ఈనాటి బిల్వార్చనను మనము
రుద్రుని యొక్క చోరత్వమును తెలియచేయు కథ-కథనము గురంచి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
నమకము 3వ అనువాకములోని 2 నుండి 7 యజుస్సులు స్వామి యొక్క చోర వైభవమును ప్రస్తుతిస్తున్నాయి.
నమకము స్వామి యొక్క అనుగ్రహమును ప్రస్తావిస్తూనే దానికి కారణమైన జీవుల పాపకర్మ ఫలితములను స్వామి ఎలా దొంగిలించివేస్తాడో చెబుతున్నది.
ఈ సందర్భములో మనము నమకములో చెప్పబడిన కొన్ని చోర శబ్దములను,వాటి అన్వయమును తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
హర హర మహాదేవ శంభో.
రండి.బిల్వార్చన చేద్దాము.
" నమో నిషంగిణే ఇషుధిమతే తస్కరాణాం పతయే నమః."
ఇది మనము చర్చింకోబోయే యజస్సు.
ఇది కాక,
1. స్తేనానాం-గుప్తచోరునిగా-వానినాయకునిగా,
2.స్తాయునాం-ప్రభువును సేవిస్తూ కన్నుగప్పి దోచుకునే
వానిగా,వారి నాయకునిగాను,
3.పరివంచకునిగా,మోసముతో ప్రభువును దోచుకునే వానిగా,
4స్తాయువు మోసముచేస్తాడు కాని నిశ్శబ్దముగా,
5. ఊష్ణతాం-ప్రభువుకు రావలిసిన ధాన్యపు గింజలు ఇవ్వకుండా న్యాయప్రకారము, దోచుకునే వాడు-వారి నాయకుడు,
6. ప్రకృంతానాం-కత్తిని పట్తుకుని రాత్రులందు సంచరించుచు దోచుకొనువారు-
7. కులుంచానాం-ధాన్యమునే దోచుకునే వారుంటే,అంతకంటే గొప్పగా,పంటపొలములను ఆక్రమించేవారి నాయకుడిగా శివుడు కీర్తింపబడుతున్నాడు.
ఎందుకు పలువిధములగు దొంగలతో పోలుస్తు,కీర్తిస్తున్నది రుద్రం అన్న సందేహము కలుగవచ్చును.
ఇది వాచ్యార్థము.నిజమునకు శంకరుడు తన కరుణాంతరంగమను విల్లునకు,దీనదాక్షిణ్యమనే నారిని కట్టి,కరుణావీక్షణములనే శరములను సంధిస్తూ,మన అనేకానేక జన్మల పాపరాశులను దోచుకుంటే,మనకు క్రమక్రమముగా జన్మాంతర పాపసంక్షయమై,భక్తివైరాగ్య మార్గమును
దర్శింపచేస్తుంది. శంభో తవారాధనం భవపాప నాశనం.
నిషంగము అను పదమునకు వాచ్యార్థము ధనస్సు సంధించుటకు చేతబట్టిన బాణము అయితే,మన మనస్సును సంధించుటకు చేతపట్టిన కరుణము అంతరార్థము.
అందులకు నిదర్శనమే తాను సైతము అదే ఉపాధితో
-వృత్తితో-ప్రవృత్తితో మనలను అనుగ్రహించడము.
ఏమని వర్ణించగలదు ఆ చిత్తచోరుని చిత్రవైఖరిని నా అజ్ఞానము.
భక్తుని విషయము గురించి ఏ విధముగా తస్కరుడో తెలుసుకుందాము.
పూర్వము నంజనగూడు ప్రాంతము నందు మల్లన్న అను ఒక ప్రకటచోరుడు,అక్కడ అడవిమార్గమున ప్రయాణించు బాటసారులను దోచుకొనుటకై,మారుమూల మాటువేసి మరి ,బెదిరించి దోచుకునేవాడు.
కాని విచిత్రము.సంవత్సరాంతమున తాను దోచిన సొమ్ముతో పెద్దదొంగ అయిన కాటి రేడు/స్మశానరాజునకు /భోళా శంకరునికి జాతర వైభవముగా జరిపేవాడు.
భగవద్గీతలో చెప్పినట్లు-గుణముల ప్రవృత్తి-నివృత్తి రెండునూ తానైన కొండ అల్లుని ఆన.మిగిలిన సంవత్సరమంతయు తిరిగి దోచుకోవడము.జాతరలు ఘనంగా జరపడము.
"నమో సస్పింజరాయ త్విషీపతే పథీనాం పతయే నమః"
నమకము 2వ అనువాకము 3వ యజుస్సు.దీనికొక ప్రత్యేకత.ప్రారంభము ముగింపు నమః తో ఉంటుంది.దీనిని ఉభయతో నమస్కార యజస్సు అంటారు.
త్విషీమతే-ప్రకాశిస్తున్న మూర్తి.
స్వామి ఇక్కడ స్వరూప-స్వభావములచే ప్రకాశింపబడుతున్నాడు.
మొదటిపదము
1 సస్పింజరము.రూపమునకు అన్వయించుకుంటేఎరుపు-పసుపు కలిసిన గరికఛాయ వంటి మేని రంగు కలవాడు.
2.సస్పింజరము-గుణము
భక్షణ స్వభావము కల రాక్షసులను హరించువాడు.
గరిక అందముగా ఉండంటమే కాదు పదునైనది కూడా.అందుకేనేమో" బహుమూలకము" గా ప్రసిద్ధి చెందినది.
పరమాత్మ కరుణము "బహుముఖములు".
రెండవ పదము
1.పథీనాం పతి.పథము-బాట/మార్గము
మార్గములకు నాయకుడు.
అవే భక్తి-కర్మ-జ్ఞాన-వైరాగ్య మార్గములను చూపువాడు.
లేదా పెద్దలన్నట్లు
పితృయాన-దేవయాన మార్గములు తానైనవాడు.
ఇంకా సందేహముగా ఉంటే,
మార్గచారులను-బాటసారులను సంస్కరించువాడు.
పథీనాం పతీ-బాటసారులకు బాసట యైనవాడు తస్కరునిలో
మార్పుకు తానే కారణమైనాడో
లేక బాటసారులను గురువులుగా మార్చాడో కాని విచిత్రము.వారు మల్లుని శివభక్తిని,జరుపుతున్న జాతర గురించి తెలుసుకున్నారు.వారు తమంతట తామే ఆగి సొమ్మును-కానుకలను మల్లనకు సమర్పించి,సాగిపోసాగారు.పుష్కలముగా లభించిన ధనముతో పుణ్యబుద్ధి చోరత్వమునకు చోటులేకుండా చేసినది.
అంతా ఈశ్వరేఛ్చ
అంటే ఇదేనేమో.
ఇప్పటికిని ఆ జాతర జరుగుతూనే ఉంది.అదే ప్రదేశములో కాని,
కల్లన్న మూలై గా ఖ్యాతి చెంది.
మల్లన్న ను అనుగ్రహించిన తస్కరాణాం పతి మన చిత్త దౌర్బల్యములను సైతము హరించి,మనలను చిదానందోన్ముఖులుగా ఆశీర్వదించుగాక.
మరి యొక కొత్త కథాకథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చేయి
0 కామెంట్‌లు
24 అక్టోబర్ 4:02 PMకి ·
స్నేహితులుతో భాగస్వామ్యం చేయబడింది
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చేయి
No comments:
Post a Comment