అమ్మకు నమస్కారములు.అదిగో ఇంద్రనీల ప్రాకారము.కాళి-కరాళి-ఉష-దుర్గ-సరస్వతి లక్ష్మి ఇత్యాది పదహారు శక్తులు పదహారు దళములుగా గల పది యోజన విస్తీర్ణ పద్మాకార భవనము.
అష్టమాతృకాశక్తుల వైఢూర్య నిలయములను దాటిన తరువాత,పదహారు ఇంద్రనీలమణి రేకులున్న పద్మాకార భవనము ప్రజ్ఞావైభవమై ప్రకాశిస్తోంది.పద్మము జ్ఞానమునకు సంకేతము.పద్మము సూర్యుని ఉషోదయ కిరణాలతో వికసిస్తుంది.బురదలో పుట్టి,బురదలోనే ఉంటున్నప్పటికిని దానిచే ఏ మాత్రము ప్రభావితము కాకుండా ప్రకాశతత్త్వముతో పరిమళిస్తుంటుంది.పద్మాకారా భవనములోని పదహారు రేకులు అమ్మచే సంకల్పమాత్ర సంభవములైన జ్ఞాన సంకేతములు.పద్మాసనే-పద్మకరే సర్వలోకైక పూజితే-నమో నమః.ఇంద్రనీలమణి ప్రాకారములో దయాసింధువైన పరాశక్తిని ధ్యానములో దర్శించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.ఎంత మధువును గ్రోలినను తనివితీరని నన్ను ముత్యాలప్రాకారము మురిపిస్తు పిలిచినది.

నిత్యకళ్యాణి మనోసంకల్పిత ముత్యాల ప్రాకారము స్వచ్చతకు-సత్యమునకు ప్రతీక అయిన తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుండి.అచ్చటి ఎనిమిది రేకులు పద్మము అనంగ మదనాది ఎనిమిది శక్తులుగ ,వారు అందించు సర్వజీవుల- సర్వకాల-సర్వావస్థల సమాచారములను కాంతులను వ్యాపింప చేస్తు ,సత్కృపకు పాత్రులను చేస్తుంటుంది.అంతేకాదు అమ్మవారి కంఠములో అలంకరించబడిన అటు-ఇటు కదులుచున్న
అందమైన ముత్యాలతో అల్లబడిన రత్నాల హారము అందముగా కనిపిస్తోంది.ఇది పైకి కనిపించే అర్థము.కాని కొంచము నిశితముగా పరిశీలిస్తే, ఆ ప్రాకారములోని శక్తుల సత్వ-రజోగుణ సంకేతములు.తల్లి విశుద్ధ చక్ర సరస్వతీరూప సాక్షాత్కారములు.అక్కడ నల్లని తమోగుణము అసలు లేనే లేదు.అంతా తేటతెల్లనైన సత్వ ప్రకాశము.హృదయ మలినములు లేని-తొలగించుకొనిన సాధకుల సాహచర్యముతో సర్వేశ్వరియే సత్యము అన్న విషయము నేను తెలిసికొనుచున్న సమయమున చెంతనేనున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment