Saturday, August 31, 2024

SREESUKTAM-08-KSHUPTIPASAAMALAAM


   శ్లోకము

  " క్షుప్తిపాసా మలాం  జ్యేష్ఠాం అలక్ష్మీం  నాశయామ్యహం
    అభూతి అసమృద్ధించ సర్వానిర్ణుద మేగృహేత్"

    తనతాను సంస్కరించుకొనబడుటకు లక్ష్మీ  అనుగ్రహమునకై జాతవేదుని సహాయమును అర్థించుచున్నసాధకుడు ఇంతవరకు వారు నాదగ్గరకు రావాలి.అతి సమీపముగా ఉండాలి.నన్ను వీడకుండా నాశ్వసలో శ్వాసగా ఉండాలని కోరుతూ వచ్చాడు.
   కాని వారు వచ్చిన స్థిరముగానిలుచుటకు అవకాశము లేని కొన్ని అడ్డంకులు/ఆటంకములు తనలో  ఇంకా ఉన్నాయని,అవి తొలిగితే కాని వారిని స్థిరాసీనులను చేయలేనన్న విషయమును గ్రహించాడు.
  కనుకనే ఓజాతవేద! నేనడిగిన వానిని నాదగ్గరకు చేర్చేముందుగా మూడు రకములైన దురవస్థలు నన్ను వీడక ఉన్నాయి.ముందు వాటిని పూర్తిగా,"నిర్ణుద" అమ్మ కరుణపూర్తిగా/సంపూర్తిగా తరిమివేయునట్లు అనుగ్రహించమని సహాయపడుము.
  పునర్జన్మతో సంస్కరింపబడాలంటే,
      నాలోని,
 .క్షుత్తు-ఆకలి 2.పిపాస-దప్పిక 3మలము తొలగిపోవాలి.
  క్షుత్తు-పిపాస అభూతినికలిగిస్తాయాఇ.
  భూతి అనగా సంపద.న భూతి అభూతి-సంపదను చేరనీయని ఒక దురవస్థ.
  సమృద్ధి-పుష్కలము.ఒకవేల సంపద లభించినను తగినంత చేరనీయక పోవుట మరొక దురవస్థ.
   ఈ రెండు దురవస్థలు నాలోని యుక్తాయుక్త వివేకమును లోపింపచేసి కౄరకర్మలను చేయిస్తాయి.
   తత్ఫలితముగా  నా గృహమున జ్యేష్ఠాలక్ష్మీ తాందవిస్తూ తమోగుణమును విస్తరింపచేస్తుంటుంది.ఆకలి-దప్పికలతో/శోక-మనోవ్యథలతో/జరా-మరణభయముతో నేను కప్పివేయబడతాను.
    కనున-మే గృహేత్,
 1.అభూతిం  నాశయామి
 2.అసమృద్ధి  నాశయామి
 3క్షుప్తి నాశయామి
 4పాసా  నాశయామి
 5.మలాం  నాశయామి

  6 వీటికి మూలకారణమైన జ్యేష్టాదేవి తరలిపోవాలి.
     అదికూడా సర్వా-అంతటా-పూర్తిగా తరిమివేయబడాలి.

     ఆతదుపరి నా గృహము శోభాయమానముగా /నా ఉపాధి సంస్కారవంతముగా  మాలా మాయను తరిమి వేయగలగాలి.
    నాబుద్ధి తనలోని తమోగుణమును విడిచిపెట్టగలగాలి.మాయను  గుర్తించగలగాలి.
  నాఉపాధిలోని చైతన్యము ,
 1.అపరిమితము పరిమితముగాను
 2అశాశ్వతమును శాశ్వతముగాను
 3.స్వస్వరూపమును ఉపాధిగాను 
    భ్రమపడుటను తొలగించాలి.కనుక నీవు దయతో నా భ్రాంతి యొక్క ముసుగులో భగవంతుని పరిపూర్ణత్వమును గుర్తించలేని స్థితిని "నిర్ణుద" తొలగించగలుగు ప్రకాసమును అందింపుము.
   హిరణ్మయీం  లక్ష్మీ సదా   భజామి.
   

Thursday, August 29, 2024

SREESUKTAM 07-UPAITU MAAM



 శ్లోకము
 
 "ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ
  ప్రాతుర్భూతోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతుమే"

   ప్రస్తుత శ్లోకములో సాధకుడు జాతవేదుని "ఉపైతుమాం" అనగా
 మాం -నాదగ్గరకు,ఉప-దగ్గరగా,ఇతు-వచ్చియుండునట్లు సహాయము చేయుము అని ప్రార్థించుచున్నాడు.
  అట్లు జరిగినచే నేను బాహ్యమునందును-అంతరంగమందును సంస్కరింపబడి "ప్రాతుర్భూతో"తిరిగి కొత్తజన్మను పొందుతాను,బ్రతికియుండగానే అమ్మ దదాతు మే" నన్ను అనుగ్రహిస్తుంది కనుక.
  ఈ శ్లోకమునందు ప్రదానము చేయువారొకరైతే,దానిని భద్రపరచి అనుగ్రహించువారు వారి పరివారములోని  మరొకరు.
 ఒకరు దేవ-మహాదేవుని సఖుడైన కుబేరుడు.
 సంపదలకు మూలము ఈశ్వరత్వమును కలిగిన మహేశ్వరుడైతే భక్తులకు దానిని భద్రపరచి అందించునది ఈశ్వరవరప్రసాదితుడైన కుబేరుడు.
  సంపదలకు మూలము మహాలక్ష్మి అయితే దానిని మనకు భద్రపరచి అందించు వరమును పొందిన "కీర్తి" అని శక్తి.
  ఈమెను దక్షప్రజాపతి కుమార్తెగాను సతిదేవి అనుంగు సోదరిగాను కీర్తిస్తారు.
 కనుక జాతవేద! దేవసఖుడైన కుబేరుని ఉపైతుని చేయుము.
    చ అనగా మరియును,కుబేరుని ఒక్కనినే కాదు 
  కీర్తిః+చ మాం ఉపైతు. 
     చ మరియును,వీరినిద్దరినే కాదు,
 " మణినా సహ" మణిని కూడా ఉపైతుమాం.నన్ను సమీపించి,నిలిచి ఉండునట్లు సహకరింపుము.
   ఇక్కడ మణి శబ్దమును,
 " రాజరాజేశ్వరీం  లక్ష్మిం వరదాం  మణిమాలినెం
   దేవి దేవప్రియాం కీర్తిం వందే కామ్యార్థ సిద్ధయే" సాక్షాత్తు రాజరాజేశ్వరి అనుగ్రహముగాస్వీకరిస్తే  నా సమీపమునకువచ్చి,నన్ను వీడక నిలిచియుండునట్లు చేయుము ఓ జతవేద.
  తల్లి అనుగ్రహమనే రక్షను మించిన రక్షామణి /కంకణము మరేది లేదుకదా.
   పదార్థమును గమనిస్తే బాహ్య ప్రాపంచిక ఉపాధి అవసరములను సంతృఒతి పరచుటకై కుబేరుని,చింతామణిని నా సమీపమునకు వచ్చి నిలిచియుండినచో నేను కీర్తివంతునిగా ప్రసిద్ధికెక్కుతాను.
  పరమార్థముగా భావిస్తే మహావేవుని అనుగ్రహమును లక్ష్మీదేవి అనుగ్రహమును రాజరాజేశ్వరి మాత అనుగ్రహమును పొందగలుగు స్థితికి నన్ను చేరిస్తే,
 ఓ జాతవేద!
  వారినుండి పొందిన అనుగ్రహముతో నేనూ నా బాహ్య ప్రలోభములను-అంతరంగిక శత్రువులను తరిమివేసి సద్గుణ-సాత్త్విక సంపన్నునిగా తిరిగి మానసికముగా జన్మించి,ధన్యతను పొందుతాను.
    హిరణ్మయీం లక్ష్మీం  సదా భజామి.
 

SREESUKTAM-06-ADITYAVARNAAM


   శ్లోకము


 " ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిః తవ వృక్షోధ బిల్వః

   తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మీః"


   తపఃఫలము బిల్వవృక్షమై ఆదిత్యవర్నముతో ప్రకాశిస్త్యున్నది.లక్ష్మీదేవి తపఫలముగా ఉదయిస్తున్న భానుతేజముతో అనుగ్రహ సంకేతముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినది.


   ఏవిధముగా సూర్యోదయము చీకట్లను తరిమివేసి అఖండకాంతితో ఉంటుందో అదేవిధముగా లక్ష్మీదేవికరుణకు ప్రతిరూపముగా "బిల్వవృక్షము"భానుతేజముతో విరాజిల్లుతు ప్రకటింపబడినది.

  ఇక్కడ మనము వనస్పతి-బిల్వ వృక్షము గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.

   ఇక్కడనుదంతు/ఉదంతు అన్న శబ్దము ప్రయోగించబడినది.తల్లివనలక్ష్మియై పచ్చని వనములను సృష్టించింది.

   లక్ష్మీదేవి వనస్పతి.వనః+పతి-ఋగ్వేద 9వ మడలములో ప్రస్తావించిన ప్రకారము అడవికి అధిపతిగా ఉండే దేవతామూర్తి "వనస్పతి".

