Thursday, October 31, 2024

TANOTU NAH SIVAH SIVAM-INTRODUCTION.

 


   ప్రియ మిత్రులారా!

   

   " తనోతు నః శివః శివం."

     *****************



    అణువణువు శివమే.అడుగడుగు శివమే.

 శివానుగ్రహము అర్థముకానిది.అయినప్పటికిని అద్భుతమైనది.అది అట్టడుగున నున్నవారినిసైతము గట్టిగా పట్టుకుంటుంది.మత్తుకళ్ళనుతెరిపిస్తుంది.కొత్తదనమునుచూపిస్తుంది.స్వామికరుణ మనలను సందర్శింప చేస్తుంది.సంభాషిస్తుంటుంది.సన్నుతింపచేస్తుంది.సన్మార్గము చూపిస్తుంది .

  కాని చమత్కారము.లీలగా,

  మనలను మాయలో ముంచేస్తుంది.శివమును నిందింపచేస్తుంది.నిలదీస్తుంటుంది.నిష్టూరమాడుతుంది.

  నేనే వ్రాస్తున్నానను భ్రమలో ముంచివేస్తూ,

 "తనోతు నః శివః శివం" అను

  శివమును విస్తరింపచేయు శివుని కీర్తించుటకు ప్రయత్నిస్తుంది.

    

      శివునికి దాసోహమనాలన్న నన్ను తనకు దాసోహము చేసుకుని నా అజ్ఞానము కొసమెరుపులు దిద్దుతానంటూ,ముసిముసిగానవ్వుతూ,కొసరి కొసరి తప్పులను వడ్డిస్తుంటుంది.శివస్వరూపులు పెద్దమనసుతో నా దోషములను మన్నించి,నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకముతో,ఈ నా చిన్నిప్రయత్నమును మీతో పంచుకుంటున్నాను.

  కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ.

    భజశివమేవ నిరంతరం.

      ఏక బిల్వం శివార్పణం.



Friday, October 11, 2024

SREECHAKRADHAARINI-09-SARVANAMDAMAYACHAKRAMU




 


   శ్రీచక్రధారిణి-09-సవానందమయచక్రము

   ****************************

 ప్రార్థన

 ******

 "తాదృశం ఖడ్గమాప్నోతి ఏనహస్త స్థితేనవై

  అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."

 

  ఇప్పటివరకు

  ********

శూన్యము అని భ్రమింపచేసే బిందువుశూన్యముకాదు "పూర్ణము" అని తెలియచేస్తున్న శివశక్తుల నిక్షిప్త "మిశ్రబిందువునకు" శరణాగతులు.

  ఆదిశంకరులు "సౌందర్యలహరి స్తోత్రము" లో కీర్తించినట్లు,

       సకలమపి భిత్వా కులపథం

 "సహస్రారే పద్మే సహరసి పత్యా విహరసే"

  అని ప్రాణశక్తి యైన కుండలినీ ఊర్థ్వ పయనమును స్తుతించారు.

    జగన్మాత

 కులామృతై రసికా కులసంకేత పాలిని

 కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ

 అకులా సమయాంతస్థా.....సమయాచారతత్త్పరా.

    అని వశిన్యాదిదేవతలకు తన తత్త్వమును అనుగ్రహించినది.

      అమ్మ సదాశివ పతివ్రత.

  సదాశివుని పతిగా పొంది సేవించునది ఒక భవముగా స్వీకరిస్తే

  సదా ఎల్లవేళల సకలజీవుల ఉద్ధరనమే వ్రతముగా/నియమముగా అనుసరించు ఆదిశక్తి.

   ఆ వ్రతమే బిందువు నుండి విడివడి కామకళయై స్థూలప్రకృతిలోఅంతర్యామిగా దాగి,తనలో తనపతిని సూక్ష్మముగా దాచుకొనిచేతనులనూద్ధరిస్తూ,కుండలినిగా తనతో పాటుగా షత్చక్ర దర్శనమును చేయిస్తూ,నిరాకార-నిర్గుణ నిరంజనమైన నిత్యసంపూర్ణ తత్త్వములోనిక్షిప్తము చేసుకుంటుంది.

 ఇప్పుడు

 ****

  పరమేశ్వరుడు పార్వతీదేవితో,

  

 " త్రికోణం సర్వసంభూతి కారణం భూతిదం సదా

   బిందిచక్రం వరారోహే "సర్వానమ్మయం' పరం

   "సదాశివమయం" చక్రనాయకం  పరమేశ్వరి".

   శ్రీచక్ర మధ్యకర్ణికలో నున్న త్రికోణము సర్వమునూత్పత్తిచేయగల సామర్థ్యశక్తి.దీనినే "సర్వ సంభూతి చక్రము"అనికూడా కీర్తిస్తారు.ఈశ్వరత్వమును సిద్ధింపచేయునది. సదాశివునితో మమేకము కాగలుగుటయే ఈశ్వరత్వము.మమేకముచేయగల శక్తియే సౌందర్యము.

    మమేకస్థితి సదాశివతత్త్వము.శాశ్వత సర్వానందమయము.

  పర-అపర నయిక పరాపర రహస్యయోగిని గా అమ్మ విరాజమానమైనది.చక్రేశ్వరి మహాకామేశ్వరీదేవి.Yఓని/మూలకారనము ముద్రాశక్తి.షడంగదేవతార్చనము షడంగన్యాదముతో జరుపుకొను ప్రదేశము.

 అంటే సాధకుడు తనలోనే ఉన్న ఆత్మానంద పరంజ్యోతిని షోడశీ మంత్రానుష్ఠానముతో ,

 సత్యం-శివం-సుందరమును/సచ్చిదానంద స్వరూపిణిని పరమహంసయై ,

   హంస హంసాయ విద్మహే-పరమహంసాయధీమహి

   తన్నోహంసః ప్రచోదయాత్" గా పరిణితిని పొందుతాడు.


    సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.

  మనముచ్చట

  **********

 అమ్మ నవావరణముల ప్రహసనములు మన భాషలో చెప్పుకోవాలంటే.

  మనమందరము కష్టాల జడివానలో సతమవుతున్నజీవులము.అమ్మ దయ అనే గొడుగును తెరిచి,విస్తరింపచేసి మనము ఆవానలో కొట్టుకునిపోకుండా తాను దగ్గర ఉండి సురక్షిత ప్రదేశమునకు చేరుస్తుంది.వానవెలిసిపోయింది.అమ్మ తన స్థూల విస్తరనానే గొడుగును మడచివేస్తుంది.పరమేశ్వరునికూడి ,

 "'జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరమై"

       పరవశిస్తుంటుంది.

 పరవశిస్తుంటుంది-పరిపాలిస్తుంటుంది

 పరిపాలిస్తుంటుంది-పరవశిస్తుంటుంది

  ప్రతీణువు తానై-ప్రతిక్షనముతానై.


 "పాహి-పాహి పరాత్పరి-పాలయమాం-పరిపాలయమాం"

  ప్రియమిత్రులారా,

    నా ఈ దుస్సాహసమును మన్నించి జగదంబ మనలనందరిని కంటికిరెప్పవలె కాచునుకాగ,

   కాత్యానాయవిద్మహే కన్యకుమారి ధీమహి

   తన్నోః దుర్గి ప్రచోదయాత్

  స్తోత్రం -స్తోత్రఫలము రెండును అమ్మనే.


     "అపరాధములను మన్నించవమ్మా

      ఆదిదేవి అమరసేవిత-నా

      అపరాధములను మన్నించవమ్మా."


  అమ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

  లోకాసమస్తాత్ సుఖినో భవంతు.

     

   "త్రిలోచన     కుటుంబినీం   -త్రిపురసుందరీం  ఆశ్రయేత్. 


             

     స్వస్తి.

     


SREECHAKRADHARINI-08-SARVA SAMPATPRADA CHAJRAMU

   శ్రీచక్రధారిణి-08-సర్వసిద్ధిప్రద చక్రము

  **************************


  ప్రార్థన

  *********


  "తాదృశం ఖడ్గమాప్నోతి  యేనహస్త స్థితేనవై

   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."



   ఇప్పటివరకు

   ***********

   ఏదవ ఆవరణమైన "సర్వరోగహర చక్రము" లోని అష్టవిధ తత్త్వములను తెలుసుకుంటూ,అత్యంత ప్రధానమైన స+అష్ట+ అంగ నమస్కార (అష్టాంగములు పరమాత్మ చైతన్యమే అను భావన) పరమార్థమును గ్రహించాము,

    మనము సులభముగా శ్రీచక్ర తత్త్వమును అర్థము చేసికొనుటకు రెండు భాగములుగా విభజించి పరిశీలిస్తే మనము మొదటి భాగమును పూర్తిచేసుకున్నాము.

  ఏడు ఆవరణములలోత్రిగుణములు-అరిషడ్వర్గములు-చతుర్విధ పురుషార్థములు-అనేకానేకములై,అనేకనామరూపములతో-స్వభావములతోనున్న యోగినీ మాతలు-వారిని పాలిస్తున్న చక్రేశ్వరులు-ముద్రా శక్తులు-సిద్ధి దేవతలతో విస్తరించిసాగినది.ప్రతి ఆవరణము ఇంకొక దానితో సంబంధమును కలిగియున్నది.

  ఇప్పుడు

  *****

 ఎనిమిదవ ఆవరణములోని త్రికోణము.సర్వ స్వతంత్రము.ఇక్కడ అన్నిసంక్షిప్తముగాఉంటాయి"

.కామకళ"

   శివశక్తుల స్వరూపమైన పూర్ణబిందువు నుండి విడివడిన శక్తిస్వరూపము " కామకళ" అను నామముతో ఆశ్చర్యముగా జరుగుతున్న మార్పులను చూస్తున్నదట.ఆ మార్పుల /విస్తరణ వలయములే శ్రీచక్ర నవ+ఆవరనములుగా  కీర్తింపబడుతున్నాయి.

   పరమేశ్వరుడు పార్వతీదేవితో,

 "ఉద్యత్ సూర్య సమప్రభం బంధూక కుసుమ ప్రభః

  దర్వసిద్ధిప్రదం చక్రం సకలాలయం ఈశ్వరీ"

      ఓ ఈశ్వరీ ఇది సర్వసిద్ధులను కలిగించే మండలము.

 మూడు బిందువులనుకలుపుతూ త్రికోణము ఉంటుంది.తిర్కోణముతో పాటుగా ఊహా చతురస్రాకారము నాలుగు ఆయుధములతో ఉంటుంది.

  చక్రేశ్వరి త్రిపురాంబ.

  అతిరహస్యయోగినులుంటారు.సర్వబీజ ముద్రాశక్తి.

 మనము చక్రమహత్వమును గ్రహించుటకు మూడు అంశములను పరిశీలిద్దాము.

 1.ఊహాచతురస్రములోని ఆయుధములు

 2.త్రికోణములోని బిందువులు

 3.అతిరహస్య యోగినులు.

   ఈ ఆవరనము నిధిధ్యాసనము ను వివరిస్తుంది.గురువు ద్వారా వినినదానిని-తర్కము ద్వారా స్థిరపరచుకొనిన దానిని-మరలమరల అన్వయించుకుంటూ అజ్ఞానమును పారద్రోలగలుగుట నిధిధ్యాసనము.

   ఏనిమిదవ ఆవరనము జగన్మాత విస్తరణ ప్రధమదశ.

 ఇక్కడ ద్వైతములుండవు.అంతా ఒక్కటిగానే భాసిస్తుంటుంది.నీవు అన్న ఊహ రానేరాదు.

 ఆవరనములోనీకి ప్రవేశిస్తున్న సమయమున "ప్రణవము" నన్ను పరవశునిచేస్తున్నది.అవ్యక్తమైన ఆనందానుభూతి.

  నా పాపిడిలో కదలికలు ప్రారంభమయినాయి.

   నా కుడిచేయి బరువుగా అనిపించింది.కిందకు చూస్తుండగానే బాణిని మాత చాపిని మాతకు నా ఎడమచేతి దగ్గరకు రమ్మని సైగచేస్తున్నది.ఇంతలో నా ఎడమచేతిలో చాపిని మాత కూర్చుని ఉంది.కుడిచేతిలో బాణినిమాత-ఎడమచేతిలో చాపిని మాత.

 నమ్మసక్యము కానివిధముగా తల్లులు పంచబానములుగా-వింటిగా నన్నుచేరారు.

  అది సామాన్యమైఇన విల్లుకాదు.అటు-ఇటు కదలనిస్థిరచిత్తము .దానికి అనుగుణముగా పంచతన్మాత్రలు కుడిచేతిలోని బాణములుగా ప్రకాశిస్తున్నాయి.

  నా కన్ను పరమాత్మను చూదగలదు.

  నాజిహ్వ సంకీర్తనము చేయకలదు.

  నాకర్ణము మహిమలనువినగలదు.

 నాస్పర్శ పరమాత్మ ఉనికిని గమనించగలదు.

  నానాసిక  పరమాత్మతత్త్వమను పరిమళమును ఆఘ్రాణించగలదు.

   అంతలోనే "పాశిని"మాత లాలనగానన్నుహత్తుకుని ప్రేమ అనే తాళ్లతో నన్నుచుట్టుతున్నది.

  అనిర్వచనీయ ఆనందము నా నయనముల ద్వారా స్రవిస్తూ,వారిపాదములను అభిషేకిస్తున్నది.

  ఇంతలో కిందకు వేలాడుతున్న (ఏడు చక్రముల వైపునకు) నన్ను ఆకర్షింది.కొంచము వంగి పట్టుకోబోయాను.అంతే,

  అంకుశిని మాత కోపముతో దానిని తుంచివేసింది.

  నామనస్సుస్థిమితబడినది.అమ్మకు నమస్కరించాను.నవ్వేసింది.

    ఆ నలుగురుమాతలు నన్ను మూడుబిందువులున్న "త్రికోణము" లోనికిప్రవేశింపచేశారు.



  


2.త్రికోణములోని బిందువులు.

  ******************

 అవి బిందువులు కావు.కరుణాసింధువులు.

 "క్రీడంతు సర్వభూతానాం"/లీలా కల్పిత బ్రహ్మాండములను ప్రకటించుతకై ఏర్పరచుకొన్న,

 ఇచ్చా-క్రియా-జ్ఞానశక్తులు.

 మహా కామేశ్వరి-మహా వజ్రేశ్వరి-మహా భగమాలిని అని గౌణనామములతో కీర్తింపబడతారు వీరు.


   స్థూల చక్రములలోని కామేశ్వరి కంటెభిన్నమైన శక్తి మహాకామేశ్వరి.ఈమె సృష్టి కారిణి.

   స్థూలములోని వైష్ణవీ కంటె భిన్నమైనది మహా వజ్రేశ్వరి.స్థితి కారిణి.

   స్థూలములోని భానుమండల మధ్యస్థ కంటె భిన్నమైన శక్తి మహా భగమాలిని.సంహారకారిణి.

  ఈ మూడు శక్తులు పశ్యంతీ-మధ్యమ-వైఖరీ స్వరూపాలుగా కూడా సమన్వయించుకుంటారు.


   ఆమహాశక్తులు నాలోనిచైతన్యమునూద్దీపింపచేస్తున్నాయి.

అతిరహస్యమైన అంతర్లీనమును అనుభవములోనికితెస్తున్నాయి.

 

  3.అతిరహస్యయోగిములు

    *************

    ఎంతటి పరమాధుతము  ఈ అంతర్లీనము.


     నేను చూస్తుందగానే,

  1.పృథ్వీ తత్త్వము జలతత్త్వముతో లీనమగుచున్నది

  2.పృథ్వీ+జల తత్త్వములు అగ్నితత్త్వముతో లీనమగుచున్నాయి.

  3.పృథ్వీ+జల+అగ్ని తత్త్వములు వాయుతత్త్వములో లీనమగుచున్నాయి.

  4.పృథ్వీ+జల+అగ్ని+వాయు తత్తములు ఆకాశ తత్త్వములో లీనమై

   అఖండముగా  భాసించుచున్నది.

       ఏకంసత్.

  పంచభూతములు మాత్రమే కాదు

 ఆవరనలు సైతము అదే పనిని ప్రారంభించాయి.

   1.త్రైలోక్యమోహనము సర్వాశా పరిపూరకము తో కలిసిపోయింది.ఆ రెండు సంక్షోభణమునుచేరాయి.సృష్టి చక్రత్రయమును స్త్థితిచక్ర త్రయము తనలో లీనముచేసుకుంది.రెండు త్రయ చక్రములోఏడవచక్రమైన సర్వరోగహరమును చేరాయి.దానిని కలుపుకుని సర్వసిద్ధిప్రదచక్రములో అంతర్లీనముగా అలరారుతున్నాయి.

   ఏకంసత్.

   త్రిగుణములు లేవు

   చతుర్వర్గములు లేవు

   పంచభూతములు లేవు

   అరిషడ్వర్గములులేవు

   సప్తధాతువులు లేవు

   అష్టదిక్కులు లేవు

     ఏకం సత్

   ప్రకట యోగినులజట్టు  గుప్తయోగినులతో

   వారిరువురి జట్టు   గుప్తతర యోగినులతో

   వారుముగ్గురిజట్టు సంప్రదాయ యోగినులతో

   వారు నలుగురి జట్టు కులోత్తీర్ణ యోగినులతో

   వారు ఐదుగురిజట్టు  నిగర్భయోగినులతో

   వారు ఆరుగురి జట్టు రహస్య యోగినులతో

   వారు ఏడుగురి జట్టు అతిరహస్య యోగినులతో,

     ఎప్పుడు ఎలా  తెలియంత అతిరహస్యముగా 

    "ఏకం సత్"  గాభాసిస్తున్నరు.


   నేను అన్న శబ్దము-రూపము-ఉపాధి-ఉనికి పూర్తిగా సమసిపోతున్నాయి.శివశక్తైరూపమును దర్శించాలన్న తపనతో నున్న నన్ను అతిరహస్య యోగినులు అత్యంత రహస్యముగా నవనవోన్మేష నవావరనము లోనికి ప్రవేశింపచేబోతున్నారు.



    యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా

    నమస్తస్త్యై నంస్తస్త్యై నంస్తస్త్యైనమోనమః.

   సర్వము కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.

  

Wednesday, October 9, 2024

SREECHAKRADHARINI-07-SARVAROGAHARA CHAKRAMU.


 


   శ్రీచక్రధారిణి-07-సర్వ రోగహరచక్రము

   *****************************

 ప్రార్థన

 ******

 " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్తస్థితే నవై

   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."


 ఇంతకు ముందు

 ***********

 సర్వరక్షాకర చక్రములోని వహ్నికళలు అన్నమయకోశమును ఆవరించియుండి,

1.భక్య-భోజ్య-చోష్య-లేహ్య-పేయ

     రూపములుగా నున్న ఆహారమును జీర్ణముచేసికి స్థితికి సహాయపడేవి.

 భక్ష్యము-తినదగిన పదార్థము(జుర్రుకుని)

  పంచామృతములు మనము జుర్రుకుంటాము.

 భోజ్యము-నమిలి తినునది.(దంతముల ప్రాధాన్యము)

  చోష్యము-కొరికి తినునది(దంతముల ప్రాధాన్యము-పిండివంటలు,పండ్లు,గింజలు మొదలగునవి)

  లేహ్యములు-నాలుక సహాయముతో స్వీకరించు పదార్థములు

  పేయము/పానీయములు-గొంతు సహాయముతో (తాగునవి)

 మనము ఆహారసిద్ధి-ఆసన సిద్ధి

        ఆసన సిద్ధి-అభీష్ట సిద్ధి అన్న మాటను వింటుంటాము.

   క్రమేణా సాధకుడు ఈ పంచభక్ష్యముల పచనముతో సంబంధమూ లేకుండా,విశ్వము నుండి నేరుగా ఆహారమును  గ్రహించి పచనము చేసుకోగలుగుతాడు.అదియే "తపోసమాధి"

  ఇప్పుడు

   ****

 సాధకుడు గురుబోధా శ్రవణ దశను దాటి మనన దశలోనికి ప్రవేశిస్తున్నాడు.అపరోక్షానుభూతిని వీడి స్వానుభవమును పొందబోతున్నాడు.అదియును తనకూ తెలియకుండానే.

   సర్వరోగహర చక్రమును గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో,

 " అష్టకోణం వరారోహే బాలార్క కిరణారుణం

   పద్మరాగ సమప్రఖ్యం సర్వరోగకరం సదా" అంటు,

   మంకెన పూవులా మెరిసిపోతున్న ఎనిమిది కోణముల చక్రమును గురించి చెప్పాడు.

   మనము మూడవ ఆవరనమన "సర్వ సంక్షోభణ చక్రమును"ఎనిమిది వికసిత దళములు కల వృత్తాకారముగా చెప్పుకున్నాము.

 ఇప్పుడు ఎనిమిది కోణములతో వృత్తాకారముగా నున్న రోగహర చక్రము గురించి తెలుసుకుంటున్నాము.

  చక్రతత్త్వమును అర్థము చేసుకునేందుకు ఉపాయముగా మనమొకవిషయమును ముచ్చటించుకుందాము.

  


  సూర్యుని వేడినుండి ఏర్పడిన మేఘాలు సూర్యుని కప్పివేయుటకు ప్రయత్నిస్తుంది.కాని ఆ మేఘమునకు తాను సూర్యప్రభలవలనే కనబడుతున్నానని తెలియదు.

 

   అదేవిధముగా పరమాత్మచే ప్రకటించబడిన మాయ పరమాత్మ తత్త్వమునే అనుగ్రహమునే కప్పివేయుటకు ప్రయత్నిస్తుంది తాను స్వతంత్రమన్న భావనతో


   కప్పినవాడు మేఘమును/మాయను విప్పలేడా ?చెప్పండి

  

   తలచుకోగానే,

 మేఘము కురుస్తుంది-మాయ ముగుస్తుంది.


  ఇప్పుడు సాధకుడు


 గుర్బోధ శ్రవణ దశను దాటి మనన డశలోనికి ప్రవేశిస్తున్నాడు.


  అత్యంత రామణీయకమైన ఎనిమిదికోణములచక్రప్రవేశము చేస్తున్న మనసు భయమును పోగొట్టుకున్నప్పటికిని సందేహములతో,


 అసలు ఆ బ్రహ్మపదార్థము ఎలా ఉంటుంది?ఎందుకు అనేకములుగా భాసిస్తుంది?ఇలా ఎన్నెన్నో సందేహములు

   నాకన్నా ముందుగా  ప్రవేశించిన ఎందరో రెండు జతలుగా ఏర్పడి గట్టిగా  వాదించుకుంటున్నారు.వారిదీఎ అపరోక్షజ్ఞానమే 

 ఆవరణములోని ఎనిమిది మహాశక్తులగురించి అనుకుంటా.


   మొదటి జట్టు ఈ ఆవరనములోని ఎనిమిది త్రికోణములు "అష్టవసువులు" అన్నారు ధీమాగా.

   వారినిఖండిస్తూ,కాదు కాదు " అష్టదిక్కులు"అన్నారు రెండవజత.

   కాసేపి నిశబ్దము.

    అయితే,

  "వశిన్యాది  బాగ్దేవతలు" అన్నారు నమ్మకంగా.

   వెంటనే కాదు కాదు "గాయత్రీమంత్రము" అన్నది రెండవ జట్టు.

  

    అసహనము పెరిగిపోతున్నది  మొదటి జతలో.

  పిడికిలి బిగించి గట్టిగా,

   పంచ తన్మాత్రలు+ రాగద్వేషములు+మనసు అన్నరు నిశ్చయముగా.

    అంటే నిశ్చయముతో కాదుకాదు,

  పంచభూతములు మనసు బుద్ధి-అహంకారము అంటున్నారు ప్రత్యర్థులు

  అది మాటలయుద్ధము కాదు.అమ్మవారికి చేస్తున్న వాక్పుష్పముల అర్చన.

   ఒకేవిషయమును పరిపరివిధములుగా సమ్న్వయిస్తూ "తర్కముటో" తల్లిని సేవిస్తున్నారు.

  నా లలాటస్థానములో కదలికలు ప్రారంభమయినాయి.

  ఎనిమిద్మంది మాతలు నన్ను సమీపిస్తున్నారు.ఖేచరీ ముద్రాశక్తి నన్ను దహరాకాసము దగ్గరకు తీసుకుని వెళుతున్నది.

  చమత్కారముగా నా సందేహములనే రోగములు మటుమాయమై పోతున్నాయి.

 ఒకసారిచూస్తే ఆఎనిమిదిమందియోగినులు దక్షుని మనుమలైన వసు కుమారులుగా కనిపిస్తున్నారు.అవును అనుకునే లోపునే అష్టదిక్కులుగాను అనిపిస్తున్నారు.

 ఇంతలోవారందరుఒకటిగా దగ్గరకు వచ్చి "గాయత్రీ మంత్రముగా" వినిపిస్తున్నారు.ఇదినిజమూనుకునే లోపునే,

  అమ్మవారిచెంతచేరి "లలితా రహస్య సహస్ర నామములను వింటున్నారు.

 సర్వ మహాంకుశీ ముద్ర సాయము చేయాలనుకుంది నా సందేహములనే రోగములను తన అంకుశముతో తుంచివేసింది.

 ఇప్పుడు మెల్ల మెల్లగ  తత్త్వము అర్థమవుతోంది.

  నాకు తెలియకుండానే నా ప్రశ్నలకు సమాధానం గొరుకుతోంది.


     మనసు స్థిమిత పడుతోంది.ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది అంటే సమాధానములేదు.అంతా ఎవ్వరికి తెలియకుండా  జరిగిపోతోంది :

 ఇంక వాదనలు-ప్రతివాదనలు పలాయనము చిత్తగించవలసినదే.

    యోగినీ మాతలు ఎంత రహస్యముగా చర్చలు అని భ్రమింపచేస్తూ నన్ను అనుగ్రహించారు.

   "రహస్యయోగినీ మాతా" నమోనమః.

  అమ్మకరుణ

 యుక్తి-తర్కము-అనుమానము గా ప్రకటితమై,

 స్వానుభవమును కలిగిస్తున్నది.


   


 గుర్బోధ శ్రవణ దశను దాటి మనన డశలోనికి ప్రవేశిస్తున్నాడు.


  అత్యంత రామణీయకమైన ఎనిమిదికోణములచక్రప్రవేశము చేస్తున్న మనసు భయమును పోగొట్టుకున్నప్పటికిని సందేహములతో,


 అసలు ఆ బ్రహ్మపదార్థము ఎలా ఉంటుంది?ఎందుకు అనేకములుగా భాసిస్తుంది?ఇలా ఎన్నెన్నో సందేహములు

   నాకన్నా ముందుగా  ప్రవేశించిన ఎందరో రెండు జతలుగా ఏర్పడి గట్టిగా  వాదించుకుంటున్నారు.వారిదీఎ అపరోక్షజ్ఞానమే 

 ఆవరణములోని ఎనిమిది మహాశక్తులగురించి అనుకుంటా.


   మొదటి జట్టు ఈ ఆవరనములోని ఎనిమిది త్రికోణములు "అష్టవసువులు" అన్నారు ధీమాగా.

   వారినిఖండిస్తూ,కాదు కాదు " అష్టదిక్కులు"అన్నారు రెండవజత.

   కాసేపి నిశబ్దము.

    అయితే,

  "వశిన్యాది  బాగ్దేవతలు" అన్నారు నమ్మకంగా.

   వెంటనే కాదు కాదు "గాయత్రీమంత్రము" అన్నది రెండవ జట్టు.

  

    అసహనము పెరిగిపోతున్నది  మొదటి జతలో.

  పిడికిలి బిగించి గట్టిగా,

   పంచ తన్మాత్రలు+ రాగద్వేషములు+మనసు అన్నరు నిశ్చయముగా.

    అంటే నిశ్చయముతో కాదుకాదు,

  పంచభూతములు మనసు బుద్ధి-అహంకారము అంటున్నారు ప్రత్యర్థులు

  అది మాటలయుద్ధము కాదు.అమ్మవారికి చేస్తున్న వాక్పుష్పముల అర్చన.

   ఒకేవిషయమును పరిపరివిధములుగా సమ్న్వయిస్తూ "తర్కముటో" తల్లిని సేవిస్తున్నారు.

  నా లలాటస్థానములో కదలికలు ప్రారంభమయినాయి.

  ఎనిమిద్మంది మాతలు నన్ను సమీపిస్తున్నారు.ఖేచరీ ముద్రాశక్తి నన్ను దహరాకాసము దగ్గరకు తీసుకుని వెళుతున్నది.

  చమత్కారముగా నా సందేహములనే రోగములు మటుమాయమై పోతున్నాయి.

 ఒకసారిచూస్తే ఆఎనిమిదిమందియోగినులు దక్షుని మనుమలైన వసు కుమారులుగా కనిపిస్తున్నారు.అవును అనుకునే లోపునే అష్టదిక్కులుగాను అనిపిస్తున్నారు.

 ఇంతలోవారందరుఒకటిగా దగ్గరకు వచ్చి "గాయత్రీ మంత్రముగా" వినిపిస్తున్నారు.ఇదినిజమూనుకునే లోపునే,

  అమ్మవారిచెంతచేరి "లలితా రహస్య సహస్ర నామములను వింటున్నారు.

 సర్వ మహాంకుశీ ముద్ర సాయము చేయాలనుకుంది నా సందేహములనే రోగములను తన అంకుశముతో తుంచివేసింది.

 ఇప్పుడు మెల్ల మెల్లగ  తత్త్వము అర్థమవుతోంది.

  నాకు తెలియకుండానే నా ప్రశ్నలకు సమాధానం గొరుకుతోంది.


     మనసు స్థిమిత పడుతోంది.ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది అంటే సమాధానములేదు.అంతా ఎవ్వరికి తెలియకుండా  జరిగిపోతోంది :

 ఇంక వాదనలు-ప్రతివాదనలు పలాయనము చిత్తగించవలసినదే.

    యోగినీ మాతలు ఎంత రహస్యముగా చర్చలు అని భ్రమింపచేస్తూ నన్ను అనుగ్రహించారు.

   "రహస్యయోగినీ మాతా" నమోనమః.

  అమ్మకరుణ

 యుక్తి-తర్కము-అనుమానము గా ప్రకటితమై,

 స్వానుభవమును కలిగిస్తున్నది.

  "నిర్మమా మమతాహంత్రీ-నిష్పాపపాపనాశినీ

   నిష్క్రోధా క్రోధశమనీ-నిర్లోభా లోభనాశినీ

   నిస్సంశయా-సంశయఘ్నీ-నిర్భవా-భవనాశినీ 

     అంటూ,చక్రేశ్వరికి నమస్కరించి,ఒకమెట్టు ఎక్కి,

      సర్వసిద్ధిప్రద చక్ర 'ప్రవేశమునకు సంసిద్ధుదవుతున్నాడు.

  యాదేవీసర్వభూతేషు   విద్యారూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.


   సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు. 


   

   

   


Monday, October 7, 2024

SREECHAKRADHARINI-06-SARVARAKSHAKARA CHAKRAMU

 

   శ్రీచక్రధారిణి-06-సర్వరక్షాకరచక్రము


  **************************

  ప్రార్థన

  ******

 "తాదృశం ఖడ్గమాప్నోతితేనహస్తస్థితేనవై

  అష్టాదశ ద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."


 ఇప్పటివరకు 

 **********

 మనము సృష్టి త్రయ చక్రములను విశేషములను తెలిసికొని,రెండవ భాగమైన స్థితిచక్ర త్రయములోని చతుర్దశారము-బహిర్దశారమును దర్శించి అత్యంత కీలకమైన (జ్యోతిర్మయ చక్రము/విజ్ఞాన చక్రము)లోనికి ప్రవేశించబోతున్నాము.

 * గమనిక

   *****

 ప్రియ మిత్రులారా ఇప్పటివరకు ముచ్చటించుకున్న ఆవరణములలోనేను,

 "అర్థముచేసుకున్న వారికి అర్థము చేసుకున్నంత"

    అను వాక్యమును వ్రాసినది నా ఉపాధి అహంకారముతో కాదు.

  భూపురము నుండి బహిర్దశారము వరకు మనము పూర్తిగా మాయచే/మాయమలముచే కప్పబడియున్నాము కనుక ఒకవేళ మనము పూర్తిగా అమ్మ తత్త్వమును అర్థముచేసికొనుటకు ప్రయత్నించినప్పటికిని వీలుకాదు.

  ఇప్పుడు మన మనసు గురువు తలపుతో-గురు పాదసరణాగతితో మాయను చాలావరకు తొలగించుకుని "గురు బోధనూ శ్రవణము చేయగల అదృష్తమును పొందియున్నది.

    కనుక ఇకనుండి దేవతానుగ్రహమును చేదుకున్నవారికి చేదుకున్నంత.

  ఇప్పుడు

  ****


  

  ఈ ఆవరణము సాధకునికి దిశానిర్దేశములో కీలకపాత్రను పోషిస్తుంది.సర్వద్వంద్వక్షయంకరీ మాతానుగ్రహముతో,గురుబోధా శ్రవనము ద్వారా సాధకుడు,

 తత్త్వమసి అను ద్వంద్వభావములనుండి తేరుకుని,

 అహంబ్రహ్మాస్మి అనగలుగుతాడు ఇప్పటికి బహిర్యాగము ముగిసి అంతర్యాగమునకు సిద్ధపడుతున్నాడు.

  ఉపాధిని అంటిపెట్టుకుని యున్న రాగద్వేషములు వీడితే కాని మనసులోనికి రాగరంజితమైన అమ్మ రూపము/తత్త్వముచేరదు.

   బాహ్యదశారములోని పది వాయుకళలు అమ్మదయతో తేజోమండలప్రవేశము చేసిన వానికి పది వహ్ని కళలుగా/అగ్ని కళలుగా తమరూపము త్రికోణములే అయినప్పటిని తమ తత్త్వమును అగ్నితత్త్వముగా అనుకూలముగా మార్చుకుని శ్వాస ప్రక్రియకు తోడ్పడినట్లుగానే జీర్ణ ప్రక్రియా సహాయకములైనవి.


   స్తోత్రము

   *******

శ్రీచక్ర షష్టావరణదేవతాః

సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,


  అంతర్దశారము అంటే అంతర్ముఖత్వము.

 ఈ ఆవరణమునే "సర్వరక్షాకరచక్రము"అని కూడా అంటారు.

    ఇక్కడి సిద్ధిదేవత ప్రాకామ్యసిద్ధి.

    ఇక్కడిముద్రామాత-సర్వమహాంకుశి

    పది త్రికోణములు -పదిమంది "నిగర్భయోగినులు".


   పరమేశ్వరుడు చక్రమును/ఆవరణమును గురించిపార్వతీదేవితో,

  " రకారాత్  పరమేశాని చక్రం వ్యాప్త విజృంభతే

    దశకోణకరీ యస్మాత్ రకారో జ్యోతిరవ్యయం

    కళా దశోనిధిః వహ్నిః దశకోణ ప్రకారకః."


     ఓ పరమేశాని! పరంజ్యోతి అనిర్వచనీయమై దసకోణములుగా తన శక్తిని నిక్షిప్త పరచి,సాధకునికి ఋజుమార్గమును చూపించుచున్నది.

   ఇక నిగర్భయోగినీ మాతలు అన్నకోశ నివాసినులై జీర్ణవ్యవస్థను  క్రమ బద్ధీకరిస్తున్నారు.


 


   శ్రీచక్రధారిణి-04-సర్వరక్షాకరచక్రము


  **************************


  ప్రార్థన


  ******


 "తాదృశం ఖడ్గమాప్నోతి తేనహస్తస్థితేనవై


  అష్టాదశమహా ద్వీ సమ్రాడ్భోక్తా భవిష్యతి."



   ఇప్పటివరకు 

   **********


 మనము సృష్టి త్రయ చక్రముల విశేషములను తెలిసికొని,రెండవ భాగమైన స్థితిచక్ర త్రయములోని చతుర్దశారము-బహిర్దశారమును దర్శించి అత్యంత కీలకమైన (జ్యోతిర్మయ చక్రము/విజ్ఞాన చక్రము) అంతర్దశారము లోనికి ప్రవేశించబోతున్నాము.



 * గమనిక


   *****


 ప్రియ మిత్రులారా ఇప్పటివరకు ముచ్చటించుకున్న ఆవరణములలో  నేను,


 "అర్థముచేసుకున్న వారికి అర్థము చేసుకున్నంత"


    అను వాక్యమును వ్రాసినది నా ఉపాధి అహంకారముతో కాదు.


  భూపురము నుండి బహిర్దశారము వరకు మనము పూర్తిగా మాయచే/మాయమలముచే కప్పబడియున్నాము కనుక ఒకవేళ మనము పూర్తిగా అమ్మ తత్త్వమును అర్థముచేసికొనుటకు ప్రయత్నించినప్పటికిని వీలుకాదు.


  ఇప్పుడు మన మనసు గురువు తలపుతో-గురు పాదశరణాగతితో  మాయను చాలావరకు తొలగించుకుని "గురు బోధను  శ్రవణము చేయగల అదృష్టమును  పొందియున్నది.

    " భక్తుడు భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడా అని నలుదిక్కుల చూస్తుంటాడట.

      భగవంతుడు వీడెప్పుడు తనలోనికి చూస్తాడా కనపడదామనుకుంటాడట."

   అయ్యా/అమ్మాఇదీ సంగతి కనుక,


    ఇకనుండి దేవతానుగ్రహమును చేదుకున్నవారికి చేదుకున్నంత.


  ఇప్పుడు


  ****




  


  ఈ ఆవరణము సాధకునికి దిశానిర్దేశములో కీలకపాత్రను పోషిస్తుంది.సర్వద్వంద్వక్షయంకరీ మాతానుగ్రహముతో,గురుబోధా శ్రవనము ద్వారా సాధకుడు,


 తత్త్వమసి అను ద్వంద్వభావములనుండి తేరుకుని,


 అహంబ్రహ్మాస్మి అనగలుగుతాడు ఇప్పటికి బహిర్యాగము ముగిసి అంతర్యాగమునకు సిద్ధపడుతున్నాడు.


  ఉపాధిని అంటిపెట్టుకుని యున్న రాగద్వేషములు వీడితే కాని మనసులోనికి రాగరంజితమైన అమ్మ రూపము/తత్త్వముచేరదు.


   బాహ్యదశారములోని పది వాయుకళలు అమ్మదయతో తేజోమండలప్రవేశము చేసిన వానికి పది వహ్ని కళలుగా/అగ్ని కళలుగా (తమరూపము త్రికోణములే అయినప్పటిని) తమ తత్త్వమును అగ్నితత్త్వముగా అనుకూలముగా మార్చుకుని శ్వాస ప్రక్రియకు తోడ్పడినట్లుగానే, జీర్ణ ప్రక్రియా సహాయకములైనవి

.

    స్తోత్రము

   *******

                శ్రీచక్ర షష్టావరణదేవతాః


సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,





  అంతర్దశారము అంటే అంతర్ముఖత్వము.


 ఈ ఆవరణమునే "సర్వరక్షాకరచక్రము"అని కూడా అంటారు.


    ఇక్కడి సిద్ధిదేవత ప్రాకామ్యసిద్ధి.


    ఇక్కడిముద్రామాత-సర్వమహాంకుశి


    పది త్రికోణములు -పదిమంది "నిగర్భయోగినులు".


   అమ్మ కరుణతో ఈ ఆవరణము మనకు,

  1.పంచకోశాస్తరస్థిత అయిన తల్లి అన్నమయకోశముగాను

    పంచభక్ష్య పదార్థములుగా-వానిని పచనము చేయు పంచ వహ్ని కళలుగా

  2.శ్రవనము-మననము-నిధిధ్యాసనము లోని శ్రవణ భాగముగాను

  3.పరంజ్యోతి ప్రకాశక అంశలైన నిగర్భయోగినీ నిర్మితము గాను  

     అన్వయించుకోగలుగుతాము.

     

   పరమేశ్వరుడు చక్రమును/ఆవరణమును గురించిపార్వతీదేవితో,


  " రకారాత్  పరమేశాని చక్రం వ్యాప్త విజృంభతే


    దశకోణకరీ యస్మాత్ రకారో జ్యోతిరవ్యయం


    కళా దశోనిధిః వహ్నిః దశకోణ ప్రకారకః."

         ఓ పరమేశాని! పరంజ్యోతి అనిర్వచనీయమై    


 దశ    కోణములుగా తన శక్తిని నిక్షిప్త పరచి,సాధకునికి ఋజుమార్గమును చూపించుచున్నది. 


  సర్వము బ్రహ్మమయము.బ్రహ్మము అనేకానేక ప్రవృత్తులతో ఉపాధులలో నిండిన వేళ,

 1.బ్రహ్మ రాక్షసుడు(తమోగుణము)

 2.బ్రహ్మర్షి(సత్వగుణము)

 3.బ్రహ్మాస్త్రము(రజోగుణము)

 4.బ్రహ్మాండము(స్థూలప్రకటనము)

 5.బ్రహ్మాస్మి( సూక్మ ప్రకటనము)


     ఇలా ఎన్నో విధములుగా ప్రకటితమగుతూ,అనేక నామరూపములను పొందుచున్నది.

   రక్ష అంటే రక్షణము.సర్వరక్ష అంటేసమస్త రక్షణము.

   అది ఏవిధముగా జరుగుతున్నది?

 చీకటికి వెలుతురు తనను తరిమివేస్తున్నదన్నభయము

 అసత్యమునకు సత్యము తనను గేలిచేస్తుందన్న భయము

 అందమునకు/యవ్వనమునకు వృద్ధాప్యము తనను మాయము చేస్తుందన్న భయము

 పదవికి తనౌనికి ఎంతకాలమో అన్నభయము.

   ఈవిధముగాచీకటి-వెలుతురులు,సత్యాసత్యములు,జీవిత దశలు,ద్వంద్వరూపములుగా ప్రకటితమగుతు భయమునకు గురిచేస్తున్నాయి.

   ద్వంద్వభావములను నిర్ద్వంద్వము చేయుటయే రక్షణ.భయమునుపోగుట్టుటయే దాని సూత్రము.కనుకనే సాధకుడు గురుతత్త్వ చింతనము తరువాతనే ఈఆవరణములోనికి ప్రవేశించగలిగాడు.శరనమును పొంది గురుబోధా శ్రవనమును పొందుతాడు.

  స్వస్వరూపావేశ ప్రవేశమే సర్వరక్షాకర చక్రము.


 ఇక యోగినులు-నిగర్భయోగినులు.అంటే,

 గర్భము అనగా ఆధారము.

 నిగర్భము అనగా నిక్షిప్తముగా నున్న ఆధారము(. విశ్వారాధము)

  మనము తల్లి గర్భము నుండి మాయ యను మూటనువెంట బెట్టుకుని ప్రపంచమను వెలుగులోనికి వచ్చాము.వచ్చిన తరువాత మాయను తెరగా పరచుకుని నివసిస్తున్నాము.ఎప్పుడయితే బాహ్యదశారచక్రమును దాటి అంతర్దశార చక్రప్రవేశము చేస్తామో వాయుశక్తి అగ్నిశక్తిగా రూపాంతరముచెంది మాయను(చాలా వరకు)దహించివేస్తుంది.

 "ఏకం సత్ విప్రాబహుదా" అన్నవిషయము అర్థమవుతూ ఉంటుంది.భయము తొలగుతుంది కాని సందేహము మాత్రము( రోగరూపముగా) ఉంటుంది.దాని నివృత్తికై సాధకుడు  త్రిపుర మాలిని ఆశీర్వచనముతో,నిగర్భయోగినుల సహకారముతో "సర్వరోగ హరచక్ర ప్రవేశమునకు"ఉద్యక్తుడగుచున్నాడు.


  " జ్యోతి స్వరూపాకాత్మే దీపం పరికల్పయామి"


  సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.

 


SREECHAKRADHARINI-06-SARVARAKSHAKARACHAKRAMU.

 


   శ్రీచక్రధారిణి-05-

   *******************************

 ప్రార్థన

 ******

 "తాదృశంఖడ్గమాప్నోతి యేనహస్తస్థితేనవై

  అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"


  ఇప్పటివరకు

  *****8**

     సాధకుడు త్రిశరీరములతో మూడు అవస్థలను దాటి ,సత్యాన్వేషనము ప్రారంభించాడు.పరబ్రహ్మ విచారణము ప్రారంభమయినది."అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా" అయిన అమ్మ కరుణ గురువు కొరకు అన్వేషణమును ప్రారంభింపచేసినది.



  ఇప్పుడు

  *****

  తనలోనిక్షిప్తం గా, నాడీమండలముగా నుండి ఉపాధి మొత్తమును రక్తప్రసరణము ద్వారా చైతన్యవంతము చేస్తున్న హృదయేశ్వరి కరుణ ,పది వాయువుల రూపనులతో (వాయుమండలము)గా చైతన్యమును ప్రసరిస్తున్నదో తెలుసుకునే ప్రయత్నములో నున్నాడు.


   స్తోత్రము

   ********

శ్రీచక్ర పంచమావరణదేవతాః

సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,


     పరమేశ్వరుడు పార్వతీదేవితో "బాహ్యదశారముగా" కీర్తింపబడుచున్న సర్వార్థసాధక చక్రమును,

  

 " దశారం తప్తహేమాభం సిందూర సదృశంప్రియే

   సర్వార్థసాధకం చక్రం మనశ్చింతితం సదా."

       ప్రియే! పార్వతీ,

   పదికోణములు వృత్తమునకు వెలుపల విరాజిల్లుతుండగా సిందూరవర్ణముతో ప్రకాశిస్తూ,మనోభీష్టములను సర్వము సాదించునది..  ఈ ఆవరణము. 

