అమ్మకు నమస్కారములతో,
నన్ను వశము చేసుకొన్న సీస ప్రాకారము ఇంకా ముందు ముందు ఏమి వింతలను వైభవములను చూడబోతున్నానో అను కుతూహలమును కలిగిస్తుంటే,రానే వచ్చింది మరో సౌందర్య నిధి నన్ను మురిపిస్తూ,
దయార్ద్ర-నిష్కళంక- నిర్విరామ అమృతాధారా ప్రవాహ మయము, ఏడు యోజనముల విస్తీర్ణముగల ఇత్తడి ప్రాకారము.స్థలము-సమయము-సందర్భములను గమనిస్తూ,మేఘవాహనుడు (శ్రావణ-భాద్రపదములైన) నభశ్రీ-నభస్య శ్రీ అను తన రాణులతో పాటు ,సర్వస్య-రస్య మాలిని-నితంతి-భ్రమయంతి-వర్షయంతి-వారిధార-మేఘయంతిక -వారిధార-చిపుణిక-మదవిహ్వల అను శక్తులను కూడి,తల్లి సంకేతానుసారముగా( నిమిత్తమాత్రుడై) వర్షిస్తూ.బాధాతప్త హృదయాలకు చలివేంద్రమై వర్షిస్తుంటాడు.జయహో జగదీశ్వరి.అక్కడచిత్ప్రకాశ ధారలలో చిత్తుగా నేను తడుస్తున్నను.నాతో బాటుగా అనేకానేక సిద్ధులు-దేవతలు ఉల్లాస భరితులై సతీ సమేతులై ఆ పవిత్రధారలలో పునీతులగుచున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారము
నన్ను చిత్తు చేస్తున్న ఇత్తడి ప్రాకారమును వదలలేక సాగుచున్న నాకు వరమై కనిపించింది పంచలోహ ప్రాకారము.పరమాద్భుతము.

" పంచమీ -పంచ భూతేశి,పంచ సంఖ్యోపచారిణి" సంకల్ప నిర్మిత,పంచమ-పంచలోహ ప్రాకారము,ఇషలక్ష్మీ-ఊర్జలక్ష్మీ సమేత శరదృతు నాయక చంద్రికాపాలితమై ,ప్రకాశిస్తూ ఉంటుంది.
నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును,నితాం
తాపార భూత దయయును
తాపస మందార నాకు దయసేయగదే. (సహజకవి బమ్మెర పోతన)
తాపస మందార-సేవక మందార-భక్త మందార అను పదములను మనము తరచుగ వింటూనే ఉంటాము.మందార శబ్దము పుష్పజాతినే కాక,కొండజాతి,జలజాతి,వనజాతులను తెలియచేస్తుంది.అంతే కాదు.
దైవ క్షిప్ర ప్రసాద గుణముగా ( అతి త్వరగా అనుగ్రహించు స్వభావముగా) కీర్తింపబడుచున్నది.
మహామహోన్నతమైన మందార వాటికలో నా డెందము చిందులువేయుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.
( శ్రీ మాత్రే నమః.)
No comments:
Post a Comment