Saturday, September 30, 2023

KURYAT KATAKSHAMKALYANI-11

  ప్రార్థన


  కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం

  


 సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం

 తవేదం నఃఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం

 యదాలోక్యా శంకాకులిత హృదయో హాస జనకః

 స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి.

 శ్లోకము

   

 యత్రాశయోలగతి తత్రాగజ వసతు కుత్రాపి నిస్తుల శుకా

 సుత్రామ కాలముఖసత్రాసకప్రకర సుత్రాణకాలిచరణా

 ఛత్రానిలాతిరయ పత్రాభిరామగుణ మిత్రామరీ సమవధూ

 కుత్రాసహీన మణి చిత్రాకృతి స్పురిత పుత్రాదిదాన నిపుణా.తాం రంజనమమీ.


1.  

 స్తోత్ర పూర్వపరిచయము.

 *******************

 ముగురమ్మలను మూడువిధములుగా స్తుతించి,ముచ్చటగా మూడు వరములను కోరిన మహాకవిని,ఆ" భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షిణి,ఆ" సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాతాలోక పూజ్యుని చేయదలచినదేమో.

 కనుకనే మహాకవి ప్రస్తుత శ్లోకములో,చాందోగ్య ఉపనిషత్ మహావాక్యమైన.

"తత్-త్వం-అసి" ని బహుచమత్కారముగా మనకు పరిచయము చేస్తున్నారు.

 కంకాళ పక్షి విషయే అంటు మన ఉపాధి విషయమును ప్రస్తావించువేళ,ప్రజ్ఞానం బ్రహ్మ అను మొదటి వాక్యమును చెప్పకనే చెప్పినారు.బృందార బృంద పద ప్రయోగము చేస్తూ 'అయం-ఆత్మ బ్రహ్మ" అన్న రెండవ వాక్యమును స్పష్టీకరించారు.

  ఆ బ్రహ్మము తనలోనే-మనలోనే చైతన్యముగాఉందన్న విషయమును నొక్కివక్కాణిస్తూ,

"తయ్రాశయో లగతు-తత్ర అగజా వసతు" అంటూ,

 మనభాషలో చెప్పాలంతేనువ్వెక్కడుంటే-నేనక్కడ ఉంటానన్నభావనను గ్రహించే వరమును అర్థిస్తున్నారు ఆ "దేశ-కాల-అపరిఛ్చిన్నను." నమో-నమః.ఈ స్థితినిదాటితేనే కదా "త్వమేవాహం"అనే తత్త్వము అర్థమయ్యేది.




  ప్రస్తుత శ్లోకములో మహాకవి తన హృదయముతో పాటుగా అమ్మ అనుగ్రహమును సహచరించమంటే,మరొక మహానుభావుడు  ఆదిశంకరులు,
 "దదానీ-దీనేభ్య" అంటూ  ప్రారంభించి,
 మజ్జీవః-నిమజ్జన్ అంటూ , 
 నీ మందార పాదారవిందముల మకరందమును గ్రోలుతూ ఈజీవి అనే తుమ్మెదను  నీలో కలిసిపోనీయవమ్మా-అంటూ  ప్రార్థించారు.
 ఎంతటి మహద్భాగ్యము. 


  పద విన్యాసము

 *********

 "పరాకృత సరోజాత పరాక్రమ సరోరుహా" నమోనమః.

 

జగదంబ-

చరణా-చరణారవిందములు

త్రాణకారి- చరణా-

రక్షించేవి అమ్మవారి చరణారవిందములు

 సు-త్రాణకారి-చరణా

 సమర్థవంతముగా-రక్షించేవి-అమ్మవారిచరణములు

 ప్రకర-సు-త్రాణ కారి-చరణా

 ఒక్కరిని మాత్రమే కాదు-సమూహములను-సమర్థవంతముగా-రక్షించే -చరనములు కలది.

 త్రాసక-ప్రకర-సు-త్రాణకరి-చరణా

 భయముతో నున్న-సమూహములను-సమర్థవంతముగా-రక్షించే-చరణములు కలది.

 "దుష్టభీతి-మహా భీతిభంజనాయైనమో నమః"


 2.జగదంబ-నేర్పరి

  నిపుణా-నేర్పరి తనము కలది

  దాన-నిపుణా-ప్రసాదించుటలో నేర్పరి

  కు-త్రాస-హీన-దాన-నిపుణా

  కు-నింద-త్రాస-భయము-హీన-లేని-దాన-వరములను ప్రసాదించుటలో-నిపుణా-నేర్పరి.

  స్పురిత-కు-త్రాస-హీన-దాన నిపుణా

 ప్రకాశభరితమైన-అనింద్యమైన-భయరహితమైన-వరములను ప్రసాదించే నేర్పరి.

  జగదంబ

 " అంతర్ముఖ జనానంద ఫలదాయాయై నమః"

  మహాకవి అంతర్ముఖులతో బాటుగా అవనీతలమునకు కూడా పై వాక్యమును అనుసంధానిస్తున్నారు.

 నిపుణా-నేర్పరి తనము కలది తల్లి

 కు-భూమండలము యొక్క

 త్రాస-భయమును 

కు-త్రాస-హా

  భూమండలము యొక్కభయమును తొలగించునది.

    అంతేకాదు


3. అష్టలక్ష్మి-అష్టైశ్వర్య ప్రదాయిని.

నిపుణా-నేర్పరి

 దాన-నిపుణా

 వరములను ప్రసాదించుటలో నేర్పరి

భూమికి-భూజనులకు-సకల చరాచరములకు,

 దాన నిపుణా-వరములను ప్రసాదించుటలో నేర్పరి

 విచిత్రకృతి-దాన నిపుణా

వేరు-వేరు స్వరూప-స్వభావములతో కూడిన శ్రేష్ఠమైన వరములను ప్రసాదించుతలో నేర్పరి.

 సంతాన శబ్దము -కావ్య సంతానముగాన్వయించుకుంటే బహుముఖ వైవిధ్య ప్రజ్ఞా పాటవ పాండిత్యములుగా కూడా అన్వయింపబడుతుంది.

 ఛందస్సారా-శాస్త్ర సారా-మంత్రసారా అయిన మహేశ్వరి  దాన నిపుణా.

4.

 


 మహాకవి జగదంబను 'అగజా" అని సంబోదిస్తు-సంస్తుతి చేశారు." న గఛ్చతి-కదలలేనిది అగము/పర్వతము.కదలలేని తల్లిగా సంబోధిస్తూ అతిచంచలమైన తనమనసు ఎచ్చటెచ్చట విహరిస్తుందో అక్కదక్కడకు అమ్మయును వచ్చి హృదయములో స్థిరముగా అధివసించి యుండు భాగ్యమును ప్రసాదించు తల్లీ  అని సూక్ష్మమును వివరించే భావ మకరందముతో అమ్మను అభిషేకిస్తున్నారు.


KURYAT KATAKSHAM KALYANI-10



 

   

     కుర్యాత్  కటాక్షంకళ్యాణి-10
    ****************************

 ప్రార్థన

 *****
" అరాలైః స్వాభావ్యాత్ అలికలభన శ్రీ భిరలకైః
   పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం
   దరస్మరేయస్మిన్ దశన రుచికింజల్క రుచిరే
   సుగంధౌముద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః"

 శ్లోకము
 *****

 వందారు లోక వర సందాయినీ విమల కుందవదాత రదనా
 బృందారు బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా
 మందానిలా కలిత మందారదామభిః అమందాభిరామ మకుటా
 మందాకినీ జననభిందాన వాచమరవిందాసన దిశతుమే.

 స్తోత్ర పూర్వ పరిచయము
 ******************

  దుష్ట శిక్షణ-శిష్ట రక్షణమే  తన కరుణగా
 లీలా బ్రహ్మాండ రూపిణి,శివాపరాధముగా తన తండ్రియైన దక్షప్రజాపతి తలపెట్టిన నిరీశ్వర యాగమును అడ్డుకుని,పరమేశ్వరునిచే దక్షుని మేథను సంస్కరింప చేసినది.కాఠిన్యము-కారుణ్యము తన చూపులుగా,ప్రసరించుచున్న తల్లి,ప్రస్తుత శ్లోకములో ముగురమ్మల రూపముగా ముజ్జగములను ఏవిధముగా కరుణించుచున్నదో దర్శింపచేస్తున్నారు.

అమ్మవారి రదనకాంతి,చరణకాంతి,కిరీట కాంతి నాపై ప్రసరించి,నన్ను పునీతునిచేయును గాక.
. పదవిన్యాసము
  *********
 

 " శరత్జ్యోత్స్నా శుద్ధాంస్ఫటిక ఘటికా పుస్తకధరాం
  మథు-క్షీరా-ద్రాక్షా మథురమధురీణా-ఫణితయా".

 
 1. జగదంబ
   రదనా-పలువరుస కలది
   అవదాత- రదనా-
   తెల్లని - పలువరుసకలది
   కుంద- అవదాత- రదనా-
   బొండు మల్లెల వంటి తెల్లని పలువరుస కలది.
  విమల-కుంద-అవదాత-రదనా
 స్వఛ్చమైన-బొండు మల్లెలవంటి-తెల్లని-పలువరుస కలది.


 అమ్మవారిముఖపద్మము  దరహాసమనే కేసరకాంతులతో సుగంధ  పరిమళములను దిగ్దిగంతములు వ్యాపింపచేస్తూ,మన్మథుని దహించిన పరమేశ్వరుని రెండుకళ్లనే తుమ్మెదలను
 వివశులనుచేస్తున్నవి తల్లీ అని ఆదిశంకరులు భావించారు. 

    "ధర్మమే పద్మము.పద్మమునకు మూలము జ్ఞానము.పద్మకేసరముల మకరందము వైరాగ్య సంకేతము.పరమశివుడు  జ్ఞాన-వైరాగ్యములనుండి తన భావనను మరల్చలేకున్నాడనుట పరమార్థము."


ఆదిశంకరులు అరవింద కేసరములుగా  అమ్మవారి దంతకాంతిని భావిస్తే,మహాకవికాళిదాసు మల్లెలతో సంభావించారు.
సౌకుమార్యము-సౌందర్యము-సౌరభము అను త్రివేణిసంగమముగా, మల్లెలు గా భావింపబడుచున్న అమ్మవారి దంతములు.

  "శుద్ధవిద్యాంకురాకారా ద్విజపంక్తిద్వయోజ్వలా నమోనమః"


      సర్వశుక్లా సరస్వతీ రూపముగా మరొకపాఠాంతరము.

 2.జనని
 'శ్రుతీనామూర్ధానో దధతి తవయౌ శేఖరతయా
  మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ"
   వేదములనే
 పువ్వులచే  ప్రకాశించుచున్న నీ   చరణములను  నా శిరముపై దయతో ఉంచవమ్మా అని ప్రార్థిస్తున్నారు  శంకరులు.

    చరణా-పాదపద్మములుకలది
    అభిషిక్త చరణా-
    అభిషేకించబడిన పాదపద్మములు కలది.
   మకరంద  - అభిషిక్త చరణా-
   పూతేనియలచే అభిషేకించబడిన పాదపద్మములు కలది. 
   అరవింద-మకరంద-అభిషిక్త-చరణా
  పద్మముల లోని- మకరందముతో- అభిషేకించబడిన- పాదపద్మములు కలది.
  మణిబృంద -అరవింద-మకరంద-అభిషిక్త-చరణా
  మణులలో దాగియున్నపద్మరాగ మణులతో

//కలిసియున్న పద్మముల మకరందముతో అభిషేకించబడిన పాద పద్మములు కలది
 బృందారబృంద-మణిబృంద-అరవింద-మకరంద-అభిషిక్త చరణా
   దేవతా సమూహముల కిరీటములలోని మణులతో పాటుగా నున్న 
 పద్మములమకరందముతో అభిషిక్తముచేయబడిన పాదపద్మములు కల తల్లీ ,

 "సుపద్మరాగ సంకాశ చరణాయై నమః"
  
3." గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
  కిరీటం తేహైమం హిమగిరి సుతే కీర్తయతి యః"
  ద్వాదశాదిత్యులనే గగన మణులతో పొదగబడిన 
  కిరీటము కల తల్లీ,నీ కిరీట కాంతులతో నన్ను పునీతునిచేయవమ్మ-
 
        
 మకుటా_ కిరీటమును ధరించినది
 అభిరామ మకుటా-
 మనోహరమైన -కిరీటమును ధరించినది
 అమంద-అభిరామ-మకుటా
 మిక్కిలి- మనోహరమైన కిరీటమును ధరించినది
 దామాభి-అమంద-అభిరామ-మకుటా
 మాలికలతో -మిక్కిలి- మనోహరమయిన -కిరీటమును ధరించినది
 మందార-దామాభి-అమంద-అభిరామ-మకుటా
 మందార-మాలికలతో-మిక్కిలి-మనోహరమైన-కిరీటము కలది.
 కలిత-మందార-దామ-అమంద -అభిరామ-మకుటా
 చేర్చబడిన-మందార-మాలికలతో-మిక్కిలి-మనోహరమైన-కిరీటము 
 కలది.
 అనిల-కలిత-మందార-దామ-అమంద-అభిరామ-మకుటా
 గాలిచే-చేర్చబడిన-మందార-మాలికలతో-మిక్కిలి-మనోహరమైన- 
 కిరీటము కలది.
 మంద-అనిల-కలిత-మందార-దామ-అమంద-అభిరామ-మకుటా
 పిల్లతెమ్మెరలను- గాలిచే-చేర్చబడిన-మందార-మాలికలతో-మిక్కిలి- 
 మనోహరమైన-కిరీటము కలది. 

   "వజ్రమాణిక్య కటకకిరీటాయై నమః" 
-
  
  4.అనుగ్రహము
  
 దిశతు-అనుగ్రహించునుగాక
 మే-దిశతు-
 నాకు అనుగ్రహించును గాకు
 -
 వాచం  మే  దిశతు
 వాక్కులను-నాకు-అనుగ్రహించునుగాక
 జవన- బింధాన- వాచ- మే- దిశతు

 వేగములన్నింటిని అధిగమించు వాక్కులను  నాకు అనుగ్రహించునుగాక
 మందాకిని-జవన-బింధాన-వాచం-మే=దిశతు
 ఆకాశ గంగానది -వేగమును-అధిగమించు- వాక్కులను- నాకు- 
 అనుగ్రహించును గాక
 అరవిందాసన-మందాకిని-జవన-బింధాన-వాచం-దిశతు-మే
  పద్మాసనయైన పరమేశ్వరి అవ్యాజ కరుణతో గంగానది వేగమును 
 అధిగమించు వాక్కులను నాకు అనుగ్రహించును గాక.

 "పద్మప్రియేపద్మిని పద్మహస్తేపద్మాలయే పద్మదళాయతాక్షి
  విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్ పాదపద్మమ్మయి సన్నిధత్స్వ"

   అని, లక్ష్మీ స్వరూపముగాను స్తుతించారు.
 మందార దామ అభి అమదాభిరామ అని సంపదలను అర్థించారు.
 బృందార బృంద-మణి బృందార వంద అంటూ ఏకము-అనేకము 
 రెండు నీవేనమ్మా అంటూ స్తుతిస్తూ,ధనము,ఐశ్వర్యము-విభవము- 
 యశము అర్థిస్తున్నారు.
 ఇక్కడ మనము మందార అన్న పదము యొక్క ప్రాముఖ్యతను  
 గుర్తు చేసుకుందాము.
 అశోకము-పారిజాతము-అరవిందము-మందారము వికసనమునకు- 
 పరిమళమునకు సంకేతములుగా అలంకారికులు భావిస్తారు.
 కనుకనే మహాకవి తనకు
 మథు-క్షీర-ద్రాక్ష మథురిమధురీణా వాక్కులతో పాటు-వాటిని 
 వికసింపచేసి-శాశ్వత శ్యామలా సాన్నిహిత్యము ప్రసాదించమని 
 ప్రార్థించారు.
 ఎంత చక్కని భావ మకరాందాభిషేకము.
  మందారము-మందానిలము-బృందారు బృందము- 
  మణిబృందారవిందము అను వినసొంపగు పదములతో,
  మందార,మందాకినీ,మందానిలా,అమందాభి అను పదములలో 
  మందా  శబ్దమును పునరావృతము  చేస్తూ,
 
 
 
 వందారు,సందాయినీ,కుందావదాత,మకరందాభిషిక్త,మందానిలా,మందార,అమదాభి,మందాకినీ,భిందాన,అరవిందాసనా అను పదములలో,బిందు పూర్వక,దా "0దా" అను నాదభూషణములను అలంకరించారు.

   సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.

    అమ్మ దయతో  అర్చనకొనసాగుతుంది.

  ( కొన్ని వర్గములవారు 8 శ్లోకములను మాత్రమే అంబాష్టకముగా పరిగణిస్తే మరికొందరు 10 శ్లోకములను తీసుకుని దశశ్లోకి గా  కీర్తిస్తారు.)
 

   

 


Thursday, September 28, 2023

KURYAAT KATAAKSHAM KALYAANI-09



 


  ప్రార్థన


  ధునోతు ధ్వాంతం నస్తులిత దలితేందీవరవనం

  ఘనస్నిగ్ధ శ్లక్ణం చికుర నికురంబం తవ శివే

  యదీయం సౌరభ్యం సహజముపలబ్దుం సుమనసో

  వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినాం.


 శ్లోకము


 దాక్షాయణీ దనుజశిక్షావిధౌ వితత దీక్షా మనోహర గుణా

 భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దస్ఖాధ్వర ప్రహరణా

 వీక్షాం విధేహి దక్షా స్వకీయ జనపక్షా విపక్ష విముఖీ

 యక్షేశ సేవిత నిరాపేక్షశక్తి జయలక్ష్మ్యావధాన కలనా.


స్తోత్ర పూర్వపరిచయము

 


 కాళీ-రాజరాజేశ్వరి-సరస్వతి అను మూడు నామరూపములతో తమోగుణ-రజోగుణ-సత్వగుణ సంకేతముగా ప్రకటితమగుచున్నప్పటికిని జగదంబ

త్రిగుణాతీత.బాల-కౌమారి-ప్రౌఢ అను వివిధ దశలలో  తనకరుణను ప్రకటిస్తున్నప్పటికిని అమ్మ సర్వావస్థా వివర్జిత.విశ్వ వపుషిని వాగ్భవకూట-కామరాజకూట-శక్తికూట త్రయినిగా సంభావిస్తూ శంకీర్తిచినప్పటికిని  పరాశక్తి

అనవద్యాంగీ.

 ఇక్కడ మనమొకవిషయములను గమనించవలెను.

 

 అంగములన్నియును దృశ్యరూపములు.అంగములున్నను-లేలున్నను అందియుండగలదు.కాని అంగి లేనిదే అంగములుండజాలవు.

 ప్రపంచమను దృశ్యరూపమునకు అంగి పరమేశ్వరి.శాశ్వతి.తన ఇచ్చప్రకారమూంగములను ప్రకటింపచేస్తుంది-జరిపించ్ హివేస్తుంది.ఎన్నో పాత్రలు తానై అన్నింటిని ముగించేద్తుంటుంది.

  ప్రస్తుత శ్లోక పరిచయము.

  **************


   ప్రస్తుత శ్లోక ప్రార్థన


 ఇచ్ఛాశక్తి-జ్ఞానశక్తి-క్రియా శక్తిగా ప్రకటింపబడుతున్న పరమేశ్వరి ఆదిపరాశక్తి.అర్షడ్వర్గములకు  తన ఇచ్ఛాశక్తితో,అనేక రూపములుకల్పించి,క్రియాశక్తితో యజ్ఞము ధర్మకార్యమును తలపెట్టించి,జ్ఞానశక్తితో నిరీశ్వర యాగ ఫలితములను తెలియచేసింది.ధర్మసంస్థాపనమే ఏకైకలక్ష్యముగా( ఇలా జరిగింది)ఇతిహాసమును పరిచయము చేస్తూ దక్షుని పై కలిగిన అనుగ్రహ-ఆగ్రహములకు కారణములను కన్నులముందుంచారు మహాకవి. పాత్రలు-పాత్రధారులు అనేకములైనప్పటికిని సూత్రధారి మాత్రము 'శివశక్యైక స్వరూపిణి  మాత్రమే.

 

" దాక్షాయిణీ-దైత్యహంత్రీ-దక్షయజ్ఞ వినాశినీ" నమో నమః.

  పదవిన్యాసము.



జగదంబ

.


 వినోదముఖీ-వినోదించుతల్లీ

 వీక్షా-వినోద ముఖీ

 చూచుటను-వినోదించు తల్లీ

 నటన-వీక్షా-వినోదముఖీ

 తాండవమును-చూచుచు-వినోదించుతల్లీ

 భిక్షా శివ#హ్-నటన-వీక్షా-వినోదముఖీ

 ఆది భిక్షువైన-శివుని-తాందవమును-చూచుచు-వినోదించుతల్లీ

 అసన-భిక్షా-శివః-నటన-వీక్షా-వినోదముఖీ

 ఆహారమునకి-భిక్షమెత్తుకొను-శివుని-తాండవమును-చూచుచు-వినోదించు తల్లీ.

 "నటన ఆడెనె"

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల నిటాలాక్షుడే తుషారాద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల నటనం ఆడెనే...  


 


 "విశ్మే-విశ్వేశ్వరుడు

 విశ్వేరుడే-విశ్వము"కనుక సకలప్రాణిపోషణమునకై తాను అమ్మవారిని ఆహారమును భిక్షగానీయమని అర్థిస్తాడట.పితృవాత్సల్యము.

 అసలుభిక్షగాడు తాందవము చేయటం దానిని అమ్మ వినోదముగా చూడటము వింతగానిపిస్తున్నదికదా.

లీలాకల్పిత బ్రహ్మాండ మండలి జగదంబ-పంచకృత్య పరాయణి అయినజగదం తాండవము వినోదముగాచూడటములో దాగిన రహస్యం ఏమిటి?


    శివము అంటే నిత్యము-సత్యము అయిన మూలశక్తి.తటస్థ శక్తిగాను భావిస్తారు.ఆ శక్తి ,ఆ మూలము తాను నిశ్చలముగానుండి,సకలచరాచరములను స్పందింపచేయుటయే "తాండవము"ఆ ప్రక్రియలోఉద్భవించు అడ్దంకులను ఉపశమింపచేయుటయే తాడనము.

 తాందవము స్మర్ఛ్చిదం-పురఛిందం-భవఛిదం-మఖ ఛిదం-అంధకఛిదం అని కథగా చెప్పబడినప్పటికిని,స్మరణము అడ్దుకొనునది,శరీర వ్యామోహమై సత్యమును తెలుసుకోనీయనిది,జన్-మృత్యు భయమైనది-పంచేద్రియములను సమీకరించలేని యజ్ఞరూపమైనది-అజ్ఞానమును వీడనీయని అయిన వాటిని,ప్రహరణించుటలో విశేషమైన దీక్ష కలది జగదంబ. 

 


2

 విపక్ష-విముఖ-అవధాన కలన దీక్షా

 శత్రువులకు ప్రతికూలతను కలిగించుట యందు ఏకాగ్రత కలిగిన సమర్థవంతురాలు.

 అంతర్శత్రువులు-బహిర్శత్రువులను నిర్మూలించు దక్షత గలది.

     మరియును

 పక్షా-పక్షమున అందగా నిలబడునది.

 జనపక్షా-జనుల పక్షమున అందగా నిలబడునది

 స్వకీయ-జనపక్షా

 తన భక్త జనుల పక్షమునాందగా నుండునది.

 దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ అనునవి అమ్మ దయకు

నున్న రెండు వైపులు.


3.దానికి కారణము-జగదంబ

 శక్తి-శక్తి స్వరూపిణి

 నిరాక్షేప శక్తి-ఇతరులు ఎద్ర్కొనుటకు వీలుకానిశక్తి స్వరూపిణి

 అవదాన కలనా-నిరాక్షేప-శక్తి

 పూర్వ చరిత్రలో-ఇప్పటివరకు-ఎప్పటికిని-ఇతరులు ఎవ్వరు ఎదుర్కొనుటకు వీలుకాని శక్తిస్వరూపిణి

 జయలక్ష్మి-అవదాన కలనా-నిరాక్షేప శక్తి

 విజయలక్ష్మినిపొందిన-పూర్వ చరిత్ర కలిగిన-ఎవ్వరును ఎదుర్కొనుటకు వీలుకాని శక్తి స్వరూపిణి

 జయలక్ష్మ-జయలక్స్మి-అవదాన కలనా-నిరాక్షేప-శక్తి

 జయ సూచకములైన-విజయలక్ష్మినిపొందిన-పూర్వ చరిత్ర కలదియును-

 ఇప్పటికి-ఎప్పటికిని-ఎవ్వరు-ఎదుర్కొనజాలని-శక్తి స్వరూపిణి 

 వీక్షాం-విదేహి-తన వీక్షణములను నాపై ప్రసరించును గాక.


 యక్షేశ సేవిత-వీక్షణం-విదేహి

 యక్షరాజైన కుబేరునిచే సేవింపబడు జగజ్జనని తన కరుణారస వీక్షణమును విదేహి-మాపై ప్రసరించునుగాక.


4.జగజ్జనని

 ప్రహరణా-ధ్వంసము చేసినది

 అథ్వర ప్రహరణా-యజ్ఞమును ధ్వంసముచేసినది.

 దక్ష-అథ్వర-ప్రహరణా

 తండ్రియైన దక్షుని-యజ్ఞమును-ధ్వంసము చేసినది.

 అష్టాదశ పీఠ స్థాపనమునకు ఉద్యమించిన తల్లి,నిరీశ్వర యాగమును ఉపసంహరింప చేసినది.

 పంచేంద్రియములను ఏకీకృతముచేసి/సమీకరించి,పంచభూతముల సాక్షిగా ఈశ్వరార్పణము అగ్నిసాక్షిగా నిర్వర్తించు వేదోక్త కర్మాచరనమే యజ్ఞము.

 యజ్ఞము బాహ్యము కావచ్చును లేదా ఆంతరంగికము కావచ్చును.

  కాని కావలిసినది ఈశ్వరభావం.


 దక్షునికి తాను వచ్చినప్పుడు సభలో నున్న "అందరు" వినయముతో చేచి నమస్కరించాలన్న కోరికకలిగింది.(కామ)

 కానిపరమేశ్వరుడు నమస్కరించక పోవుటచే ఆ 

 కామమునకు తోడుగా క్రోధము చేరినది(క్రోధము)

 దానితో పాటుగా తనహోదా ను సంరక్షించుకోవాలన్న లోభము తోడైనది.

 (కామ+క్రోధ-లోభములు)

 అమ్మ తన తపమునకు మెచ్చి కుమార్తెగా అనుగ్రహించినదన్న విషయమును సైతము విస్మరింపచేసినది పదవిపై నున్న మోహము/ఇష్టము.

(కామ-క్రోధ-లోభ-మోహములు)

 శివుని అవమానించాలంటూ వచ్చిన తలపు నిరీశ్వర యాగమును తలపెట్టినది.(మదము-

 (కామ-క్రోధ-లోభ-మోహ-మదములు)

 సకలదేవతా సేవా సౌభాగ్యము తనకే దక్కవలెను కాని అన్యులకు కాదు.కాని ప్రస్తుతము అది పరమేశ్వరుడు అనుభవిస్తున్నాడు అన్న భావనయే యాగ తలంపును విరమింపచేలేని మాత్సర్యము.

   దక్షుడు అనగా సమర్థత  కలవాడు అనిభావిస్తారు.తనను తాను తెలుసుకోగల చూచుకోగలిగిన సమర్థుడు.అయినను ఆరుశత్రువులచే దాడిచేయబడి తన ఉపాధి పతనమునకు తానే కారణమయినాడు.

 అనుగ్రహించిన అమ్మ ఆగ్రహమునకు కారకుడైనాడు.

 దక్షుని అహంకారము అతని ఇంద్రియములను ఏకీకృతము కావించలేకపోయినది.

 దక్షుని నిష్కల్మష తపమునకు మెచ్చి జనక స్థానమును అనుగ్రహించిన జగదంబయే,

 నియమోల్లంఘనమును గావించిన నిరీశ్వర యాగమును ధ్వంసము చేసినది.

ఇక్కడ మనము స్వకీయ అన్న పదము దేహ సంబంధము కాదని ధర్మ సంబంధమని అర్థము చేసుకోవాలి.

 దాక్షాయణి,వీక్షాం

 తన కరుణదృక్కులను

 మయి-విధేయి

నాపై/మనందరిపై ప్రసరింపచేయును గాక.


 

 


 తాండవ వినోదముతో ప్రారంభించి,తాడన విజృంభణమును ప్రదర్శించి "ధర్మసంస్థాపనమే" తానైనతల్లినిభావ మకరందనుతో అభిషేకించారు.

 

 దాక్షాయణి-శిక్షా-దీక్షా-భిక్షా-వీక్షా-పక్షా-దక్షాధ్వర-మొదలగు పదములలో "క్షా" అను అక్షరమును పునరావృతము చేస్తూ,

 అవదాన-గొప్పదైన చరిత్ర,అవధాన-ఏకాగ్రత అను పద విన్యాసములతో నాదభూషణములను అలంకరించారు.  


   సర్వం  శ్రీమాత  చరణారవిందార్పణమస్తు.                          

    అమ్మ దయతో అర్చనకొనసాగుతుంది.

 


Saturday, September 16, 2023

KURYAAT KATAAKSHAMKALYAANI-08




   కుర్యాత్ కటాక్షం కళ్యాణి-08

   *************************




 ప్రార్థన

 ****





 వహత్యంబ స్తంబేర మదనుజ కుంభ ప్రకృతిభిః


 సమరబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికా


 కుచాభోగ బింబాధర రుచిభిరంత శబలితాం


 ప్రతాప వ్యామిశ్రాం పురదమయితః కీర్తిమివతే.





  శ్లోకము

  ****





  జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచసంభావ్య హార లతికా


  రంభాకరీంద్ర దంభాపహోరు గతి డింభా అనురంజితపదా


  శంభా ఉదార పరిరంభా కురాత్ పులక దంభానురాగ పిశునా


  శం భాసుర ఆభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా.


 స్తోత్ర పూర్వ పరిచయము

 ****************



        మహాకవి ఆరు శ్లోకములో అమ్మనుకోరినవరములకు భిన్నముగా ఏడవ శ్లోకములో ఉపాధి నైజమును వివరిస్తూ-ప్రత్యేకతను వ్యక్తి పరముగా ఎలా ఉపయోగపడుతుందో-అమ్మ పాదారవిందములనుచేర్చుటకు ఏకైక సాధనము సుమా అని తెలియచేశారు. 

   కాని అంత వేదాంతమును-పరమార్థమును సెలవిచ్చిన మహాకవి తరువాతి శ్లోకములో అమ్మ యొక్క కామరాజకూటమైన వక్షములను-వాటిపై ధరించినముత్యాలహారమును,శక్తికూటమైన ఊరువుల


వైభవమును స్తుతించారు. అంటే కథ మళ్ళీ మొదటికి వచ్చిందా అన్న సందేహము అజ్ఞానమునకు కలుగక మానదు.


 కాదు-కాదు


.జగదంబ బీజాక్షరదాత-మహాకవి గ్రహీత.వారి రచనము పురోభివృద్ధి సూచకమే కాని తిరోధానము ఉండనిది కదా అని వివేకము హెచ్చరిస్తుంది.


 ప్రస్తుత శ్లోక పరిచయము.


***********************


  నిజమే.విజయమువివేకముదే.వ్యక్తివికాసమును సూచించిన మహాకవి విశ్వ వికసనమును సూచిస్తున్నారు.అదియును అమ్మ రూప-లావణ్య విభవమును సంకీర్తిస్తూ.


    జగదంబ 


 సర్వారుణ అనవద్యాంగి-సర్వాభరణభూషితా.


విశ్వమే ఆభరణములుగా-అలంకారముగాధరించిన "విశ్వభూషిణి" ఆ అమ్మలగన్న అమ్మ. 


 కనుకనే ఆదిశంకరులు సదాశివుడు తన నుండి విడివడి సర్వాంగ సుందరముగా పంచభూతములు-పంచతన్మాత్రలను అలంకరించుకుని,ఛిచ్చక్తిగా తేజరిల్లుతున్న అమ్మను చూస్తూ" ఆహో పురుషికా" అంటూ అభినందించారు.


  ముమ్మాటికిని సకల మంత్ర విశేషములే అమ్మధరించినవిగా ప్రకటింపబడుతున్న సర్వాభరణములు.బ్రహ్మాందమునందలి సకల చరాచర సమిష్టి రూపములే సర్వాభరణములు.


  అదేవిషయమును  ఆదిశంకరులు,


అమ్మవారి జఘనభాగ స్తోత్ర విషయములో,  హిమవంతుడు తన కుమార్తె కు అరణముగా/హరనముగా , విశాలమైన-గొప్పవైన కొండచరియలను కానుకగా ఇచ్చాడేమో  అన్నట్లుగా 


 "గురుత్వము విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్


  నితంబాదాచ్చిద్య త్వయి హరణరూపేణ నిదధౌ" భావించారు..


 పద విన్యాసము


 ***********




1. జగదంబ-అర్థనారీశ్వరి-




 " శంకరార్థాంగ శరీరాయై నమోనమః"


  పిశునా-సూచనయైనది


  అనురాగ- పిశునా-


 అనురాగమునకు సూచనయైనది


  దంభ-అనురాగ-పిశునా


  గాఢమైన-అనురాగమునకు-సూచన యైనది


  పరిరంభ-దంభ-అనురాగ-పిశునా


  ఆలింగనమందు- గాఢమైన- అనురాగమునకు- సూచన యైనది.


  పులక-పరిరంభ-దంభ-అనురాగ-పిశునా


  పులకాంకితత-ఆలింగనమందు-మిక్కిలి-అనురాగమునకు -సూచన యైనది.


  ఉదార-పులక-పరిరంభ-దంభ-అనురాగ-పిశునా


 ఉత్కృష్టమైన//సాటిలేని- పులకాంకిత-ఆలింగనమందు-అనురాగమునకు -సూచనయైంది.


 విశ్వశ్రేయస్సే  ఆ ఉదార పులక-పరిరరంభ అనురాగ సూచనము.జగత్రక్షణమునము మిక్కిలి అనురాగము కలది ఆ పరమేశ్వరి.


 




  ప్రకాశ-విమర్శ రూపకలయికయే ఆ దివ్య పరిష్వంగము.


  జడశక్తి-చిచ్ఛక్తుల సంగమమే ఆ దివ్య పరిష్వంగము.


  బిందు-రూప మమైకత్వమే ఆ దివ్య పరిష్వంగము.


  జీవాత్మ-పరమాత్మ అద్వైతమే ఆ దివ్య పరిష్వంగము.


"భూతేశాలింగనోభూత పులకాంగై నమోనమః" అని కీర్తింపబడుచున్నది.




2.జగన్మాత-పాదపద్మములు

 ****************


 "పారిజాతగుణాధిక్య పదాంబుజాయై నమోనమః"


  సౌకుమార్యములో-సాముద్రికములో-సౌభాగ్యప్రదానములో పారిజాత కుసుమములను మించిన సుగుణములు కలవి తల్లి పాదపారిజాతములు.


 పదా-ప్రకాశించుచున్న పాదపద్మములు కలది


 అనురంజిత-పదా-/కరుణమనే అరుణిమతో ప్రకాశించుచున్న పాదపద్మములు కలది.


 గతి-అనురంజిత -పదా


 గమనముచే/అరుణిమతో-ప్రకాశించుచున్న-పాదపద్మములు కలది


 డింభ-గతి-అనురంజిత-పదా


 పసిపిల్లల సౌకుమార్యవంతమైన-నదకచే ఎరుపెక్కిన-కెందామరల వంటి పాద పద్మములు కలది


  కనుకనే


" పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమోనమః" అనికీర్తింపబడుచున్నది.


3.జగన్మాత-దివ్యభూషణ సందోహ రంజిత

  ***************************


 గుంభా-కూర్పుకలది


 ఆభరణ  గుంభా-ఆభరణముల కూర్పు కలది.


 భాసుర-ఆభరణ-గుంభా


 ప్రకాశిస్తున్న ఆభరణములకూర్పు కలది.


 లతికా-భాసుర-ఆభరణ-గుంభా


 హారములవరుసలతో -ప్రకాశిస్తున్న-ఆభరణముల -కూర్పుకలది.(108)


 హార-హార-లతికా-భాసుర-ఆభరణ-గుంభా


 ముత్యాల హారములతో ప్రకాశిస్తున్న-ఆభరణ సౌందర్య -కూర్పు కలది.


 సంభావ్య-హార-లతికా-భాసుర-ఆభరణ-గుంభా


 సమున్నతమైన-ముత్యాల హార-ప్రకాశముతో-నేర్పుతో కూర్చబడిన సౌందర్యము కలది.


కుచ-సంభావ్య-హార లతికా-భాసుర-ఆభరణ-గుంభా


 స్తనసీమపై-సమున్నత.సమున్నతస్తన సీమపై-ప్రకాశిస్తున్న-ముత్యాల హార కూర్పు కల తల్లీ.


 స్థూల ముక్తా ఫలోదార సుహారాయై నమోనమః.


  అమ్మ నాసిక సూక్ష్మ మౌక్తిక బులాకీతో ప్రకాశిస్తున్నది.విశ్వపోషకమైన స్తనసీమ స్థూల ముక్తాహారముతో కాంతులీనుచున్నది.


సాధనతో సద్గతిని పొందిన సత్పురుషులను, అమ్మ తన హృదయసీమలో అలంకరించుకొనినది అని కూడా మరొక భావన.


 'వహత్యంతర్ముక్తాః శిశిరకర నిశ్వాస గలితః


  సమృద్ధ్యా యత్తాసం బహిరపిచ ముక్తావళిధరః"


 సౌందర్యలహరి.


స్వాతి కార్తె వర్షబిందువు సముద్ర ముత్యపుచిప్పలో బడి ఫలముగా  మారిన సమర్థవంతమైన/పరిపక్వతనొందిన.పరిణామముదాల్చిన ముత్యముల హారమును అమ్మ ధరించినది. 


 




 ముత్యములు ఆరువిధములుగా పెద్దలచే వర్గీకరింపబడినవి.అమ్మధరించినవి తల్లి /విశ్వ శ్వాస ప్రక్రియను సంకేతించిన/స్థితికార్యమును సూచించిన బులాకి ముత్యముగా సంకేతిస్తున్న చిన్నముత్యముగా ఆదిశంకరులు భావించారు.మహాకవి అమ్మ పయ్యెదపై ముత్యాల హారమును "స్థూల ముక్తా ఫలోదారమును" ఉదారమైన ఉత్కృష్తమైన ముత్యములను తన అనుపమానహృదయసీమపైధరించింది.


  నాసికాముత్యము శ్వాస (విశ్వ) సంకేతముగాభావిస్తే, స్థూలముక్తాఫల హారమును విశ్వ గుండె చప్పుడుగా మహాకవి భావించారేమో.


 కాలసంకేతముగా మరొకపాఠాంతరమును చెబుతారు.  ఎందరో ముక్త సంగులను అనుగ్రహించి శుద్ధసత్వ శోభితులుగా తన యెదపై ప్రకాశింపచేస్తున్నదని


 మరికొందరి భావన.


 "యద్భావం తద్భవతి"కదా. 






4."కరీంద్రాణాం శుండాన్ కనకకదళీ కాండ పటవీం


  ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపినిర్జిత్యభవతి."సౌందర్య లహరి.


4.జగదంబ-ఉరువుల శోభ


  ******************




 ఊరు-తొడలు కలిగినది


 అపహ-ఊరు


 అపహసించే-తొడలుకలది


 దంభ-అపహ-ఊరు


 గర్వమును-అపహసించే-తొడలుకలది


 కరీంద్రకర-దంభ-అపహ-ఊరు


 ఏనుగు తొండపు గర్వమును అపహసించే తొడలు కలది.


 రంభా-కరీంద్రకర-దంభ-అపహ-ఊరు


 అరటిబోదె మరియును ఏనుగు తొండము యొక్క పోలికను అపహసించే సౌందర్యము కలవి అమ్మ  ఉరువులు.


 గణపతిని/కుమారస్వామినికూర్చుండబెట్తుకొనునవి.మనలనుసైతము కూర్చుండబెట్టుకొని లాలించునవి అమ్మ ఊరువులు.




 చిదగ్ని కుండ సంభూత సుదేహాయ నమ






 


    తల్లిదివ్యమంగళ విగ్రహమును దర్శింపచేస్తున్నారు మహాకవి.


   హారలతికా-


 పరమేశ్వరి తన పయ్యెదపై పరమపవిత్రమైన ముత్యాల హారమును ధరించియున్నది.ఆ హారము దేవేంద్రుని ఐరావత కుంభస్థలమును పరిహసించుచున్నదా యన్నట్లున్న అమ్మ కుచకుంభముపై అలంకరింపబడి అతిశయించుచుచున్నది.


 ఆ హారములోని ముత్యములుసామాన్యమైనవి కావు కనుకనే వాటికి ఆ సౌభాగ్యము.

పరమేశ్వరుడు గజాసుర సంహారము వేళ వాని శరీరములోని అణువణువునకు లోక పూజత్వమును అనుగ్రహించిన వాని కుంభస్థలములోనుండి వెలువడినవి.అమ్మవారికి కానుకగా స్వామిచే బహూకరించబడినవి.


  సహజముగా అహంకారభరిత ప్రదేశమునుండి వెలువడినప్పటికిని వాటి పురాకృత పుణ్యమేమో కాని అవి అమ్మ స్పర్శను పొంది సత్వగుణసంశోభితములగుచున్నవి. 




:" గజాసుర కుంభస్థలము అహంకారభరితము.అమ్మ కుచకుంభస్థలము అవ్యాజ కరుణాభరితము."


.ఇక్కడ మనము అమ్మ హృదయ భావనను స్వీకరించకలగాలి.ఏ విధముగా ముత్యములు /ముక్తసంగులు


  అనుగ్రహ సంకేతములుగా మారినవో అదేవిధముగా మన చిత్త వికారము సైతము చిత్త వికాసముగా పరిణామము చెందాలి.దానికి అమ్మ అనుగ్రహించాలి.




  ".అమ్మవారి వక్షోజ సందర్శనములో మనము ప్రతి రోజుస్వీకరించుచున్న ఆహార-పానీయములను దర్శించగలగాలి:".సత్వగుణశీలికి కాని ఆ దర్శనము లభించదు.


  అలంకార (మౌక్తికశాస్త్ర) శాస్త్ర ప్రకారము,ముత్యములు ఏనుగు కుంభస్థల నుండి,వెదురు నుండి,పాముపడగ నుండి,మేఘముల నుండి,(స్వాతిచినుకు) ముత్యపు చిప్ప నుండి,చెరుకుగడ నుండి వివిధవర్ణములతో,ఆకారములతో లభిస్తాయని పెద్దలు చెబుతారు.

    రంభాకరీంద్ర కర అంటూ,

 స్థూలముక్తఫలోదార సుహారయైన తల్లి కామరాజకూట కూటమును దర్శించచేసిన తరువాత,కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద్రవోరు ద్వయాన్వితను మహాకవి శక్తికూట దర్శనమును స్తుతిస్తున్నారు.

 శుభాంగియైన తల్లి ఉరువులు

1.నునుపు

2.గుండ్రనితనము

3.వెచ్చదనము

4.బరువు అను నాలుగు సాముద్రిక శుభలక్షణములకు నిర్వచనముగా నున్నవట.దయాంతరంగ యైన పరమేశ్వరి వాటిలోని నునుపును-గుండ్రనితనమును అరటిబోదెలకు,   (సౌకుమార్యము)వెచ్చన ,బరువును(సామర్థ్యమును)ఏనుగులకు  అనుగ్రహించినదా యన్నట్లు సంభావించబడుతున్నది.

 అలంకారికుల "ఊరు ద్వయమును" "ఉకార"-ఊకార" ద్వయముగావిభజించిరి.అమ్మమాతృకావర్ణరూపిణి.


 ఉకారము -


 అమ్మవారి కుడిఊరువుగాను-మార్దవ సంకేతము గాను భావించిరి.మానవ సృష్టి యందలి నాలుగు అందజ-బుద్బుజ-స్వేదజ-తదితర స్త్రీ-పురుష ప్రాణిని వర్గీకరణశక్తి గాను ఆరాధింతురు.

   ఊ కారమును-


 ఎడమఊరువుగాను,సౌభాగ్య చిహ్నముగాను-పంచభూతములు-మనోబుద్ధ్యహంకార  వర్గీకరణశక్తిగాను ఆరాధింతురు.


  శం-అనే పదమునకు అమరకోశము శాంతము-శుభము-శాస్త్రము-కీర్తి-స్వర్గము-శివుడు-శ్రేయస్సు-శక్తి-సుందరము మొదలగు భావమును విశ్లేషించినది.


  శం-సదా దిశతు-తల్లి తల్లి తనకృపావీక్షణములను నాపై ఎల్లప్పుడుప్రసరిస్తూ శం ను అనుగ్రహించును గాక.ఇది యొక అర్థము.


 సదా దిశతు-ఎల్లవేళల నన్ను సంతుష్టునిగా  అనుగ్రహించును గాక-ఇది ఒక అర్థము. 


2.సత్+ఆదిశతు


  సత్తు అనగా నిర్మలము-నిరాకారము-నిరంజనము-నిస్తులము అయిన ఒకేఒక సత్యము.అదియే పరబ్రహ్మము.


  పరమేశ్వరి కృపావీక్షణము నన్ను ఆ పరబ్రహ్మము వైపునకు నడిపించును గాక.ఇది పరమార్థము.


  ఎంత చక్కని కవితా చమత్కారము.


  అనన్వానయమైన ఆ నితాంత సచ్చిదానందము నన్ను అనుగ్రహించును గాక.

  కవితా చమత్కారము.

  ********************

  శంభుడు-శుంభుడు


      శంభుడు శుభంకరుడు కనుక అమ్మపరిష్వంగము లభించినది.

 ప్రతిజీవి శంకరుడు వానిలోనికి మాయ ప్రవేశించనంతవరకు.మాయమోహితుడైన వాని మనము ఎప్పుడు  కుటిలత్వమునకు దాసోహమవుతుందో,వాని స్వభావమునకు తగినట్లు వానినామముసైతము కొమ్మ్ను జతచేసుకుని శుంభనామిగా మారుతుంది.దానికి కావలిసినది అమ్మ ప్రసన్నత కాదు.ప్రహరణమే.

 అమ్మ వానిని సంస్కరించి తదుపరి సంహరిస్తుంది.


  మహాకవి డింభాను రంజిత పదా-అను దండాన్వయముతో తల్లి సౌకుమార్యమును,


  శుంభాసుర ప్రహరణా అను పదముతో శక్తి సామర్థములను సన్నుతించి,భావ మకరందముతో అమ్మను అభిషేకించారు.

జంభారి,కుంభాపహాసి,సంభావ్య,రంభాకరీంద్ర,దంభాప,డింభా,శంభా,పరిరంభా,దంభానురాగ,భాసుర,గుంభా,శుంభాసుర,పదములలో బిందుపూర్వక భా(0భా0 అను ప్రాసతో నాదభూషణములను అలంకరించారు.


    సర్వం శ్రీమాతాచరనారవిందార్పణమస్తు.

    అమ్మ దయతో  అర్చన కొనసాగుతుంది..







Friday, September 15, 2023

KURYAAT KATAAKSHAM KALYAANI-07




 కుర్యాత్  కటాక్షం కళ్యాణి-07
 *********************** 


 ప్రార్థన
 ****




  "భవాని త్వం దాసే" మయి వితర దృష్టిం సకరుణా

  మితిస్తోత్రం వాంఛనధియతి "భవానిత్వమితియః"

  త దైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం

  ముకుంద బ్రహ్మేంద్ర స్పుట మకుట నీరాజన పదాం

 శ్లోకము
 ****
  న్యంకాకరే వపుషి కంకాల రక్తపుషి కంకాది పక్షి విషయే

  త్వంకామనాం అయసి కింకారణం హృదయ పంకారి మేహి గిరిజా

  శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో

  ఝంకారి భృంగతతిం అంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం.



  స్తోత్ర పూర్వ పరిచయము
  ***************


       ప్రథమ శ్లోకములో తాంబూలరసమును ప్రసాదించి,కవితా వైభవమునుకోరిన మహాకవి,రెండవ శ్లోకములో మంత్ర సాధనము,మహర్షుల ఉద్ధరణమును విశ్లేషించారు.మూడవ శ్లోకములో సంసార సర్పమును సంహరించు ఆడముంగిసగా ఆరాధించారు.అమ్మ కరుణ ఒక రూపమును సంతరించుకున్నది.నాల్గవ  శ్లోకములో అమ్మ నిధిత్వ-పృథుత్వ స్తన ప్రస్తావనము చేస్తూ,సకల చరాచర రూపముల స్థితికారిణిగా సంకీర్తించారు.అంటే సృష్టికారిణి-సృష్టి,స్థితికారిణి జగదంబయే అని వివరించారు.
  తాను అరాధిస్తున్న స్తనములు అందింస్తున్న క్షీర ప్రాముఖ్యతను ఐదవ శ్లోకములో స్కందమాత తత్త్వము ద్వారా అవి,కేవలము ఆకలిని తీర్చునవి మాత్రమే కాదు సుమా,

" సదాశివుని సైతము ఆది భిక్షువుగా,జ్ఞాన వైరాగ్య సిద్ధులను" అనుగ్రహించమని అర్థించిన  అమృతకలశములుగా దర్శిస్తూ,మనలకు దర్శింపచేస్తూ,కడుపు నిండిన వేళ కాంతిస్వరూపిణిగా తల్లిని వర్ణిస్తూ,కన్నుల పండుగ చేసారు ఆరవ శ్లోకములో.

  ఆరు శ్లోకములలో,

 సాధకుడు-వరము-ప్రార్థన-వరానుగ్రహ విధానము-వరప్రదానము వరప్రదాత జగదంబ అను  అంశములు కనపడుతుంటాయి.తనకొరకు,తనకు  
కావలిసినది ఏమిటి? దానిని ఎలా పొందాలి?దానిని అనుగ్రహించగల శక్తి ఎవరికి ఉంది? ఏవిధముగా అభ్యర్థించాలి?అని ఆలోచించిన సాధకుని తలపు ఒక విషయమును గ్రహించింది.

   " దానిని పొందుటకు తానున్న సంసారము,తనకు-అమ్మకు మధ్య అడ్దుగాఉండినందున ఆ అడ్డును తొలగించివేసుకోవాలి".అంటే,

 "తనను తాను చూసుకోవలెనన్న తన ముందర నున్న అద్దమును" మాయ అను మురికి కప్పివేసినది"

 " యాదేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థితా" నమోనమః.



.అద్దము ప్రతిబింబమును చూపు సమర్థతను కలిగియున్నదే.తాను తనప్రతి బింబమును చూసుకోవలెనన్న కుతూహలమును కలిగియున్నవాడే ,కాని అడ్దుపడుతున్నది మధ్యగా అద్దమును కప్పియున్న  మాయ అను  దుమ్ము.దానిని తొలగించుకొను ప్రయత్నమే ప్రస్తుత శ్లోక పరమార్థము. 





 పద విన్యాసము.

 **********



1. భ్రమ యని తెలుసు-బ్రతుకంటె బొమ్మలాట యని తెలిసు

  తెలుసు తెర తొలగుతుందని-తెలుసు తెల్లారుతుందని

 అయినా 

 అన్నీ తెలిసి అడుసులోన పడి దొర్లుతుంటావు 

   ఓ! మనసా(ఆదిశంకరా చిత్రము)



 ఆదిశంకరులు   సౌందర్యలహరి స్తోత్రములో           స్తుతించినట్లు,

 అనేనాయం ధన్యో భవతి-నచతే హాని రియతా."
  తల్లీ నీవు అనుగ్రహిస్తే నేను ధన్యుడిని అవుతాను,నీకు వచ్చే నష్టము ఏమిలేదు కదానీవు శిరోభూషణముగా ధరించినచంద్రరేఖ ఎటువంటి తారతమ్యమును చూపకుండా సమముగా తన వెన్నెలలను పంచుతున్నది.ఆ సిద్ధాంత ప్రకారము నా అర్హతను చూడక,నన్ను అనుగ్రహింపుము.నమోనమః.

   ప్రస్తుత శ్లోకము,

 "ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం  ఇతి అభిధీయతే

  ఏ తద్ యో తం ప్రాహుః క్షేత్రజ్ఞా ఇతి తత్ విదః'



   అభిధీయతే-పిలువబడుతున్నది.

   శరీరం-అభిధీయతే

   శరీరము పిలువబడుచున్నది

   ఏ- తద్- శరీరం-  అభిధీయతే

   ఈ-శరీరము-పిలువబడుతున్నది

   క్షేత్రం-ఏ తద్-శరీరం-అభిధీయతే

   క్షేత్రముగా-ఈ శరీరము-పిలువబడుచున్నది.

   వేత్తి-క్షేత్రం-ఏ తద్- శరీరం-అభిధీయతే

   తెలుసుకుంటారో-క్షేత్రముగా-ఈ శరీరము-పిలువబడుతున్నదని

   యః-వేత్తి-క్షేత్రం -ఏ తద్-శరీరం-అభిధీయతి

  ఎవరైతే-తెలుసుకుంటారో-క్షేత్రముగా-ఈ శరీరము-పిలువబడుతున్నదని

  తం-క్షేత్రజ్ఞ-వారే క్షేత్రజ్ఞుడు.
.ఆ శక్తియే క్షేత్రజ్ఞ శక్తిగా సంభావించబడుతున్నది.

  ఇంత చక్కటి సందేశమును మహాకవి,
1.

 కిం-కారణం

 కారణం-ఏమిటి? 

 అయసి-కిం-కారణం

 పొందుటకు-కారణం-ఏమిటి?

 కామనాం-అయసి-కిం-కారణం

 కోరికలను-పొందుటకు-కారణం-ఏమిటి?

 వపుషి-కామనాం-అయసి-కిం-కారణం

 శరీరముపై-కోరికలను-పొందుటకు-కారణం-ఏమిటి?

 రక్తపుషి-వపుషి-కామనాం-అయసి-కిం-కారణం

 రక్తముచే పోషిపబడుచున్న-శరీరముపై-కోరికలను-పొందుటకు-కారణం-ఏమిటి?

 కంకాళ-రక్తపుషి-వపుషి-కామనాం-అయసి-కిం-కారణం

 ఎముకలగూడు-రక్తసిక్తము అయిన -శరీరముపై-కోరికలను-పొందుటకు-కారణం-ఏమిటి?

   అంతే కాదు, 

 ని-అంక-ఆకరే-కంకాళ-రక్తపుషి-వపుషి-అయసి-కిం-కారణం

 నిందలకు నిలయమై-బొమికలగూడై-రక్తపు వాగైన-శరీరముపై-కోరికలను -పొందుటకు-కారణం-ఏమిటి?

 అశాశ్వతమైన శరీరమును శాశ్వతమనుకొని దానిపై కోరికను పెంచుకొనుటకు కారణమేమిటి ? ఓ ఉపాధి,

 అట్టి ఉపాధి చివరకు,

 విషయే-ఆహారముగా మారుచున్నది.

 పక్షి-విషయే-

 పక్షులకు-ఆహారముగా-మారుచునది.

 కంక-ఆది-పక్షి-విషయే

రాబందులు-కాకులు-మొదలగు పక్షులకు ఆహారముగా మారుచున్నది.గ్రహించావా?

పరమేశ్వరియే,

 క్షేత్రస్వరూపి-క్షేత్రేశి-క్షేత్రక్షేత్రజ్ఞ పాలినిగా  తెలుసుకో.

' "జరాధ్వాంత రవిప్రభా-ముసలితనమను చీకటిని తొలగించు సూర్యుని వంటిది."

మృత్యు ద్వార-కుఠారికా-మృత్యు గుహను ఖండించు కత్తి వంటిది.అమ్మను స్తుతించు.

  2.నిస్సంసయా-సంశయఘ్నీ
    ********************
   సంశయములు లేనిది భక్తుల సంశయములను తొలగించునది జగజ్జనని.



. తల్లీ! స్థూల శరీరము-సూక్ష్మ శరీరము ఒకటేనా లేక వేర్వేరా?

 వాటి ధర్మములు వేర్వేరా లేక ఒకటేనా? అను అనేకానే సందేహములు నా హృదిలో బండరాయి వలె కూర్చుని నన్ను సతమతముచేస్తున్నాయమ్మా..వాటిని పగులగొట్టి సత్యావిష్కారము చేయించగలిగిన పదునైన ఉలులు/ సుత్తులు నీ పాదపద్మములు.

 గిరిజా-పద-గిరిజాదేవి పాదపద్మములు

 ఝంకారి-పద-గిరిజా

 ఝంకారమును చేయుచున్న(ప్రణవోపాసనము చేయుచున్న) గిరిజాదేవి-పాదపద్మములు

 భృంగ తతిం- ఝంకారి-పద-గిరిజా

 తుమ్మెదల సమూహములు-వాలి-ఝంకారముచేయుచున్న-గిరిజాదేవి-పాదపద్మములు

సుమనో-భృంగ-తతి-ఝంకార-పద-గిరిజా

 సుమనస్కులైన దేవతలు అనే తుమ్మెదల సమూహము సేవిస్తూ/ఝంకారము చేస్తూ-ఉన్న గిరిజాదేవి-పాదపద్మములు

 టంకాయమాన- సుత్తుల వంటివి.

 నిశిత-టంకాయమాన-పదునైన సుత్తుల వంటివి

 శిలా-టంకాయమాన-పద-గిరిజా

 బందరాళ్లను ఛేదించే పదునైన సుత్తి వంటి పాదపద్మములు కల గిరిజాదేవి
 శంకా-శిలా-టంకాయమాన-పద-గిరిజా

 సందేహములనే బండరాళ్ళను పగులగొట్టగల పదునైనఉలులువంటి పాదపద్మములు నన్ను ఉద్ధరించును గాక.

 3. అమ్మ మహనీయదయామూర్తి.
    ***************


 రాకేందుముఖి.మచ్చలేనిచంద్రబింబము అమ్మ ముఖము.

 అమ్మ క్షిప్రప్రసాదత్వమును ఆది శంకరులు,

 భవాని త్వం దాసే--భవానిత్వం అను రెండు పదములతో  చమత్కరించారు. 
  " భావానీ-భావనాగమ్యా" తలచినంత మాత్రముననే తరలివచ్చు "భావనా మాత్ర సంతుష్టా".
 సాధకుడు అమ్మను భవానీ-త్వం-అమ్మా నన్ను ....

  నీ దాసునిగానుగ్రహించమని  అడగాలనుకున్నాడట.               అనుకున్నాడట.

   కానీ, అమ్మ   
   అడిగే లోపుననే వాడు నన్ను భవానిత్వమును అడుగుతున్నాడు.ఇచ్చేద్దామనుకుందట.

   భవానిత్వం అంటే?

1.జడశక్తి-జడాత్మికా
 చిఛ్చక్తి-చేతనారూపా

    రెండునూ తల్లి శక్తులే  యని గ్రహించుట.

2 రక్తపు వాగు నీ శరీరము-అశాశ్వతము అనుకున్న తెలివియే
  అమ్మను రుధిర సంస్థితగా,రక్త వర్ణా-మాంసనిష్ఠా ఆ జగజ్జనని శక్తియే 
  యని గ్రహించగలుగుట.

3.ఎముకలగూడు మన-ఉపాధి  అని భావించిన 
 మనమే అందులో అస్థి సంస్థితా శక్తిని అర్థముచేసుకొనగలగటము.

  అంతేకాదు భవబంధ విమోచిని-పశుపాశ విమోచిని మనలోనే 
 ఉన్నదను భావనయే భవానిత్వం.దానిని గ్రహించినవాడే అమ్మ 
 దాసుడు. 



  ద్వంద్వాతీత స్థితి అను మకరందముతో అభిషేకించిన మహాకవి,
 కంకాల,సంకాశ,కంకాది,ఝంకారి,పంకారి,న్యంకాకరే,కిం కారణం,శంకాశిలా,త్వంకామనా,అంకానుపేత,టంకాయమాన,సంకాశమాన,మొదలగు పదములలో బిందు పూర్వక "0కా"అను అక్షరమునుపునరావృత్తము చేసి,నాదభూషణ ములను అలంకరించారు.
  
  సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.

  అమ్మ దయతో అర్చనకొనసాగుతుంది.



KURYAAT KATAAKSHAM KALYAANI0-06


   కుర్యాత్ కటాక్షం కళ్యాణి-06 
   ******************************

 
 ప్రార్థన
 *****

   అవిద్యానాం అంతస్తిమిర మిహిరద్వీపనగరి
   జడానాంచైతన్య స్తబకమకరంద శృతిఝరి
   దరిద్రాణాంచింతామణి గుణనికాం జన్మజలధౌ
   నిమగ్నానాం మురరిపు వరాహస్య భవతి

   శ్లోకము
   *****

 "దాసాయమాన సుమహాసా కదంబ వనవాసా కుసుంభమనో
 వాసా విపంచికృత రాసా విధూత మధువాసారవింద మధురా
 కాసార సూన తతిభాసాభిరామతను ఆసాద శీతకరుణా
 నాసామణి ప్రవరణాసా శివా తిమిరమాసాదయేత్ ఉపరతిం."
  స్తోత్ర పూర్వ ప్రస్తావనము

    జగజ్జనని కదంబవనములో విహరిస్తూ సమస్త దేవతాగణములను ఆశీర్వదిస్తున్నది.మునిగణములను (తనను సేవిస్తున్న) తన పాదరజముచే తేజోమూర్తులను చేస్తున్నది.తన నీలోత్పల పాద మకరందాస్వాదన చేయుటకు సాధకుల యొక్క మనసును తుమ్మెదగా మలచమని ప్రార్థింపబడుచున్నది.సంసార సర్పమును కడతేర్చు ఆడముంగిసగా,సంసార సాగర కీలలను ఇంకింపచేయు సూర్య ప్రతాపముగా భువనములను పాలించుచున్నది.
 పదవిన్యాసము.
 *************
 1.తిమిర మిహిరద్వీపనగరి.

  ఉపరతిం ఆసాసయేత్-తొలగునట్లుచేయును గాక
  తిమిరం-ఉపరతిమాసాదయేత్
-చీకట్లను-తొలగునట్లు-చేయునుగాక.
  భాసా-తిమిరం-ఉపరతిం-ఆసాదయేత్
  కాంతిచే-చీకట్లను-తొలగునట్లు చేయును గాక.
  నాసామణి-భాసా-తిమిరం-ఉపరతిం-ఆసాదయేత్
  ముక్కెర మణి కాంతులచే -చీకట్లను-తొలగునట్లు చేయును గాక.
  శివా-నాసామణి-భాసా-తిమిరం-ఉపరతిం-ఆసాదయేత్
  శివాని/శుభంకరి-తన ముక్కెర-కాంతిని ప్రసరించి-చీకట్లను-తొలగునట్లు-చేయును గాక.
" కాలకంఠి-కాంతిమతి-కమలాక్ష నిసేవితాయై నమో నమః."
  ప్రస్తుత వాక్యములో చీకటి-వెలుతురు అను ద్వంద్వములు ప్రస్తావించబడినవి.
  అమ్మ  జగములను తన
 "నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల గా " తన అరుణకాంతి యను    కరుణతో బ్రహ్మాండముల చీకట్లను తొలగించి-ప్రకాశవంతము చేస్తున్నది.
 అమ్మకాశి విశాలాక్షి-కాంతిమహాదేవి.
 అమ్మ జగములతో పాటు,జగదీశ్వరుని సైతము,
'మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా"
 తనమందస్మితకాంతులతో మహాదేవుని మానసమును మునకలు వేయిస్తున్నది.
 " చీకటిలోని ఏ వస్తువును చూడవలెనన్న దానిని తొలగించగలిగిన కాంతి అవసరము.అనగా చీకటిని అధిగమించగలిగిన సామర్థ్యమును కాంతి కలిగియుండవలెను.లేనిచో ఆ కాంతి తన పరిధిని దాటి,చీకటిలో నున్న వస్తువును చూపించలేదు పూర్తిగా."
  పరమేశ్వరి తన నాసామణి నుండిప్రసరింపచేస్తున్న కాంతి మండలము బ్రహ్మాండమండలములోని చీకట్లను పూర్తిగా తొలగించవేయగల తేజోమండలము.
     అనగా,
 " సకల కాంతి పదార్థములు పరమేశ్వరి నుండియే కాంతిని పొందుచున్నవికాని,పరమేశ్వరికి కాంతినీయగల పదార్థమేదియును లేదనుట నిస్సందేహము."
  స్వయంప్రకాశక స్వరూపుణి ఆ జగజ్జనని.
  కనుకనే దశమహావిద్యలలో చూపినట్లు కాళి విద్య నుండి నాదము-ప్రకాశము అను రెండు లక్షణములను తనకు తానే ప్రకటించుకొనుచు,తారాదేవి ఉద్భవించినది రెండవశక్తిగా.

 మహాకవి ప్రస్తావించిన ప్రకాశ ప్రసరణము అమ్మవారి నాసామణిలోని ముక్కెర మణి కాంతి.అత్యద్భుతము.అద్వితీయ ఆవిష్కరనము.

  ముక్కెర ప్రాశస్త్యమును గ్రహించుటకు పూర్వము అమ్మవారి ముక్కును,
 " శరత్చాంపేయ పుష్పాభ  నాసికాయై నమోనమః"అని స్తుతించుటలోని భావమేమిటి?
  అమ్మ నాసిక కిందకు వంగియున్న సంపెంగ పూవు వలె నున్నదట.తుమ్మెదలు వాలుట కొంచము కష్టము.అంతే కాదు మకరందము కానరానిది.షట్పదము  గ్రోలవలెనన్న ఆసక్తినికలుగచేయనిది.అమ్మ నాసిక మందార మకరంది.నిగూఢ మాథుర్యము కలది..
 ఇహములనే ఉపాధిని.ఇంద్రియములు-మనసును   సామాన్యమైన/సాధారణమైన తృష్ణతో  ఆరురెక్కలతో వచ్చి సేవించుటకు  వాలనీయనిది.అమ్మ అనగాద్భుత చారిత్ర.
 అమ్మ
 "తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా" స్వయంప్రకాశక శుక్రతారాదుల కాంటిని సైతము తోసివేయునది.
 జనని కుడిముక్కునకు పగడపు ముక్కెర-ఎడమ ముక్కునకు వజ్రపు ముక్కెరను ధరించియున్నది.శుక్లశోణితములు.వాటి రెండింటి మధ్యన తనముక్కుదూలము అంచున సత్వగుణ సంశోభితమైన ముత్యమును ధరించినది.
  పగడము-వజ్రము-ముత్యము సత్వ రజోగుణ సంకేతములు.పునఃసృష్టి సూచనములు.
 తమోగుణమునకు తావులేదు.నాసిక అజపామంత్ర సంకేతము.
 తిమిరమును ఏ మాత్రము కానరానీయని అమ్మ నాసాభరణ మణికాంతులు అజ్ఞానమనే నా చీకటులను తొలగునట్లుచేయును గాక.

2.అనఘాద్భుత సౌందర్య శరీరాయై నమోనమః.

  
   జగదంబ
, తనుః-శరీరము కలది
  అభిరామ-తనుః-సొగసైన శరీరము కలది
  భాసా-అభిరామ-తనుః
  ప్రకాశిస్తున్న-సొగసైన-శరీరము కలది.
  తతి-భాసా-అభిరామ-తనుః
  కాంతి సమూహములతో నిండిన సొగసైన శరీరము కలది.
  సూన-తతి-భాసా-అభిరామ-తనుః
  పూలకాంతి సమూహలతో ఒప్పుచున్నసొగసైన శరీరము కలది.
  కాసార-సూన-తతి-భాసా-అభిరామ-తనుః
  సరోవరములోని పూల కాంతుల సమూహములతో తేజరిల్లు శరీరము 
 కలది
 

 అమ్మ,
 దాసాయమాన-సుమహాసా
 పువ్వుల నవ్వులను తన దరహాసముతో ఓడించి,పువ్వులను తన దాసీజనముగా అనుగ్రహించినది.
 సు-మహసా- సుమనస్కులైన వారికి సేవాసౌభాగ్యమును అనుగ్రహించినది.
 సుమ-హాసా-తన నవ్వులను పూలనవ్వులతో పోల్చే వరమును పూలకు అనుగ్రహించినది.
  అమ్మ మహాపద్మాటవీ నివాసా.
 4.
  కళ్యాణి,

 కదంబవనవాసా-కదంబ వనవాసిని
 కుసుంభ సుమనో వాసా-కుంకుమపూవు వంటి పరిమళవస్త్రమును ధరించినది.
  తల్లి-అలంకరనము-అంతరంగము కరుణా సముద్రమే.పరిమళ ప్రకాశమే.వాటి వ్యాపనమే 
విపంచికృత రాసా-తనలో దాగలేక ఉరకలేయుచున్న వీణానిక్వణము.
 తల్లిని తన మానసమనే వనములో సంచరింప చేసే,
  "మాన వనచర సంచారము చేసే వారెందరో మహానుభావులు.అందరికి వందనములు.
 ఆ చల్లని తల్లికరుణను నాపై వర్షించును గాక.

   మహాకవి,
        శివా-కుసుంభ సుమనోహాసా-దాసాయమాన సుమహాసా-నాసామణి ప్రవర భాసా అన్న పదములలో అమ్మవారిప్రసాదగుణ మకరందమునుచేర్చి-అభిషేకించారు.
 మరియు
 1.శివాన్-మంగలం-అస్యాత్--మంగళకారిణి శివాని
 2.శివస్య పత్నిః శివా-శివుని పత్ని శివాని
 3.శివా శక్తిః సముఖ్యాత-శివుని శక్తి- శివాని
 4.మోక్షే-భద్రే-సుఖే -శివా-మోక్షమును-భద్రతను-సుఖమును ప్రసాదించునదిశివాని,
 అంటూ బహుళ  అన్వయములతో " శివా" అను రెండు అక్షరముల ద్వైతముగా ప్రకటింపబడుచున్న ఒకటిగా ,
  దాసాయ-హాసా.వాసా.భాసా,నాసా,ఆసార,కాసార,ఆసాదయేతను శబ్దములతో సా అను అక్షరమునుపునరావృతముచేస్తూ నాదభూషణములను అలంకరించారు.

    సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.
  అమ్మదయతో అర్చనకొనసాగుతుంది.

KURYAAT KATAAKSHAM KALYAANI-05


   కుర్యాత్ కటాక్షంకళ్యాణి-05
   ********************* 


 ప్రార్థన
 ****
  అమూం  తే వక్షోజావమృత మాణిక్య కుతుపౌ

  న సందేహోస్పందో నగపతిపతాకే మనసివ@ 

  పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూసంగ రసికౌ

  కుమారావద్యాపి ద్విరద వదన క్రౌంచదళనౌ.

 శ్లోకము
 ****
  "కుంబావతీ సమవిడంబా  గళేన నవ తుంబాభవీణ సవిధా

  బింబాధరా వినత శంబాయుధాది నికురంబా కదంబ విపినే

  అంబా కురంగ మద జంబాళి రోచిరిహ లంబాలకా  దిశతు  మే

  శం బాహులేయ శశి బింబాభిరామ ముఖ సంబాధిత స్తనభరా."

 స్తోత్ర పూర్వ పరిచయము.
 ****************
   దేవర్షి గణ సంభూత యైన ఆ స్కందమాత కదంబవనములో లీలగా క్రీడిస్తూ పరిపాలనమును గావిస్తున్నది.ఎందరోమహానుభావులను తన చరణధూళిని స్వర్గసోపానములుగా మలచి కటాక్షించినది.సంసార సర్పద్రష్టులను ఆడ ముంగిసయై ఆదుకున్నది.సంసార సాగరమును   ఈదలేని వారిపైజాలిపడి, తాను సూర్యశక్తిగా ప్రకటింపబడుతూ వాటిని ఇంకింపచేసి తరింపచేయునది అయిన ఆ  మాతృమూర్తి నా హృదిలో ప్రకాశించుచు,శుభములను చేకూర్చును గాక అని మహాకవి ప్రార్థించుచున్నాడు.

 పదవిన్యాసము.

 ***********

 " సింహాసన గతానిత్యం

   పద్మాశ్రిత కరద్వయం

   శుభదాస్తు సదాదేవి

   స్కందమాతా యశస్విని." నమోనమః.

 1.స్తనభరా-

  *********

   ఉన్నతమైన-నిండైన -వక్షోజములు కలతల్లి.

  సంబాధిత-స్తనభరా

   వాత్సల్యముతో కూడిన బాధను పొందుచున్న -వక్షోజములు కలతల్లీ.

  ముఖ-సంబాధిత-స్తనభరా

 శిశువు క్షీర పానముచేయువేళ శిశువు ముఖములోని తృప్తిని చూచుచున్న-  వాత్సల్యముతోకూడిన బాధను పొందుచున్న వక్షోజములు కలతల్లీ. 

  అభిరామ-ముఖ-సంబాధిత-స్తనభరా

   మనోహరమైఅ-శిశువు ముఖమును చూచుచు-మాతృ వాత్సల్యముతో కూడిన బాధను పొందుచున్న వక్షోజములు కలతల్లీ.

  శశిబింబ-అభిరామ-ముఖ-సంబాధిత-స్తనభరా

 చంద్రబింబ-మనోహరమైన-శిశువు ముఖమును  చూచుచు-వాత్సల్యముతోకూడిన బాధను పొందుచున్న తల్లీ.
  బాహులేయ-శశిబింబ-అభిరామ-ముఖ-సంబాధిత-స్తనభరా.

 బృహత్తుయే(సర్వము-సమస్తము)శిశువుగా  మారి  -క్షీరపానము చేయుచున్న -చంద్రబింబ -మనోహరమైన-ముఖమును పొందిన కుమారుని/స్కందుని చూస్తూ-వాత్సల్యముతో కూడిన బాధను పొందుతున్న వక్షోజములు కలతల్లీ

 నీవు,

"యాదేవి సర్వ భూతేషు పుష్టి రూపేణ సంస్థితా" గా నున్నావు.కనుకనే,

 భావయత్రి -కారయత్రి వై,

 " ఐశ్వరస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః

  జ్ఞాన వైరాగ్య   యోశ్చైవ షణ్ణా "భగ"ఇతీరిణా.

  సమగ్రమైన ఐశ్వర్యము-ధర్మము-యశము-శ్రేయము-జ్ఞానము-వైరాగ్యము అను ప్రకాశ-గమన శక్తులను,షణ్ముఖములుగా చేసుకుని శిశువునకు నీ  స్తన్యమును బాహులేయునకు అందించుచున్నావు.

 2.మరొక పాఠాంతరము.
   ***************


   ఉత్పత్తిం ప్రళయం  చైవ

   భూతా నామం గతింగతిం

   వేత్తి విద్యామవిద్యాంచ

   న వాచ్యోభగవాన్ ఇతి."



     సృష్టి-ప్రళయం-ప్రాణుల రాక-ప్రాణుల పోక-విద్య-అవిద్య ఎరుక కలిగినవాడు బాహులేయుడు.ఆ ఎరుకను అందించు ఎరుకల సాని కుంబావతీ జగజ్జనని.

  ఆరుగురు కృత్తికల స్తన్యపానముచేసి,అమ్మ చే ఆరు తలల శిశువుగా మార్పుచెంది విజ్ఞాన వికసనమునకు మూలమైన ప్రణవమును పరమేశ్వరునకు ఉపదేశించుటకా  యన్నట్లు బాహులేయుడు సకల శాస్త్రార్థ సారములను  గుహ్యముగా  సేవిస్తున్నాడు. 

      తారకాసుర సంహార సమయమున సుబ్రహ్మణ్యుని శరీరము నుండి ఉద్భవించిన శక్తిని బాహులేయునిగా/వీరబాహునిగా       భావించే  మరొక పాఠాంతరము కలదు.

  ఆదిశంకరులు "సౌందర్యలహరి" స్తోత్రములోని "అరాలకేశేషు" శ్లోకములో అమ్మవారి రూపవైభవమును దర్శింపచేస్తూ,శిరీషాభా చిత్తే,మందహసితా,ప్రకృతి సరళా అని ప్రస్తుతిస్తూనే.వక్షోజములను మాత్రము,

 "ద్రుషదుపల శోభా కుచ తటే" అంటూ సౌష్టవమైన స్థిరమైన సన్నికల్లుతో పోల్చి కరుణను సంకేతించారు. 



  " యాదేవి సర్వభూతేషు స్థితి రూపేణ సంస్థితా."

2.
 బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా.




  అంబ-జగజ్జనని

  నికురంబా-సమూహము కలది

  ఆది-నికురంబా

 మొదలైనవారి సమూహము కలది.

 ఆయుధ-ఆది-నికురంబా

 ఆయుధధారులైనవారి-సమూహముకలది.

 శంబ-ఆయుధ-ఆది-నికురంబా

 వజ్ర-ఆయుధధారులు-మొదలగువారి-సమూహముకలది.

  వజ్రాయుధాది-(ఇంద్రాది) సమూహము కలది.

 వినత-శంబ-ఆయుధ-ఆది-నికురంబా

 వినమ్రులై నమస్కరించుచున్న-ఇంద్రాది దేవతా-సమూహము కలది

 కదంబ విపినే-వినత-శంబ-ఆయుధ-ఆది-నికురంబా

 కదంవనములో-వినమ్రులై నమస్కరించుచున్న-ఇంద్రాదిదేవతా-సమూహము కలది.

 సురార్చిత పదా-నమోనమః.

 .3.కాళికా స్వరూపముగా,

 " మాణిక్యావీణాం ఉపలాలయంతీం

   మదాలసాం మజుల వాగ్విలాసాం." 
  జగజ్జనని,


 సవిధా-పోలికను కలిగియున్నది

 ఆభ-సవిధా

 తలపించు-పోలికను కలిగియున్నది

  నవతుంబ  -ఆభ-సవిధా

 లేత సొరకాయను-తలపించు-పోలికను-కలిగియున్నది.

 గలేన-నవతుంబ-ఆభ-సవిధా

 కంఠ సౌకుమార్యము-లేతసొరకాయను -తలపించు-పోలికను- 
 కలిగియున్నది

 వీణ-గళేన-నవతుంబ-ఆభ-సవిధా

 అమ్మలగన్న అమ్మ-మెడలో-లేతసొరకాయను-తలపించు-పోలికను -కలిగిన-వీణను-ధరించి 

  కుంబావతె విడంబా- కొండజాతి స్త్రీని,తాను పోలియున్నది.

 కుంబావతీ-సమ--గళేన-నవతుంబా- వీణ-ఆభ-సవిధా

 ఎరుకలసానివలె-కంఠమున  -లేతసొరకాయ-పోలికను తలపించు-వీణను-ధరించి బోయస్త్రీ వలె అమ్మ సాక్షాత్కరించుచున్నది.

 "ఎరుకకలిగిన శివుడు ఎరుకగా మారగా,

  తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా".

 

  
"కిమపి మహతాంపశ్యంతి" అని జగద్గురువులు స్తుతించినట్లుగా మహాకవి కాళిదాసు అమ్మయొక్క ఎరుకలసాని రూపప్రకటనములోని అంతరార్థమును గ్రహించి ధన్యుడైనాడు. గిరిజ అనగా కొండజాతికి సంబంధించినది..ఆమెబోయస్త్రీ.అనగా దుష్కర్మలను కౄరమృగములను  వేటాడునది.మహాపద్మాటవి వంటి మనమన్సులోనికి విషయవాసనలను విషపు భావములను రానీయనిది.      సర్వజ్ఞ.      కంబావతీ సంబోధనములో      రూప సామ్యము-నామసామ్యము-సమర్థతా సామ్యము పరిపూర్ణముగా ప్రకటింపబడుచున్నవి. 

   5..

   5.అంబ-మూలపుటమ్మ

   దిశతు-ప్రసాదించునుగాక

   శం-దిశతు-శుభములను ప్రసాదించునుగాక

   ఇహ-శం-దిశతు-

   ఈ జన్మలోనే ప్రసాదించునుగాక

   మే-ఇహ-శం-దిశతు

  నాకు-ఈ జన్మలోనే-శుభములను 

  ప్రసాదించునుగాక.

 అంబ-మే-ఇహ-శం-దిశతు

 జగదంబ-నాకు-ఈ జన్మలోనే-శుభములను-ప్రసాదించునుగాక.

  బింబ+అథర-అంబ-మే-ఇహ-శం-దిశతు

 దొండపండు వంటి క్రిందిపెదవి కల అమ్మ నాకు-ఈ జన్మలోనే-శుభములను ప్రసాదించును గాక.

 అంబ-దిశతు

 లంబ+అలకా-అంబ-మే-ఇహ-శం-దిశతు

 పొడవైన/వేలాడుచున్న కురులుగల-జగజ్జనని-నాకు-ఈ జన్మలోనే-శుభములను-అనుగ్రహించును గాక.

 రోచిస్-జంబల-లంబ  _అలకా-అంబ-మే-ఇహ-శం-దిశతు

 ప్రకాశిస్తున్న-పొడవైన/వేలాడుచున్న కురులుగల-జగజ్జనని-నాకు-ఈ జన్మలోనే-శుభములను-ప్రసాదించునుగాక.

 జంబాల-రోచిస్-లంబ-అలకా-అంబ-మే-ఇహ-శం-దిశతు

 లేపనముతో-ప్రకాశిస్తున్న-పొడవాటి/వేలాడుచున్న-కురులుగల-జగజ్జనని-నాకు-ఈ జన్మలోనే-శుభములను-ప్రసాదించునుగాక.

 కురంగ మద-జంబాల-రోచిస్-లంబ-అలకా-అంబ-మే-ఇహ-శం-దిశతు.

 కస్తురి పరిమళ-లేపనముతో-ప్రకాశిస్తున్న-పొడవాటి/వేలాడుతున్న -కురులు గల-జగదంబ-నాకు-ఈ జన్మలోనే-శుభములను-ప్రసాదించును గాక.

 " శేఖరీభూత శీతాంశు రేఖా మయూఖావళీ

   బద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే"

  నమోనమః 

 స్కందమాతగా అమ్మ అనుగ్రహమును,సు-బ్రహ్మము తానైన కుమారస్వామి తత్త్వమును మందార మకరందముగా చేసి అమ్మను అభిషేకించారు.

 అమ్మను ఎరుకలసానిగను,అమ్మ ధరించిన వీణను లేతసొరకాయతోను,కిందిపెదవిని దొండపండుతోను పోల్చి"ఉపమా కాళిదాసస్యను" సార్థక పరుచుకున్నారు

.,శంబాయుధ-నికురంబా-జంబాక-బాహులేయ-బింబాభిరామ-సంబాధక-అంబా అను పదములలోని"0 బా"  అను 

   బిందుపూర్వక దుష్కర ప్రాసలతో నాదభూషణములను అలంకరించారు.



  యాదేవి సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.



  అమ్మదయతో అర్చన కొనసాగుతుంది.


Thursday, September 14, 2023

KURYAAT KATAAKSHAM KALYAANI-04













   కుర్యాత్ కటాక్షం కళ్యాణి-04
   ******************
   ప్రార్థన
   ******


 గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
 కిరీటం తేహైమం హిమగిరిసుతే కీర్తయతి యః
 సనీడే యత్ ఛాయాత్ చురణశబలం చంద్రశకలం
 ధనుఃశౌనాసీరం కిమితి నః బధ్నాతిధిషణాం.

  శ్లోకము.
  ******


" బాలామృతాంశు నిభఫాలామనంగరుణ చేలానితంబఫలకే
 కోలాహల క్షపితకాలామరాకుశల కీలా శోషణ రవిః
 స్థూలాకుచే జలదనీలాకచే కలిత లీలా కదంబ  విపినే
 శూలాయుధా ప్రణుతి శీలావిభాతు హృది శైలాధిరాజ తనయా."

 పూర్వ స్తోత్ర ప్రస్తావనము.
 ****************
   మందార మకరందమాధుర్యమును గ్రోలుమధుపంబు బోవునే మదనములకు--పోతన  మహాకవి.
  అదేవిషయమునుమరింతనొక్కి వక్కాణిస్తూ,తల్లీ నీ పాద రజ మకరందమును, అనన్య భక్తితో గ్రోలుటకు నామనసును  తుమ్మెదగా మార్చి  నన్ను  అనుగ్రహింపుము .తల్లీ !సంసారమనేసర్పము విషపుకాటులతో నన్ను సతమతము చేస్తున్నది.దానిని ఆడుముంగిసవై అదృశ్యము చేసి నన్ను నీ సేవకు సంసిద్ధముచేయి అని ,మహాకవిప్రస్తుత శ్లోకములో అకుశలతలను తొలగించమని వేడుకుంటున్నారు.
 
 పద విన్యాసము
 *************

1." లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవ యత్
   ద్వితీయం తత్ మన్యే మకుట ఘటితం చంద్రశకలం"
   ఆదిశంకరులు తల్లీ నీ లలాట సౌందర్యము పూర్ణచంద్ర కాంతులీనునది,అయినప్పటికిని సగము భాగము నీ కిరీటము లో నిక్షిప్తమై,మిగిలిన అర్థభాగ  చంద్రరేఖ మాత్రమే నీ ఫాలభాగముగా ప్రకాశించుచున్నదని,  అహం-నేను,మన్యే-భావిస్తున్నాను తల్లీ"అని దర్శించి,మనలను అనుగ్రహించారు. 
 జగజ్జనని,
 *********
 ఫాలా-నుదురు కలది
 నిభ -ఫాలా
 పోలిన-నుదురు కలది
 అంశు -నిభ -ఫాలా
 కిరణములను-పోలిన-నుదురుకలది
 అమృత-అంశు-నిభ -ఫాలా
 అమృత-కిరణములను-పోలిన-నుదురు కలది.
 బాల-అమృత-అంశు-నిభ
-ఫాలా
 బాల/లేత-చంద్రుని-కిరణములను-పోలిన-నుదురుకలది

 శిరస్థితా చంద్రనిభా  ఫాలసేంద్ర ధనుః ప్రభా"

 అమ్మా నీ ఫాలభాగము అర్థచంద్రరేఖను ధరించి ఇంద్రధనుసు వలె కాంతులీనుచున్నది.
సోమ-సూర్య-అగ్ని తత్త్వ విరాజితమైన జగజ్జనని నుదురు శుభములను  అనుగ్రహించును గాక.
.
 ఉపమా-కాళిదాసస్య-నమోనమః 
 
  
2.వస్త్రము
 *******

 బృహత్-సౌవర్ణ-సౌందర్య -వసనాయై నమోనమః
 బృహత్వమే-స్థూలత్వమే-వస్త్రముగా-ధరించిన సుందరి జగజ్జనని.
 మొదటి శ్లోకములో పాటీరగంధ కుచ శాటీ-అని ఉత్తరీయమును మాత్రమే ప్రస్తుతించినమహాకవి,ప్రస్తుత శ్లోకములో, 

  చేలా-వస్త్రమును(చీరను) ధరించినది
  అరుణ -చేలా-ఎర్రని వస్త్రమును - ధరించినది.
  మనాక్-  అరుణ -చేలా-
లేత - ఎర్రని  -వస్త్రమును- ధరించినది.


3.ఓం సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమః 

 కుచే-
వక్షోజములు (పోషించునది) కలది
 స్థూలా -కుచే
-విశ్వపోషణను నిర్వహించు స్తనములు కలది.

4.  చంపక-అశోక- పున్నాగ- సౌగంధిక- లసత్-కచా
 చంపకములు-అశోకములు-పున్నాగ పుష్పములు మొదలగువానికి సౌగంధమును ప్రసాదించుచు-ప్రకాశించుచున్న థమ్మిల్లము కల జనని నమస్కారము.

  కచే-కేశ సంపద కలది.
 నీలా-కచే-
నల్లని- కేశసంపద కలది.
 జలద-  నీలా- కచే-
 జలమును ధరించి-ద-ఇచ్చుటకు/వర్షించుట సిద్ధముగా నున్న మేఘము వంటి నల్లని కేశ సంపద కలది.
 లీలా స్వరూప విలాసము కలది.
 కలిత లీలా-తనకు తాను మనోహరముగా కల్పించుకొనిన రూప సౌందర్యము కలది.
   ఆది శంకరులు అమ్మ స్వరూపమును దర్శింపచేస్తూనే స్వభావమును సంస్తుతిస్తున్నారు.

