Thursday, February 8, 2018

SIVA SANKALPAMU-55


 గంగాధర అని పిలువగ  గంగ తొంగిచూస్తుంది
 ముక్కంటి అని పిలువగ  తిక్క కన్ను పలుకుతుంది

 శశిశేఖర అని పిలువగ జాబిలి ఊ అంటుంది
 కపర్ది అని పికువగానే  కచభారము కదులుతుంది

 నందివాహన అనగానే  ఎద్దు సద్దుచేయకంది
 జంగమ దేవర అంటే లింగము పలుకలేనంది

 నాగేశ్వర అనగానే  పాము ఆగమంటుంది
 అర్థనారీశ్వర అనగానే అమ్మమిన్నకున్నది

 పశుపతి అని పిలువగానే  పాశము ఏమిటంటోంది
 ఏక నామధారివి కావని ఎకసక్కెము చేస్తున్నవి

 "శివోహం" అను జపమునాపి  నిన్ను నేను పిలుచుటకు
  ఒక్క పేరు చెప్పవేర ఓ తిక్క శంకరా!

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...