Friday, January 26, 2018

SANKRANTI-03

మకర సంక్రమణ శుభాకాంక్షలు
************************************
శ్రీకరమని దినకరుడు మకరములో ప్రవేశించె
సౌరమాన కళలతో సంక్రాంతిగ ప్రకాశించె
భూమాత నింగిసాగు రంగవల్లులనే తిలకించె
పుష్యమాస పులకింతను ఆ గాలి ఆలకించె
భోగిమంటగా అగ్ని కంటకములను తొలగించె
మంచుపూల అంచలా జలమేమో అంజలించె
గాలిపటము సాక్షిగా గగనమే పులకించె
పంచభూతములు సాక్షిగా పండుగ తానేగుతెంచె.
సింగారపు ధర్మమై గంగిరెద్దు దీవించె
ఏలిక పోలికనెరిగి హరినామము నర్తించె
అంత రంగ నాథుని ఆరాధన ఫలించె
లోక కళ్యాణముగా గోదా కళ్యాణము గావించె
పండుగ తనతో పాటు పారమార్థికతను తెచ్చె
కడుపునింప సిద్ధమయ్యి కర్షకుడు తరియించె
బోసి పళ్ళను దీవింపగ భోగిపళ్ళు పండించె
ఉమ్మడి సంపద విలువను గుమ్మడేమొ తెలియపరిచె
కర్మ భూమి ధర్మపు మర్మమేమో వివరించె
పొంగుచున్న సంతోషము పొంగలిగ రుచించె
అణువణువు అర్పించిన పశుగణమును పూజించె
వ్యవసాయముతో పాటు వస్తువ్యాపారము నేర్పించె
గొబ్బెమ్మల కథలతో నిబ్బరాలు చూపించె
ఉన్మాదము వదిలిన భువి స్వర్గమునె తలపించె
చక్కటి మార్గము చూపుతు "సంక్రాంతి సంతసించె".

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...