  ఇక్కడ మనము అర్థము అను పదమునకు పరబ్రహ్మ తత్త్వమైన "పరమార్థమును " గ్రహించాలి.



    కామ అను పురుషార్థమును వివరించునపుడు పెద్దలు ఆ పదము ప్రారంభమున వస్తే అది అరిషడ్వర్గములలోనిదని,అదే పదము మూడవపదముగా "ధర్మ-అర్థ-కామ-మోక్షములలో "వస్తే చతుర్విధ పురుషార్థములలో ఒకటిగా మారుతుందని చెబుతారు.

   అదే విధముగా జన్మము సఫలతనొందించు అర్థమును మామూలు సార్ధకత గా కాక పరమార్థ సదృశముగా చెబుతారు.

    ఈ ఆవరణమును "కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతులుగా" భావిస్తారు.


    సర్వార్థసాధక చక్రములో హకార+సకార +ఈకార బీజములుగా,

 హ్సైం -హ్స్కీం+ హ్సౌం నినదిస్తూ,

  పది మంది "కులోత్తీర్ణ యోగినులతో" కళకళలాడుతుంటుంది.వీరినే "కులయోగినులు" అని కూడా అంటారు.

 1.కులము అనగా సదాచారము

 2.కులము అనగా భూవలయము.

 3.కులము అనగా మూలాధారము

 4,కులము అనగా "జ్ఞానము"

 5.కులము అనగా సమూహము.

    భూమిని,మూలాధారమును-భూవలయమును చర్మచక్షువులు దర్శించగలుగుతాయి.

   జ్ఞానము మాత్రము అనుభవైక వేద్యము.స్వానుభవముతో తెలుసుకోవలసినదే కాని కేవలము చూచి గ్రహించ తరముకానిది.

   యోగినుల స్వభావము ఉత్తీర్ణత.అనగా విస్తరింపచేయుట. 


 తనకున్నజ్ఞానమును మరికొందరికి పంచుతూ విస్తరింపచేయుట కులోత్తీర్ణత.అనేకానేక గురుపరంపరలు శిష్యపరంపరల ద్వారా వ్యాప్తి జరుగుట.వీరి నామ సంకేతము.



  ఆ విధముగా పొందిన జ్ఞానమునే "ముక్తి"/కైవల్యము అంటారు.దీనినే మోక్షసిద్ధి అనికూడ పేర్కొంటారు.

 ముముక్షుస్థితి నుండి మోక్షస్థితికి సాధకునిచేర్చునది అమ్మ కరుణస్వరూపమన "యోగినీ రహస్యము."

  చక్రేశ్వరి మనలలితా రహస్య సహస్ర నామములో కీర్తించు

  "త్రిపురాశ్రీ-వశంకరి" త్రిపురశ్రీ మాత.ఉపాధిని లక్ష్మీప్రదము చేయు శక్తి.


  సర్వోన్మాదినిముద్రాశక్తి సాధకునిచిత్తమును ఉన్మత్తమయము చేసి పరబ్రహ్మ తత్త్వదర్శనమునకై పరితపింపచేస్తుంది.

   వశిత్వసిద్ధి గురువును పరిచయముచేస్తూ మార్గమును సుగమముచేస్తుంది.

  సాధకుడు తనకు మార్గ నిర్దేశి యైన గురువును సమీపించ గలుగుతాడు.గురుదర్శన భాగ్యము కలుగుతుంది.

   "గురువు లేని విద్య గుడ్డి విద్య ' అను సామెత ఉందికద

     ఇక్కడ మనము వాచక జ్ఞానము-అనుభవ జ్ఞానము అను రెండువిషయములను ముచ్చటించుకుందాము.ఒక్కొక్క సారి వాచక జ్ఞానము శ్రవణము వరకేమనలనుచేర్చగలదు.తాత్కాలిక మార్పును మాత్రమే కలిగిస్తుంది.కానీనుభవ జ్ఞానము అగ్గి వంటింది.


 ఉదాహరణముగా అగ్గి ఎన్ని దీపములైననను వెలిగించగలదు.కాని దీపము ఒకసారి తాను అగ్గిచే వెలించబడిన తరువాతనే కొంత సమయము వరకు మిగిలిన దీపములను వెలిగించగలదు.



  ఆ అగ్గియే జ్ఞానాగ్ని స్వరూపమైన గురువు.ఎందరో శిష్యులను గురువులుగా మార్చగల శక్తిస్వరూపుడు.

   మన శరీరములో నిండియున్న 

 5.ప్రధానవాయువులు

 %.సహాయ వాయువులు 

    దశారములోని రేకులుగా చెబుతారు

   వీటి పనితీరు బాహ్యముగా ప్రకటితమగుచున్నది కనుక బాహ్యదశారము.

  అర్థముచేసుకున్నవారికి  అర్థము చేసుకోగలిగినంత.

 మనముచ్చట

 *********

   పూజలందు నైవేద్యము చేయువేళ మనము

 ఓం

1.ప్రాణాయస్వాహా

 2.అపానాయస్వాహా

3.వ్యానాయస్వాహా

 4.ఉదానాయస్వాహ

5.సమానయస్వాహా అని వుంటుంటాము కదా.

    దేవునికిసమర్పిస్తున్నాము అన్న భావనౌన్నప్పటికిని మనము మన శరీరములో దాగిన 5 వాయువులకు సమర్పిస్తాము.

   అదేవిధముగా,

 మనము కన్ను  రెప్పవేస్తుంటాము-ఆవులిస్తుంటాము-తుమ్ముతుంటాము-నోరు తెరిచి మూస్తుంటాము,మూత్ర-మల విసర్జనము చేస్తుంటాము.ఆ సమయములకు అనుకూలముగా మన శరెరభాగములూప్రయత్నముగా స్పందిస్తుంటాయి.చాలా సహజముగా జరిపోతుంటాయి ఆ ప్రక్రియలు.వాటినిచేయిస్తున్న శక్తులే ఉపవాయులను పేర నున్న ఐదుగురు యోగినులు.


   అమ్మచేయిస్తుంటే ఆనందంగా ఉంటూ అమ్మను తలవలేకపోవటం...అమ్మ అజ్ఞానమును మన్నించునుగాక.

  " వాయవ్యాత్మకాయై అరిషడ్వర్గ విసర్జనం ధూపం పరికల్పయామి"



  సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.


Sunday, October 6, 2024

SREECHAKRADHARINI-05-SARVARTHASADHAKACHAKRAMU


 


   శ్రీచక్రధారిణి-04-సర్వార్థసాధక చక్రము

   *******************************

 ప్రార్థన

 ******

 "తాదృశంఖడ్గమాప్నోతి యేనహస్తస్థితేనవై

  అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"


  ఇప్పటివరకు

  *****8**

     సాధకుడు త్రిశరీరములతో మూడు అవస్థలను దాటి ,సత్యాన్వేషనము ప్రారంభించాడు.పరబ్రహ్మ విచారణము ప్రారంభమయినది."అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా" అయిన అమ్మ కరుణ గురువు కొరకు అన్వేషణమును ప్రారంభింపచేసినది.



  ఇప్పుడు

  *****

  తనలోనిక్షిప్తం గా, నాడీమండలముగా నుండి ఉపాధి మొత్తమును రక్తప్రసరణము ద్వారా చైతన్యవంతము చేస్తున్న హృదయేశ్వరి కరుణ ,పది వాయువుల రూపనులతో (వాయుమండలము)గా చైతన్యమును ప్రసరిస్తున్నదో తెలుసుకునే ప్రయత్నములో నున్నాడు.


   స్తోత్రము

   ********

శ్రీచక్ర పంచమావరణదేవతాః

సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,


     పరమేశ్వరుడు పార్వతీదేవితో "బాహ్యదశారముగా" కీర్తింపబడుచున్న సర్వార్థసాధక చక్రమును,

  

 " దశారం తప్తహేమాభం సిందూర సదృశంప్రియే

   సర్వార్థసాధకం చక్రం మనశ్చింతితం సదా."

       ప్రియే! పార్వతీ,

   పదికోణములు వృత్తమునకు వెలుపల విరాజిల్లుతుండగా సిందూరవర్ణముతో ప్రకాశిస్తూ,మనోభీష్టములను సర్వము సాదించునది..  ఈ ఆవరణము. 

  ఇక్కడ మనము అర్థము అను పదమునకు పరబ్రహ్మ తత్త్వమైన "పరమార్థమును " గ్రహించాలి.



    కామ అను పురుషార్థమును వివరించునపుడు పెద్దలు ఆ పదము ప్రారంభమున వస్తే అది అరిషడ్వర్గములలోనిదని,అదే పదము మూడవపదముగా "ధర్మ-అర్థ-కామ-మోక్షములలో "వస్తే చతుర్విధ పురుషార్థములలో ఒకటిగా మారుతుందని చెబుతారు.

   అదే విధముగా జన్మము సఫలతనొందించు అర్థమును మామూలు సార్ధకత గా కాక పరమార్థ సదృశముగా చెబుతారు.

    ఈ ఆవరణమును "కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతులుగా" భావిస్తారు.


    సర్వార్థసాధక చక్రములో హకార+సకార +ఈకార బీజములుగా,

 హ్సైం -హ్స్కీం+ హ్సౌం నినదిస్తూ,

  పది మంది "కులోత్తీర్ణ యోగినులతో" కళకళలాడుతుంటుంది.వీరినే "కులయోగినులు" అని కూడా అంటారు.

 1.కులము అనగా సదాచారము

 2.కులము అనగా భూవలయము.

 3.కులము అనగా మూలాధారము

 4,కులము అనగా "జ్ఞానము"

 5.కులము అనగా సమూహము.

    భూమిని,మూలాధారమును-భూవలయమును చర్మచక్షువులు దర్శించగలుగుతాయి.

   జ్ఞానము మాత్రము అనుభవైక వేద్యము.స్వానుభవముతో తెలుసుకోవలసినదే కాని కేవలము చూచి గ్రహించ తరముకానిది.

   యోగినుల స్వభావము ఉత్తీర్ణత.అనగా విస్తరింపచేయుట. 


 తనకున్నజ్ఞానమును మరికొందరికి పంచుతూ విస్తరింపచేయుట కులోత్తీర్ణత.అనేకానేక గురుపరంపరలు శిష్యపరంపరల ద్వారా వ్యాప్తి జరుగుట.వీరి నామ సంకేతము.



  ఆ విధముగా పొందిన జ్ఞానమునే "ముక్తి"/కైవల్యము అంటారు.దీనినే మోక్షసిద్ధి అనికూడ పేర్కొంటారు.

 ముముక్షుస్థితి నుండి మోక్షస్థితికి సాధకునిచేర్చునది అమ్మ కరుణస్వరూపమన "యోగినీ రహస్యము."

  చక్రేశ్వరి మనలలితా రహస్య సహస్ర నామములో కీర్తించు

  "త్రిపురాశ్రీ-వశంకరి" త్రిపురశ్రీ మాత.ఉపాధిని లక్ష్మీప్రదము చేయు శక్తి.


  సర్వోన్మాదినిముద్రాశక్తి సాధకునిచిత్తమును ఉన్మత్తమయము చేసి పరబ్రహ్మ తత్త్వదర్శనమునకై పరితపింపచేస్తుంది.

   వశిత్వసిద్ధి గురువును పరిచయముచేస్తూ మార్గమును సుగమముచేస్తుంది.

  సాధకుడు తనకు మార్గ నిర్దేశి యైన గురువును సమీపించ గలుగుతాడు.గురుదర్శన భాగ్యము కలుగుతుంది.

   "గురువు లేని విద్య గుడ్డి విద్య ' అను సామెత ఉందికద

     ఇక్కడ మనము వాచక జ్ఞానము-అనుభవ జ్ఞానము అను రెండువిషయములను ముచ్చటించుకుందాము.ఒక్కొక్క సారి వాచక జ్ఞానము శ్రవణము వరకేమనలనుచేర్చగలదు.తాత్కాలిక మార్పును మాత్రమే కలిగిస్తుంది.కానీనుభవ జ్ఞానము అగ్గి వంటింది.


 ఉదాహరణముగా అగ్గి ఎన్ని దీపములైననను వెలిగించగలదు.కాని దీపము ఒకసారి తాను అగ్గిచే వెలించబడిన తరువాతనే కొంత సమయము వరకు మిగిలిన దీపములను వెలిగించగలదు.



  ఆ అగ్గియే జ్ఞానాగ్ని స్వరూపమైన గురువు.ఎందరో శిష్యులను గురువులుగా మార్చగల శక్తిస్వరూపుడు.

   మన శరీరములో నిండియున్న 

 5.ప్రధానవాయువులు

 %.సహాయ వాయువులు 

    దశారములోని రేకులుగా చెబుతారు

   వీటి పనితీరు బాహ్యముగా ప్రకటితమగుచున్నది కనుక బాహ్యదశారము.

  అర్థముచేసుకున్నవారికి  అర్థము చేసుకోగలిగినంత.

 మనముచ్చట

 *********

   పూజలందు నైవేద్యము చేయువేళ మనము

 ఓం

1.ప్రాణాయస్వాహా

 2.అపానాయస్వాహా

3.వ్యానాయస్వాహా

 4.ఉదానాయస్వాహ

5.సమానయస్వాహా అని వుంటుంటాము కదా.

    దేవునికిసమర్పిస్తున్నాము అన్న భావనౌన్నప్పటికిని మనము మన శరీరములో దాగిన 5 వాయువులకు సమర్పిస్తాము.

   అదేవిధముగా,

 మనము కన్ను  రెప్పవేస్తుంటాము-ఆవులిస్తుంటాము-తుమ్ముతుంటాము-నోరు తెరిచి మూస్తుంటాము,మూత్ర-మల విసర్జనము చేస్తుంటాము.ఆ సమయములకు అనుకూలముగా మన శరెరభాగములూప్రయత్నముగా స్పందిస్తుంటాయి.చాలా సహజముగా జరిపోతుంటాయి ఆ ప్రక్రియలు.వాటినిచేయిస్తున్న శక్తులే ఉపవాయులను పేర నున్న ఐదుగురు యోగినులు.


   అమ్మచేయిస్తుంటే ఆనందంగా ఉంటూ అమ్మను తలవలేకపోవటం...అమ్మ అజ్ఞానమును మన్నించునుగాక.

  " వాయవ్యాత్మకాయై అరిషడ్వర్గ విసర్జనం ధూపం పరికల్పయామి"



  సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.



Saturday, October 5, 2024

SREECHAKRADHARINI-04-SARVASAUBHAAGYAPRADA CHAKRAMU




  




    శ్రీచక్రధారిణి-04-సర్వ సౌభాగ్య(ప్రద)చక్రము


    *********************************




 ప్రార్థన


 *******


 " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై


   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"




 ఇప్పటివరకు


 *********


  అమ్మ దయతో సాధకుడు "సృష్టి త్రయ చక్రములను" దర్శించి త్రితత్త్వమును తెలిసికొని,స్తోత్ర రెండవ భాగమైన "స్థితిచక్ర త్రయము"లోని మొదటిచక్రమైన "సర్వ సౌభాగ్య ప్రద చక్ర ప్రవేశము చేయబోతున్నాడు.


  


 స్తోత్రము


 ********


శ్రీచక్ర చతుర్థావరణదేవతాః


సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,


  పరమేశ్వరుడు ఐదవ ఆవరణమును గురించి పార్వతీదేవి ఈ విధముగా వివరిస్తున్నాడు.


 " చతుర్దశారం  దేవేశి దాడిమీ కుసుమ ప్రభః


   ఆనందఫలదం భద్రే సర్వసౌభాగ్య సంప్రదం"


       దేవేశి  పార్వతి! 


   మన్వస్త్రము గా (మనోవృత్తులు) పిలువబడు ఈ ఆవరణము పదునాలుగు త్రికోణములతో వృత్తాకారముగా ఉంటుంది.సూక్ష్మత్వమునకు గుర్తుగా కోణములతో సంకేతించబడినది.సాధకునికి ఇది హృదయస్థానము.అనాహత చక్రము.


   ఈ 14 త్రికోణములను "సంప్రదాయ యోగినులు" అని కీర్తిస్తారు.వీరు ముముక్షువులకు సంపూర్తిగా పరబ్రహ్మమును తెలిసికొనునటకు,ఉద్ధరించుటకు సహాయపడుతుంటారు.


   భ్రమానందము నుండి బ్రహ్మానందమును పొందుటకు తాము సహకారమనేనిచ్చెనులుగా మారుతారు.


  గురు-శిష్య సంప్రదాయమునకు ప్రతీకలై ఉంటారు.


  ఈశ్వర ఆలోచనమును కలిగించు ఈశిత్వ సిద్ధిమాత ఉంటుంది.


  సర్వ వశంకరీ ముద్ర సత్యాన్వేషణకు బీజము వేస్తుంది.




 పదునాలుగు కోణములను,  


 1.పదునాలుగు లోకములు గాను,


 2 కనుండి -ఢ వరకు వర్ణములుగాను,


 3.పరమాత్మ ఉనికిని గ్రహింపచేయు


     "బ్రహ్మసూత్రములూ గాను అన్వయిస్తారు.


  1.పరబ్రహ్మ ఉనికిని తెలుసుకోవాలనుకొనుటయే "సౌభాగ్యము"


  2.దేహాత్మ భావనమును విడనాడగలుగుటయే "సౌభాగ్యము"



  3.సత్యాన్వేషణమునకు ఉద్యమించుటయే "సౌభాగ్యము"


  4.సంప్రదాయ యోగినుల సహకారము నందుకొనగలుగుటయే" సౌభాగ్యము"


  5..ముఖ్యముగా "వాసి-ని" ఖడ్గమును/గొడ్డలిని ధరించిన "త్రిపురవాసిని చక్రేశ్వరి ఆశీర్వచనముతో అడ్డంకులు తొలగి పోవుట "సౌభాగ్యము.(వాసిని అను పదమునకు నివసించునది/గొడ్డలిని ధరించినది అను అర్థములు)


   అత్యంత ఉత్కృష్టమైన  బ్రహ్మ విచారము ప్రారంభమవుతుంది ఇక్కడ.తనకు తానుగాచేయలేని స్థితి సాధకునిది.గురువుకై అన్వేషము ప్రారంభమవుతుంది.


  పరమేశ్వరుడు సాక్షాత్తుగా తానే ఈశ్వరరూపముగానో-గురురూపముగానో చేయినందిస్తాడు.


 పరబ్రహ్మము


 తత్+త్వం-అసి 


 నీవు నేను-ఉన్నాము అనుకుంటాడు.సాధకుడు.



 భాండ శుద్ధి జరిగిన తరువాత దానిలోని పాకము "మహాప్రసాదమే"








 ఆవరణము "ఈం" అను కామకళా బెజమును కలిగియున్నది.అంతేకాదు,


 హ అనే శివబీజమును+ ర అనే అగ్ని బీజమును_ఈం అను శక్తి బీజమును కలిగి "హ్రీకార" నాదాత్మకమైనది.ఇది మాయా బీజము.


  


  పరబ్రహ్మము ఎవరు?సాకారమా?లేక నిరాకారమా/ప్రత్యాక్షానుభూతిని కలిగిస్తుందా? లేక పరోక్షముగానే ఉంటుందా?ఒకే స్థలములో ఉంటుందాలేక అనేకరూపములతో అనేక విధములుగా ఉంటుందా?ఇంకా ఎన్నెనో సందేహములు


   వీటన్నిటికి కారణము మాయ యను తెరచే కప్పబడియున్న మనసు.




  పోతన గారు దుర్గమ్మను స్తుతిస్తు,


 'తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ" అన్నారు కదా.లోనమ్మకము కలగాలంటే లోతట్టు విచారణము/అంతర్మథనము జరగాలి.ఇక్కడ సత్యావిష్కారము చేయుటకై సత్యాన్వేషణ ప్రారంభము జరుగుంతుంది.సంక్షోభణముతో  ప్రారంభమై స్వంద్వములను క్షయముచేయుటతో ముగుస్తుంది.



   ఇంకొక ముఖ్య విషయము మానవ శరీరములో 72 000 ల నాడులు ఉన్నప్పటికినీ పదునాలుగు నాడులు అత్యంత కీలకమైనవి

.ఇడ-పింగళ-సుషుమ్నా  నాడులు హృదయమునకు రక్తమును శుభ్రపరచి అందిస్తూ,ప్రాణశక్తి రూపముగా ఉంటాయి.మిగతా నాడులు సైతము కీలకపాత్రను పోషిస్తాయి .


 అర్థము చేసుకున్న వారికి చేసుకున్నంత.




  మన ముచ్చట.


  ************


  మన రూపము-అద్దము-ప్రతిరూపము అను మూడింటి  గురించిన ముచ్చట.మనము అద్దములో కనపడటంలేదు.ఏమైందా అని చూస్తే అద్దము విపరీతమైన దుమ్ముతో ఉంది.మన ప్రతిరూపము కనపడాలంటే ఆ దుమ్మునెవరైనా తుడవాలి.వస్త్రముతో కాని/కడగాలి జలముతో కాని.


  ఆ తుడిచే శక్తి గురువు.ఉపయోగపడే వస్త్రమే సంప్రదాయ యోగినులు.తుడవబడు క్రియయే పరమాత్మ కరుణ.వారు ఎప్పుడు చేయినందిస్తూనే ఉంటారు.మనమే అప్పుడప్పుడు పట్తుకోనవసరము లేదులే అనుకుంటుంటాము మాయలో పడి.



   సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.


   








 



Friday, October 4, 2024

SREECHAKRADHAARInI-03-SARVA SAMKSHOBHANA CHAKRAMU


   శ్రీచక్రధారిణి-03-సర్వసంక్షోభణ చక్రము.

  ****************************

 ప్రార్థన

 *********

 " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితే నవై

   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా  భవిష్యసి"


  ఇప్పటి వరకు

  **********

 అమ్మ దయతో సాధకుడు తన మూలాధారములో,స్వాధిష్ఠానములో కదలికలనుపొంది జాగ్రత్-స్వప్న అవస్థలను స్థూల-సూక్షదేహములతో అనుభవించి,మూడవ ఆవరణమైన "సర్వసంక్షోభణ చక్ర "ప్రవేశము చేస్తున్నాడు.తేజసుడు-ప్రజ్ఞ గా తన స్వభావ నామమును మార్చుకుంటున్నాడు.సుషుప్తి అవస్థను తన కారణ శరీరముతో అనుభవించబోతున్నాడు.దానికి కారణము ఆ జీవి చేసుకొనిన కర్మల ఫలితములను అందుకొనవలసిన ఆవశ్యకత.

 ఇప్పుడు

 *****

 విచిత్రముగా దేహము 


 చలాకిగా లేదు.కలలు లేవు.ఇక్కడ త్రిగుణములు-త్రి అవస్థలు-త్రి శరీరములు ఒక్కటిగా  మారబోతున్నాయి.దేహము ఉంది కాని దేహాభిమానములేదు.మనసు ఉంది కాని మనోభావములు కావు.ఇప్పటివరకు సాధకునిలో దాగిన చైతన్యము అతనిని సాక్షీభూతముగా చూస్తున్నది నిమిత్తమాత్రముగా.ఏమి జరుగబోతున్నదో?

  

  పరమేశ్వరుడు  పార్వతీదేవితో మహేశాని అని సంబోధిస్తూ,

 

 " అష్టపత్రం మహేశాని జపాకుసుమ సన్నిభం

   "సర్వ సంక్షోభణం" నామ సర్వకామ ప్రపూరకం"

      అని వివరించారు.


      చక్రము ఈశ్వరబీజమైన హ కారముతో నిండియున్నది.

       అనంగ/ఆకాశ తత్త్వమును కలిగియున్నది.

       సర్వాకర్షిణి ముద్రాశక్తి-మహిమాసిద్ధి అనుగ్రహప్రదమైనది.

       పరబ్రహ్మ తలపుల మన్మథ ప్రాధాన్యతను కలిగియున్నది.


     మన్మథుని అనంగుడు/శరీరములేనివాడు అని అంటారు కదా.ఇక్కడి యోగినులను సైతము అనంగ యోగినులు/గుప్తతర యోగినులు అంటారు.

   తనతో తాను సంభాషించుట స్వగతము.ఎవ్వరు గుర్తించలేని తనలో జరిగిన విశషము "గుప్తము" స్వప్నము గుప్తము.వ్యక్తి చెబితేకాని ఇతరులకు తెలియదు.

    తన నుండి ఆవిర్భవించుచున్న ఆలోచనలద్వారా తనకు తెలియకుండానే మార్పులను తెచ్చే యోగినులు "గుప్తతర యోగినులు>"

 నిన్న కలవచ్చింది/మొన్న వచ్చింది అని చెప్పగలము అది గుప్తమైనప్పటికిని.

  నాలో ఈమార్పు వచ్చినది ఈమధ్యన అంటాము కాని సరిగా ఎప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో చెప్పలేము జ్కనుక ఆ మార్పు గుప్తతరము.

   సాధకునిలో ఈ చక్రము నాభిస్థానములో ఉంటుంది.

  త్రిపురములను ఏకముచేసే మాతయే చక్రేశ్వరి "త్రిపురసుందరి" మాత.


 స్తోత్రము

 ******

శ్రీచక్ర తృతీయావరణదేవతాః

అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,

 అను ఎనిమిది యోగినులను కలిగియుంటుంది.

  "సంక్షోభణము" అనగా స్పందనము.సర్వములో స్పందనమును కలిగించే స్పందన/కదలికల శక్తి.

  పెద్దలు అనంగ శబ్దమును మన్మథపరముగాను/అఖండమైన ఆకాశ పరముగాను అన్వయిస్తారు.వ్యక్తి పరముగాను/విశ్వ పరముగాను భావిస్తారు.

  దేని సంకేతములు  ఎనిమిది యోగినులు?


  1.జ్ఞానేంద్రియ+కర్మేంద్రియ+ప్రవృత్తి+ఉపేక్ష+నివృత్తికి సంకేతములు అనికొందరి  భావన.

  2.పంచప్రానములు-ప్రవృత్తి+ఉపేక్ష+నివృత్తికి అని మరికొందరి విశ్వాసము

  3.అష్టదిక్కులుగాను భావిస్తారు.

   

 మన్మథపరముగా గమనిస్తే వ్యక్తులలోని,

 1.భావవ్యక్తీకరణము

 2.భావ సంగ్రహనము

 3.భావ కదలికలు

 4.భావ నిర్మూలనములు

 5.మితిమీరిన ఉత్సాహము

 6.కొత్తదానికి దగ్గరగుట

 7.ఉన్నదానిని దూరము చేసుకొనుట

 8.తటస్థభావముతో నుండుట

     అన్నీ ఈశ్వర సంకల్పములే.

  మన్మథపరముగా గమనిస్తే విశ్వములోని,

 1.భూమికి తిరుగు సంకల్పము

 2.జలమునకు ప్రవాహ తత్త్వము

 3.అగ్నికి ఊర్థ్వ గమనశక్తి(మంటగా పైకిలేచు శక్తి)

 4.వాయువునకు మంద్రముగాను/తీవ్రముగాను వీచు శక్తి

 5.ఆకాశమునకు వ్యాపకశక్తి

 6.సృఋష్టించుశక్తి

 7.దానిని చూస్తు తటస్థముగా నుండు శక్తి

 8.విడిచిపెట్టు తిరోధానశక్తి.

    ఆకాశమునూండి మిగిలిన నాలుగు భూతములు ప్రకటింపబడి అంగములుగా మారినవి.ఆ నాలుగు భూతములు తిరిగి ఆకాశమును చేరినచో ఆకాశము అనంగమే/అఖండమే.

   ఆ మార్పులను ప్రకటనముచేయు శక్తులే "గుఒతతర యోగినులు."

  " ఆనందో బ్రహ్మ స్థితి"

 

   "అర్థం చెసుకునే వారికి అర్థము చేసుకున్నంత."


 మనముచ్చట.

 ***********

   మనము లావయ్యమని-సన్నపడ్దామని,చర్మమునకుముడుతలు వచ్చాయని,జుట్టు తెల్లబడుందని తెలుసుకుంటాము కాని సరియైన సమయము,సరియైన పరిణామము చెప్పలేము.

   అంతేకాదు పూజచేయాలనో-పుణ్యక్షత్రమును చూడాలనో,నోములు నోచుకోవాలనో సంకల్పం  పుడుతుంది.ఈ గుప్తతర యోగినులు వాటిని క్రమబద్ధీకరించి,అడ్దంకులను తొలగించి నిన్ను సృష్టిచక్ర త్రయ స్థితి నుండి స్థితిచక్ర ప్రవేశమునకు అర్హునిగా చేస్తారు.

 " నమో ఆకాశ తత్త్వే పంచభూతాత్మక పుష్పం సమర్పయామి."


     

    సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.



  

Thursday, October 3, 2024

SREECHAKRADHARINI-02-SARVASAPARIPURAKA CHAKRAMU


 


 




 శ్రీచక్రధారిణి-02/సర్వాశాపరిపూరకచక్రము


 ***************************




  ' తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై


    అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"




   ఇప్పటి వరకు


   ************


 అణిమా సిద్ధిమాత+ సర్వ సంక్షోభిణి ముద్రామాత   నివాసమైన త్రైలోక్య మోహన చక్రములో "విశ్వన్" పేరుతో నున్న  సాధకుడు,


   జాగ్రదావస్థలో నుండి తన మనసునునిద్రాణము చేస్తూ,తన ఇంద్రియములను మెలకువలోనుంచుతూ అనేక పనులతో సతమతమవుతుంటాడు.అలిసిన స్థూల శరీరము విశ్రాంతిని కోరుకుంటూ తదుపరి పనుల బాధ్యతను సూక్ష్మశరీరమునకు అప్పగిస్తుంది తనతో పాటుగా తన ఇంద్రియములను సైతము నిద్రలోనికి జార్చుతు,రెండవ ఆవరణమైన సర్వాశా చక్రములోని ప్రవేశింపచేస్తుంది.


 ఇప్పుడు


 *****


 పరమేశ్వరుడు పార్వతీదేవికి ,


 " స కారః చంద్రమా భద్రే కళా షోడశమాత్మకం" అని


 చంద్రబీజమును కలిగి,షోడశకళలు షోడశదళ    పద్మముగా వృత్తాకారముగా నున్న ఆవరణము లోనికి "తైజసునిగా" తనపేరుని మార్చుకుని ప్రవేశిస్తాడు.


  స్తోత్రము


  *******


             శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః

కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,

   

    ఈ ఆవరణము పదహారు వికసిత పద్మరేకులు కలిగి వృత్తాకారములో ఉంటుంది.పదహారుగురు మాతలు ఆకర్షణ శక్తులుగా  పరిచయమవుతారు.ఆవరణము లఘిమా సిద్ధిమాతను-సర్వవిద్రావిణి శక్తి మాతను కలిగియుంటుంది.స కార బీజముతో సంకేతించబడుతుంది.జలమునకు నిలయమై చంద్రతత్త్వమును భావింపచేస్తుంది. స్వాధిష్టాన చక్ర ప్రదేశము జీవునిలో.             ఇక్కడ జీవుడు సూక్ష్మశరీరముతో స్వప్నావస్థలో ఉంటాడు.

  పదహారు వికసిత దళములు,

 1.చంద్రుని పదహారు కళలను/తిథులను

 2.అ-అః అను పదహారు అచ్చులను

 3షోడశోపచారములను

 4.షోడశ జాతక కర్మలను 

    సూచిస్తాయని అంటారు.

.


  పదహారు శక్తులను పంచభూతములు-పది ఇంద్రియములు మనసు గాను పరిగణిస్తారు.యోగినీ హృదయము పంచప్రాణములు-ఇంద్రియ దశకము -మనసుగా పేర్కొనినది.

  "సాధకుని మనసు శుభ్రపరచబడుట ఇక్కడు పరిణామము."


    సాధకుడు కామము-బుద్ధి-అహంకారము-శబ్దము-స్పర్శ-రూపము-రసము-గంధము-ధైర్యము-స్మృతి-నామము-బీజము-ఆత్మ-అమృతం-శరీరము అను పదహారు విబాగములతో ఉంటాడు.కాని అవి మాయ అనే ముసుగుతో కప్పివేయబడి అవిద్యా రూపములుగా ఉంటాయి.ఏది కోరుకావాలో,ఏది ఆలోచించాలో,దేనిని తనదిగా భావించాలో,దేనిని తాకాలో,దేనిని చూడాలో,దేని వాసన పీల్చాలో,దేనికి భయపడకుండా ఉండాలో,దేనిని స్మరిస్తుండాలో,ఏది తన ఉనికికి మూలమో,ఏది నిత్యచైతన్యమో,ఏది మరణించనిదో,ఏది శరీరమో తెలియని స్థితి లో ఉంటాడు.దేహమే ఆత్మ అని భావిస్తూ సరికాని,శాశ్వతము కాని,మరలమరల జనించే కోరికలను కోరుకుంటూ స్వల్పకాలము తృప్తిని పొందినప్పటికిని 

 అసంతృప్తితో   మాయాచట్రములో తిరుగుతుంటాడు.

.

  అమ్మ దయతో అవేనామములతో నున్న ఆకర్షణశక్తులు "గుప్త యోగినులు" ఆ పదహారు విభాగములను ధర్మబద్ధము చేస్తాయి.బుద్ధి ధర్మము వైపునకు మరల్చబడుతుంది.శబ్దము గా  ప్రణవమును వినిపిస్తుంది/పలికిస్తుంది.దానిరుచి శాశ్వతానందమయమన్న సత్యమును తెలియచేస్తుంది. కన్ను పరమాత్మ రూపమును చూపిస్తుంది.ముక్కు పరమాత్మ అనుగ్రహ పరిమళమును పీలుస్తుంది.జిహ్వ ఎంతో రుచి అంటూ నామామృతమూను సేవిస్తుంది.స్మృతి మరి మరి స్మరణము చేస్తుంది.మూలము అర్థమవుతుంది.దేహము వేరు అశాశ్వతము/ఆత్మవేరు శాశ్వతము అన్న విషయము అర్థమవుతుంటుంది.

  పదహారు నామములతో/స్వభావములతో ఎదురుబొదురుగా నున్న విద్యాశక్తుల కరుణ,అవిద్యను తొలగించి ముందుకు నడిపిస్తుంటుంది.వారి అనుగ్రహమే చక్రేశ్వరి అయిన త్రిపుర+ఈశిని దర్శించుకొని నమస్కర్రించుకొని,దీవెనలను పొంది మూడవ ఆవరణమైన "సర్వ సంక్షోభణ చక్ర" ప్రవేశ అర్హతను సాధకునికి కలిగిస్తుంది.


   అర్థము చేసుకున్నవా  రికి  అర్థము చేసుకున్నంత


 మనముచ్చట

  *******

 'చెడు అనవద్దు-చెడు కనవద్దు-చెడు వినవద్దు" అంటున్న మూడుకోతుల బొమ్మను ఒక్కసారి తలచుకోండి.

  మూటితో పాటుగా  ఇంకొక పదమూడింటిని కలుపుకుని పదహారు శక్తులను ఏ విధముగా ఉపయోగించుకోవాలో తెలియచేసే అమ్మ అనుగ్రహమే ఇది.ప్రాణాయామం అంటుంది దీనినే యోగశాస్త్రము.నిన్ను సంస్కరించుకోవటము నీ చేతుల్లోనేఉంది అని మనలో ఎరుకను కలుగచేస్తుంది.



     సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.





 


SREECHAKRADHARINI-01-TRILOKAMOHANA CHAKRAMU


 శ్రీచక్రధారిణి-త్రైలోక్య మోహన చక్రము-01

****************************
ప్రార్థన
********
" తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై
అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"
తల్లి అనుగ్రహము/ఆరాధనము అనే ఖడ్గము చేతధరించినవారికి వర్తమానములోనే కాకుండాభవిష్యత్తు నందును సామ్రాజ్యాధికారము ఉంటుందట.ఆసామ్రాజ్యము అష్టాదశ మహాద్వీపమట.అంటే మన ఉపాధిలోని దశేంద్రియములు+సప్తధాతువులు+మనస్సు అను మహాద్వీపములు,నారాయణతత్త్వము అను జలముతోచుట్టివేయబడిఉన్నవి.వానిని సన్మార్గములో సంరక్షించుకోగల అనుగ్రహము/ఖడ్గము అమ్మ కరుణ మాత్రమే.
పరమేశ్వరుడు పరమేశ్వరికి ప్రథమ ఆవరణమును ఈ విధముగా తెలియచేస్తున్నాడు.
దేవీ!
" చతురస్రం మాతృకార్ణైః మండితం సిద్ధిహేతవే
ముక్తా మాణిక్యఘటితం "సమస్థల" విరాజితం
త్రైలోక్య మోహనం నామ కల్పద్రుమ ఫలప్రదం"
ఈ ఆవరణము కల్పవృక్షమునకు అనుగ్రహశక్తినిచ్చిన,.కోరినకోరికలను తీర్చేశక్తిని కలిగియున్నది.అంతే కాదు సమతల ప్రదేశముగా , ముత్య మణి-మాణిక్య సహితమై మోహనత్వముతో పాటుగా,త్రితత్త్వములను కలిగి
"త్రైలోక్య మోహన చక్రముగా" కీర్తింపబడుచున్నది.
స్తోత్రము
*******
శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ, విరాజితము.
ఈ ఆవరణము మూడువిభాగములను మూడుగీతలద్వారా ప్రకటింపడియున్నది.నాలుగువైపుల నాలుగు వేదములు ద్వారములుగా ప్రకాశిస్తుంటాయి.
యోగము అనగా అర్హత.అర్హతను అందించగలిగిన శక్తి యోగిని మాత.
భూపురచక్రములలో సిద్ధిమాతలు-మాతృకా మాతలు-ముద్రా మాతలు విరాజమానులై చక్రేశ్వరి యైన "త్రిపురను" సేవిస్తుంటారు.చేతనులకు సహాయపడుతుంటారు .
.త్రిలోకములను సమ్మోహనపరచే శక్తివంతముగా అమ్మ భువనేశ్వరియై విస్తరించినది కావున "త్రైలోక్య మోహన చక్రము" అనికూడా అంటారట.విస్తరణకు హద్దును నిర్ణయించినందుకు "భూపురము" అంటారట.
తెలుపు-ఎరుపు-పసుపు రంగులతో
మూడు ఊహా చతురస్రాకార రేఖలను కలిగియున్నది ఆవరణము.మూడు ప్రాకారములను నాలుగు వేదములు నాలుగు ద్వారములుగా రక్షిస్తుంటాయట.
"మానవ మేథ పరిమితము.అమ్మ అనుగ్రహము అపరిమితము"
.మాతృవాత్సల్యము అమ్మచేత తన అంశలను అనేకరూపాలుగా ప్రభవింపచేసి,అనేక ఆవరణములయందు నియమించి,వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించేటట్లుచేసింది.
రేఖా విశేషాలను పరిశీలిద్దాము.
అమ్మ విస్తరణ ప్రకటనమునకు ఆఖరిది-జీవుని పతనమునకు మొదటిది ఈ ఆవరణము.ఆవరణములోని మూడు రేఖలను త్రిగుణములుగా-మూడు అవస్థలుగా-మూడు శరీరములుగా,జీవుని మూలాధారముగా,'ల కార బీజముగా సంకేతిస్తారు.
మొదటి రేఖ యందు సిద్ధిమాత శక్తులు,రెండవ రేఖ యందు మాతృకా మూడవరేఖ యందు ముద్రా శక్తులు అవ్యాజానుగ్రహమును అందిస్తుంటాయట.
సాధకుడు "విశ్వ" నామముతో మొదటిరేఖా ప్రాంగణ ప్రవేశము చేసిన తరువాత అరిషడ్వర్గములు+పాప పుణ్యములు తనలో నిండియున్నాయన్న విషయమును గ్రహిస్తాడు.వాని అధీనములో తానుండుట వలనే తమోగుణముతో నిండియున్న విషయము అర్థమవుతుంది.దానిని తొలగించుకోగలగాలంటే,అష్టసిద్ధి శక్తుల /మాతల అనుగ్రహము తక్క అన్యము లేదు.ఇక్కద ఎనిమిది శక్తులు విద్య-అవిద్య రూపములతో ఎదురుబొదురుగా నున్నవి.మాయామోహితమైన జీవుని అవిద్యను తొలగించుట సిద్ధిమాతల లక్షణము
.
అణిమ-లఘిమ-మహిమ-ఈశిత్వ-వశిత్వ-ప్రాకామ్య-ఇఛ్చా,ప్రాప్తి-అను స్వభావ/గౌణ నామములతో కీర్తింపబడు వీరు,సాధకునికి తన తమోగుణమును విడిచిపెట్టుటకు సహాయపడుతూ,రెండవ రేఖా ప్రాంగణ ప్రవేశార్హతను కలుగ చేస్తారు.
రెండవ రేఖా ప్రాంగణములోనికి ప్రవేశించిన సాధకుని/జీవులను,
బ్రాహ్మీ-మాహేశి-కౌమారి-వైష్ణవి-వారాహి-మాహేంద్రి-చాముండా-(సప్తమాతృకలు) మహాలక్ష్మీ సమేతముగా ఆశీర్వదిస్తుంటారు.
సాధకుడు తనశరీరములోని సప్తధాతువులకు-మనసునకు వశుడై ఎన్నో ఇబ్బందులను పడుతుంటాదు..వాటిని తొలగించగల శక్తి కేవలము మాతృకానుగ్రహమే.
సప్తధాతువులు మనసు మాతృకానుగ్రహముతో శుద్ధిపొందిన సాధకుడు అహంకారమును విడనాడి,మూడవరేఖా ప్రాంగణ ప్రవేశార్హతను ( రజోగుణమును వీడి) పొందుతాడు.
మూడవరేఖా ప్రాంగణములోని ముద్రాశక్తులు సాధకుని తనను తాను తెలుసుకొనుటకు తన శరీరమును ఉపకరణముగా మలచుకునే విధానమును అనుగ్రహిస్తాయి.తన శరీర భంగిమలతో తనలో దాగిన శక్తిని జాగృతము చేసుకొనవచ్చన్న ఉపాయమును చెబుతాయి.(యోగ)
మూడురేఖలలోని మాతలు తమ అనుగ్రహమును/సహాయమును ప్రకటితము చేస్తూ,"ప్రకట యోగినులు" గా
కీర్తింపబడుతూ,తమ చక్రేశ్వరి అయిన "త్రిపుర" దగ్గరకు తీసుకునివెళ్ళి ,నమస్కరింపచేసి ఆమె ఆశీర్వాదమును పొంది,ఇంకొక మెట్టు ఎక్కి రెండవ చక్రమైన "సర్వాశా పరిపూరక చక్ర"ప్రవేశార్హతను కలిగిస్తారు.
అర్థము చేసుకోగలిగినవారికి చేసుకున్నంత.
మనముచ్చట
**********
మనము ఉపయోగించే ఫోనులొ మాట్లాడకుండ/ చాటింగ్ / 👍సంభాషణము చేస్తుంటాము.పెద్ద పెద్ద వాక్యములకు బదులుగా చిన్నచిన్న గుర్తులను పెడుతుంటాము.బొమ్మలను పెడుతుంటాము 😂ఈ విధానము కొత్తదేమి కాదు.
ఇక్కడ Q వరుస మూడు వరుసలుగా ఉంది.
మనము మనుషులము.మనలో దాగిన ఆశ,కోపము,పిసినారితనం మొదలగు
లోపలి శత్రువులు మనతో ఆడుకుంటాయి,వాని ఆటలను ఆపేందుకే అష్టసిద్ధులు అనే శక్తులు సహాయముచేస్తుంటాయి(.మొదటి వరుస దాటుట.)
మనము మనుషులము కనుక మనశరీరములో రక్తము-ఎముకలు-మాంసము అంటు ఏడు పదార్థములు ఎక్కువ తక్కువ క్రమములోనికి మారుతూ మన ఆరోగ్యమును కలవరపరుస్తుంటాయి.వాటిని నియంత్రించుకొనుటకు సహాయ పడే వి మాతృకా శక్తులు అంటారు.వారి సహాయముతో (రెండవ వరుస దాటుట).
మనము శారీరక-మానసికముగా ఆరోగ్యముగా ఉండాలంటే యోగా చేయాలంటాము కదా.ఆ యోగా విధానమునకు సహాయపడు శక్తి మాతలనే ముద్రాశక్తులు అంటారు.
ఇక్కడ సమస్య-పరిష్కారము ఎదురు-బొదురుగా ఉన్నాయి.
సమస్యలున్నాయంటే చీకటి ఉన్నట్లే.అదే తమోగుణము.
ఆ చీకటి మనచే అనేక
పనులను చేయిస్తూ-వాటి ఫలితములను అనుభవింపచేస్తుంది.గత జన్మలవి ఇప్పుడు-ఇప్పటివి మరుజన్మలలో.
వాటిని పూర్తిగా పోగొట్టుకోవాలంటే శరీరము అవసరము దానిని సాధనముగా మలచుకొని తరించే ఉపాయమును చూపే,
"తమసోమా జ్యోతిర్గమయా-దేవీ ఖడ్గమాల స్తోత్రము."
భువనేశ్వరి విలాస నిర్మితమైన త్రైలోక మోహన చక్రము ప్రకట యోగినుల పరిపాలినిగా/చక్రేశ్వరిగా "త్రిపురా దేవిని కలిగి యున్నది.సాధకుడు చక్రేశ్వరికి నమస్కరించి,ఆమె ఆశీర్వాద అనుగ్రహముతో మరొక మెట్టు ఎక్కే అర్హతను పొందుతాడు.
ఓం పృథ్వీ తత్త్వాత్మికాయై గంధం పరికల్పయామి.
సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.
గుడి చిత్రం కావచ్చు
అన్ని ప్రతిస్పందనలు:
Lakshmi MV

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...