వందనాలు చంద్రయ్యా
*******************************
ఆబాలగోపాలము చందమామను రమ్మనగా
మాబాలచందురుడు ఇలకే దిగివచ్చెనుగా
అరుదైన ప్రతిభతో తన ఆరంగేట్రముతో
పూవాసనలందించాడు పున్నాగమన్నన్
చిత్రసీమ దర్శకులకు కొత్త కొత్త అర్థాలుగా
నాశరహిత కీర్తులకు నాలుగుగోడలుగా
ఆకలిమంటలను ఆర్పిన సర్వర్ సుందరముగా
అంటరానితనము ఆర్పు రుద్రవీణ సూర్యంగా
స్త్రీలు స్వతంత్రులన్న సిద్ధాంతపు అబద్ధముగా
వింతవైన అంతులేని కథల నిలువుటద్దములా
ఇంతుల ఆంతర్యాల తెరలు రాసిన కవితలా
పవిత్ర ప్రవృత్తి గల మా ఊరి పతివ్రతలా
అక్రమాలను అణచగలుగు మేజర్ చంద్ర కాంతులా
సినిమా.టెలివిజను నీ ఇంటికి రెండు గుమ్మాలుగా
తారాగణమును అందించిన కమ్మనైన అమ్మలా
రహమాను జయహోల కులుకు కోకిలమ్మలా
ప్రతిభా ప్రశంసలకు నూట్రికి నూరుగా
పద్మశ్రీ -,ఫాల్కే పలుకరించిన దర్శకత్వ దాదాగా
కైలాసమే విలాసమన్న మా బాలచందురిడివి
చిరంజీవివయ్యా నీవు చిత్రసీమలోన
No comments:
Post a Comment