  ఇక్కడ లక్ష్మీదేవికి-బిల్వవృక్షమునకు అభేదము సూచింపబడినది.

  చరక సంహిత/సుశ్రిత వృక్షములలో ఉన్నతమైనదానిగా బిల్వవృక్షమును పేర్కొనినవి.

  వేయికొమ్మలతో వసివాడక నిత్యము బంగరు ఛాయతో ప్రకాశించేవృక్షములు "వనస్పతి"

  వామనపురాణకథనము ప్రకారము బిల్వవృక్షము లక్ష్మీదేవి హస్తము నుండి ఉద్భవించిన మహాప్రసాదము.

  త్రిగుణాతీతముగా పుష్పించకుండానే ఫలప్రదమునొసగు వృక్షములను వనస్పతి అను సంప్రదాయము కలదు.

 చీకటి తెరలను తొలగించేది  ఆదిత్యవర్ణము.

 మాయ అవనికను తొలగించేది లక్ష్మీకటాక్షము.

  బాహ్యపు చీకట్లను మాత్రమే కాక అంతరంగ అజ్ఞానమును సైతము తొలగించేది అమ్మ తపఫలమైన బిల్వవృక్షము.

 


 'వామ పత్రే వసేత్ బ్రహ్మ పద్మనాభశ్చ దక్షిణే

  పత్రాగ్రే లోక పాలశ్చ మధ్యపత్రే సదాశివః"


   స్కాంద పురాణ కథనము ప్రకారము 

 మూడు పత్రములు ఒకే కాండమును  ఆశ్రయించి ఉంటాయి.ఆ మూడు పత్రములే,

1.కర్త-కర్మ-క్రియ అనుమూడు విభాగములుగాను

2.సౄష్టి-స్థితి-సంహారము అను మూడు పనులుగాను

3.సత్వ-రజ-తమో గుణవిభాగముగాను

4.స్థూల-సూక్ష్మ-కారణ శరీరములుగాను

5.జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలుగాను

6.భూత-వర్తమాన-భవిష్యత్కాలము గాను నిర్ధారిస్తూ,


  వీటన్నింటికి ఆధారమైన పరబ్రహ్మమును ఆశ్రయించియున్న కాడగా అభివర్ణిస్తారు.

  బిల్వ పత్రము సకలదేవతా సమాహారముగాను

  బిల్వ ఫలమును జ్ఞాన/శ్రీ ఫలముగాను

  బిల్వ వృక్షమును లక్ష్మీస్వరూపముగాను

  బిల్వ వనమును కాశీక్షత్రముగాను 

     అసలిన్ని మాటలెందుకు?

 "  త్రిపుటీ జ్ఞానమే బిల్వపత్రము."

   పువ్వు నుండి కాకుండా జ్ఞానఫలమును సృష్టించగలిగినది

  బిల్వవృక్షము.

  లక్ష్మీదేవి తపః ఫలితముగా ఆవిర్భవించినది(స్కాంద పురాణము)


  తల్లీ నీ పూజ అరిషడ్వర్గములను అంతర్మాయను,షడూర్ములను బాహ్యమాయను తొలగించగలుగు సామర్థ్యమును కలిగినవి.


  హిరణ్మయీం లక్ష్మీం  సదా స్మరామి.




Wednesday, August 28, 2024

SREESUKTAM-05-CHANDRAAM HIRANMAYEEM



 


  శ్లోకము

 

 చంద్రాం ప్రభాసా జ్వలంతీ శ్రియంలోకే  దేవజుష్టాముదారాం

 తాం పద్మినీం శరణం  అహంప్రపద్యే అలక్ష్మీం నశ్యతాం త్వాం వృణే.


   -ఓ జాతవేద అంటు,

  లక్ష్మీ దేవి అనుగ్రహమునకై అగ్ని సహాయమును అర్థించుచున్న సాధకుడు,

1.మొదటి శ్లోకములో "మ ఆవహ" అంటూ అహ్వానించమని కోరాడు.

    అహ్వానమును మన్నించి వచ్చుటయే కాదు,

2."అనపగామినీం' అంటూ  రెండవ శ్లోకములో వచ్చిన తరువాత తనను వీడక శాశ్వతముగా  ఉండునట్లు చేయుము.

    అంతేకాదు,ఓజాతవేద

3"అశ్వపూర్వాం రథమధ్యాం" అంటూ ఆమె తన దగ్గరకు వచ్చు సన్నివేశమును,తన ఇంద్రియములనే ఆశ్వములను సరైన మార్గములోఉంచుతూ,తన గుణ్డెచప్పుడు చేయు ప్రణవనాదము  అనుసరించుచుండగా హ్రిదయరథ మధ్యమున ఆసీనమై తల్లి రావలెనన్న దర్శనాభిలాషను  కోరాడు.