4.రవి -సూర్యుని వంటిది.
  శోషణ - రవి-
 ఇంకింపచేయు సూర్యుని వంటిది.
   కీలా-  శోషణ - రవి
 జలములను- ఇంకింపచేయు -సూర్యుని వంటిది.
 అకుశల  - కీలాల-  శోషణ- రవి
 కుశలము కాని-(/కష్టములను)  నీళ్ళను - ఇంకింపచేసే - సూర్యుని వంటిది

 అమర  - అకుశల -  కీలాల -శోషణ - రవి

 దేవతల - కష్టములను  -నీళ్లను - ఇంకింపచేసే - సూర్యుని వంటి తల్లి

  - క్షపిత-కాల--- అమర      . అకుశల  -కీలాల - శోషణ - రవి

 కష్ట కాలము గడుపుచున్న -     దేవతల    -   కష్టములను నీళ్ళను- తన వేడిమితో-ఇంకింపచేయు - సూర్యుని వంటి తల్లి
 కోలాహల-క్షపిత కాల -అమర-  అకుశల  -  కీలాల-శోషణ-రవి

 చుట్టుముట్టి కదలనీయని సమయములోనున్న-వాటిని అధిగమించలేని స్థితిలో నున్న - దేవతల - కష్టాల సమూహములనే నీళ్ళను - ఇంకింప చేయు - సూర్యుని వంటి తల్లీ.


 చంద్ర సూర్య అగ్ని కళాత్మిక త్రినయని,అర్చిషిత్-మహస్వత్-జ్యోతిష్మత్ అను మూడు విధములైన కళలను ప్రసరింపచేస్తు సమశీతోష్ణములను కలుగచేస్తుంది.
 సూర్యుని నుండి ప్రసరించునవి   మహస్వత్ కళలు.కష్టములనే జలమును ఇంకింపచేయునవి.
5.
 

 'ప్రణమ్రేష్వేతు ప్రసభముపయా తస్య భవనా
  భవస్యాభ్యాత్థానే తవ పరిజనోక్తిః విజయతే (కిరీతం వైరించి-సౌందర్యలహరి)
   సదాశివుడు గజాసురసంహానంతరము భవనమునకు విచ్చేయుచున్న వేళ,జగన్మాతభర్తను స్వాగతించి,నమస్కరించుటకు ఎదురేగుచున్న సన్నివేశము.అమ్మా నీ దారిలో నీకు నమస్కరించుటకు, వారి విజయములను  విన్నవించుకొనుటకు నీచే పంపబడిన దేవతలకిరీటములు తాకి నిన్ను నొప్పించగలవు.కనుక వాటిని చూసి-దాటుకుంటూ వెళ్ళు తల్లీ అని చెలొకత్తెలు విజయధ్వానములను చేయుచున్నారట.
 తల్లి మహా పతివ్రత.ప్రతిరోజు అత్యుత్సాహముతో శూలధారికి ప్రణమిల్లునది.ప్రణుతులను విని ఆనందించునది,అదేవిషయమును ఆదిశంకరులు జిహ్వాగ్రమున నున్న శుక్లసరస్వతి నీ పతి వీరగాధలను వినిపిస్తూ తాను సైతము నీ జిహ్వాగ్ర ఎర్రదనమును సంతరించుకున్నదని భావించారు.

 శీలా-స్వభావము కలది
 ప్రణుతి  -శీలా-
స్తోత్రములే ఆహ్లాదము కలిగించు స్వభావము కలది
 శూలాధిప -ప్రణుతి శీలా-
శూలధారి యైన పరమేశ్వరుని స్తోత్రములకు సంతసించు స్వభావముకలది యైన
 శైల  అధిరాజ  తనయా
  పర్వత రాజపుత్రిక
 
  భాతు-ప్రకాశించును గాక
 వి-  భాతు
    -విశేషముగా    -ప్రకాశించును గాక
 హృది - వి- భాతు-
హృదయములో నిలిచి విశేషముగా ప్రకాశించును గాక
 మే-హృది-విభాతు
 నా హృదయములో నిలిచి విశేషముగా ప్రకాశించును గాక.


  

 ఓ శైలపుత్రీ!
  నీవు భాను మండలమధ్యస్థా-భైరవి భగమాలినిగా,   వశిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుచున్నావు.అంతే కాదు మను విద్యా-చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా కూడా స్తుతింపబడుచున్నావు.తల్లీ నీ దక్షిణనేత్ర తీక్షణతగా సౌరశక్తిగా-వామ నేత్ర శరత్-జ్యోత్స్న ను       చంద్రశక్తిగా ప్రసరింపచేయుచు  జగమునకు పోషణను కలిగిస్తున్నావు.
 ఓ స్థూలాకుచా నీ స్తనదర్శనములో మాకు మేము స్వీకరించే ఆహార పానీయాలను దర్శించగలగాలి.వక్రదృష్టి మా దరికి రానీయకమ్మా.నీ వు మాకు ఆహారమునకు కావలిసినజలమునందించు నల్లని మేఘ సంస్కారము  నీ నల్లనికురులలో నిక్షేపించావు. ఓ జలద నీలకచా కరుణామృత వర్షమును అనుగ్రహించిమమ్ములను పోషించుచున్న ఓ
 గోప్తీ గోవిందరూపిణి నీవు శివస్తుతులను ఆలకించుటయే నీ సహజ స్వభావముగా ఉంటావు.శివుడే శుభంకరుడు.శుభముల యందు  ఆసక్తి నీ సహజ స్వభావము.
   మహాదేవ రతౌత్సుక మహాదేవి వందనమమ్మా. 

  సంసార పంకనిర్మగ్నా! నీవు నన్ను ఈదనీయలేని సంసార సాగర కీలలను,నీ సూర్య ప్రతాపముతో ఇంకింపచేసి,నాహృదయములో వసించి,చైతన్య భరితము చేయవమ్మా.
అను భావ మకరందముతో అమ్మను  అభిషేకించారు. 
  
  ఉపమాకాళిదాసస్య-అన్న నానుడిని రూఢి పరుస్తూ మహాకవి,అమ్మ నుదుటిని బాల చంద్రుని తోను,అమ్మ కురులను వర్షించే నల్లని మేఘముతోను,అమ్మ సంరక్షణ  బాధ్యతను సూర్య ప్రతాపముతోను,అమ్మ సౌభాగ్య గుణమును శివ స్తోత్ర  శ్రవణముతోను మనకు అర్థమగుటకు అన్వయించి,దర్శింపచేసారు.

  బాలా,ఫాలా,చేలా,కోలాహలా,కాలా,కీలా,స్థూలా,నీలా,లీలా,శూలా,శీలా,శైలాధిరాజ మొదలగు పదములలో లా అను అక్షరము ఆవృత్తముచేసి వృత్తానుప్రాస  లతో నాదభూషణములను అలంకరించారు..

  కవితా చమత్కారము.
 మహాకవి కాళిదాసు జలమును కరుణకు-కష్టములకు వేరువేరు సందర్భములలో ప్రస్తావించి కమనీయతను చాటినారు.
 శూకాతుధ  అను పదమును త్రిగుణాతీత స్థితికి సంకేతించినారు.

   యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
  నమస్తస్త్యై నంస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః
  సర్వం శ్రీమాత  దివ్యచరణారవిందార్పణమస్తు. 

 (అమ్మ  దయతో అర్చన కొనసాగుతుంది.)



















 ****









KURYAAT KATAAKSHAM KALYAANI-03



   కుర్యాత్ కటాక్షం కళ్యాణి-03
   ****************
 ప్రార్థన


  దృశాద్రాఘీ   యస్యా దరదళిత నీలోత్పల రుచా

  దవీయాంసుం" దీనం స్నపయ కృపయా మామపి శివే"

  అనేనాయం ధన్యో భవతి న చతే హానిరియతా

  వనేవా హర్మేవా సమకర నిపాతో హిమకరః.

  శ్లోకము
  ******
 " యాళీ భిరాప్త తనుతాళీనకృత్ ప్రియక   పాళీషు   ఖేలత  భవ

   వ్యాళీ నకుల్యసిత చూళీభరా     చరణ ధూళీ లసత్   మునిగణా

   యాళీ భృతి శ్రవసి తాళీదళం వహతి యాళీక శోభితిలకా

   పాళీకరోతు మమకాళీ మనః స్వపద నాళీక సేవన విధౌ."

 స్తోత్ర పూర్వ ప్రస్తావనము
  ***************
    అమ్మా నీవు కదంబవనములో చెలులతో సఖ్యముగావిహరిస్తూ,సమస్త దేవతాగణముచే పాదసంసేవనమును స్వీకరిస్తూ వారిని అనుగ్రహిస్తున్నావు.తపోధనులైన వ్యాస వాల్మీకాదులకు నీ అనుగ్రమును సోపానముచేసి ఉద్ధరించుచున్నావు.భక్తరక్షణాశీలా 
    సనకాది సమారాధ్యా-నీవు అసంఖ్యాక   మునిగణములను  నీ పాదరజముతో (సామీప్య భక్తానుగ్రహముతో ) తేజోవంతులను చేయుచున్న కరుణామయి నన్ను సైతము నీ పాదారవింద మకరందము గ్రోలుటకు అనువైన తుమ్మెద సామర్థమును   ప్రసాదించమని   అర్థించుచున్నారు.

ప్రస్తుత శ్లోకములో     
    జట్టునకు నాయకియై నదురు-బెదురు లేక శత్రువులపై దాడిచేసి,లోబరచుకొను సామర్థ్యము కల ,  ఆడ ముంగిసయై ఆర్త్రత్రాణపరాయణమును చేయుచున్న  అమ్మను స్తుతించే   ప్రయత్నము చేద్దాము. 

  పద విన్యాసము
 ********** 
1. లీలన్ క్రీడయతి లలితా
 ఆదిశంకరులు,
 పదన్యాసక్రీడా పరిచయమి.....తవ చరణ కమలంచారుచరితే.

  సకల భువనభాండములను సముచిత స్థానములలో నుండునట్లు చేయు లీలయే ఆ పదన్యాసము.

 సా కాళీ-కాళికాదేవి/ ఆ కాళికాదేవి

 ఖేలతి-క్రీడించుచున్నది 

 పాళీషు-సాకాళీ-ఖేలతి

 వనములో/ఉద్యాన వనములో కాళికాదేవిక్రీడించుచున్నది.

 ప్రియక-పాళీషు-సా కాళీ-ఖేలతి

 కడిమి తోటలలో కాళికాదేవి క్రీడించుచున్నది.

 ఆళీనకృత్-ప్రియక-పాళీషు-సా కాళీ-ఖేలతి

 కలిసిమెలిసినదై-కదంబ వనములో-కాళికాదేవి-క్రీడించుచున్నది.

 ఆళీభిః-ఆళీనకృత్-ప్రియక-పాళీషు-సా కాళీ-ఖేలతి

 చెలికత్తెలతో-కలిసిమెలిసినదై-కదంబవనములో-కాళికాదేవి-క్రీడించుచున్నది.

 ఆత్మ-ఆళీభిః-ఆళీనకృత్-ప్రియక-పాళీషు-సా కాళీ -ఖేలతి

 తాను అనుగ్రహించిన-చెలికత్తెలతో-కలిసిమెలిసినదై-కదంబ వనములో-కాళికాదేవి-క్రీడించుచున్నది.నమో నమః 


   మొదటి శ్లోకములో కష్టములను దూరము చేయునది కదంబవనము-రెండవ శ్లోకములో, 
  'నయతి ప్రాణినాం సుఖం" నీపం అని స్తుతించిన మహాకవి,ప్రస్తుతశ్లోకములో "ప్రియక-పాళీషు"

 ప్రీణాతీతి ప్రియకః-ప్రీతిని కలిగించేది అను అర్థముతో-పరమార్థముతో సంభావించారు.
2. సా కాళీ- 
   ***********

 వహతి-ధరించినది

 సాకాళి -వహతి

 కాళికాదేవి-ధరించినది

 శ్రవసి-సా  కాళీ-వహతి

 చెవులకు-కాళికా దేవి-ధరించినది.

 తాళీదళం-శ్రవసి-సా కాళీ-వహతి

 తాటంకములు-చెవులకు-కాళికాదేవి-ధరించినది.

 " తాటంక యుగళీ భూత తపన-ఉడుప మండలా".

3, 

 " కళంకం కస్తూరి 



 రజనకర బింబం.....విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవకృతే"



  ఆదిశంకరులు చంద్రకళల హెచ్చుతగ్గులను అమ్మ ధరించు కస్తురిగా పోల్చి బ్రహ్మ తిరిగి తిరిగి దానిని నింపుటచే చంద్రుని జగదంబ బొట్టుపెట్టెగా దర్శించి-ధన్యులైనారు. 

 స కాళి-కాళికా

 వహతి-ధరించియున్నది

 తిలకా-సకాళి-వహతి

 తిలకమును -కాళికాదేవి-ధరించియున్నది

 శోభి-తిలకా-స కాళి-వహతి

 శోభాయమానమైన-తిలకమును-కాళికాదేవి-ధరించియున్నది.

 అళీక-శోభి-తిలకా-సకాళి-వహతి

 నుదుటిపై-శోభాయమానమైన-తిలకమును-కాళికాదేవి-ధరించియున్నది

" కస్తూరి తిలకోద్భాసి నిటలాయై నమో నమః." 

 నమోనమః.

 4.సా కాళీ-లసత్
 *************

 లసత్-ప్రకాశిస్తున్నది.

 సా కాళీ-లసత్

 కాళీకాదేవి ప్రకాశిస్తున్నది.

 చూళీ భరా-సా కాళీ-లసత్

 కేశబంధముతో-కాళికాదేవి-ప్రకాశిస్తున్నది

 భృతి-చూళీ భరా-సా కాళీ-లసత్

 నిండైన-కేశబంధముతో-కాళికా దేవి-ప్రకాశిస్తున్నది.

 అసిత-భృతి-చూళీభర-సా కాళీ-లసత్

 నల్లని-నిండైన-కేశబంధముతో -కాళికాదేవి-ప్రకాశిస్తున్నది.

" ఘన స్నిగ్ధ శ్లక్ణం చికుర నికురంబం తవ శివే-ధునోతు ధ్వాంతం" ఘన-నల్లనైన-స్నిగ్ధం-చిక్కనైన/ఒత్తైన,శ్లక్ణం-మెర్పు-మృదుత్వము కల నల్లని వర్షించే మేఘము వంటి కేశ సంపద శుభములను వర్షించును గాక.

5. కాళికాదేవి పాదపద్మములు ప్రకాశించుచున్నవి.
    ************************
   సా-కాళీ-ధూళీ-చరణ-లసత్

  కాళికాదేవి -పరాగ-పాదపద్మములు-ప్రకాశించుచున్నవి.

  మునిగణా-సకాళీ-ధూళీ-చరణ-లసత్

  మునిగణములచే సేవింపబడుచున్న కాళికాదేవి-పరాగ పాద పద్మములు-ప్రకాశించుచున్నవి.

 6.

 జగజ్జనని,
  సనకాది సమారాధ్యా-సనక సనందన సనత్ సుజాతాదులచే సేవింపబడుచున్నది.అమ్మ అనుగ్రహ ప్రకాశముతో వారు తేజోమూర్తులగుచున్నారు.
 



 పారిజాత గుణాధిక్య పాదుకాయై నమో నమః.

