అమ్మకు నమస్కారములతో,
ఆరు ఋతువులను ,ధాతు ప్రాకారములను దాటిన నా మనసు ఆరు శతృవులను జయించినదా అన్నట్లు ప్రశాంతమై,పరమ పావన పాదసేవకు పరుగులు తీస్తున్న సమయమున,కనిపించిందొక అద్భుతము అమ్మ వరము.
.
" కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితా" సంకల్ప నిర్మితమైన పుష్యరాగ ప్రాకారమునకు సమిష్టి దిక్పాలకులు నాయకులు.ఇక్కడ తరువులు-పత్రములు-ఫలములు-పక్షు లు-సరోవరములు అన్ని ఎర్రని కాంతితో ఉంటాయి.ఉత్తరమున కుబేరుడు-పశ్చిమమున వరుణుడు-వాయవ్యమున వాయుదేవుడు-ఆగ్నేయమున అగ్నిదేవుడు ఈశాన్యమున రుద్రుడు మహాతేజోవంతులై వారివారి శక్తులను,ఆయుధములను ధరించి అమితోత్సాహముతో నున్నారు.ప్రమథగణ సంసేవితుడైన పరమేశుడు అష్టమూర్తియై,ఇష్టకామ్యములను తీర్చుచున్నాడు.అతి సుందర అమరావతి పట్టణమున అలౌకిక ఆనందముతో నున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
ఇది నిజమా? కలా? అని ఇది ఇహ-పర వారధియా? నాలో ఇంత అద్భుత పరివర్తనను అందించిన అతీతశక్తికి అభివాదములిడుచుండగా అగుపించినది అత్యంత ప్రేమతో నన్ను ఆహ్వానిస్తు
.
"అరుణాం కరుణాంతరంగతాక్షి" సంకల్పిత పద్మరాగ మణి ప్రాకారము రక్షక స్థానము.చతుషష్టి కళలనెడు అరవై నాలుగు శక్తిస్వరూపములు-అరివీర భయంకరులైన వీరులు ధనుర్బాణ ధరులై,ధర్మపాలన చేస్తుంటారు.అసంఖ్యాక రథములు-గజములు-అశ్వములు-యుద్ధభూమి పయనమునకు సిద్ధముగా ఉంటాయి.ఆదిశక్తి అరివీరభయంకర సంకేతముగా,కుంకుమ సమ అరుణకాంతి భూభాగములో మండపములు-పక్షులు-వృక్షములు-ద్వారములు-సరోవరములలో పద్మరాగమణుల కాంతులు ప్రకాశించుచున్నవి.అమ్మదయతో నాలోని అరిషడ్వర్గములు అంతరించుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
అమ్మ దయ యుంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.
( శ్రీ మాత్రే నమః.
.
ఆరు ఋతువులను ,ధాతు ప్రాకారములను దాటిన నా మనసు ఆరు శతృవులను జయించినదా అన్నట్లు ప్రశాంతమై,పరమ పావన పాదసేవకు పరుగులు తీస్తున్న సమయమున,కనిపించిందొక అద్భుతము అమ్మ వరము.
.
" కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితా" సంకల్ప నిర్మితమైన పుష్యరాగ ప్రాకారమునకు సమిష్టి దిక్పాలకులు నాయకులు.ఇక్కడ తరువులు-పత్రములు-ఫలములు-పక్షు
ఇది నిజమా? కలా? అని ఇది ఇహ-పర వారధియా? నాలో ఇంత అద్భుత పరివర్తనను అందించిన అతీతశక్తికి అభివాదములిడుచుండగా అగుపించినది అత్యంత ప్రేమతో నన్ను ఆహ్వానిస్తు
.
"అరుణాం కరుణాంతరంగతాక్షి" సంకల్పిత పద్మరాగ మణి ప్రాకారము రక్షక స్థానము.చతుషష్టి కళలనెడు అరవై నాలుగు శక్తిస్వరూపములు-అరివీర భయంకరులైన వీరులు ధనుర్బాణ ధరులై,ధర్మపాలన చేస్తుంటారు.అసంఖ్యాక రథములు-గజములు-అశ్వములు-యుద్ధభూమి పయనమునకు సిద్ధముగా ఉంటాయి.ఆదిశక్తి అరివీరభయంకర సంకేతముగా,కుంకుమ సమ అరుణకాంతి భూభాగములో మండపములు-పక్షులు-వృక్షములు-ద్వారములు-సరోవరములలో పద్మరాగమణుల కాంతులు ప్రకాశించుచున్నవి.అమ్మదయతో నాలోని అరిషడ్వర్గములు అంతరించుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
అమ్మ దయ యుంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయతో కొనసాగుతుంది.
( శ్రీ మాత్రే నమః.
.
No comments:
Post a Comment