Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-71

అసంగోహం అసంగోహం-అసంగోహం పున: పున:" శివుని తల్లి "బెజ్జ మహాదేవి" అంటున్నారు "శిలాదుడు" తండ్రి అని నేను వింటున్నాను శివుని అక్క "మగాదేవి" గారాబం చేస్తుందట శివుని పత్ని "పార్వతి" పరిపాలించేస్తోందట గణపతి-గుహుడు శివుని సుతులంటున్నారు శివుని సఖుడు "హరి" అట చెప్పుకుంటున్నారు శివ భక్తి "తమదని" పక్షులు చెప్పుకుంటున్నాయి శివ లీలలు "యుగయుగములు" కనువిందు చేస్తున్నవి భావనలో నిండినది "బహు చక్కని కుటుంబము" "బ్రహ్మజ్ఞాన వలీనము" బహు చక్కగ చెబుతున్నది "అసంగోహం-అసంగోహం అసంగోహం-పున:పున:" చక్కనైన మాటలేరా ఓ తిక్కశంకరా. భావము శివ కుటుంబము చిద్విలాసము చేయుచుండగా,శివుడు ఎవరులేనివాడను,ఏ బంధములేని వాడనని అనుట అబద్ధము-నింద. బెజ్జ మహాదేవి తల్లిగా భావించింది.శిలాదుడు తండ్రిగా లాలించాడు.(పారమార్థిక దృష్టితో చూస్తే వీరు శివుని తమ బిడ్డడుగా భావించారు.)మహాదేవి అక్కగా శివుని ఆదరించింది.పార్వతీ దేవి శివుని పత్నిగా ప్రకాశిస్తూ, పరిపాలిస్తోంది.వినాయకుడు-కుమార స్వామి పుత్రులుగా ధాత్రినేలుతున్నారు.విష్ణుమూతి నిన్ను చేర్చి కార్తీక దామోదరుడైనాడు.పశు పక్ష్యాదులు,కాలచక్రము నిన్ను తనవాడివని అచంచల భక్తితో కొలుచుచున్నవి. పశుపతి, మోహ బంధములకు అతీతుడైన భవుడు, భవతారకుడు-స్తుతి.. ( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...