చింతామణి గృహాంతస్థా-శ్రీమన్నగర నాయిక-01
****************************** **********
స్థూల-సూక్ష్మములు రెండును తానైన అమ్మ ఒక రూపము మాత్రమే కాదు.ఒక దివ్య చైతన్యము.పరమాద్భుత తత్త్వము.ఆనందకరమైన,అనిర్వచనీ యమైన,అజరామరమైన పరబ్రహ్మ తత్త్వము.ఉపనిషత్తులు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమే అమ్మ.స్థూలమునకు సారమే సూక్ష్మము.అదియే మన మనోమందిరమైన మణిద్వీపము.సర్వ భువనభాంద సృష్టికర్త మణిద్వీపనిర్మాణమునకు సూత్రధారియైన అమ్మ తన అనుగ్రహ ఆశీస్సులను బ్రహ్మగారిని పాత్రధారునిగా మలచి అందించినది.అసలు విషయమేమిటంటే,
శ్రీ మహావిష్ణువు చెవి గులివి నుండి మధుకైటభులు అను అసురులు జనించి,హరి నాభికమలమున ఉన్న బ్రహ్మపై దండెత్తిరి.అనుకోని ఈ పరిణామమునకు భయపడిన బ్రహ్మ పద్మము తూడులోని కిందకు కిందకు జారి దాగుకొను సమయమున శ్రీ హరిని దర్శించెనట.కొత్తగా చూసిన హరి నాభి కమలము తన జన్మస్థానము అర్థమైన బ్రహ్మకు అంతా అయోమయముగా తోచెను.అవ్యాజ కరుణాంతర0గ అమ్మ బ్రహ్మ సందేహ నివృత్తి చేయ దలచెను. ఒక దివ్య విమానము బ్రహ్మముందు వచ్చి ఆగెను.అందులోనుండి ఓంకారము వినబడుచున్నది.దైవ నిర్దేశముగా బ్రహ్మ ఆ విమానమును ఎక్కి హరి-హరులతో పాటు అతల-వితల-సుతల-తలాతల-మహాతల-రసాత ల-పాతాళ సప్త అథోకములను,భూర్లోకము-భువర్లోకము -సువర్లోకము-మహర్లోకము-జనలోకము, తపోలోకము-సత్యలోకమునకు పైననున్న సర్వలోక చింతామణి గృహమున ప్రవేశించినారట.దారిలో వారికి మరొక బ్రహ్మ విష్ణువు శివుడు కనిపించినారట.త్రిమూర్తులు తమను నడిపించు జగన్మాతను దర్శింప కుతూహముతో మణిద్వీప ద్వారము దగ్గర నిలబడినారట.అక్కడ
మణిద్వీపమునకు నాలుగు వైపుల అమృత సాగరముంటుంది.సాగరతీరములో దక్షిణావర్త శంఖములు-రతనాల ఇసుక ప్రదేశములు-రత్మ వృక్ష వాటికలతో,అమ్మ సందర్శనమునకై చిన్న పడవలతో వచ్చుచున్న భక్తులతో కళకళలాడుతుంటుంది.అంతేకాదు మొదటి ప్రాకారమైన ఇనుప ప్రాకారము నాలుగు ద్వారములలో కిక్కిరిసిన దేవ,యక్ష,కిన్నెర,కింపురుషాదు లతో,నిలిపిన వారి ఆయుధములనుండి వచ్చు రణగొణ ధ్వనులతో,చెవులను చిల్లుపరచునా అనేటంత.గుర్రపు సకిలింతలతో,ఇసుకవేస్తే రాలనంతగ,ఇసుమంతయు ఒకరి మాట వినిపించలేనంతగ కోలాహపూరితమై ఉంటుండి.అరి వీర భయకరులైన,ఆయుధధారులైన,తల్లి సేవా దురంధరులైన,అప్రమత్తులైన,అనిర్ వచనీయ పుణ్యశాలులైన ద్వారపాలకులు,వారిని నిర్ణీత క్రమపద్ధతితో,ఏడు యోజనముల (16038 కిలోమీటర్ల) విస్తీర్ణముగల ప్రాకారములోనికి అనుమతిస్తున్న సమయములో (నన్నుకూడ) అయోమయ (ఇనుప) ప్రాకారములోనికి ఆనందోద్వేగములతో నా అడుగులు తడబడుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment