Friday, January 26, 2018

GIDUGU RAMMOORTI

యాదిలో
*********
బుక్కెడు బువ్వ తిని బేగిరం తొంగో-పొద్దు పొడవంగనే లేసి పెద్ద మనిసి "రామ్మూర్తి" లెక్కన ఏసం కట్టాలాయె- అనబట్టె రంగి బుడ్డోడితో. ఓ యమ్మో అన్న కతలు పడుతుండు.తాను రామ్మొర్తి సారునని అనబట్టె.శాసనాలేస్తడంట.బాసకున్న సంకెళ్ళు తీస్తడంట.ఏసం కడ్తడంట.ఏవేవో సేస్తడంట.ఏందేందో అంటుండు.మన సోయలేడు.అమ్మ కూసింత అరసుకోవే బేగిరం.
గా పెద్ద మడిసిని నాను ఎరుక పట్టనాయె.యాద్ భీ రాకపాయె.గంతలోనే ఓ అత్తో నాను ఈరయ్యను గాను.గురజాడను.సదువు సెప్తా.సోపత్గాళ్ళను సక్కదిద్దుతా.అన్నెం పున్నెం ఎరుకలేని ఆడకూతుళ్ళను అన్యాయమునకు తలొగ్గందంటా. అరసుకుంటా.అక్కున సేర్సుకుంటా అంటుండగన్నె ఇద్దో ఇద్దరు చిటుకు-బుటుకు తళుకుపెట్టెలో కులుకుతున్న పతకం గొలుసు,రావుబహదూర్ అను పట్టుకొచ్చింద్రు మద్రాసు దొర బంట్రోతుల మాదిరి సూడసక్కగున్నరు.
అవ్వ నీకెరుకేనా ? మా ముత్తాత ఆ సారుకాడనె బిడ్డలెక్కనుండి సదివినడట.అయ్య సెప్పిండు.ఇంగో సారు మన బాసకు రాసిన బుక్కులు సూడు అంటు సూపెడుతుంటే సంకనున్న సిట్టి తల్లి " ఆంగ్ల-సరవ భాష వ్యాకరణము" సరవ శబ్ద కోశము " అని సదవ బట్టె.పోలిగాడి సేతిలో "ఆంధ్ర సారస్వత పరిషత్తు" పోటోలు.కోటిగాడి సేతిలో "తెలుగు" పత్రిక.సరవగూడెం సంబురాలతో ......పిల్లగాళ్ళు పిడుగులై" గిడుగు వారి పుట్టినరోజు"మన బాస సంకెలను విడగొట్టినరోజు అంటు వేదిక సిద్దం చేస్తున్నరు.సరవభాష శాసనమును ప్రదర్సిస్తున్నరు.పద్దతిగ
పలకరిస్తున్నరు.పదే పదే
పులకరిస్తున్నరు.రామ్మూర్తిని రమ్మంటున్నరు.వారిలో ఒక్కడిని కమ్మంటున్నరు.పలకరిస్తుండ్రు.నిదురలో పలవరిస్తుండ్రు.పసి(డి) పువ్వులై పరిమళిస్తున్నరు.బుడుగులందరు గిడుగులై వ్యవహారభాషకు గొడుగులై సడిసేస్తుంటే సూద్దాం రాండ్రి సూడసక్కని పండుగను..
(స్మరియిద్దాం--సంతసిద్దాం--సం రక్షించుదాం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...