Friday, January 26, 2018

DURMUKHI UGADI-01

ఉగాది శుభాకాంక్షలు
******************
" దుర్ముఖి " నామ సంవత్సరాది అనగానే
సుముఖముగా ఉండదా? ఎన్నో సందేహాలు!!!!!
ఏమరుపాటుగా నున్న నన్ను అపుడు
ఆరు రుచుల పచ్చడి నేరుపుతో సరిదిద్దింది.
...............
1.శిశిరమును చూసి అసలు చింతించ వద్దని
నిశితముగ చూస్తే వసంతము అనుసరిస్తున్నదని
మోడైన రూపమే నీడనీయ గలదనుటకు
సాక్ష్యము తానన్నది చిగురిస్తున్న మామిడి. (సహనము)
.......................
2.ఎప్పుడంటే అప్పుడు గళము విప్పవద్దని
గానము చేయాలనుకున్నా మౌనము తప్పవద్దని
మావి చిగురు తినువరకు మారాడకుండుటకు
సాక్ష్యము తానన్నది సంగీతముతో కోయిల.(నియమము)
...................
3.ఎద నిండిన అనురాగము ఎల్లలే ఎరుగదని
పదిమందికి అందించగ పుల్లగా ఎదగాలని
తనివితీర తినిపించగ తానే తరలుటకు
సాక్ష్యము తానన్నది చెంతనున్న చింతకాయ.(సంస్కారము)
.........................
4.ఎగిసిపడు కెరటములో ఎడతెగని ఆరాటముందని
కమ్మనైన విందులలో క్షార కళిక రూపునొంది
" రుచి"కై తన "అభిరుచి"నే కనుమరుగు చేసికొనుటకు
సాక్ష్యము తానంది సాగర లవణము.(త్యాగము)

5. ఫలితము కనబడలేదని ప్రయత్నమే వదలొద్దని
అనుకున్నది అయ్యేదాక పనినుండి కదలొద్దని
" గడ" రూపములో నున్న "మనుగడ"లో మధురము అనుటకు
సాక్ష్యము తానన్నది సారమైన చెరుకుగడ (పట్టుదల)
6."వాహ్వా" అను జిహ్వ నన్ను అసహ్యముగ చూస్తున్నదా
పువ్వులకై జగము నన్ను "ఏడాదికి" గుర్తు చేస్తున్నదా
అను భావమే "అనుభవమై" పాఠాలను నేర్పుటకు
సాక్ష్యము తానన్నది సంస్కారపు వేప పువ్వు (సంస్కారము)
(అభి)రుచులను ఏ వికారము లేని "కారము"తో కలిపి
"పచ్చడి" అని తిందామా లేక
"పాటించ వచ్చని" అనుకుందామా
అజ్ఞానపు దారి మార్చి విజ్ఞతను వివరిస్తు
"దుర్ముఖము" ను "సుముఖముగ" సృష్టంతా మురిసేలా.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...