Friday, January 26, 2018

GURUVU-01

  శ్రీ గురుభ్యో నమ:
  *******************

  "గు" కారో అంధకారస్య-"రు"కారో తన్నివారణం
   గురో దైవ రూపస్య  శిష్యరికం జన్మ సార్థకం"

  మా తరగతి,
 
  పసికందుల ప్రసూతి గది,మమ్ము
  వసివాడనీని  మంత్రసాని అది.

 సంతసముగా వస్తారు  మా గురువు అందులోకి
     మేము

 పక్షులుగా  ఎగరాలని  రెక్కలు అతికిస్తారు
 కక్షలెన్నో  దాటాలని లెక్కలు  వెతికిస్తారు

 నవ్విస్తూనే  ప్రతిభను తవ్విస్తూ ఉంటారు
 భుజం  తట్టుతూనే భావిబీజములను  నాటిస్తూ ఉంటారు

 చతురత నిండియున్న చతుర్ముఖులు వారు

 మా తరగతి,

  విరబూసిన  పూవులమడి.మమ్ము
  విడువలేని  దేవుని గుడి అది

 సాదరముగ వస్తారు మా గురువు  అందులోకి
       మేము
 వీరులుగా  ఎదగాలని  గాథలు వివరిస్తారు
 వినయముగా ఉండాలని   మేథను  సవరిస్తారు

 దండిస్తూనే  దండిగా ప్రోత్సహిస్తు ఉంటారు
 సవాళ్ళు చేస్తూనే  సంస్కరణలు చేయిస్తు ఉంటారు

 దార్శనికత నిండియున్న  సుదర్శనులు  వారు.

 మా తరగతి,
  సంస్కారపు  సారపు నిధి,మమ్ము
  మరచిపోని,విశ్వ శాంతి కపోతము అది

  సంతృప్తిగా వస్తారు  మా గురువు అందులోకి

     మేము
 ఒక్కటిగా  ఉండాలని  పిడికిలి  చూపిస్తారు
 మక్కువలే నిండాలని  తలపడి వాదిస్తారు

 గరళము మింగమంటూనే మంగళమిస్తుంటాడు
 కఠినము అనిపిస్తూనే  కరుణను కురిపిస్తాడు

 పాశుపతమును అందించగలుగు  పరమేశ్వరులు  వారు.

 ఒక సూర్యుడు అందరిలో ఒక్కొక్కరిగ కనిపిస్తాడు
 ఇక గురువు మా అందరిలో చక్కగ ప్రతిబింబిస్తుంటాడు.

  (గురువు ఆశయమును నిలబెట్టుటయే అసలైన గురుదక్షిణ.)

 (శ్రీ రాధాక్రిష్ణగారి కోరికను మన్నిస్తూ 1962 వ సంవత్సరమునుండి వారి జన్మదినము గురుపూజోత్సవదినముగా  పరిగణింపబడుచున్నది.)

 (ఒక జ్యోతి తాను ఏమాత్రము వెలుగును కోల్పోకుండా లెక్కలేనన్ని జ్యోతులను వెలిగించగలదు)

  అసతోమా సర్గమయా
  తమసోమా జ్యోతిర్గమయా
  మృత్యోర్మా అమృతంగమయా.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...