కన్నులు నిప్పులు రాల్చ కరుణాకటాక్షము ఎట్లు అగునురా
కరము పుర్రెను దాల్చ వరద హస్తము ఎట్లు అగునురా
గళమున గరళమున్న మంగళము ఎట్లు అగునురా
పాములు నగలుగ నున్న సామి ఎట్లు అగునురా
గంగ నెత్తిన ఉన్న తీరిన బెంగ ఎట్లు అగునురా
విషమ రూపము ఉన్న అనిమిషుడు ఎట్లు అగునురా
అసుర భయముతో ఉన్నవాడు శూరుడు ఎట్లు అగునురా
తాండవములో నున్న దుష్ట తాడనము ఎట్లు అగునురా
కనులు తెరిచిన కదనము కనులు మూసిన ప్రణవము ఐతే
కనుల పండుగ ఏదిమాకు కనులు కాయలు కాచినా అని
తనకు తోచిన తీరే కాని మమ్ము తరియింపగ చూడడేమిరా అన
దిక్కు తోచక ఉన్నానురా ఓ తిక్క శంకరా.
No comments:
Post a Comment