అమ్మకు నమస్కారములతో, ఏ మాత్రము అర్హత లేని నన్ను, అమ్మ తన అమృత హస్తపు వేలితో నాచేతిని పట్టుకొని నడిపించుచున్నదన్న విషయము అర్థమై ఆనందభాష్పములు జాలువారుచున్న వేళ నేను,మరొక దివ్య ప్రాకారములోనికి అడుగిడబోవుచున్నానన్నమాట.ఆ ప్రాకారము అద్భుతము.
చదరపు ఆకారములో సప్తయోజన విస్తీర్ణ గోడలతో రాగి ప్రాకారము ప్రకాశిస్తుంటుంది.కల్పక వృక్ష వాటికలు బంగారు ఆకులతో,రతనాల పండ్లతో,వజ్రాల గింజలతో అమృత మధువును స్రవిస్తూ,పది యోజనములకు వరకు పరిమళములను వ్యాపింప చేస్తుంటాయి.గాన ప్రియులైన గంధర్వ యువతీ-యువకులు మధువును సేవిస్తూ,మదన పరవశులై ఉంటారు.అందులో పుష్ప బాణుడు పువ్వుల గొడుగు క్రింద,పువ్వుల సింహాసనముపై ,పువ్వుల మాలలను అలంకరించుకొని,తన భార్యలతో పువ్వుల మథువును త్రాగుతూ పూబంతులాడుచున్న సమయమున, వారిచెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. అమ్మ అనురాగముతో ఆర్ద్రమైన నా మనసు రాగిప్రాకారమును దాటి సీసప్రాకారములోనికి ప్రవేశిస్తున్నది.

సీస ప్రాకారము సప్తయోజన విస్తీర్ణముతో,మథుర రస ఫలములు గల సంతానవాటికతో శోభిల్లుతుంటుంది.గ్రీష్మ నాయకుని భార్యలైన (జ్యేష్ఠ-ఆషాఢ మాసములు) శుక్రశ్రీ-శుచిశ్రీలు సంసార తాప ఉపశమనమునకై సంసారవాటిక తరుమూలములలో సేదతీరుతుంటారు.అచ్చటి ప్రాణులు చల్లని నీరు త్రాగుతుంటారు.లెక్కించలేనంతగా నున్న అమరులు-సిద్ధులు-యోగినీ యోగులు తల్లిని సేవిస్తుంటారు.గ్రీష్మ తాపమును తగ్గించుకొనుటకై నవ విలాసినులు శరీరమునకు సుగంధమును పూసుకొని,పరిమళ పుష్పమాలలను అలంకరించుకొని, తాటియాకు విసనకర్రలను వీచుకొనుచు విలాసముగా తిరుగుతుంటారు.తల్లి కనుసన్నలలో ప్రత్యక్షదైవమైన సూర్య భగవానుడు ప్రచండుడై కిరణములను ప్రసరించు,నిస్తుల వైభవమును విస్తుబోయి చూచుచున్న సమయమున ,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment