పుట్టినరోజు జేజేలు
***************
ప్రతిఫలమునకై చూడదు-ప్రజాసేవ వీడదు
అన్నార్తుల కడుపు నింపు అనురాగపు ఈ కోవెల
కోవెలను నిర్మించిన "కన్నతల్లి" పాదాలకు వందనం.
మధుమాసమునకై ఆగదు-మావిచిగురు అడుగదు
కొంగ్రొత్త స్వరముల కోటిరాగాల ఈ కోయిల
మధురసమును వర్షించిన "కన్నతండ్రి" పాదములకు వందనం.
అధికప్రసంగమంటుంది-అద్భుతములు చేస్తుంది
అభ్యాసముతో కూడిన అంకితభావపు పదము
పదప్రవాహమందించిన "గురువులకు" వందనం.
అందుకే గద
పండితారాధ్యుని ప్రతిపాట నడక పూదారి
ఆడంబరమసలెరుగని సప్తస్వర పూజారి
వీనులవిందు చేయుచున్న "విద్వత్తుకు" వందనం.
ఆర్యుల ఆశీర్వచనము-ఆత్మీయుల అభిమానము
స్వయంకృషి సంస్కారము త్రివేణి సంగమమై
"శ్రీరామ రక్ష" చుడుతుంటే, మీకు
"శతమానం భవతి" బాలు గారు.
.
***************
ప్రతిఫలమునకై చూడదు-ప్రజాసేవ వీడదు
అన్నార్తుల కడుపు నింపు అనురాగపు ఈ కోవెల
కోవెలను నిర్మించిన "కన్నతల్లి" పాదాలకు వందనం.
మధుమాసమునకై ఆగదు-మావిచిగురు అడుగదు
కొంగ్రొత్త స్వరముల కోటిరాగాల ఈ కోయిల
మధురసమును వర్షించిన "కన్నతండ్రి" పాదములకు వందనం.
అధికప్రసంగమంటుంది-అద్భుతములు చేస్తుంది
అభ్యాసముతో కూడిన అంకితభావపు పదము
పదప్రవాహమందించిన "గురువులకు" వందనం.
అందుకే గద
పండితారాధ్యుని ప్రతిపాట నడక పూదారి
ఆడంబరమసలెరుగని సప్తస్వర పూజారి
వీనులవిందు చేయుచున్న "విద్వత్తుకు" వందనం.
ఆర్యుల ఆశీర్వచనము-ఆత్మీయుల అభిమానము
స్వయంకృషి సంస్కారము త్రివేణి సంగమమై
"శ్రీరామ రక్ష" చుడుతుంటే, మీకు
"శతమానం భవతి" బాలు గారు.
.