4.నాల్గవ శ్లోకములో,

 కాం  అనిర్వచనీయమైన  ఆ పరశక్తి నాకు అత్యమ్య విడదీయరాని సాన్నిహిత్యములో "ఉపహ్వయే" నా శ్వసగా మారిపోయి ఉండేలా చేయమని ప్రార్థిస్తున్నాడు.

    ప్రస్తుత శ్లోకములో శరణాగతి,ప్రపద్యే శరణమహం" అంటూ,

 బాహ్య-అంతర్ శుచికి సానుకూలతను కలిగించునట్లు తల్లి అనుగ్రహమును కోరుతున్నాడు.

  ప్రస్తుత శ్లోకములో 'అలక్ష్మి"ని ప్రస్తావించినాడు.ఈమె లక్ష్మీదేవికన్నా ముందు ఉన్నది మానసిక ఆటంకములకు-బాహ్య అడ్డంకులకు కారణమగుచున్నది కనుక,

 శ్రియం లోకే-ఆ అలక్స్మిని నశింపచేయుము.

 షడూర్ములను అల్స్క్మిగా భావిస్తుంది సనాతనము.ఆరు బాధలు.అవి

1 ఆకలి-దప్పికలు

2;శోక-మనోవ్యథలు

3.జరా-మృత్యువులు.

  వీటి చింతననశించిన నాడే శ్రియము ప్రాప్తిస్తుంది.

  దానిని తొలగించగల సామర్థ్యము కలది లక్ష్మి+ఈం

 


 మహాలక్ష్మి,

1 తాం ప్రభసా జ్వలంతీ-చైతన్య సక్తిగా ప్రకాశిస్తున్నావు

2.తాం చంద్రాం-చదనమితిచంద్ర.అహ్లాదకారిణిగా అనుగ్రహిస్తున్నావు

3.తాం ఉదారాం-నీవు కరుణించే స్వభావము కలదానివి

4.తాం-పద్మిని+ఈం-నీవు సృష్టి కర్తివి,జ్ఞాన స్వరూపము నీవ్,ఈ ప్రపంచము స్ర్ష్టించి దానికి అతీతముగా ఉండుదానివి

5.తామ్యశసాం-నీవుకీర్తింపబడుదానివి,కీర్తిని భక్తులకు అనుగ్రహించుదానివి

   మానవులకు మాత్రమే కాదు,దేవతలకు సైతము.అందుకే తలీ

6.తాం దేవజుషతాం-దేవతలచే పూజింపబడుదానివి

      సకలసంపద సంకేతమైన లక్ష్మిదేవి నాబాహ్య-అంతర అమంగళములను నశింపచేసి నన్ను సంస్కరింపుము.నీ పవిత్ర పాదపద్మముల శరణాగతిని అనుగ్రహింపుము.


   హిరణ్మయీం లక్ష్మీం శిరసావదామి. 


