Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-58

నీ పిరికితనమును చూసి నీ నామము భయపడింది ఎందుకైన మంచిదని పొంచి పొంచి దాగినది రెండు వేదముల మధ్య యజుర్వేదమును పెట్టినది యజుర్వేద మధ్యలో రుద్రాధ్యాయమును చూసినది అష్టమ వాకము రక్షణ అని సుస్పష్టము చేసినది. రక్షణదాయినిగా పంచాక్షరిని పట్టుకుంది రెండక్షరముల దాచలేని దైవము నీవేనంది పంగ నామము పెడతావని నీనామము అనుకుంటోంది గంగపాలు చేస్తావేమో నన్ను నీ చేతకానితనముతో ఆది మధ్యాంత రహితుడా వాదనలేలర కావర ఇన్నాళ్ళు నమ్ముకున్న నన్ను ఇప్పుడు కాదంటే ఎక్కడికి పోవాలిరా ఓ తిక్క శంకరా ..నీ వీరత్వము మీద నమ్మకములేక "శివ"అను నీ పేరు వేదముల మధ్యనున్న యజుర్వేద మధ్యలోనున్న ,రుద్రాధ్యాము మధ్యలోనున్న అష్టమవాకమున చేరి,ధైర్యము చాలక "నమ:"అయ" అను రెందింటి మధ్య దాగినది నింద వేదము నమః శివాయ-వేలుపు నమః శివాయ నామము నమః శివాయ-నాథుడు నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " పంచాక్షరీ శివ వేదేన విభాతి నిత్యం రుద్రస్తయా స్పురతి తేన చతుర్థ కాండః కాండేన తేన యజురేవ విభాతి నిత్యం ఋక్సామమధ్య మణినాచ విభాంతి వేదాః" పంచాక్షరీ మంత్రము శివ పదముచేత ప్రకాశించుచున్నది.అట్టి శివపంచాక్షరిని పేశంసించి నిర్దేశించుటచే రుద్రాధ్యాయము ప్రశస్తమగుచున్నది.అట్తి రుద్రాధ్యాయముచే తైత్తరీయ సంహిత చతుర్థ కాండము మహిమాన్వితమైనది.శివా నీ నామమునకు స్థానములై,యజుర్వేద-ఋగ్వేద-సామవేదములు సన్నుతింపబడుచున్నవి.శివా నీ దివ్య నామము వేదములనే ప్రకాశవంతము చేసినది.నిరంతరము దానిని జపించే భాగ్యమును అనుగ్రహింపుము.-స్తుతి. శివ శివ శివ యనరాదా-శివనామము చేదా శివ పాదము మీద నీ శిరసునుంచ రాదా .( శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...