ అత్తన్ ఆనందన్ అముదన్ ఎన్ని ఎళ్ళోరి తిత్తిక్కు పేశువాయ్ వందున్ కడై తిరవాయ్ పత్తుడయీర్ ఈశన్ పళ అడియార్ పాంగుడఈర్ పుత్తడియో పున్మై తీర్థాదు ఆట్కొండార్ పొల్లాదో ఎత్తోనిన్ అంబుడమై ఎల్లోం అరియోమో సిత్తం అళగియార్ పాడారో నం శివనే ఇత్తనియుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్. పత్తుడయీర్ ఈశన్ పోట్రి. ********************** రెండవ పాశురము మనోవృత్తులను వివరిస్తే ప్రస్తుత పాశురము సత్వగుణ సంశోభితమై , సత్వాన్ సంజాయతే జ్ఞానం అన్న భగవద్గీతా వాక్యమునకు ఉదాహరముగా మేల్కొలుపబడు చెలిగా ప్రకాశించుచున్నది. ఆమె సత్వగుణశోభిత.రజో-తమోగుణములను జయించినది.ఆ విషయమును తిరు మాణిక్యవాచగరు, ముత్తన్న వెణ్ నకయ అని ఆమెను సంబోధిస్తూ మనకు తెలియచేసారు. చెలులు వచ్చి ఆమెను, ముత్తన్న-మంచి ముత్యముల వంటి, వెణ్-తెల్లనైన,స్వచ్ఛమైన నకయ-పలువరుస కలదానా నీవు నిన్న మాతో స్వామియే మన, అత్తన్-తండ్రి -జగతః పితరో వందేం మన రక్షకుడు అని,అంతే కాదు, ఆనందన్-తలపే ఆనందాయకమని, అంతటితో ఆగక, అముదన్-అమృతస్వరూపుడు,మనకు జీవనాధారము అంటూ ఎన్నో మాటలు చెప్పావు. మేము నీ దగ్గరకు రాకముందే నీవే, మున్ చందు-మేకాంచి, ఎదిరెళుందు -జాగరూకతతో,ఎటువంటి అజ్ఞానములేక, మాకు ఎదురుగా వస్తానని చెప్పావు.కాని అవన్నీ మరచిపోయి ఇంకా నిదురించుచున్నావు. కాని మాకు ఇప్పుడే తెలిసినది నీవన్ని, అళ్ళూరి-కోతలే యని వాటిలో నిజములేదని అని నిందించారు.అయినా వారి అసహనము ఆగలేదు. వారు సంభాషణమును కొనసాగిస్తూ, తిత్తిక్క పేశువాయ్-అన్నీ గొప్పలు చెబుతావు. నీవి కేవలము మాటలే కాని చేతలలో కానరాదు అని ఆమెను నిందిస్తున్నారు. సరే ఇప్పుడైన వచ్చి తలుపు గడియ తెరువు అని అడుగుతున్నారు. ఇక్కద తలుపు/తలుపు గడియ బాహ్యమునకు/ఆంతర్యమునకు మధ్య గడియను బిగిచి ఆమెను/మనలను బయటకు రానీయకుండా ఉన్నది. మనము ముందు అంతర్ముఖము కావాలంటే బహిర్ముఖమును దాటి రాగలగాలి.అడ్దంకులను తొలగించుకొనగలగాలి.ఆ అడ్డంకులే గడియ.ఆ బహిర్ముఖమే లోపలిగది. రెండవ పాశురములోని చెలియ మాటకు మాట చెప్పినది. ప్రస్తుత పాశురములోని చెలి సవినశీలి.కనుక శాంతముగా వారికి తనకు శివభక్తిలో గల వ్యత్యాసమును విన్నవించుకొనినది. చెలులారా మీరు , పాంగు-అడయారు-స్వామి పాదపద్మములను పొందిన పరమ భక్తులు. పది సోపానములను ఎక్కి పరమేశుని అనుగ్రహమును పొందుచున్నవారు. కాని నేను, పుత్తు అడియో-కొత్తగా భక్తిని అలవరచుకొనుచున్నదానను. తాము ఉధ్ధరింపబడుటయే కాక తోటి వారికి కూడా పరమశ్వరానుగ్రహమును అందించుటకు చేయూత నందించునది కదా. మీ సాహచర్యముతో నా, పున్మై-దోషములు తెర్థాదు-నశించును కదా. నన్ను మీతో నోమునకు తీసుకువెళ్లమని ప్రార్థిస్తున్నాను. అట్కొండార్ పొల్లాదో-మీతో పాటుగా నన్ను తీసుకుని వెళ్లండి. నీవు మాతో వచ్చి ఏమిచేస్తావని అడుగుతారేమో, ఎల్లోం అరియోమో అందరము కలిసి, సిత్తం అళగియార్-మనస్పూర్తిగా ,మైమరచి తన్మయత్వముతో, నం-మనయొక్క శివనే-పరమేశుని,శుభకరుని పాడారో-కీర్తిద్దాము. ఇత్తనియుం-ఇంక ఆలస్యము వేండుం-వద్దు, ఇంక జాగుచేయక ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ వారితో నొముచేయుటకు ఇంకొక చెలిని మేల్కొలుపుటకు బయలుదేరినది. ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగర్ పత్తుడయీర్ అని పది శబ్దమును ప్రస్తావించారు. పడి శబ్దమును పరమాత్మకు అన్వయించుకుంటే , మనలో దాగి దశ-ఇంద్రియములను నడిపించుచున్న పరమాత్మ. భక్తుల పరముగా అన్వయించుకుంటే పది ఇంద్రియముల పరమార్థమును తెలుసుకుని వాటి ద్వారా పరమపదమును పొందువారు. పరమేశుడు మనకు దశేంద్రియ సంస్కారమును అనుగ్రహించును గాక. అంబే శివే తిరువడిగళే శరణం.

Thursday, December 16, 2021

PASURAM-02

పాశురము-02 ************** తిరువెంబావాయ్-02 ************ పాశం పరంజోది ఎంబాయ్ ఇరా వకల్నాం పేశుం పోదే ఎప్పోదం పోదారమళిక్కే నేశముం వైత్తనయో నేరిళై యార్ నేరిళై ఈర్ చీ చీ ఇవైయూం శిలవో విళైయాడి ఏశుం ఇడమిదో విణ్ణోర్కళ్ ఏత్తుతర్కు కూశుం మలర్పాదం తందరుళ వందరుళం దేశన్ శివలోకన్ థిల్లై చిట్రంబలకుళ్ ఈశనార్కు అంబార్ యాం ఆడేలో రెంబావాయ్. తందరుళ వందరుళం పోట్రి *************************** మనపై అవ్యాజకరుణతో తనకు తానే తరలివచ్చిన పరమాత్మ మనలకు మంగళమొనరించును గాక. మొదటి పాశురములోని చెలి అంతర్ముఖమును వీడలేదు.తనను మేల్కొలుపుటకు వచ్చిన చెలులతో సంభాషించనులేదు. కాని ప్రస్తుతము చెలులు మేల్కొలుపుచున్న చెలి వాగ్భూషNaమును భూషణముగా అలంకరించుకొనిన భాగ్యశాలిని.kanukanae naeriDayaar ani Amenu saMboedhimchaaru. ఆమె చెలులును పరమహంసలే.మహాజ్ఞానులే. మనలను ఉధ్ధరించుటకై అద్భుత సంభాషణలతో సమయస్పూర్తితో కూడిన నటరాజ కీర్తనముతో మనలను పరవశింపchaeస్తున్నది పాశురము. ఈ పాశురములోని పడుచు , ఎప్పోదు-ఎల్లప్పుడు తన చెలులతో సంభాషించునపుడు, తాను భవబంధములను అధిగమించితినని,తనకు ఉన్న ఒకేఒక్క పాశము/బంధము పరంజోతి పాదములవద్ద ఉంచు భక్తి యొక్కటే అని,దానిని ఇరాన్/వకల్ అహర్నిశలు విడిచి ఉండలేననిచెబుతుండేది. కాని ఇప్పుడు తన దృష్టిని పరంజోతి నుండి పువ్వులు పరచిన తల్పమువైపునకు మరల్చినది అని చెలులు మేలమాలుడుతున్నారు. పాశం పరంజోది అన్న నీవు పోదార్ అమలిక్కేani poolaparimaLamulanu aihikamulanu aghraaNistoo Adamarachi nidurapoetunnaavu. అనగానే చెలులారా! నేను మాత్రమే కాదు భాగ్యశాలిని,మీరును శివానుగ్రహమును పొందిన భాగ్యశాలురే,నేరుడ ఈఇర్, శిలవో విళయాడి, పరిహాసములా నాతో,చెలులారా అని కొంచము నొచ్చుకున్నట్లుగా కనిపించగానే, అయ్యో చెలి, ఇది పరిహాస సమయముకాదు/ప్రదేశమును కాదు ఎందుకంటే మనము ఇప్పుడు ఇక్కడ , మలర్పాదం ని ప్రస్తుతించటానికి సన్నధ్ధులమగుచున్నాము. malapaadam -పరమేశుని పాదపద్మములు విణ్ణోర్కల్-దేవతా సమూహములను కూసుం-పశ్చాత్తాపపడునట్లు చేయుచున్నవి. విణ్ణోర్గళ్ దేవతా సమూహములు (అహంకారముతో) తమకుతామే స్వామి పాదపద్మములను పట్టుకుని సేవించుదామని ప్రయత్నించి విఫలులైనారు.ఎవరికిని సులభముగా దొరకని స్వామి పాదములు,అత్యంత తేజోవంతములు-దయా సముద్రములు మన మీది అనురాగముతో, తందరుళ వందరుళం-తమకు తామె తరలివచ్చినవి. ఎక్కడికో తెలుసా? తిల్లై చిట్రంబలం-చిదంబరములోని తిల్లై వనములో స్వామి కొలువుతీరి యున్నాడు. చెలి నటరాజసేవలో తరించబోతున్న ఈ సమయమున మేము నీతో, ఏసం-పరిహాసములు పలుకుతామా, మనమM దరము త్రికరణశుధ్ధులై జ్యోతిస్వరూపముగా ,mana cheekaTlanu పారద్రోలుటకు దయతో విచ్చేసిన నటరాజస్వామిని అర్చిచుటకు బయలుదేరుదాము అని మూడవ చెలిని తమతో పాటుగా తీసుకుని వెళ్లుటకు కదులుchunnaaru.. తిరుమాణిక్యవాచగరు ఈ పాశురములో పరస్పర పరిహాస సంభాషణములను జరుపుకొనిన,ఒకరి ఆలోచనను ఇంకొకరు సవరించినట్లుగా ,అటు-ఇటు జరుగుచున్న వారి మనో భవనములను-భాషNaములను సరిచేసుకొని,స్వామి అర్చనమునకు బయలుదేరినట్లు వాచ్యార్థముగా సూచించారు. కాని వారు చెలులు కారు.మానవ చిత్తవృత్తులు.అవి నిరంతరము నిలకడ లేక అటు-ఇటు జారిపోతుంటాయి.వాటిని అనుక్షణము యుక్తాయుక్త విచక్షణమనే సాధనముతో సవరిస్తూ సక్రమమైన మార్గములో పయనించుటయే నిజమైన సాధన అను విషయమును విశదపరుస్తున్నారు. అంబే శివే తిరువడిగళే పోట్రి. , ,

Wednesday, December 15, 2021

PASURAM-01

పాశురం-01 ********** ఆదియుం అందముం ఇల్లారుం పెరుం శోదియై యాం పాడ కేట్టేయుం వాల్కడంగళ్ మాదే వళరుదియో వన్సెవియో నిన్సెవిదాన్ మదేవన్ వార్కళంగళ్ వాళ్తియ వాళ్తోళిపోయ్ వీధివాయ్ కేట్టిలియో విమ్మి విమ్మి మెయ్ మరందు పోదార్ అమలి ఇమ్మేల్ పురండిగన్ ఏదేను మాగాళ్ ఎడుందాన్ ఎన్నే ఎన్నే ఈదే ఎంతోళి పరిసేలో రెంబావాయ్. పరంజ్యోతియే పోట్రి. *************** తిరు మాణిక్యవాచగరు మొదటి పాశురములో సంకీర్తనా భక్తిని సన్నుతిస్తూ,వ్రతమునకు సిధ్ధమవుతున్న కన్నెలు తమ చెలిని నిద్దురలేపుటకు వచ్చినారు. వారికి మరికొందరు స్వామియొక్క స్వరూప-స్వభావ సంకీర్తనము వీనుల విందుగా వినిపిస్తున్నది. ఆ సంకీర్తనము ఎంతటి సౌశీల్యమును కలిగినదంటే అది , వాల్ ఒళిపో-ప్రతిధ్వనించుచున్నది. వీధివాయ్-వీధి అంతా తన నోరు తెరుచుకుని కీర్తిస్తున్నదా అన్నట్లుగా శివనామము, స్వామి స్వరూపమును , అరుం-అద్భుతమైన, పెరుం-బహు పెద్దదైన,విస్తీర్ణమును కొలుచుటకు సాధ్యము కాని , స్వభావమందువా ఆదియుం-అంతముయుం, మొదలు చివర కనలేని/కనరాని అనగా, ఆద్యంతరహితుని,దివ్య చరణారవిందములను, వార్కళల్-పాదపద్మములను ప్రస్తుతిస్తున్నది. మాదే! వాళ్ తడంగల్ మాదే! చురకత్తుల వంటి కన్నులు కలిగిన ఓ చెలి! నీవు ఇంకా, వళదెరియో? నిదురిస్తున్నావా? ఇంకా మేల్కొనలేదా? వాళ్దియ -స్వామి సంకీర్తనము నీ చెవికి సోకడము లేదా? లేక నీవు విన్సెవియా-చెవిటిదానివా? లేక, మన్సెవియా? నీ చెవి సంకీర్తనమును అందించుచున్నప్పటికిని,దానిని లెక్క చేయుటలేదా/పెడచెవిని పెడుతున్నావా? అనవరతము శివనామధ్యానములో ఉండే నీవు ఇప్పుడు,ఈ పోదార్ అమలి ఎమ్మేల్-పూలసుగంధముతో గుబాళించుచున్న ఈ తల్పము వైపునకు నీ దృష్టిని మరల్చి,ఆదమరచి నిదురించుచున్నావా? పురండిగన్-ఇంద్రియములకు వశమై,నిన్ను నీవు మరచినావా ఎన్ తోళి-నా సఖియ ఈదేన్-ఇదేమి నీ వింత వైఖరి ఎడుందాన్ ఈ తమో నిద్రను వీడి ఎంపావై-మనము చేయుటకు తలపెట్టిన వ్రతమునకు పరిసేలో -సిధ్ధముగా. ఎన్నే ఎన్నే-అన్ని విధములుగా బాహ్యాంతరములను స్ధ్ధము చేసుకుని మాతో బయలుదేరు చెలి అని నిదురిస్తున్న పడుచును మేల్కొలుపుతున్నారు. వారు స్వామి సంకీర్తనమును వినిన ఇంకొక చెలి ఏ విధముగా తాదాత్మ్యమును చెంది తన్మయత్వముతో ఎక్కి ఎక్కి, విమ్మి-విమ్మి -ఎక్కి ఎక్కి ఏడుస్తూ, మెయ్ మరందు-తనను తాను మరచి, నేలసోలినది. కడు విచిత్రము స్వామి ధ్యాసలో నున్న ఆమెకు కటికనేల సుగంధభరిత సుమ శయ్యగా మారినది. అంటూ మొదటి చెలిని తమతో కలుపుకుని,రెండవ చెలిని నిదురలేపుటకు బయలుదేరారు. మనము కొంచము లోతుగా ఈ పాశిరము మనకు చెప్పదలచుకున్న విషయమును గురించి కనుక ఆలోచిస్తే, ఇక్కడ మనకు ఇద్దరు చెలుల ప్రస్తావన వచ్చినది. పూల పానుపు ప్రస్తావన వచ్చినది. ప్రారంభములో నున్న పూలపానుపు,పూల పరిమలములు ఐహికములకు సంకేతములు.ఆమెను ,ఆమె ఇంద్రియములను వశపరచుకొని,తమోగుణ ప్రభావితురాలను చేసినవి.అందుకే ఆమెకు చురకత్తుల వంటి కన్నులను కలిగియున్నప్పటికిని,వాటిని మూసుకుని,సాధనకు ఉపయోగించలేకున్నది. మనము సైతము మనకు స్వామి అనుగ్రహముచే ప్రాప్తించిన ఉపాధిని సద్వినియోగము చేసుకొనలేక పోతే అజ్ఞానమను నిద్దురను వీడలేము.బహిర్ముఖమును దాటలేము. రెండవ చెలి తన చెవులతో స్వామి సంకీర్తనమును వినగలిగినది.వినినదానిని తన కన్నులద్వారా చూడగలిగినది.వినినదానిని-చూసినదానిని తన మనసు ద్వారా అస్వాదించకలిగినది.అంతర్ముఖమైనది.బాహ్యమును అధిగమించినది. మహదేవుని అనుగ్రహమును ఆస్వాదించని అజ్ఞానమును వీడి మానవ ఉపాధిని మహేశుని పాదసేవకు ఉపయోగపడనీయమని తిరు మాణిక్యవాచగరు సులభోపాయమును అందిస్తున్నారు. అంబే శివే తిరువడిగళే పోట్రి.

TIRU VEMBAVAY INTRODUCTION

[08:24, 15/12/2021] Vimala: భగవత్ బంధువులారా! మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి. ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో . " అందరికి వందనములు." మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి, " నీ పాదము పట్టి నిల్చెదను పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అనిప్రార్థించగానే తానే పలికినది. తిరు ఎం పావై ***** తిరు-శ్రీకరము-శుభకరము-పవిత్రము-ప్రపన్న ప్రసన్నము-పరమార్థ ప్రదాయకము ఇలా ఎన్నెన్నో అర్థములను పెద్దలు సమన్వయపరిచినారు. పావై -పాహిమాం-వ్రతము-అనుసరణీయము-అవ్యాజ అనుగ్రహము-అసమాన అదృష్టము-పరమము-పరమార్థము ఇలా ఎన్నెన్నో విధములుగా పెద్దలు సమన్వయపరిచినారు. అయితే మనకు ఇక్కడ ఒక చిన్న సందేహము వస్తుంది.ఈ పావై/వ్రతములో ఆరాధ్యనీయమైనది ఏది? అది సాకారమా? నిరాకారమా? సగుణమా? నిర్గుణమా? నామ రూప సాధ్యమా? అసాధ్యమా? కాల పరిమితి కలదా?లేనిదా? ఆ చిత్-శక్తి స్తోత్రములు పరిమితములా? అపరిమితములా? అంటూ ఎన్నెన్నో సందేహములు మన మనసులో తారాడుతుంటాయి. తిరుమాణిక్య వాచగరు చే ఆలాపింపబడి-ఆదిదేవునిచే వ్రాయబడిన తమిళవేదమైన "తిరు వాచగము" తిరు శివ పావై అని గాని /తిరు శంకర పావై అని గాని/తిరు సాంబ పావై అని గాని పేరు పెట్టవచ్చును.కాని ఎం అని ప్రశంసించేటట్లు ఎం అను చిద్రూప సామీప్య-సాంగత్య-సారూప-సాయుజ్యమునందుటకు ఏక హృదయమైన అనేక నామరూపములు ఒక చోట చేరి,ఒక్కటే ఒక్కటైన బృహత్తును సంకీర్తనమార్గములో స్వానుభవముతో సాక్షాత్కరింపచేస్తున్నది. తిరు పావైలోని గోపికలను కాని,తిరు ఎంబావైలోని కన్యలని గాని మనము సామాన్యముగా భావించే స్త్రీమూర్తులుగా భావించి,ఈ వ్రతము ఏవలము స్త్రీలకు మాత్రమే సంబంధించినదనుకుంటే మనము పొరబడినట్లే. పరమాత్మ యొక్కడే పురుషుడు తక్కిన జీవులన్నియును పరమాత్మచే రక్షింపబడుచున్న స్త్రీమూర్తులే.ఇదే విషయమును మనకు మణిద్వీప ప్రవేశము చేసిన వెంటనే త్రిమూర్తులు స్త్రీమూర్తులుగా మార్పుచెందిన విషయము స్పష్టము చేస్తుంది. తిరు వ్రతములలో గల ఇంకొక ప్రత్యేకత సామూహిక సంకీర్తన తనతో పాటుగా తనచుట్టు ఉన్నవారిని కూడా తరింపచేస్తుంది. సామాన్యులకు అవగాహన కల్పించుటకై సంకేతములను సామాన్య స్త్రీరూపములుగా మలచి,వారి ప్రవర్తనము/సంభాషణములద్వారా ఒక్కొక్క స్థాయిని దాటి,మనము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చే సోపానములుగా మనకు అందిస్తున్నది. నిజమునకు ఈ వ్రతము ప్రాముఖ్యతను వారిద్వారా మనకు తెలియచేసే ఉద్దేశము మనలను భవసాగరము నుండి ఉధ్ధరించుటయే తక్క అన్యము కాదు..ఇందులో మనము ప్రేక్షకులము కాదు/శ్రోతలము అంతకన్నా కాదు.ఇందులోని ప్రతి సందేశము మనలను సంస్కరించుటకు,మలకు సాలోక్య-సాయుజ్యము ప్రసాదించుటకు సహాయకారులు. తమిళవేదమైన "తిరువాచగము"లోని ఏడవప్రకరణములోని 20 పాశురములు మరియును "తిరుపళ్ళి ఎళుచ్చి" లోని పది పరమాద్భుత స్తోత్రములు మహదేవుని అనుగ్రహప్రదమైన మార్గళి వ్రతమును సుసంపన్నము చేయుచున్నవి.మునుపు ఎందరో ఆచరించినారు.ప్రస్తుతము ఆచరిస్తున్నారు.భవిష్యత్తులో కూడ ఆచరిస్తారు. దీనిలో వ్రతముచేయుచున్నవారును పరమహంసలే.మన కొరకు తాము పరస్పర సంభాషణములను చేస్తు-పరమాత్మ పరమదయతో ప్రకటితమైన పలురూపములను ప్రస్తుతిస్తు-ఒక ప్రదేశములో మెట్ల స్వరూపముగావేరొక చోట లింగ స్వరూపముగా-మరొక చోట ఆకాశ/నాట్య స్వరూపముగా ,నామ రూపములు మాత్రమే కాదు/నానా రూపములు వేద స్వరూపము జ్యోతి స్వరూపము లింగ స్వరూపము శూలి స్వరూపము కొలను స్వరూపము కమల స్వరూపము కలువ స్వరూపము భ్రమర స్వరూపము ఇలా తెలియచేస్తు, అంతర్ముఖులై కొందరు,ఆరాధనములతో కొందరు,సంకీర్తనముతో మరికొందరు,సాహచర్యములో ఇంకొందరు, ఒకరినొకరు మేలుకొలుకుంటూ,తమతో కలుపుకుని,వ్రతమునకు ఉద్య్క్య్తులగుట బాహ్యము. కాని కొంచము నిశితముగా ఆలోచిస్తే మనలో నున్న అజ్ఞానము కూడా బహుముఖములుగా బట్తబయలవుతుంటుంది. అది భావన కావచ్చును,భాష కావచ్చును,హావభావములు కావచ్చును ఇలా ఎన్నెన్నో విధములుగా కమ్ముకునియున్న తమో నిద్రను తరిమివేసే తరుణోపాయము, తిరుమాణిక్యవాచగరు అందించిన తిరువెంబావాయ్ అను నావలో కూర్చుని,స్వామి అనుగ్రహమనే కొలనులో పుక్కి/మునకలు వేస్తూ,అందరము తరించుదాము.తరలి రండి.. . సభక్తిపూర్వక వణక్కంగళ్/నమస్కారములతో. తిరు చిట్రంబలం పోట్రి మిత్రులారా! ు,స్వామి అనుగ్రహముగా అల్లబడుచున్న ఈ పాశురముల మాలలో నా అహంకారము ఎన్నో ముళ్ళను చేర్చుటకు ప్రయత్నిస్తూనే ఉంటుంది.దానికి తోడు తమిళము నా తాయ్ మొళి/మాతృభాష కాకపోవుటచే నా అజ్ఞానము కూడా అహంకారమునకు తనవంతు సహాయము చేస్తూనే ఉంటుంది.కనుక పెద్ద మనసుతో నా ఈ దుస్సాహసమును మన్నించి,మాలను సవరించి,నన్ను ఆశీర్వదించగలరు. సవినయ నమస్కారములు. 🙇‍♀️

Saturday, December 11, 2021

PERU MIlALAI KURUMBAR NAAYANAAR

KARI NAYANAR

GANANATHA NAYANAR

SIRAPPULI NAYANAR

సిరప్పులి నాయనారు ******************** సంతోషముగా శివభక్తులను సేవించుచు,శివార్చనము చేయు నాయనారు అసలుపేరు మరుగునపడి సిరప్పునాయనారుగా ప్రసిధ్ధిచెనది.నాయనారు బ్రాహ్మణవంశమునందు తిరు ఆకూఎఉలో జన్మించెను. నిరంతరము, బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటు పంచేంద్రియములను పంచాక్షరి జపమునకు సమన్వయించుకొనుచు,పరమశివభక్తుల పాద సేవనమె పరమార్థముగా భావించెడివాడు . ప్రతిదినము వెయ్యికి మించి శివభక్తులకు అన్ననైవేద్య నియమమును నిండిన భక్తితో కొనసాగించుచు,నిశ్చల మనముతో నిటలాక్ష సేవనమును చేసెడివాడు.

Tuesday, December 7, 2021

KALIYA NAYANARU

కలియ నాయనారు. ***************** ఆడిన మాటను నిలబెట్టుకొనుటకై ఆలిని అమ్మకమునకు పెట్టి,అమ్మివేసిన ఘనత హరిశ్చంద్రునిదైతే, ఆదిదేవునికి దీప ప్రజ్జ్వలములచే సేవించుటకై తన ఆలిని అమ్మకమునకు పెట్టిన ఘనత కలియనాయనారుది. అన్నింటికన్న అర్చనయే అతిముఖ్యమన్న సిధ్ధాంతముతో నున్న కలియ నాయనారు తిరవట్రూరు లో వైశ్య కుటుంబమునందు జన్మించెను.నూనె వ్యాపారము వృత్తి. దీపప్రజ్వలనముతో శివారాధనము చేయుట ప్రవృత్తి. " సాజ్యంచ వర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్యం తిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నిరయాద్ ఘోరాత్ దీపంజ్యోతి నమోస్తుతే." ఓ త్రిలోక తిమిర సంహారకా! సత్వ-రజో-తమో గుణములనే త్రిగుణములను వత్తులుగా చేసి,భక్తి యనే చమురుతో,హృదయమనే ప్రమిదలో చైతన్యమనే అగ్నితో వెలిగించిన దీపము నీ ప్రతిబింబమై నా పాపములనే చీకట్లను పారద్రోలును గాక. తేజము కలియ చుట్తుప్రక్కల విస్తరించి సమస్త చీకట్లను తరిమివేయునుగాక అను సిధ్ధాంతమును నమ్మువాడు కనుక ,కలయ(చుట్ట్ ఉప్రక్కల) చీకట్లను తాను వెలిగించిన దీపములతో పారద్రోలువాడు కనుక కలియ నాయనారుగా పేరుగాంచినాడు.ఇది బాహ్యము/వాచ్యార్థము. " మాయామేయ జగంబు నిత్యమని భావించి మోహంబునన్ నా ఇల్లాలని, నా కుమారుడని,ప్రాణంబుండు నందాకనేనను" సంసార బంధములను చుట్టు కమ్ముకుని యున్న చీకట్లను పారద్రోలుటకు, సత్యహరిశ్చంద్రుని వలె తాళికట్టిన ఆలిని సైతము అమ్మకమునకు పెట్టి,లభించిన ధనముతో సత్వదీప ప్రజ్జ్వలనమునకు సిధ్ధపడిన సర్వజ్ఞుడు నాయనారు. ఇది ఆంతర్యము దాగిన ఆధ్యాత్మికము. దీపము తాను ప్రజ్వలించుచు తన చుటు కమ్ముకొనియున్న చీకట్లను తాను కరిగిపోతూ ఏ విధముగా కనుమరుగు చేయునో అదే విధముగా, కాలకంఠుని ఆనగా కలిమి తరలిపోయినను ,తన ధైర్యమును విడనాడక తనను తాను గానుగకు కట్టుకుని గిరగిర తిరుగుచు,నూనెను తీసి,స్వామికి దీపోత్సవమును జరిపించెడివాడు. పరమేశ్వరానుగ్రహ పరిశీలనా చాతుర్యమేమో ప్రజ్వరిల్లుతున్న దీపము తన ప్రాశస్త్యమును పరిపరివిధములుగా నాయనారుకు బోధిస్తూనే ఉండేది.తన చుట్టూ ఉన్న పసుపు వృత్తములు తనలోని చైతన్యమని,అరుణ గోళములు తేజో పుంజములని,వాని నుండి కిందకు రాలుచున్న అణువులు/పరమాణువులు శక్తిపాతములని ,తిమిర సంహారములని,జడరహితములని ఉపదేశిస్తూనే ఉండేది.నాయనారుని పరవశింపచేస్తుండేది. కాలము మాయాజాలమును ఎవ్వరును తప్పించుకోలేరన్నది కాదనలేని సత్యము. హరుని ఆనగా సంపదలు హరించిపోతున్నవి దారిద్రపు చీకట్లకు దారిచూపుతూ. దొరికిన కొన్నింగింజలను గానుగలో వేసి తాను గానుగ చుట్తు తిరుగుతూ లభించిన నూనెతో దీపములను పరమ సంతోషముతో వెలిగించెడివాడు. సంసారమనే గానుగలో తాను తిరుగుతున్నప్పటికిని భక్తి అనె గింజలను దానిలో వేసి భావమనే తాడుకు తన జీవుని కట్టి,నిరంతర స్మరణమనే వృత్తము చుట్టు పరైభ్రైస్తూ/ప్రదక్షిణమును చేస్తూ లభించిన పుణ్మనే చమురుతో మనసనే వత్తిని ముంచి నిష్ఠ అని అగ్నితో వెలిగించి పరమానందమును పొందుచుండెడి వాడు. కాని అది భగవంతునికి -భక్తునికి మధ్య జరుగున్న అలౌకికానంద సుందరబంధము.అమృతానంద మరందము.అత్యయంత అనుగ్రహ ఆనందసాగరము.అది అంతటితో ఆగితే సరిపోదు.జగద్విఖ్యాతము చేయాలని జంగమదేవర సంకల్పము. కనుక కాసిని గింజలు కూడా కరువైపోయినవి నాయనారుకు.దీపారాధనమునకు తైలమును సేకరించుతకు మనసు పరి పరి విధములుగా ఆలోచించుచున్నది. " నమో గృత్యేభ్యో గృస్తపతిభ్యశ్చవో నమః' ఆశపడు స్వభావమును కలిగించు బుధ్ధిమంతులకు ప్రభువగు సదాశివా నమస్కారములు. పరమ నీతిమంతుడైన నాయనారుకు నీ దీపార్చనకు కావలిసిన తైలము కొరకై,తన ధర్మపత్నిని అమ్ముటకు సిధ్ధపడునట్లు చేసినావు. చిదంబరములో ఆలిని అమ్మకమునకు నాయనారు పెట్టినప్పటికిని ఆమెను కొనుటకు ఎవ్వరును ముందుకు రాలేదు. నమో మంత్రినే వాణిజాయ కక్షానాం పతయే నమః వణిజులలో/వర్తకులలో ఏమి ఆలోచనలను అందించాడో తెలియదు కాని నాయనారు వర్తకము సఫలము కాలేదు. భార్యను అమ్ముడు పోనీయలేదు ఆలికి అర్థభాగమునిచ్చిన వాడు. దీప ప్రజ్జ్వలనుము మానివేయలేడు-కావలిసిన తైలమును సమకూర్చుకొనలేడు. విషమును కంఠములో దాచుకొనిన వాని విషమపరీక్షయా లేక విషయమును అవగతము చేసుకొనినవాని వ్రతదీక్షయా నెరవేరునది తనను తాను నిరూపించుకొని. ఇక్కడ వెలగవలసినవి దీపములు కావు స్వామి కృపా కటాక్షపు తేజోరూపములు. బేసికన్నులవాడు ముసిముసి నవ్వులతో నడిపిస్తున్నాడు ఒకవైపు పరీక్షను మరొక వైపు దాక్షిణ్యమును ఒకదాని తో మరొకదానిని ముడిపెడుతూ . ప్రదోష సమయము ప్ ఒంచి చూచుచున్నది మించిన ఉత్సాహముతో . నమో స్రోతస్యాయచ దేహమునందలి రక్తనాలములుగా కలవాడా నీకు నమస్కారములు. అంతే నాయనారు మనసులో ఆలోచన తలుక్కున మెరింది కాదు కాదు కలిగింపచేశాడు కపర్ది. వెంటనే కొడవలితో తన కుత్తుకను కత్తిరించుకుని,వచ్చిన నెత్తురుతో దీపములను వెలిగించాలనుకున్నాడు. అచంచలభక్తి అడుగు వెనుకకు వేయనీయలేదు. అనుకున్నదే తడవుగా , ఆదిదేవుడు అవ్యాజకరుణా మూర్తి ఆనందాంతరంగు డై అడ్డుపడ్డా డు నాయనారు భక్తిని ఆ చంద్ర తారార్కము విరాజిల్లచేయుటకై .అనుగ్రహించి ఆశ్రీవదించినాడు తన సాయుజ్యమునిచ్చి. కలియ నాయనారును కటాక్షించిన కపర్ది మనలనందరిని అనిశము సంరక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం. "

