ఉగాది శుభాకాంక్షలు
*******************8
షష్టిపూర్తి పండుగ,స్పష్టమైన పండుగ
షట్ ప్రజాపతుల జపము షడక్షరీ మంత్రముగ
షడ్రుతువులు మధురముగ,షడ్వర్గములు చేదుగ
షట్చక్రములు లవణముగ,షట్ చక్రవర్తులు మిరియముగ
షట్విధ శాస్త్రములు భాండముగ,షడ్రుచులు షరాగ
నవ నవోన్మేషముగ,మానవతే శేషముగ
మనుగడ సాగించమంది,"మన్మధ నామ ఉగాది"
మనలను దీవించునది,మన్మధ నామ ఉగాది
.
(బ్రహ్మ మానస పుత్రులైన షడ్విధ ప్రజాపతులు మరీచి,అత్రి,పులత్స్తుడు,పులహు డు,క్రతువు"ఓం నమ: శివాయ" అను షడక్షరీ మంత్రమును జపించు చుండగా,వసంత,గ్రీష్మ,వర్ష,శరత్, హేమంత,శిశిర ఋతువులు,తీపిగా,శక్తి,జ్ఞానము, బలము,ఐశ్వర్యము,వీర్యము,తేజము అను గుణములు వగరుగ,దాస్యము,మంత్రాంగము,రూప సంపద,ఓరిమి,స్నేహము,కూతమి అను ధర్మములు పులుపుగ,కామ,క్రోధ,లోభ,మోహ,మద, మాత్సర్యములు(అన్ని వేలల శత్రువులు కావు}చేదుగ,మూలాధారము,స్వాధిష్ ఠానము,మణి పూరకము,అనాహతము,విరుద్ధము,ఆజ్ఞా చక్రము లవణముగ,హరిశ్చంద్రుడు,నలుడు,పు రుకుత్సుడు,పురూరవుడు,సగరుడు,కా ర్త వీర్యుల కీర్తి కారముగా,తర్కము,వ్యాకరణము,వైద్ యము,జ్యోతిషము,ధర్మ శాస్త్రము,మీ మాంస అను జ్ఞాన భాండమున ఉగాది పచ్చడి గా మారి ,నూతన సంవత్సరమునకై ఎదురు చూస్తున్నప్పుడు,షష్టి పూర్తి ముగించుకుని,కొత్త కాంతులతో మానవతే తానుగా,మనలను దీవించగ మధురముగ తరలినది "మన్మధ నామ ఉగాది"
No comments:
Post a Comment