కన్న తండ్రిని చూడగ నేను కాశిపోవ కానరాడు
దేవత మోహమడచ మొదలు చివర కానరాడు
చిదంబరము పోయి చూడచిన్నగానుకానరాడు
అటుచూడను,ఇటు చూదని ఆటలెన్నో ఆడతాడు
నింగిలోన సాగుతాడు-నీటిలోన దాగుతాడు
అగ్గినంటి ఉంటాడు-గాలి నేనే అంటాడు
జ్యోతిని నేనంటాడు ప్రీతిని నీకంటాడు
ఈ వలసలు ఎందుకంతే చిద్విలాసమంటాడు
రూపివా-అరూపివా-అపురూపివా శివా
ఓంకార రూపుద ఇవి నీ ఆకారపు లీలలుగ
జంగమదేవర నీవు లింగముగా మారి నీ
చక్కదనము చూపవేర? ఓ తిక్క శంకరా!
No comments:
Post a Comment