Monday, December 6, 2021

KANAPULLA NAAYANAARU

కణుంపుల్ల నాయనారు ********************** నమో శుష్కాయచ హరిత్యాయచ పచ్చి గడ్డి/పచ్చి కట్టెల రూపములో, ఎండుగడ్డి/ఎండు కట్టెల రూపములో నున్న శివునికి నమస్కారములు. గడ్డిని కోసి,మోపులు కట్టి అమ్మి వచ్చిన డబ్బులతో శివభక్తునిగా ఖ్యాతిని గాంచిన,పుల్లరెక్కు వల్లూరులో జన్మించిన కణంపుల్ల (గడ్డిమోపు) నాయనారునకు నమస్కారములు. నాయనారు పచ్చిగడ్దిని కోసి,మోపులులను తలపైకెత్తుకుని,అమ్మి,వచ్చిన పైకముతో జీవించెడివాడు. దర్భలను వత్తులుగా మలచుకొని అగ్నికార్యములను ఆచరించుచు,ఆనందముగా శివనామ సంకీర్తనమును చేయుచు నుండెడివాడు. నాయనారు వైదిక పూజావిధానమునకు ఆటంకమును కలిగించాలనుకున్నాడు వైదీశ్వరుడు. పరీక్షను నిర్వహించడానికి కరువుకు గడ్డి మిగలకుండా చేశేలా ఉత్తరువులను జారీచేసాడు. మారుమాటాడకుండా గడ్డి పరకలను మాయము చేసేసింది. గడ్డు సమస్యకు శ్రీకారమును చుట్టింది. నమో నమో ఉలప్యాయచ అనేకరకములైన గడ్డిజాతులలో నిండియున్న నిటలాక్ష నమస్కారములు. సమిధలకు,వత్తులకు అగ్నికార్యములకు అతిముఖ్యమైన గడ్డి,దుర్వారములు కనుచూపుమేరలో కానరాకుండా రాబోవు/కాబోవు స్వామి సేవగా, " వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే ప్రబోధ పూర్ణపాత్రే తు జ్ఞప్తి దీపం విలోక్యయేత్" పరమేశ్వరా నీ ఉనికిని-ఉత్కృష్టతను తెలుసుకోగల /దర్శించగల/భావించగల/భాషించగల/ జ్ఞానమును ద్వరా మోక్షమను నీ పాదసన్నిధిని చేరుటకై, బుధ్ధి అదియును ప్రకృష్టమైన బుధ్ధి యను పాత్రనందు,వైరాగ్యమను తైలమును/నూనెను పోసి,భక్తియనే వత్తిని దానిలో ముంచి,జ్ఞానమనే దీపజ్వలనమునకై ప్రయత్నించుచున్నాను. ఓ తిమిర సంహార నీ అనుగ్రహమనే ఆలంబనముతో దానిని అఖండముగా ప్రకాశించనీయి అంటూ తనదగ్గర నున్న సామాగ్రితో వెలిగించినాడు వెలుగు నీడలు రెండును తానైన శూలి ఆ దీపమును రెపరెపలాడించి కొండెక్కించేసినాడు. వెండికొండ దొర నిండైన కరుణను వెదజల్లుటకు కదలబోతున్నాడేమో. నాయనారు మనసు చాలా నొచ్చుకున్నది.ముచ్చటగా వెలగవలసిన దీపమునకు చిచ్చు సహకరించకున్నది.చిమ్మ చీకట్లను కమ్మేస్తున్నది.కిమ్మనకున్నాడు నమ్మినవాడు. నాయనారు నిరాశపడలేదు. 'హరికేశునికి" దీపారాధనమునకు తనకేశములను వట్తిగా మలిచాడు.వైరాగ్యతైలములో ముంచాడు. 'అగ్నా విష్ణూ సజోష " అంటూ చమకమును ప్రారంభించాడు. ఏ విధముగా అగ్ని-విష్ణువు ఇద్దరు కలిసి సమానమైన ప్రీతితో మేము అర్పించే హవిస్సును స్వీకరించి,మమ్ములను అనుగ్రహిస్తారో అదేవిధముగా, నేను చేయుచున్న దీపారాధన అను అగ్ని సేవనమునకు మీరిద్దరు సమానమైన ప్రీతితో వచ్చి నన్ను ఆశీర్వదించగలరు అంటూ తన్మయత్వముతోఎ ధ్యానములో మునిగిపోయాడు. బాహ్యము భయావహకముగా అగ్నిని ప్రజ్వరిల్లచేయుచున్నది.కేశములు అగ్నిస్పర్శచే సంసార పాశములను విడదీయుచున్నవి. ఆంతర్యము స్వామి చెంత అవధులులేని ఆనందాబ్ధిలో మునకలు వేయుచున్నది. కన్నుల ఎదుట నిలబడినాడు మూడుకన్నులవాడు . నాయనారుని తన కౌగిలి లోనికి తీసుకొని, కైవల్యమును ప్రసాదించాడు. నాయనారును అనుగ్రహించిన నందివాహనుడు మనలనందరిని అనిశము రక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం.