 జగజనని-అనుగ్రహము
 భావయత్రి-కారయత్రి రెండును తానై,

 కరోతు-చేయును గాక

 అళీ-కరోతు

 తుమ్మెదగా-చేయునుగాక

 సేవనవిధౌ-అళీ-కరోతు

 సేవించుకొనుటకు-తుమ్మెదగా-చేయును గాక

 నాళీక-సేవనవిధౌ-అళీ-కరోతు

 నల్లకలువలను-సేవించుకొనుటకు-తుమ్మెదగా-చేయును గాక

 స్వపద-నాళీక-సేవనవిధౌ-అళీ-కరోతు

 తనపాదములనెడి-నల్లకలువలను-సేవించుకొనుటకు-తుమ్మెదగా-చేయును గాక.

  మనః-స్వపద-నాళీక-సేవనవిధౌ-అళీ-కరోతు

 మనస్సును-తనపాదములనెడి-నల్లకలువలను-సేవించుకొనుటకు-తుమ్మెదగా-చేయును గాక.

 మమ-మనః-స్వపద-నాళీక-సేవనవిధౌ-అలీ-కరోతు

 నాయొక్క-మనసును-తనపాదాలనెడి-నల్లకలువలను-సేవించుకొనుటకు-తుమ్మెదగా-చేయును గాక.

 సాకాళి-మమ-మనః-స్వపద-నాళీక-సేవనవిధౌ-అళీ-కరోతు

 కాళికాదేవి-నాయొక్క-మనసును-తనపాదములనెడి-నల్లకలువలను-సేవించుకొనుటకు-తుమ్మెదగా-చేయును గాక. 

 స్వపద్మరాగ సంకాశ చరణ  నన్ను తుమ్మెదగా మలచి పాదరజ మకరందమును గ్రోలునట్లు చేయును గాక.



   కలయతీతి ఇతి కాళి.కదిలిపోవునది కాలము.దాని శక్తియే కాళి.

 కాళ వర్ణత్వాత్  కాళి-నల్లని రంగు గలది.

  దశమహా విద్యలలోని ప్రథమ శక్తి కాళి/కాళికా.

  సమస్తము సమానమై గుప్తస్థితిని పొందినపుడు ఇచ్ఛాశక్తి స్వరూపిణి యైన కాళీమాత తిరిగి సృష్టిని ప్రారంభిస్తుంది.తటస్థమైన శివశక్తిని జాగృతపరచి రాత్రి స్వరూపమైన కాళి,పగటి స్వరూపమైన శివుని శక్తిని కలుపుకుని (రాత్రి+పగలు) సంపూర్ణదినముగా ప్రకటితమగుతూ,(దశమహావిద్యలు) పరిపాలిస్తుంటుంది.

 దివ్య మంగళ  స్వరూపముతో-దీటులేని శౌర్యముతో సంసారమనే సర్పమును సంహరించే ఆడుముంగిస అను చక్కని భావ మకరందముతో మహాకవి అమ్మను అభిషేకించారు. 
ళీ,తాళీన,పాళీషు,వ్యాళీ,చూళీ,ధూళీ,యాళీ,తాళీదళం,యాళీక,అను పదములలో "ళీ" అను అక్షరమును పునరావృత్తము చేస్తూ,

అళీ అను పదమును ఐదు సందర్భములలో విభిన్నార్థములలో,

1.అళీభిః-చెలికత్తెలతో

2.అళీనకృత్-కలిసిమెలిసినదై

3.అళీ-శుద్ధాంతరంగముతో

4.అళీకశోభి-నుడుటమీద ప్రకాశిస్తున్న

6.అళీ కరోతు-నా మనసును) తుమ్మెదగా మలచును గాక

   అని శబ్ద చమత్కారముతో   నాదాభరణములను అమ్మకు అలంకరించారు.
   యాదేవి సర్వభూతేషు సక్తి రూపేణ సంస్థితా
   నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః
    సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.
    
    అమ్మ దయతో అర్చన కొనసాగుతుంది. 


 

  .
 ****

Wednesday, September 13, 2023

KURYAAT KATAAKSHAM KALYAANI-02



 


  కుర్యాత్ కటాక్షం కళ్యాణి-శ్లోకము02
  *************************


 ప్రార్థన



    తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం

    విరించి సంచిన్నన్విరచయతి లోకానవికలం

    వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం

    హర సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలన విధిం.



 శ్లోకము

 

  ద్వైపాయన ప్రభృతి శాపాయుధా త్రిదివ సోపాన ధూళి చరణా

  పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా

  నీపాలయా సురభి ధూపాలకా దురిత కూపాత్ ఉదంచయతు మాం

  రూపాధికా శిఖరిభూపాలవంశ మణిదీపాయితాం భగవతి.



 



 స్తోత్ర పూర్వ పరిచయము



   దేవతా సమూహములచే కదంబవనములో సేవింపబడుతూ,వారి కిరీట కాంతులచే ప్రకాశమును-మంచిగంధపు సువాసనలీను చేలాంచలమును ధరించి పరిమళమును అనుగ్రహింపచేస్తున్న జగజ్జననిని,తాంబూలరసమును ప్రసాదించి,అప్రతిహత ఆశుధారను అనుగ్రహించమనిన స్తుతిని మననము చేసుకుంటూ,ప్రస్తుత శ్లోకములోనికి ప్రవేశిద్దాము.

 పద విన్యాసము.
 జగజ్జనని- కరుణామయి.

 1.చరణా-పాదపంకజములు కల తల్లి

   ధూళి- చరణా-పరాగ పాద పంకజములు కల తల్లి

   సోపాన- ధూళి- చరణా-

   మెట్ల వంటి  - పరాగ  - పాదపద్మములు కల తల్లి

   త్రిదివ  -సోపాన  - ధూళి చరణా

   స్వర్గమునకు మెట్లవంటి  పరాగ పాదపద్మములు కల తల్లి

   ఆయుధ - త్రిదివ - సోపాన - ధూళిచరణా

   శక్తివంతులైన వారికి -         స్వర్గపు-       దారిచూపు 
 మెట్ల వంటి  -  పరాగ పాదపద్మములు కలతల్లి

   శాప   - ఆయుధ   -త్రిదివ  - సోపాన - ధూళిచరణా

   శపించగల -/వాక్శుద్ధి-వాక్సిద్ధి కల/తపోసంపన్నులైన వారికి  
  -స్వర్గమునకు -దారిచూపగల మెట్ల వంటి - పరాగ పాదపద్మములు 
   కల తల్లి

   ద్వైపాయన   -ప్రభృతి- శాపాయుధ - త్రిదివ సోపాన ధూళి 
   చరణా

   కృష్ణ ద్వైపాయనుడు/వేద వ్యాసుడు   మొదలగు తపోసంపన్నులకు స్వర్గమునకు 
   దారిచూపగల మెట్ల వంటి పరాగ పాద పద్మములు కల తల్లి
    
  "దేవర్షి ముని సంజాత స్తూయ మానాత్మ 
  వైభవా"
             నమోనమః
2 జగజ్జనని-నేర్పరి.

 నిపుణా-నేర్పరి

 అపనోద   - నిపుణా-

  తొలగించుటలో   -నేర్పరి

 తాప -  అపనోద   -నిపుణా

 తాపత్రయములను-తొలగించుటలో  -నేర్పరి

 జన- తాప -  అపనోద- నిపుణా


 జనుల - మూడు తాపములను- తొలగించుటలో- నేర్పరి

 అనులీన- జన - తాప-నిపుణా

 తన భక్త- జనుల- తాపములను తొలగించుటలో- నేర్పరి

 జాప- అనులీన జన- తాప- అపనోద-నిపుణా

 జపమును చేయు/జపించు తన భకత జనుల తాపములను 
 తొలగించుటలో నేర్పరి

 మను-  జాప- అనులీన -జన తాప- అపనోద- నిపుణా

 మంత్రమును జపించు తనభక్త జన తాపత్రయములను తొలగించుటలో 
 నేర్పరి

 ఆధ్యాత్మిక-ఆదిభౌతిక-ఆదిదైవికము అను మూడు తాపములను/తాపత్రయములను  
 తొలగించే జనని.

  తనకు-తన వారికి కలిగే శరీర సంబంధ రుగ్మతలు-మానసిక 
  రుగ్మతలు ఆధ్యాత్మిక తాపములు.

   విషజంతువులచే కలుగుబాధలు ఆదిభౌతికములు.

  వరదలు,అగ్నిప్రమాదములు-ప్రకృతి వైపరీత్యములు ఆదిదైవిక  
  తాపములు అని పెద్దలు చెబుతారు.

  "తాపత్రయాగ్ని సందగ్ధ సమాహ్లాదిక చంద్రికా అయిన తల్లి"  
  మనలను 
  వాటినుండి దూరము చేయును గాక.,

 3. జగజ్జనని-దివ్యమంగళ 
    
     రూపా- దివ్యమంగళ విగ్రహము.
     విశేషముగా భక్తిని గ్రహించునది/భక్తుని అనుగ్రహించునది.
  
  అధికరూపా-సాటిలేని దివ్య మంగళ  విగ్రహా
  వయోవస్థా వివర్జితా-వయస్సునకు సంబంధించిన మార్పులు లేనిది,సర్వావస్థా వివర్జితా-త్రిగుణములుగా ప్రకటింపబడుచున్నప్పటికిని /త్రిగుణాతీత స్థితియును తానైన,సర్వ మంగళ స్వరూపమే తానైనది.   

   అలకా- రూపాధికా -
 చక్కని కేశ సంపదతో కూడిన  అనుపమాన/ పోలిక కానరాని దివ్య 
 మంగళ విగ్రహా 

  ధూప-  అలకా- రూపాధికా

  ధూప సేవనమును పొందిన- చక్కని కేశసంపదతో కూడిన -దివ్య మన్గళ విగ్రహా 

  సురభి ధూప- అలకా- రూప- అధికా
 యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం అని సంకీర్తించారు ఆదిశంకరులు.ఆ తల్లి కేశపాశ సహజ సౌందర్యము మా మనసులోని చీకటిని తొలగించును గాక.
   
" దశాంగం గుగ్గిలోపేతం-సుగంధంచ సుమనోహరం
   మహాదేవి నమస్తుభ్యం గృహాణ వరదో భవ"
  క్లేశ హరితములే అమ్మవారి 
  కేశములు.నిత్యసుగంధ 
  భరితములు.సౌభాగ్యప్రదములు.

    దేవి అథాంగ పూజ.
 అగరు సుగంధ ధూప సేవనమును భక్తులకు అనుగ్రహించిన కేశ 
 సంపద కల దివ్య మంగళ విగ్రహా"   నమో నమః



   4.జగజ్జనని-భవతారిణి.        


     ఉదంచయతు-ఉద్ధరించునుగాక

     మే - ఉదంచయతు-నన్ను ఉద్ధరించును గాక

  కూపాత్-మే-ఉదంచయతు-కూపములనుండి నన్ను ఉద్ధరించును గాక

  దురిత- కూపాత్- మే- ఉదంచయతు-పాపకూపములనుండి నన్ను ఉద్ధరించును గాక

 పాప-అపహ- దురిత- కూపాత్- మే-ఉదంచయతు

 పాపములను తొలగించి- పాప కూపము(బావి) నుండి- నన్ను పైకిలేపి- ఉద్ధరించును గాక

 నీపాలయా- పాప- అపహ- దురిత- కూపాత్- మే- ఉదంచయతు.

 కడిమి వనములోనివసించు తల్లి- పాపములను తొలగించి-,పాప కూపము నుండి- నన్ను- ఉద్ధరించును- గాక
 

 భగవతీ- నీపాలయ- పాప-అపహ- దురిత- కూపాత్- మే -ఉదంచయతు

 కడిమి వనవాసియైన భగవతి పాపములను తొలగించి,దురిత కూపము నుండి నన్ను ఉద్ధరించును గాక

 కదంబవనమును ప్రస్తుత శ్లోకములో నీపాలయా, అని సంకీర్తించారు.
 నయతి ప్రాణినః సుఖం-నీపం అన్నది వారి భావన.
 సుఖమును కలిగించేది-దుఃఖములేనిది .కదంబవనము.సకలప్రాణులకు సుఖమును కలిగించేది/దుఃఖమును తొలగించేది అమ్మ కరుణాంతరంగము.
 తల్లి మన హృదయాంతస్థ యైన వేళ మన హృదయము సైతము నీప-ఆలయమే..

 మణిదీపా - భగవతీ- నీపాలయా- పాప- అపహ- దురిత కూపాత్ -మే- ఉదంచయతు.

 మణిదీపమైన భగవతి-కదంబ వనవాసిని పాపములను తొలగించి-పాపకూపము నుండి-నన్ను ఉద్ధరించును గాక.

 భూపాల వంశ- మణిదీపా- నీపాలయా- పాప+ అపహ- దురిత కూపాత్- మే -ఉదంచయతు.

  రాజవంశ మణిదీపము-కదంబ వనవాసి-భగవతి-పాపములను తొలగించి-పాప కూపము నుండి- నన్ను- ఉద్ధరించును గాక.

 శిఖరి- భూపాల వంశ- మణిదీపా నీపాలయ భగవతి పాప అపహర దురిత కూపాత్ మే ఉదంచయతు.

 పర్వతరాజ వంశ మణిదీపము-కదంబ వనవాసిని భగవతి యైన తల్లి పాపములను తొలగించి దురిత కూపము నుండి నన్ను ఉద్ధరించునుగాక.
5. జగజ్జనని సర్వమంత్రాత్మికా

2.స్వమను-సర్వమంత్రాత్మిక యైన జగన్మాత అష్టాక్షరిగా,పంచదశిగా,షోడశి గా,ఇంకా అనేకానేక మంత్రములుగా నాదరూపముతో విరాజిల్లుతూ,నామపారాయణమును చేసేవారి తాపములన్నింటిని తొలగించివేస్తుంది.మంత్రాణాం మాతృకాదేవి
   "నామ పారాయణాభీష్ట" 


    జగజ్జనని అరిషడ్వర్గములలోని  క్రోధవశుడై కాశిపట్టణమునకు శాపమునీయబోవు స్థితి నుండి అన్నపూర్ణయై రక్షించినది అని కూడా మరొక పాఠాంతరము. 
   శిఖరి  భూపాల మణిదీపా-భగవతీ-పాపాపహరా-రూపాధికా అన్న పద భావమకరందముతో అమ్మను అభిషేకించారు.
  ద్వైపాయన-శాపాయుధ-సోపాన-పాపాపహ-జాపానులీన-తాపానోద-నీపాలయా-ధూపాలకా-కూపాత్-భూపాల-మణిదీపా-రూపాధికా అన్న పదములలోని "పా" అను అక్షరమును పలుమార్లు పునరావృత్తిచేసి నాదభూషణములను అలంకరించారు.
  యాదేవి సేవభూతేషు దయారూపేణ సంస్థితా
  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై  నమోనమః,
  సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.

    అమ్మ దయతో అర్చన కొనసాగుతుంది.


 



 

(







TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...