Sunday, August 25, 2024

KRSHNAM VAMDE JAGADGURUM

     కృష్ణం వందే జగద్గురుం

*************************

        కృష్ణా నేను


  .ముస్తాబు చేయగలుగు కస్తూరిని కాను

   వక్షస్థలమందున్న కౌస్తుభమును కానేకాను


    సఖ్యత శిఖి చేరగ బర్హిపించమును కాను

    ముక్కు చివరి చక్కని ముత్యమును అసలుకాను


  .చల్లదనమును అందించగ చందనమును కాను

   వేణువునై నినదించగ వెదురును కానేకాను


    బెదరగొట్ట సేనల పాంచజన్యమును కాను

    చెదరని భక్తిగల పాంచాలిని అసలు కాను


   ఆరగింపును అందించిన అరటితొక్కను గాను

   అడిగి ఆరగించిన అటుకులు కానేకాను


   మిన్నతనము కన్నులుంచ మన్నైనా నేగాను

   వెన్నుడవని వెల్లడించ వెన్నపూస అసలుకాను


   ఉల్లము ఝల్లనిపించిన గోవర్ధన నగముగాను

   గజ్జెలు ఘల్లనిపించిన కాళియమర్దనము కానేకాను


   ద్వంద్వ యుద్ధము అందించిన జాంబవంతుడిని కాను

   ద్వాదశిఫలమును పొందిన అంబరీషుడిని అసలుకాను


   సూచనతో స్తుతియించగ శాంతనవుడిని కాను

   సూటిగా కీర్తించ సూరదాసుని కానేకాను


   మీరిన భక్తితో కొలిచిన మీరాబాయిని కాను

   సంబరముగ సన్నుతింప సక్కుబాయిని అసలుకాను


  .కృష్ణశతకమును రచియించిన నరసిమ్హకవిని కాను

   కృష్ణగీతను అందుకొన్న అర్జునిడిని కానేకాను


   కర్ణామృతమును వ్రాసిన లీలాశుకుని కాను

   భాగవతమును అందించిన బమ్మెర పోతన అసలుకాను


  .మధురామృతమును అందించు సురభుల గోష్ఠము కాను

   మధురభక్తిని అందించు శుక సద్గోష్టి కానేకాను


    మాధవలీలలు చాటిన గోదాదేవిని కాను

    రాధామాధవ బాంధవ రాసక్రీడ అసలు కాను


.  మాయామోహితులను చేయు యమునాతటిని కాను

   యమకోరలు పారద్రోలు అష్టాక్షరిని కానేకాను


   అష్టమ గర్భముకాను,అష్టమి జననము కాను

   అష్ట భార్యలందు లేను,అష్ట పదులు కానేకాను


   ఏవికాని నికృష్టుని నిష్ఠూరములను

   అష్టకమనుకొని అష్ట దళపద్మము అనుకొని


   ఇహపరములు అందించగ ఇష్టము ప్రకటించుతు

   అధిష్ఠించి నీ కరుణను సుస్పష్టము చేసుకో

.

               కృష్ణార్పణం.. 


Friday, August 23, 2024

SREESUKTAM-04--KAAM SAHA-SMITAAM-SOSMITAAM


 


 శ్లోకము


  "కాం సోస్మితాం హిరణ్యప్రాకారం అర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం 

   పద్మేస్థితాం పద్మవర్ణాం తాం ఇహోపహ్వయే శ్రియం.


  జాతవేదుని ప్రార్థిస్తున్న భక్తుడు ప్రస్తుత శ్లోకములో,

 ఇహ ఉపహ్వయే-లక్ష్మీదేవి తనకు ఎంతదగ్గరగాఉండాలంటే,తన శ్వాసలో  నిలిచియుండునట్లు సహాయపడుమని  ప్రార్థిస్తున్నాడు.

   లక్ష్మీదేవి తనదగ్గరకు రావాలి,వచ్చితనను వీడకుండాలి,తన మనో సంకల్పమును దృఢపరచినిరంతరము ప్రణవమును నినదించునట్లుచేయాలి వానితో పాటుగా తనశ్వాసలో నిరంతరము నర్తిస్తుండాలి అని కోరుకుంటున్నాడు.

  ప్రస్తుత శ్లోకము పరబ్రహ్మము కాం  అను శబ్దముతో సూచించబడినది.క కారము బ్రహ్మ స్వరూపము.

  వాజ్మానస గోచరము కానిది "కాం" ఇది  అని విశేషించి చెప్పజాలనిది.చూపించజాలనిది.

   ప్రకృతికి మూలకారణమై ఆధారభూతమైనది.

  పంచదశి మంత్రమే శరీరముగా భాసించునది కనుక "కాం"

    లక్ష్మీదేవి సోస్మితాం.సుందర దరహాసముతో తప్తకాంచన వర్ణముతో ప్రకాశించుచున్నది.

   ఆ తల్లి పద్మములో స్థిరముగా కూర్చునియున్నది.ఆ పద్మము పద్మాసనస్థయై పద్మవర్ణముతో ప్రకాశించుచున్నది.

  హిరణ్మయియై  హిరణ్యప్రాకారముతో తేజరిల్లుచున్నది.

   తల్లికి ఆసనముగా సర్వ శుభలక్షణ సమన్వితమైన నా హృదయకమలము నందు ఆసీనురాలినిచేయుము.

   అర్ద్రత-జ్వలనము అను రెండు విశిష్ట లక్షణ శోభిత మహాలక్ష్మి తన కరుణను నాయందు ప్రవేశింపచేసి అనుగ్రహించునట్లు సహాయపడుము.తల్లి కురిపించు అర్ద్రత నన్నుభక్తితో పరవశించి,ప్రకాశించునట్లు అనుగ్రహించునుగాక.

   నా పూజలను స్వీకరించి తృప్తయై శ్రేయంకరియై నా శ్వాసలో నిరంతరము నిలిచి యుండునట్లు సహాయపడుము అనిప్రార్థింపబడుచున్న లక్ష్మీదేవి మనలను ఆశీర్వదించును గాక.

 హిరణ్మయీంలక్ష్మీ సదా భజామి.



Thursday, August 22, 2024

SREESUKTAM-03 ASVAPURVAM

  శ్లోకము


  ప్రస్తుత శ్లోకములో భక్తుడు తల్లి తనను అనుగ్రహించుతకు వచ్చు సుందర దృశ్య దర్శనమును అనుగ్రహింపమని కోరుచున్నాడు.

  మొదటి స్లోకములో లక్ష్మీదేవిని ఆహ్వానము చేయమనిన సాధకుడు రెండవ శ్లోకములో వచ్చ్చి తన దగ్గర శాశ్వతముగా ఉండునట్లు సహాయముచేయమని కోరాడు.మూడవ శ్లోకములో తల్లి తనను అనుగ్రహించుతకు ఏ విధముగా రావలెనో తెలియచేయుచున్నాడు.

 మూడు కోరికలను కోరుచున్నాడు.

1. తల్లి రథమధ్యమున ఆసీనురాలై యుండాలి.

2.రథమునకు ముందర అశ్వములు అలంకరింపబడియుండాలి.

3.రథమునకు వెనుక భాగము ఏనుగుల ఘీంకారముతో చైతన్యప్రద సంకేతముగా ఉండాలి.


   తల్లి నా హృదయమనే రథమును అధిష్ఠించి యుండాలి.

   నా ద్ర్ఢసంకల్ము అశ్వములవలె అకుంఠితముగా ఉండాలి.

   నా అనాహతమునిరంతరము ఏనుగుల ఘీంకారము వలె ప్రణవ నాదోపాసన చేస్తుండాలి.

   ఓ జాతవేద ! 

     నా మనోఫలకమున అట్టి సుందర దృశ్యము నిండి నన్ను 



SREESUKTAMU-02-TAAM AAVAHA JATAVEDO


  శ్లోకము


 "తాం మ ఆవహ జాతవేదో లక్ష్మిం అనపగామినీం

  యస్యాం  హిరణ్యం  విందేయం గామశ్వం పురుషానహం.


  పూర్వ శ్లోకములో లక్ష్మీదేవిని తన దగ్గరకు చేర్చమని జాతవేదుని ప్రార్థించిన భక్తుడు జాతవేదునికి మరొక విన్నపమునుచేయుచున్నాడు.

  ఓ జాతవేదుడా!

     నీవు నిత్యపూజలలో జ్యోతిగాను,అగ్నికార్యములలో  మేము అందించు యజ్ఞవస్తువులను దేవతలకు అనుకూలమగు హవిస్సులుగా చేర్చి,వారి అనుగ్రహమును అందించు సంధానకర్తగా కీర్తింపబడుతున్నావు.దానికి కారనము,

1ఆశ్రిత ఆశ్రయము

2.ఆర్ష వాజ్మయము

3.అనంత సంపద అను నీ మూడు శుభలక్షణములు.

   లక్ష్మీదేవి ప్రసన్నతను అందచేయగల జ్ఞానచైతన్యము నీవేసుమా.

  నీ ఆశ్రిత ఆశ్రయముతో నిన్ను చేరగలిగినాను.నీ ఆర్ష వాజ్మయ శక్తితో ఆ తల్లి శాశ్వతముగా నాలో నిండియుండునట్లు ,నన్ను సౌభాగ్య సౌశీల్యునిగా దీవించునట్లు చేయుము.




  ప్రస్తుత శ్లోకము రాజ్యలక్ష్మి "రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ'గా ,భక్తుని అనుగ్రహింపమని జాతవేదుని అర్థించుచున్నాడు భక్తుడు.
 ఓజాతవేద! అమ్మకు నే పలుకు ఆహ్వానము తాత్కాలికము కాదు.
 నా హృదయపీఠమున శాశ్వత నివాసమేర్పరచుకొనుటకై,హిరణ్యము,గోవులు,అశ్వములు,మరియును సేవకులతో పాటుగా కొలువుతీరి నేను శాశ్వత సేవాభాగ్యమును పొందుటకు సహాయపడుము.
  హిరణ్యము హితము+రామణీయకతతో కూడిన జీవితము,గోవులు -పవిత్రస్వభావము/పవిత్రమైన వాక్కులు పొంది,అశ్వముల దృఢత్వ సంకల్పబలమును పొంది ,ఇంద్రియ పటుత్వముతో అర్చించు అవకాశమును కలిగింపుము.
 "హిరణ్మయీం లక్ష్మీ మనసా స్మరామి."


Wednesday, August 21, 2024

SREESUKTAM-01 -HIRANYAVARNAM


  శ్రీసూక్తము-01

 ************

 "ఓం హిరణ్యవర్ణాం  హరిణీం సువర్ణరజతస్రజాం

  చంద్రాం  హిరణ్మయీం లక్ష్మీం " జాతవేదో" మ ఆవహ."


  ఇది అమ్మవారి సాకార సంకీర్తనము.సహాయకుడు జాతవేదుడు.అమ్మ బంగారు మేనిఛాయతో మెరిసిపోతున్నది.మేనిఛాయకు మెరుగులు అద్దుతూ సువర్ణ వెండి ఆభరణములు కదులుతూ కాంతులను వెదజల్లుతున్నవి.తల్లి బంగారు మేనిఛాయయే బంగారుమయముగా మరింత ముచ్చట గొలుపుతున్నది.దానికి తోడుగా తల్లి ధరించిన చంద్రరేఖ ఆహ్లాదమును కలిగించుచున్నది.అట్టి పరాశక్తి కరుణతో నా చుట్టు ఉన్న మాయతెరలను తొలగించివేసి,అనుగ్రహరూపముగా నన్ను నిండియుండుటకై,చైతన్యస్వరూపమైన ఓ జ్ఞానమా నీవు నా విన్నపమును అమ్మకు హవిస్సు రూపముగా అందించి,ఆమె అనుగ్రహము నాలో సంపూర్ణముగా నిండియుండునట్లు ఆశీర్వదించుటకు సహాయపడుము.

 ఇది బాహ్యార్థము.సాకార దర్శనము.

  ఇంకొంచము నిశితముగా అర్థము చేసుకొన కలిగితే అమ్మ "ఈం "బీజ ప్రదాయిని.సర్వానుగ్రహకారిణి.ఆమె లక్ష్మీ-హరిణీం.

 హరి మనోవల్లభి కనుక హరిణి

 ప్రకృతి స్వరూప-స్వభావము కనుక హరిణి

 అశుభములను హరించివేసే తల్లి హరిణి.

  అమ్మ ధరించిన సువర్ణ-రజత స్రజములు కేవలము లోహ సరములు కానేకావు.


 హిరణ్యము సూర్యుని-రజతము చంద్రునికి వారి నిరంత కదలికలు హారములకు సంకేతములుగా చెప్పబడినవి.

  అంతేకాదు అమ్మవారి పాశాంకుశములు రక్షణ-శిక్షణ సంకేతములు

 అమ్మవారి స్వరూపము తేజోమయము.స్వభావము కరుణభరితము.

   మరికొందరు అమ్మను సువర్ణా,హిరణ్య వర్ణ అక్షరస్వరూపిణిగా ఆరాధిస్తారు.

   శ్లోకములో అమ్మ లక్ష్మీ శబ్దముతో సంబోధింపబడినది.

 "లక్ష్యతే శ్రేయతే "లక్ష్మీ,

  శ్రేయో మార్గమును లక్ష్యముగా భావింపచేయునది లక్ష్మీ

  లక్ష్యతే దృశ్యతే లక్ష్మీ-లక్ష్య మార్గమును చూపించునది లక్ష్మీ

  జాతవేదుని సహాయముతో నా ప్రార్థనలను విని లక్ష్మీదేవి మనదగ్గర ఉండునుగాక 

  "హిరణ్మయీం  లక్ష్మీ మనసా భజామి"



SREE SUKTAM-INTRODUCTION

 


  శ్రీ సూక్తము

  **********

 లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం-

     శ్రీరంగ ధామేశ్వరీం

 దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం


  శ్రీమన్మంద  కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం

 త్వాం  త్రైలోక్య కుటుంబినీం సరసిజాం 

     వందేముకుందప్రియాం.

  "శ్రీ  అను నాదము ఆరువిధములుగా అభివర్ణింపబడినది."


 1.స్రీయతే ఇతి శ్రీః-చేతనులచే ఆశ్రయింపబడు పరబ్రమము "శ్రీ."

 2,శ్రేయతి ఇతి శ్రీః-చేతనులకు శ్రేయోదాయకమైనది "శ్రీ"

 3.శ్రుణోతి ఇతి "శ్రీః".-మొరలను ఆలకించేది "శ్రీ"

 4.శ్రావయతి ఇతి శ్రీః-లక్ష్మీమాతగా చేతనుల ఆర్తిని స్వామికివిన్నవించే దయ/సహాయము "శ్రీ"

 5.శ్రుణాతి ఇతి శ్రీః-పాపములను నశింపచేసేది శ్రీ"

 6.శ్రీణాతి ఇతి శ్రీః-జగద్ధాత్రియై తనకరుణతో మాయ అను తెరను తొలగింపచేయునది.

  శ్రేయతే లక్ష్యతే శ్రీః-శ్రేయతే దృశ్యతే శ్రీః

  లక్ష్యమును మార్గమును సుగమముచేసే అవ్యాజకరుణయే "శ్రీ"


   సూక్తము అనగా శక్తివంతములైన-ఫలప్రదములైన మంత్రముల కూర్పు.సూక్తములు అపౌరుషేయములు.

 సు-శుభప్రదములైన-ఉక్తులు-పలుకులు.

   

   శ్రీసూక్తము ఋగ్వేద ఐదవ-ఆరవ మండల మధ్యభాగమున చేర్చబడిన పరిశిష్టముగా/ఖిల గా సన్నుతిస్తారు.

   అథర్వ వేదము మూర్తీభవించిన పవిత్రత-ప్రకాశమును శ్రీ గా పరిగణించిమ్నది.

  ఆకలి-దప్పులు,శోకమనోవ్యథలు-జరా-మృత్యువులు అను షడూర్ములను తొలగింపచేయు శక్తిస్వరూపిణిగా కీర్తిస్తున్నది.

  సర్వసమృద్ధ సంకేతముగాపశువులు-పంటలు-పంచభూతములు-ప్రకృతి-వికృతులుగా ప్రస్తుతింపబడిన శ్రీ అను శక్తిని,సాకారా అర్చనకై ఉపనిషత్తులు లక్ష్మీ స్వరూపముగా అందించినవి.

  ఒకే పరబ్రహ్మము చేతనులచే శ్రీగాను/లక్ష్మీగానుభావింపబడుచున్నది.సూక్త సహాయముతో అర్చించబడుచున్నది.

  శ్రీసూక్తము 15 శ్లోకములతోను 14 ఫలసిద్ధి మంత్రములతోను అమరియున్నది.

  శ్రీసూక్త శ్లోకములు/మంత్రములు బీజము-శక్తి-కీలకములతో ప్రకాసిస్తుంటాయి.

  మంత్రసారమునందించు నాదము బీజము

  మంత్ర చైతన్యమునందించునది శక్తి

  మంత్ర నాదమునకు -మంత్రచైతన్యమునకు అనుసంధాన కర్త కీలకము అని ఋషిప్రోక్తము.

 

  శ్రీసూక్తమునకు  దేవత లక్ష్మీదేవి

  ఋషులు ఆనం-కర్దమ-చిక్లీత 

  అగ్నిని,


 మధ్యవర్తి  చేసుకొని, చేయు ప్రార్థనయే శ్రీసూక్త


 


 ఓ యజ్ఞ చైతన్యమా! ఓ జ్ఞాస్వరూపమైన జాతవేద! నా ప్రార్థనను అమ్మకు అందించి-అమ్మ అనుగ్రహమునన్ను చేరుటయే కాక శాశ్వతముగా ,నన్ను వీడకుండునట్లు 

 ' మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్నీచ ధీమతి

   తన్నో లక్ష్మీ ప్రచోదయాత్" అన్న 

  లక్ష్మీ గాయత్రీ మంత్రము సర్వదా శుభములను అనుగ్రహిస్తూనే ఉంటుంది.

 "హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి."


 













Wednesday, August 14, 2024

SAHO SVAATAMTRAMAA-2024

 



   సాహో  స్వాతంత్ర్యమా (78)

   *****************

శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా

చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక.

అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము

భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ

"తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను

కర్తవ్యదీక్ష సాక్షి" కాషాయపు రంగు."

బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు

తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా

"వందేం అహింసా పరమో ధర్మ:" అను

శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు".

పంచభూతములు శుచిగ పంచభక్ష్య రుచులుగ

కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా

"సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను

పచ్చతోరణపు కుచ్చు మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు."

నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో

వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో

ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో

జనగణమన గళముతో జనగణముల మంగళముతో

"జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో

కోటలలో పేటలలో కోటి కోటి కాంతులతో

ఎగురుతోంది పతాక- ఎద నిండిన ఏరువాక.

అమ్మలార రండి రండి-అయ్యలార రారండి

పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి

శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకించంద్ర చటర్జీ

శ్రీ రవీంద్ర నాథుడు, శ్రీ మహమ్మద్ ఇక్బాలు

ఎందరో మహనీయులు కొలువుదీరి ఉన్నారు

"70 వ స్వాతంత్ర జెండాను ఎగురవేద్దాము

అజెండాను తిరిగి వ్రాద్దాము

దేశభక్తి గీతాలను ఆలపిస్తుంటే వారు

ఆలకిస్తారు ఆనంద భాష్పాలతో

దేశభక్తి చేతలను ఆచరిస్తుంటే వారు

ఆశీర్వదిస్తారు హర్షాతిరేకముతో.

జైహింద్




TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...