Sunday, December 5, 2021

SERUTANAAY NAAYANAARU

" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే" చిదానందరూపా-శేరుతనాయ్ నాయనారు. కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు కామేశుని ఆన కాన కాదనలేని విధంబున కదిలిరి రాజుయు-రాణియు కథ నడిపించు పథంబున లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ హేలగ చేతబూని వాసనచూసెను రాణి నాసిక అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను వాటిని జరిపించే పరమేశ్వర తత్త్వమును చాటిచెబుతాయి పుష్పములు.అంతే కాదు.శబ్ద-చెవి,స్పర్శ -చర్మము,గంధ-నాసిక,రూప-నయనము,రస-నాలుక(మకరందము) మకరందముతో తుమ్మెదలు ఝుంకార వినబడునట్లు చేయు పంచేంద్రియ ప్రతిరూపములైన పూలు, తాము పంచ భూతేశ్వరుని పాదపద్మలయందు నిలిచి పరవశించాలనుకొనుట సమంజసమేకదా. " ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఎంత తొందరలె హరు సేవకు పొద్దు పొడవకముదె పూలిమ్మని." అంటూ ఉదయముననే శేరు తునాయ్ నాయనారు పరమభక్తితో పూలమాలలల్లి పరమేశ్వరార్పితము చేసి పరవశించేవాడు. పొన్న-పొగడ-జిల్లేడు-తుమ్మి-ఉత్తరేణి-చెంగల్వ-మందార మొదలగు పుష్పములతో కాని,తత్ ఋతు పుష్పములతో గాని పరమేశుని అర్చిచిన సహస్ర గోదాన ఫలితము తథ్యమని నమ్మువాడు శేరుతనాయ్ నాయనారు,పార్వతీదేవియే చెప్పినదని పలు సుగంధపుష్పములను( అనాఘ్రత పుష్పములను) మాలలల్లి,మల్లేశుని అలంకరించి పులకరించేవాడు.తిలకిస్తున్న స్వామికి చిలిపి ఆలోచన వచ్చింది.రాణిని కథావస్తువు చేసి,కథను ముందుకు నడిపించాడు . రాణినాసిక తాను ఏమి ఆశించిందో ఏమో,పుష్ప సుగంధమును ఆస్వాదించకుండా ఉండలేకపోయింది.పరిసరములను గుర్తించలేని పరవశముతో పూసువాసనను పీలుస్తు,నాయనారు కంట బడింది.కాలరుద్రుడైనాడు నాయనారు,రాణి ముక్కును కోసివేసాడు.కేకలు వినిన రాజు,జరిగిన విషయము తెలిసికొని,ఆ పూవును నాసికకు అందించిన చేతిని నరికి,జరిగిన అపరాధమునకు మన్నించమని శివుని వేడుకున్నాడు. కరుణాంతరంగుడైన సాంబ శివుడు కటాక్షించి వారిని ధన్యులచేసెను.మరల మరల పుష్పించునట్లు చేయుట అనగా కరుణను మరల మరల వర్షింప చేయుటయే కదా.అట్టిపరమేశ్వరుడు మన హృదయములను అనాఘ్రాణిత సుమములను చేసి,ఆశీర్వదించును గాక. ( ఏక బిల్వం శివార్పణం.)

TIRU KORIPPU TONDA NAAYANAARU.

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్ మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో " చిదానందరూపా-తిరు తొండ నాయనారు. *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా తిరు కురిప్ప తొండ నాయనారు నియమము రజకవృత్తి యందే యతిరాజ భక్తి సంయమనము మాసిన బట్టల మసిపూతలరేడు ఆ చాకిరేవులో వ్రత భంగము చేసినాడు కురిపించిన జోరువానలో అపరాధము జరిగినదని ఆ బండరాయికే, తన తలను బాదుకొనుటయే సరియనినాడు వెంటనే తగదని-నిలుమని కనపడి, కపర్ది కరుణించగ తరియించగ నాయనారు తలబాదుకొనుటయే కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలుతీర్చుగాక. తిరుకొరిప్పు తొండనాయనారు. తిరు అరాధ్యుడు కొరిప్పు క్రమశిక్షణ ఏ సమయమునకు ఏ విధముగా శివునికి వేనితో అభిషేక-అర్చనాదులనులను జరుపుటలో క్రమమును పాటిచెడివాడు కనుక తిరు కొరిప్పు తొండ నాయనారుగా ప్రసిధ్ధిగాంచెను. కాంచీ పురమునందు వల్లారు కుటుంబములో జన్మించిన నాయనారు వృత్తిరీత్యా చాకలి.స్వధర్మో నిధనో శ్రేయ: అను సూక్తిననుసరించి శివ భక్తుల అవసరములను గుర్తించి,వారి మలిన కౌపీనములను శుభ్రపరచి తిరిగి వారికి పరమానందముతో ఇచ్చెడివాడు. స్వధర్మములోనే స్వామి సేవా ధర్మమును మిళితము చేసికొనిన తొండనాయనారు భక్తిని పరీక్షించి,లోకారాధ్యునిగా చేయాలనుకున్నాడు.ఒకపేదశివయోగి వలె మలినవస్త్రములతో తొండనాయనారును సమీపించాడు.శివసేవా భాగ్యము లభించిన సుదినమని నాయనారు యోగినిసమీపించి,మలిన కౌపీనమును శుభ్రపరచుటకు అనుమతినివేడుకొన్నాడూ.తనకొకటే కౌపీనము ఉన్నందున(ధరించినది కాక) సంధ్యాసమయమునకు తన కౌపీనమును శుభ్రపరచి అందచేసెదెననిన అంగీకరింతునన్నాడు ఆ యోగి.సూర్య ప్రభల్తో చుర్రుమంటున్న వాతావరణమును చూసి,షరతుకు అంగీకరించాడు శివుడు. " పవి పుష్పంబగు- అగ్ని మంచగు" అన్న ధూర్జటి మాట ప్రాపునకే కాదు పరీక్షకు కూడా నిజమే అవుతుంది. మన సక్కియనాయనారు రాళ్ళ పూజను పుష్పార్చనగా మార్చగలిగినది ఆ సదాశివుని కరుణయే కదా.ఉత్తర గర్భముననున్న పరీక్షిత్తుపై చేసిన దుష్ట ప్రయోగము మంటలు కక్కుతు అగ్ని వలె తాకబోవ పరమాత్మ తనలీలగా మంచుగా మార్చి శిశువునకు చల్లదనమును అందించెను కదా.విరోధాభాసమైన విశ్వేశ్వరుడు అదే విధముగా భానుని బాధ్యతను తొలగించి వరుణునికి వర్షించమన్నాడు.పరమేశ్వర లీలల పరమార్థమును తెలుసుకొనెననుట వెర్రిమాట.వజ్రము పువ్వుగా మారినట్లు శివుని లీలగా ఎండ వానయై కౌపీనమును తడిపేసినది.అన్నమాట నిలుపుకోలేదని తనతలను బండకు కొట్టుకున్న నాయనారును, అడ్డుకొని రక్షించిన అడ్డనామాలసామి మనందరిని రక్షించును గాక. ( ఏక బిల్వం శివార్పణం.)

KULACHCHIRAAYI NAAYANAARU

కులచ్చిరాయ్ నాయనారు ********************** పాండ్యరాజ్యములో రాజవంసమున మన్మేల్కుడి యందు జన్మించిన కులచ్చిరాయి నాయనారు జైనము రాజును-రాజ్యమును ప్రభావితముచేయుహున్న సమయమునందున్న గొప్ప శివభక్తుడు.ప్రధానమంత్రి.మహారాణి తిరుమంగై కరసి నాయనారు తక్క మిగిలిన వారందరు జైనమతమునకు దాసోహమయిన వారే.అప్పటి మత ఉద్రిక్తత మహారాణిని విభూతిధారనను చేయలేని ఆక్షలను విధించినది. మహారాణి-ప్రధానమంత్రి మతవిద్వేషములను అణచివేయుటకు ప్రయత్నించినప్పటికిని, ముదిరిని వ్యాధిని కుదిరించే మందును ఇచ్చేవారు కనరాక యున్న సమయమున , మహారాణి మనో వేదనకు ఉపసమనమా అన్నట్లుగా, వేదారణ్యేశ్వర స్వామి వారి ఆలయ త్ద్వారములు వేదనాభరితములై బిగిసిపోయినవా అన్నట్లు తెరుచుకొనుట మానివేసినవి. మానవనేత్రములకు మాములు మనుషులకు తెలియచేసేందుకేమో మహనీయుల రాకకై వేయికన్నులతో వేచి చూచుచున్నవి. వేకువ రేఖలుగా అప్పార్-జ్ఞాన సంబంధర్ తమ పాదమును మోపి ,తమ నామ సంకీర్తనముతో ,విషపూరిత విచక్షణారాహిత్యముపై తమ అమృతాభివర్షమును కురిపించి అజ్ఞానమును తొలగించివేశారు.మహాద్భుతము మూసిన తలుపులు.మూఢుల తలపులను తెరిపిస్తూ,తమంతట తామె తెరుచుకున్నవి. మహారాణి చెవికి సోకిన ఈ వార్త మహానందభరితను చేయుటయే కాక,మదిలో చిన్న అశాకిరణముగా ,ఊరక రారు మహాత్ములు అన్న సూక్తిని బలపరచినది. కాలముచేసే మాయాజాలమును తెలిసికొనుట ఎవరికిని సాధ్యము కాదు. మూఢత్వము-నిగూఢత్వమునకు వ్యత్యాసము తెలియాలంటే శివుని లీలా విన్యాసము జరగాలంతే. ఔషధము విలువ తెలియాలంటే వ్యాధి తీవ్రత ముదలాంతే. భిషక్-వైద్యుడు ఔసధీనాం పతి కరుణ కలిగితే కానిపని ఏముంటుంది కాపాడ్ అటము తప్ప. మహారాజుకు అస్వస్థత మొదలైనది.ఆపాదమస్తకము అతలాకుతలమవుతున్నది.అంతుచిక్కని అసహనము.కూర్చోలేడు.నించోలేడు.కదలికలను శరీరము కానిపని అంటున్నది.ఎందరో వైద్యులు-ఎన్నెన్నో మందులు.ఎమీ ప్రయోజనము లేకపోయినది. మంత్రము-తంత్రము మరొక్కసారి తాము సరిచేయాలని చూసింది కుహనా భక్తుల కుతంతరూపముగా వచ్చి. ఊహు.నిస్సహాయమై నేలచూపులు చూస్తున్న సమయమున , అది రోగ నివారనమో/సంస్కార సవరణమో ఆ సదాశివుని ప్రతిరూపములైన అప్పార్-జ్ఞానసంబంధర్ గా అదుగులను కదిలిస్తూ ముడులు విప్పటానికి పాండ్య రాజును చేరుకున్నది. అన్యథా శరనం నాస్తి-త్వమేవ పరమేశ్వరా అని రాజు అందించిన పషాత్తాప ప్రనతులను అందుకుంది. " ఓం అగ్నిరితి భస్మ వాయురిస్తి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ సర్వం ఇహవా ఇదం భస్మ మన ఏతాని చక్షుగిం షా భస్మాతి" అంటూ వారిచే పరమశివుని భస్మము రాజుగారి దేహమును ఆచ్చాదిస్తూ,ఆశీర్వదించసాగినది.నామము శబ్దభేరియై రుగ్మతలను పారద్రోలింది ఏలినవాని ఆనగా. మధురం శివ మంత్రం మదిలో మరువకే ఓ మనసా ఇహపర సాధనే తలచగ సురుచిర పావనమే నిన్రసెన్ నిడమార్-నిట్టనిలువుగా నిలుచున్నాడు మహారాజు. అపూర్వ అనుగ్రహపాత్రుడైనాడు.పరమభతితో పరమేశ్వరాధనములో తరించాడు నిన్రసేర నిడమాన్ నాయనారుగా చిరస్మరణీయుడైనాడు. నిన్రసేనను అనుగ్రహించిన నిటలాక్షుడు మనలనందరిని అనిశము సంరక్షించును గాక ఏక బిల్వం శివార్పణం..

Thursday, December 2, 2021

ILANGUdI MARAN NAYANAR

ఇలయాంగుడి మారన్ నాయనారు ***************************** హరిలీలా విలాసమో/సిరి కేళీ వినోదమో రంతిదేవుడు అను విష్ణుభక్తుడు ,తన కుటుంబముతో సహా 48 రోజులు ఆకలిదప్పులతో బాధించబడినాడు.అది ఊరటయో/ఊరట అనుపేర తనను పరీక్షించు గారడియో వారికి పాలు-అన్నము-రొట్టెలు -నీరు లభించినది. స్నానాదికములు పూర్తిచేసుకొని,హరిని మనసారా స్మరించుకొని,అహారమును తినుటకు సిధ్ధమవగానే, "భవతి భిక్షాందేహి" అంటూ బ్రాహ్మణుడు రానే వచ్చాడు. హరికి అర్పిస్తున్నానన్న భావనతో ,తమ దగ్గర నున్న ఆహారములో కొంత భాగమును సవినయముగా సమర్పించి,వెనుదిరుగగనే ,వెనుకనే నిలచి మరొక అభ్యాగతి అకలికేకలు వినపడగానే మరికొంత పదార్థములనిచ్చి తృప్తిపరచినాడు రంతిదేవుడు.ఇంతలో నాలుగు కుక్కలతో నలిగిన దుస్తులతో నకనకలాడుచున్న కడుపుతో నాలుగు మెతుకులకై ఎదురుగా మరొక దీనుడు రంతిదేవుని ముందు నిలిచాదు. కటకట! ఆకలిని జయించుట కానిపనికద అనుకొని తన దగ్గరనున్న మొత్తము ఆహారమును ఇచ్చివేసి నిశ్చింతుడైనాడు రంతిదేవుడు . హరినామ స్మరణముతో తమ ప్రానములను నిలుపుకొనుటకు జలాహారమును స్వీకరించ సిధ్ధమగుచున్నవేళ రానేవచ్చాడు జలజాక్షుడు చండాలుని రూపములో. అమ్మా అకలి-అయ్యా ఆకలి-అన్నము పెట్ట ండయ్యా అంటూ అరుపులు దీనముగా వినిపిస్తున్నాయి. కదిలిపోయాడు రంతిదేవుడు/వెన్నలా కరిగిపోయింది మనసు .ఎంతో భక్తితో, ఓ పుల్కసా./ అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న అంటూ దప్పిక తీర్చి,తన భక్తిచే తరించాదు. ఒక విధముగా రంతిదేవుడు-ఇలయాంగుడి నాయనారు హరిహరాద్వైతమునకు నిలువెత్తు నిదర్శనమనవచ్చును.. రంతిదేవుని హరిభక్తి సకలజీవులలో స్వామిని దర్శింపచేసి సాయుజ్యమును ప్రసాదించినది. అదేవిధముగా ఇలయాంగుడి మారన్ శివభక్తి సంస్కారము అర్థికి లేదనకుండా అన్నములను అందించి జీవిత పరమార్థమును చాటినది. జనని-జన్మభూమిశ్చ స్వర్గదపి గరీయసీ తన జన్మస్థల నామధేయమునే తన నామధేయము చెసుకున్న ఇలైయంగుడి నాయనారు గొప్ప వ్యవసాయ కుటుంబములో జన్మించెను.పరమ శివభక్తుడు. శివభక్తుల పాదసేవనము-పావన నైవేద్య సమర్పణములను పరమసంటోషముగా ఆచరిస్తూ-ఆనందముగా ఉండేవాడు.అతని ధర్మపత్ని సహితము భర్త కనుసన్నలలో మెలగుతూ,అన్న వితరణమే ఆ మూడుకన్నులవాని సేవగా పరమ భక్తిశ్రధ్ధలతో చేయుచుండెడిది. వారి అన్నసంతర్పణలను అత్యంత వైభవముగా కొనసాగించేలా కాలము తనపని తాను చేసుకుపోతున్నది. గంగను తన జటలో బంధించిన గంగాధరుడు,వేడుక ఇలైయంగుడి సంపదలను సైతము సాగకుండా బిగించాలనుకున్నట్లున్నాడు. . గంగను తన జటలో బంధించిన గంగాధరుడు,వేడుకగా ఇలైయంగుడి సంపదలను సైతము సాగకుండా బిగించాలనుకున్నట్లున్నాడు. సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగవెలగపండు కరణిని సుమతీ. సుమతీశతకము-బద్దెన మహాకవి అన్న సూక్తిని నిజముచేస్తూ కాలము తన మాయాజాలముతో నాయనారు నైవేద్య సేవలకు ప్రతిబంధకముగా మారి సంపదలను హరిచివేయసాగినది. నాయనారు దంపతులు హరుని సేవను తక్క హరించిన సంపదల తలంపును తమదగ్గరకు చేర్నీయలేదు.వారి వ్రత విధానమును మార్చుకోనులేదు.కలియో/గంజియో/కాయయో/పందుయో/కలిగిన దానితో సంతర్పణములనుచేస్తూ సంతుష్టిగా నున్నవేళ, నాయనారు విలక్షణమైన భక్తిని లోకవిదితము చేయాలనుకున్నాడు. అన్నివేళలా జరిగేటట్లే కరుణ తాను ప్రయాణానికి సిధ్ధమై తనకంటె ముందు కఠినపరీక్షను నాయనారు దంపతుల దగ్గరికి పంపించేసింది. కరుణ నిండిన కుంభవృష్టి ఎడతెరిపిలేకుండా కురుస్తోందా అన్నట్లుగా చిదంబరుని ఆనగా జగములను చిందరవందరగా మారుస్తూ ఒకటే వర్షము అలుపెరుగకుండా నాయనారు భక్తికి గెలుపు, మలుపుగా మారుటకు తలుపులను తెరుస్తున్నది. అసలు అది కురుస్తున్నదో లేక రాబోవు వింతలను చూడాలను కుతూహలముతో మురుస్తున్నదో కథను జరిపించేవానికే ఎరుక. పరమార్థమునకు త్రోవ నేను అవుతానంటూ అర్థరాత్రిసమయము తన వేదికను మురిపెముగా సర్దుకుంటున్నది. రంగము సిధ్ధమైనది కరుణాంతరంగునికై వేయికన్నులతో ఎదురుచూస్తూ. దంపతుల అంతరంగమును సిధ్ధమైనది అవ్యాజకరుణామూర్తికి సమర్పించవలసిన ఆతిథ్యమునకై ఎదురుచూస్తూ. ఒకటి బాహ్యము-మరొకటి ఆంతరంగికము. ఆంతరంగిక సమర్పణము నాయనారు దంపతులది స్వామికి అందమైనదే.అనుభవైకవేద్యమే.అజ్ఞానులకు/అల్పులకు అది అందరానిది. అండములోని పక్షి వలె నిండుగా ఉన్నప్పటికిని అందుకోవాలంటే నిరీక్షణమును నిర్దేశించునది. నాయనారు స్వామిభక్తి పరిపూర్ణమైనదైపరిమళించుటకు సమయమాసన్నమైనదనుటకు సూచనగా ,మంగళవాయిద్యములను తలదన్ను జయజయధ్వానములతో ఉరుములు మురియుచున్నవి. త్రినయనం త్రిగుణాకారం త్రిమూర్తించ ... త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం సమర్పణం అని అనుకుంటూ మెరుపులు సైతము స్వామికి దారిని ఇచ్చుటకు ముచ్చట పడుతు ముందుముందు త్రోవను చూపిస్తున్నాయి. "నింగి వ్రేలుచు అమృతమునొసంగు మేఘుడు" అన్నట్లుగా హర్షవర్ష మేఘములను స్వామిలీలామృతమును వర్షిస్తున్నాయా అన్నట్లుగా ఒకటే కుండపోత వర్షము మెండైన ప్రీతితో,నిండైన భక్తితో నింగి-ఇలయైంకుడి నేలను కలిపివేస్తుంటే ,ఆహా ఏమినా భాగ్యము అని పరవశిస్తుంటే,పరమాత్మ, యతివేషధారియై నియతి భోజనమునకై నీటి మడుగులలో అడుగులను కదుపుచున్నాడు. ఇంటి ముంగిటను వేడుకగా వేచియున్నాడు. పరుగుపరుగున వచ్చి,అతిథికి పాద నమస్కారమును చేసా రు.పాహి-పాహ్ ఇ అని పాదసేవనము చేసారు. " ఊర్క్చమే సూనృతాశ్చమే పయశ్చమే రసశ్చమే ఘృతంచమే మధుచమే అన్నము-పాలు-తేనె-నీరు-నెయ్యి మొదలగు పంచామృతములకై చమకము అర్థిస్తుంటే, తపమేమి చేసెనో కద మన నాయనారు దంపతులు, స్వామి తనంత తాను అన్నార్థియై తరలి వచ్చినాడు. ఏమా కృపాకటాక్షము ఆదిభిక్షువు ఆహారభిక్షకుడైనాడు.. అతిశయమైన కారుణ్యము అతిథి ఆకలిగా మారి,అన్న ప్రసాదమును ఆరగింపునకు సిధ్ధముచేయించుకుంటున్నది. గంగమ్మ తరలిస్తున్న గింజలను మున్నీటిలో మునిగి ఏరుతూ,తప్పలను తీసివేస్తూ,వాటిలోని తప్పలను/తప్పులను తరలించివేస్తూ,వాటిని వండి, దానికి కావలిసిన అనుపానమునకు " నమో వృక్షేభ్యో-హరికేశ భ్యః" అందించటానికి కొన్ని ఆకులను జారిపోకుండా ఒడుపుగా పట్టుకుని కమ్మగా వండి అతిథి కడుపు నింపారు నాయనారుదంపతులు.సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరునికి అన్న నైవేద్యమును ఆరగింపుచేశారు. ఇది బాహ్యము కొంచము ,నిశితముగా పరిశీలిస్తే తప్పగింజలు అనుకుని తప్పుకున్నవి వారి బంధనములు. ఒడిసిపట్టుకున్న ఆకుకూరలు వారి సుకృత బంధము. అది ఆరగింపా లేక అమరిన కరుణ ఆలకింపా సుష్టుగా భుజించిన అతిథి వారిని కరుణించదలిచాడు జ్యోతిస్వరూప సాక్షాత్కారముతో. . "శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రు బుధ్ధి వినాశాయ దీపర్జ్యోతిర్నమోస్తుతే. " జ్యోతిరూపమున దర్శనమిచ్చి నాయనారుదంపతులను అనుగ్రహించిన పార్వతీపరమేశ్వరులు మనలనందరిని అనిశము సంరక్షించెదరు గాక. ఏక బిల్వం శివార్పణం.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...